Kuru Dynasty Lalitha Lankhini, కురు వంశము, లలిత, లంఖిణి

Kuru Dynasty Lalitha Lankhini, కురు వంశము, లలిత, లంఖిణి
 
పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు —
 
కురువంశము, Kuru Dynasty :
భరతుడి తరువాత వంశం–
భరతుడి కుమారుడు భుమన్యుడు, భుమన్యుడి కుమారుడు సుహోత్రుడు, సుహోత్రుడి కుమారుడు హస్తి , హస్తి పేరు తోనే ఉన్నదే అప్పటి కురురాజుల రాజధాని, ఇప్పటి ఢిల్లీ నగరమైన హస్తినాపురం. హస్తి కుమారుడు వికంఠనుడు, వికంఠనుడి కుమారుడు అజమేఢుడు.
అజమేఢుడికి 124 కుమారులు. వాని కుమారులలో ఒకడైన సంవరణుడికి సూర్యుని కుమార్తె అయిన తపతికి వివాహం జరిగింది. వారి కుమారుడు కురు. కురు పేరు తోనే కురువంశం వృద్ధి చెందింది.
కురు కుమారుడు విదూరధుడు. విదూరధుడి కుమారుడు అనశ్వుడు.
అనశ్వడి కుమారుడు పరిక్షిత్తు , పరిక్షిత్తు కుమారుడు భీమసేనుడు.
భీమసేనుడు కొడుకు ప్రదీపుడు. ప్రదీపుడి కుమారుడు శంతనుడు.
 

Lalitha : లలిత–
హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.
 
Lankhini : లంఖిణి —
లంకను కాపలాకాసిన రాక్షసి .
హనుమంతుడు లంఖిని ని హతమార్చి లంకలో ప్రవేసిస్తాడు .
లంకాదహనము కావిస్తాడు .
 
Lavakusulu : లవకుశులు —
సీతా రాముల కవల పిల్లలు .

G.A.M.E (GITA FOR ALL MADE EASY), iiQ8, Bhagavad Gita Online Course 2021

 
ManDodari : మండోదరి –
పలుచని ఉదరము కలది (మండ-పలుచని). మండోదరిరామాయణంలో రావణాసురుని భార్య. ఈమె మహా పతివ్రత. మండోదరి మాయాసురుడి కుమార్తె. రావణాసురుడు ఈమెను మోహించి అపహరించి పెళ్ళాడాడు. ఇంద్రజిత్తు ఈమెకు పుట్టిన కుమారుడు.


Spread iiQ8

May 2, 2015 7:50 PM

264 total views, 0 today