Karma Affects Life, కర్మలు జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి, అన్ని జన్మలలో ఏది ఉత్తమమైనది
కర్మలు జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి !!
కర్మలెన్ని ఆచరిస్తున్నా సరే తృప్తి అనేది ఎప్పటికీ కలగదు. సరిపోయినంత సంపాదించుకున్నాం. చక్కని ఇల్లు కట్టుకున్నాం. మంచి ఉద్యోగం ఉంది.
బుద్ధిమంతులైన పిల్లలున్నారు అని తృప్తిపడే వాడు ఈలోకంలోనే లేడు. ఎప్పుడూ ఏదో లేని దానిని గురించే ఆలోచిస్తాడు. వున్నది చాలదని భావిస్తాడు. ఇంకా ఏదేదో కావాలనుకుంటాడు. తనకన్నా ఉన్నతంగా ఉన్నవాణ్ణి గురించి ఆలోచిస్తాడు. వాళ్ళతో పోలిక పెట్టుకుంటాడు. తన దగ్గర లేనివి, ఇంకొకరి దగ్గర ఉన్నవి ఏమిటో తెలిసాక ఇక ఆ లేని వాటి గురించి ఆరాటం. వాటిని సంపాదించుకోవడానికిసతమతం అవుతాడు.
అది తన వల్ల సాధ్యం కాకపోతే ఇంకొకరిని దాని కోసం అభ్యర్థించడం లేదా ఇంకొకరి నుండి లాక్కోవడం.
ఇలా కొరతలతో, కోరికలతో, అసంతృప్తితో వేగిపోతుంటాడు. ఇలా ఆంతర్యంలో అసంతృప్తితో రగిలిపోయేవాడు ఏదేదో కావాలని, ఏదేదో చేయాలని సంకల్పాలు చేస్తుంటాడు.
ఈ సంకల్పాలకు అనుగుణంగా కర్మలు చేస్తూ ఉంటాడు. కర్మలు చేసినప్పుడు ఫలితం అనేది తప్పకుండా వస్తుంది. అది నీవు కోరుకున్న ఫలితం కావచ్చు, కోరుకోనిది కావచ్చు. నీకు సంతోషం కలిగించేది కావచ్చు. దుఃఖాన్ని కలిగించ…
Read more
about Karma Affects Life, కర్మలు జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి, అన్ని జన్మలలో ఏది ఉత్తమమైనది