Call Center Job, Telugu Moral Stories కాల్ సెంటర్ ఉద్యోగం

కాల్ సెంటర్ ఉద్యోగం..! Call center job..!

 

“పగటికల కు కొనసాగింపు”…!

బస్సు దిగి, ఫోన్ రీఛార్జ్ చేసుకుని అమీర్పేట్ లో పిల్లోడు ఇచ్చిన 5500 రూపాయలకు జాబ్ అనే పామ్ప్లేట్ మీద నెంబర్ కి కాల్ చేశాం, వెళ్లి కలిసాక మాకు అర్ధం అయ్యిందేంటంటే..!ఇంగ్లీష్లో చదవటం, మాట్లాడటం, రాయటం ఇవ్వన్నీ వచ్చిన వాళ్ళకే ఉద్యోగం వస్తుంది లేకపోతే రాదని తెలుసుకుని బైటికొచ్చిన మాకు ఏడుపొక్కటే తక్కువ..! 🤨😟అసలే తెలుగు మీడియం…! మా ఇద్దరివి యాసంగి, వానాకాలం చదువులే, ఊరు వదిలి బైటికెళ్లింది లేదు..! నేను :ఈ ఇంగ్లిష్ మనతో అయ్యేపని కాదు మావా ..! ఊరెళ్ళి పోదాం..!

మావోడు : మావా ఇంత పెద్ద సిటీలో మనకు ఒక్క ఉద్యోగం దొరకదా..? వద్దురా వాడి మాటలు పట్టించుకోకు, కొన్ని రోజులు ప్రయత్నిద్దాం మావా…! మనకు వేరే పనేముంది, వచ్చిందే ఉద్యోగ వేటకు అని మా ఫ్రెండ్ నాకు ధైర్యాన్ని

ఆరంజ్ ను జ్యూస్ పిండినట్టు, రుబ్బురోలుతో పెసరపప్పు రుబ్బినట్టు, మినప్పప్పు మిక్సీ పట్టినట్టు పట్టి కరుగ్గా ఇంటికెళ్లిపోదాం అనుకున్న నన్ను మెత్తగా ఇడ్లి పిండి లాగా చేసాడు..!😂😀

రోజు లేవటం అన్ని రకాల జాబ్ ఇంటర్వ్యూ లకు ప్రయత్నించటం, దొరికింది తినటం ఇదే తంతు కానీ ఒక్క ఉద్యోగం రాలేదు ..!

ఓరోజు పొద్దున్నే లేచి మావోడు మావా నేను ఇంటికి వెళ్ళిపోతారా…? 🥸🧐🤨

“ఖతం నాకు హార్ట్ అట్టాక్ వచ్చినంత పనైంది”

Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu, పరమానందయ్య పరలోక యాత్ర,

రాత్రి డిసైడ్ చేసుకున్నా మావా ఈజాబ్లు మనకోసం కాదు, దాదాపు 4 నెలలైంది ఒక్క జాబ్ కూడా రాలేదంటే మన దగ్గర జాబ్ కి పనికొచ్చే మేటర్ లేదు..! 😅

నేను: ఇంకో నెల చూద్దాం మామ రాకపోతే ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళిపోదాం..! ఈజాబ్ ఆ జాబ్ అని కాదు ఏ చిన్న జాబ్ వచ్చినా చేద్దాం..!

కాల్ సెంటర్ లో ఐతే ఇంగ్లీష్ వస్తుందని చాల మంది అంటుంటే విని ఆవైపుగా ప్రయత్నాలు మొదలెట్టాం.

అక్కడ కూడా అదే తంతు

టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్..!

సెలెక్ట్ వన్ టాపిక్ అండ్ టెల్ ఇన్ ఇంగ్లిష్ ఫర్ 2 మినిట్స్…!

ఇంగ్లీష్ విత్ ఎనీ లోకల్ లాంగ్వేజ్ మస్ట్ …!

వితౌట్ ఇంగ్లీష్ విల్ లెట్ యు నో..!

కాల్ యు బ్యాక్ ..!

కాల్ సెంటర్ ఉద్యోగాలు కూడా రావట్లే..! ఉన్న పైసల్ ఐపోయినై, ఇంటికాడ నుంచి కృష్ణుడు నేను ఎప్పుడు. ఫోన్ చేస్తానా క్లాస్ పీకి నా జీవితాన్ని అత్యున్నత స్థానానికి మాటలతోనే చేర్చాలని గీతోపదేశం రెడీ చేసుకూర్చున్నాడు..! ( కృష్ణుడు మా నాన్న)..!😜😜

ఇంకా వద్దురా బయలుదేరుదాం వెనక్కి..! భాగ్యనగరమ్ కి వచ్చింది ఓ విహార యాత్ర కోసం అనుకుని, శేష జీవితం మా ఊర్లోనే గడపాలని ఫీస్కు అయిపోయి బట్టలు సర్దుకుని, ట్యాంకుబండ్ , బిర్లామందిర్ చూసి, అక్కడే కాలిగా ఉందిగా అని రిజర్వుబ్యాంకు కూడా చూసి, తర్వాత ఎం చెయ్యాలో అర్ధం కాక రవీంద్ర భారతి గేట్ బైట నిల్చుని సినిమా వాళ్ళ ఫోటోలు చూస్తున్న మాకు ఓ ల్యాండ్ ఫోన్ నుంచి కాల్ టుమారో ఇంటర్వ్యూ బై 10ఏమ్ షార్ప్, కోపంగా నేను రాను మేడం నాకు ఇంగ్లిష్ , హిందీ రాదు, అవతల పక్క ఇది airtel కాల్ సెంటర్ మేము తెలుగు వాళ్ళకోసం ఇంటర్వ్యూ చేస్తున్నాం..! ఇద్దరం ఉన్నాం మేడం…! ఐతే మీ ఫ్రెండ్ని కూడా. తీసుకుని రండి అనటం,

పరశురామ ప్రీత్యర్దం – ఉత్సవం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu

ఇంటర్వ్యూ అవ్వటం, జీతం 7వేలు అనటం,అకౌంట్ ఓపెన్ చెయ్యటంతో మా ఆనందానికి అవధులు లేకుండా పొయ్యాయి..! కానీ ఏదో భయం ఎం రాదుగా ఎలా నేర్చుకోవాలి అని కంగారు..!

(కింది ఫోటో గూగుల్ లో తస్కరించటం జరిగింది)

కాల్ సెంటర్ ఉద్యోగం

కాల్ సెంటర్ ఉద్యోగం

కట్ చేస్తే మొదటి 6 రోజులు ట్రయినింగ్ తరువాత ఫ్లోర్ మీదకు పంపిస్తాం అక్కడ 4 రోజులు సీనియర్ పక్కన ఉండి కాల్స్ హేండిల్ చెయ్యటం నేర్చుకున్నాక, మీకు సిస్టం ఇస్తాం అనటంతో దైర్యం వచ్చేసింది..! పనిలో పని కంప్యూటర్ కూడా ఫ్రీ గా నేర్చుకోవచ్చు అనుకుంటూ ఆ రాత్రి తెల్లవాఱుజాముదాకా ఎలా జీవించాలో కబుర్లు చెప్పుకుంటూ నిద్రపొయ్యాం..!

టీంలీడేరు: మీ పేర్లు మార్చుకోండి..!

మేము: వీడేంటి పేర్లు మర్చిపో అంటున్నాడు..! ఇప్పటికిప్పుడు వీడు ఇచ్చే 7 వేలకు సర్టిఫికెట్ ల మీద పేర్లు ఎలా మార్చుకుంటాం జాబ్ వద్దు పాడు వద్దు అనుకునే లోపే..!

టీం లీడర్ :సూడో నేమ్స్ పెట్టుకోండి…!

సొంత పేర్లతో మాట్లాడటం ఆపెయ్యండి..!

Tenali Ramakrishna stories in Telugu, ఆనందభట్టు

ఎట్టి పరిస్థితిలో కూడా మన ఆఫీస్ అడ్రస్ ఎవరికి చెప్పకూడదు…! కాల్ చేసిన వాళ్ళు ఎంత గోరంగా మాట్లాడినా ఏవరిని తిట్టొద్దు…! మీ మొబైల్స్ అన్ని సెక్యూరిటీ వాళ్ళ దగ్గర ఇచ్చేసి రావాలి, సాయంకాలం వెళ్ళేటప్పుడు మాత్రమే తీసుకెళ్లాలి, 30 రోజుల్లో ఒక లీవ్ కూడా పెట్టకుండా ఉంటేనే మీకు మొత్తం జీతం, ఒక్క డుమ్మా ఉన్నా జీతం 1000 కట్టు..! 20 నిముషాలు లంచ్ బ్రేక్, టీ కోసం, బాత్రూం కోసం ఇంకో 10నిముషాలు..! లాగిన్ టైం రికార్డు అవ్వుద్ది ముప్పై నిముషాలకంటే ఎక్కువ టైం ఉంటే ఇంకో గంట సేపు ఎక్స్ట్రా చెయ్యాలి..!

వీటి అన్నింటికీ ఓకే అనుకునే వాళ్ళు ఉండండి మిగిలిన వాళ్ళు వెళ్లిపోండి..! ☹️🙁🤯

మావా ఏందిరా ఇది మన వల్ల అవ్వుదంటావా..? నేను: పాజిటివ్ గా ఆలోచించు మామ 7+7=14 వేలు మధ్యలో డుమ్మా కొట్టినా 6,6 =12 మనకు నెలకయ్యే ఖర్చు 2500 అంటే ఇంకో 4,5 నెలలు గడిపెయ్యోచ్చు ఒక్క నెల చేసి ఇబ్బంది ఐతే మానేద్దాం రా..!

ఓ నోట్స్ పెన్ను తీసుకుని ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది రాసుకున్నాం, ఓ 5రోజులు ట్రైనింగ్ తర్వాత,

నేను: ఎయిర్ టెల్ కి కాల్ చేసినందుకు ధన్యవాదం నాపేరు జాన్ పాల్ కెనెడీ నాగన్న, మీకు ఏ విధంగా సాయపడగలను అనాలి..! 😆

అప్పుడు కాల్ చేసిన వాళ్ళు బోరున ఏడ్చుకుంటూ అయ్యా అన్నాయం జరిగిందయ్యా అని వాళ్ళ కష్టాలు దేవుడికి చెప్పుకున్నట్టు మనకు చెప్పుకుంటారు, అప్పుడు పిచ్చి భక్తా నేనున్నాగా ఎందుకేడుస్తావ్ అని వాళ్ళ కష్టాలను మన కష్టంగా భావించి శాప విముక్తి చెయ్యాలి, వాళ్ళ కన్నీళ్లు తూడ్చి శాపవిముక్తులను చేసినందుకు ఫలితంగా నీకు నైవేద్యం పెడతారు అంటే రేటింగ్ ఇస్తారు..!

రోజులో ఏరెండు కాల్స్ రేటింగ్ తగ్గినా హాఫ్ డే శాలరీ కట్ చేస్తాం కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి కస్టమర్లను కన్విన్స్ చెయ్యండి, వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి..!

వాళ్లకు మీరు దేవుళ్ళు…!

మీకు వాళ్ళు దేవుళ్ళు..!

గీతోపదేశం చేసి కృష్ణుడు బైటికెళ్ళాడు..! (ఇక్కడ కృష్ణుడు మా ఫ్లోర్ లీడర్)..!

కొద్ది రోజులదాకా అలా మాట్లాడి మాట్లాడి బైటకు వచ్చాక కూడా ఎవరన్నా ఫోన్ చేస్తే చెప్పండి ఏవిధంగా సాయపడగలను అనటం అలవాటైపోయింది..! 😆😆😝

నేను : ఎయిర్టెల్కి స్వాగతం (మిగతా రామాయణం స్టోరీ)

కాలర్ : ఒరేయ్ నా డాష్ గా సంపత్ అంట ఎవడో నా డబ్బులు 100 దొబ్బాడు మర్యాదగా ఇస్తే ఇచ్చాడు లేకపోతే నీ మీద వాడి మీద పోలీస్ కేసు పెడతా, నేను అసలే హెడ్ కానిస్టేబుల్ ని..!

నాకు. ఒక్క నిముషం గుండె ఆగినంత పనైంది, నా పక్కన వాడి సూడో నేమ్ సంపత్ వాడే ఏదో చేసి ఉంటాడు 100 బాలన్స్ పోయింది ఇప్పుడెలా అని పోగొట్టుకున్నోడు బానే ఉన్నాడు, తీసుకున్నోడు బానే ఉన్నాడు మధ్యలో నా మీద కేసు ఎందుకురా అయ్యా ..! “సార్ అతను నా పక్కనే ఉన్నాడు నేను మాట్లాడి మీకు 100 ఇపిస్తా మీరు కేసు పెట్టొద్దు ప్లీజ్ అనేసా..!” గంటలో ఫోన్ చేస్తా నా డబ్బులు రాకపోతే మీ ఆఫీస్ కి పోలీసులు వస్తారు చూసుకో అని వార్ణింగ్ ..! కట్ చేస్తే మా టీం లీడర్ వచ్చి ఛాంబర్కి రా అన్నాడు..!

మక్కికి మక్కీ జవాబు, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu

వెళ్ళగానే ఒక అరగంట క్లాస్ పీకి, వాడేదో పోలీస్ అనగానే ప్రాబ్లెమ్ ఏంటో కూడా చూడకుండా మనీ రిటర్న్ చేస్తా అన్నావ్, ఫేక్ కమిట్మెంట్ కింద టుడే లీవ్ వేసా అన్నాడు, వీడికి ఎలా తీసిందబ్బా అనుకుంటుండగానే🤨🤔, అన్ని కాల్స్ రికార్డు అవుతాయి, వాయిస్ హై లో ఉన్న కాల్స్ మేము వింటాం, అవసరం ఐతే మీకు హెల్ప్ చెయ్యటానికి, ఓహో అలాగా 😏 ఎలాగో లీవ్ వేసాడుగా రూమ్ కి పోయి రెస్ట్ అన్నా తీసుకుందాం అనుకుని బ్యాగ్ సర్దుతుంటే, మా టీం లీడర్ ఎక్కడికమ్మా వెళ్తున్నావ్ రాంగ్ కమిట్మెంట్ కే లీవ్ ఇంటికిపోతే ఈ నెల. జీతం రాదు😏 ఒరేయ్ దీనికంటే నరకంలో శిక్షలు నయం కదరా దీనిపేరు కాల్ సెంటర్ అని కాకుండా నరకం అనో ఏ రాజమండ్రి సెంట్రల్ జైలు అనో పెట్టాల్సిందిరా..! మీమొహాలు మండ మీరు మీ శాడిజం ఛీఛీ 😭😅😂

ఓపక్క డబ్బుల ఇబ్బంది, మరోపక్క వీళ్ళ తలనొప్పి, జాబ్ నచ్చట్లేదు, తప్పట్లేదు ఏమైనా కానీ మానేద్దాం అనుకుని పక్కన ఇంగ్లీష్ కాల్స్ హేండిల్ చేసే ఓ అమ్మాయ్ ఉంటే హాయ్ అన్నా..!

అమ్మాయ్ : చెప్పండి

School Life Memory, Telugu Moral Stories మా బడి జీవితం..!

నేను : రేపట్నుంచి రాను, మానేస్తున్న డిగ్రీ చదివి ఇక్కడ జాబ్ చెయ్యటం నచ్చట్లేదు,

ఆవిడ: నాకు కూడా నచ్చట్లేదు, నేను ఎంబీఏ గోల్డ్ మెడల్, కోచింగ్ కోసం హైదరాబాద్ వచ్చా ఇంట్లో వాళ్ళను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇక్కడ చేస్తున్నా ఓ నెల చేసి జీతం రాగానే మానేస్తా..! 😃😃🧐

చి ఛీ ఆ అమ్మాయ్ మంచిగా అంత దైర్యంగా చేస్తుంది మరీ ఇంత మెతకేంట్రా అనుకుని మానేద్దాం అనుకోటం మానేశా..!

అమ్మ : ఎలా ఉందిరా జాబ్

నేను : చాల బావుందమ్మా

అమ్మ : డబ్బులకు ఇబ్బంది అవుతుందని చేస్తున్నావ్ నాకు తెలుసు, అడిగితే నాన్న ఇస్తాడు నేను అడిగిస్తాలే నువ్వేం బాధపడక, సంక్రాంతికి వస్తున్నావ్ గా అక్క, నేను అందరం చెపుతాం జాబ్ వద్దు కోచింగ్ ఇపించండని..!

నేను :సరే అమ్మా..!

సంక్రాంతికి ఒకరోజు లీవ్ కావాలని అడిగా కుదరదు అనటంతో చిన్నబుచ్చుకుని సంక్రాంతి రోజు పొద్దున్నే కాల్స్ తీసుకుంటున్నా..!!

కాలర్ : పల్లెటూరు వాడు ఏదో కాలర్ ట్యూన్ పెట్టుకోబోయి పైసల్ పోగొట్టుకున్నాడు “చెత్తనా ….. తో మొదలెట్టి, మా ఇంట్లో వాళ్ళ అందరిని తిట్టడం మొదలెట్టాడు, “అరే వీళ్లకు కుటుంబాలు లేవా లేక సంస్కారం తెలీదా అనుకుంటూ వాడు తిట్టిన తిట్లన్నీ వింటున్నా” కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి, ఏదో వాడిని ఆపాలని ప్రయత్నిస్తున్నా కానీ నా వల్ల కావట్లేదు, వాడు ఇంకా ఇంకా బూతులు తిడుతున్నాడు, (కాల్ కట్ చేసే ఆప్షన్ కాల్ సెంటర్ వాళ్లకు ఉందదు కస్టమర్ పెట్టేయాలి అప్పటిదాకా వినాల్సిందే లేదా కన్విన్స్ చెయ్యాలి) ఓ 20 నిముషాల పాటు తిట్టాక పెట్టేసాడు..!

బ్రేక్ పెట్టి కాంటీన్ లో అలాగే కూర్చుని బాధపడుతుంటే, నా పక్కన అమ్మాయ్ వచ్చి ఏమైంది అని అడిగింది..!

ఒక పల్లెటూరి కాలర్, కాలర్ ట్యూన్ వల్ల మనీ కట్ అయ్యాయని నా ఫామిలీని తిట్టాడు, భాధగా అనిపించింది ఈ ఉద్యోగం చెయ్యటానికి కారణం ఇంట్లో వాళ్ళ కోసం వాళ్లకు మర్యాద లేని ఈ పని నేను చెయ్యలేను మానేస్తా అన్నా..!

Budugu Gadi Katha, Telugu Moral Stories బుడుగు గాడి కథ

అమ్మాయి: నేను కూడా జీతం రాగానే మానేస్తా ..! నీ కాల్ పల్లెటూరు వాడు వాడికేం తెలీదు, కానీ నాకు. కాల్ చేసిన వాడికి అన్ని తెలుసు, ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు, ఫాన్సీ నెంబర్ కావాలని అడిగాడు వాడు సెలెక్ట్ చేసిన నెంబర్ కాస్ట్ 10వేలు ఉంది, మొత్తం 15వేలు ఇస్తా సిమ్ము వద్దు నువ్వు వచ్చి నాతో. పడుకుంటావా అని అడిగాడు..! మనం మనుషులం అనే విషయమే గుర్తుండదు వాళ్లకు, డబ్బు ఒక్కటి లేకపోవటం వల్లనేగా ఇలాంటి ఉద్యోగాలు చేస్తూ, మాటలు పడాల్సొచ్చింది, టీం లీడర్ కి చెపితే అలాంటివి కామన్ లైట్ తీసుకో కంప్లైంట్ ఇవ్వటం కుదరదు ఇష్టం లేకపోతే జాబ్ మానేసుకో అంటున్నాడు..! మనం కేవలం ఉద్యోగం చేస్తున్నాం అంతే మనకు జీతం పని చేసినందుకు ఇస్తున్నారు, అంతేకాని మాటలు పడటానికి కాదుగా. అని ఏడవటం స్టార్ట్ చేసింది.

నేను :చూడు ఇక్కడ ఎవరు ఎవరి గురించీ ఆలోచించరు, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళవి మనం వాళ్ళ గురించి ఆలోచించినంత, వాళ్ళు మనగురించి ఆలోచించరు, మనం ఇక్కడ. పని చేస్తున్నాం అంతే కంపెనీ మనది కాదు, ఎవరైనా తిడితే మనల్ని తిట్టినట్టు కాదు కంపెనీ ని తిట్టారు అనుకుని వదిలెయ్యాలి, బాధ పడకు ఇంకో 15 రోజులైతే జీతం వస్తుంది రోజులు లెక్కపెడుతూ గడిపేద్దాం..! జీతం రాగానే మానేద్దాం, మధ్యలో మానేస్తే చేసిన కష్టం వృధా అవుతుంది..!!

అమ్మాయ్ : పదా బ్రేక్ టైం అయిపోతుంది మళ్ళీ ఎక్స్ట్రాగా గంట డ్యూటీ చెయ్యాలి..!

నేను: ఎయిర్టెల్ కి స్వాగతం అంటూ ఇంకో కాల్ .!ఏవిధంగా సాయపడగలను..!

కాలర్ : ముందుగా మీకు మీ కుటుంబ సబ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు..!

నేను: 😀😃☺️😇 థాంక్యూ సార్ ..!

మీకు మీ కుటుంబ సబ్యులకు కూడా మా తరపున మా కుటుంబ సభ్యుల తరపున సంక్రాంతి శుభాకాంక్షలు..! చెప్పండి సార్ ఏంటి సమస్య..!

ఒకడు బాధ పెట్టాడు ..!

ఒకరు ఓదార్చారు…!

ఇంకొకరు సంతోషపెట్టారు..!

(జీవితం అంటే అంతేగా కష్టాలు, కన్నీళ్లు, తర్వాత నవ్వులు ఆనందాలు ఒకదాని తర్వాత ఒకటి రావటం సహజం)

మిగతా 15 రోజులు ఎలాగోలా ఐపోయాయి, జీతం వచ్చిన్న విషయం 10–30 కి తెలిసింది, వెంటనే బ్రేక్ పెట్టేసి ముగ్గురం కాంటీన్ కి జంప్..!

నేను : ఎం చేద్దాం మరి మానేద్దాం అనుకున్నాం గా..?

Grandfather, Telugu Moral Stories తాతా మనవరాలు

అమ్మాయ్: పిచ్చా మీకేమైనా ఏడువేలు సరిపోతాయా కొంచెం కష్టపడండి, టీం లీడర్ ని అడిగి కొన్ని ఇంగ్లీష్ కాల్స్ పంపమనండి ఇంగ్లీష్ నేర్చుకోండి బైట 4 వేలు అడుగుతున్నారు ఇంగ్లీష్ నేర్పడానికి ఇక్కడ జీతం ఇచ్చి మరి నేర్పిస్తారు మాట్లాడుతుంటే ఇంగ్లీష్ అదే వస్తది,

నేను మీకు నోట్స్ రాసిస్తా వెళ్లొద్దు ప్లీజ్…! (మేము వెళ్ళిపోతే తను ఒక్కతే అవ్వుద్దని ఆవిడ బాధ)

నేను: ఈవిడేంటి మొన్నటివరకు పోదాం అని ఇప్పుడు ఇలా అంటుందని అనుకుని, జీతం పడ్డ మెసేజీ ని ఒక 60 సార్లు చూసుకుని మురిసిపోతుండగా, ఫ్లోర్ లీడర్ కాల్ రండి అని..!

అలా కష్టాల్లో సుఖాన్ని వెతుక్కుంటూ నాలుగు నెలలు చేసి చాలా అనుభవాలను అనుభూతులను, నలుగురు ప్రాణ స్నేహితులను సంపాదించుకున్నాం…!

ఇప్పుడు దేవుడి దయవల్ల అందరం మంచి ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాలతో సంతోషంగా ఉన్నాం..!

అప్పటి నుంచి ఇప్పటి దాకా ఒక్క కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ ని కూడా తిట్టలేదు..! (స్వానుభవం గా మరి 😝😛😜)

“కాల్ సెంటర్ ఉద్యోగానికి శుభం”

“ఓ 120 రోజుల నా కాల్ సెంటర్ జీవితం నాలో చాల మార్పు తెచ్చింది” నేను ఈ సేల్స్ జీవితం మొదలెట్టడానికి అప్పటి ఆ పీపుల్ మానేజ్మెంట్ అనుభవం కూడా ఒక కారణం..!

చివరగా ఓ మాట ..!

కాల్ సెంటర్ వాళ్ళ జీతంలో, జీవితంలో హెచ్చు తగ్గులు వుంటాయి తప్ప, మనకన్నా వాళ్లు తక్కువేం కాదని నా అభిప్రాయం..!

చాలా వరకు మనకు వచ్చే కాల్స్ వాళ్ళ ప్రమేయం లేకుండానే సాఫ్ట్వేర్ ద్వారా వస్తాయ్, బ్యాంకు లోన్లు, క్రెడిట్ కార్డులు, ఓపెన్ ప్లాట్స్, పోస్ట్ పైడ్ కి సంబంధించిన ఎన్నో రకాల కాల్ సెంటర్ల వాళ్లు 60 నుంచి 70% మందిని పలెటూర్లనుంచి వచ్చిన వాళ్లనే తీసుకుంటారు ఎందుకంటే వాళ్లే తక్కువ జీతానికి వస్తారు ..! ఎక్కువ కష్టపడతారు, కారణం ఏంటో తెలుసా..? ఏదో ఒకటి చేసి తల్లిదండ్రులకు ఖర్చుల బాధ తగ్గిద్దాం అనుకుంటారు..!

చదివినందుకు థాంక్స్ నమస్తే..!

ఇట్లు

మీ జ్ఞనా చారి

Day Dream, Telugu Moral Stories పగటి కల

Spread iiQ8

February 23, 2023 3:53 PM

131 total views, 0 today