పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు –
Kumaara Swaami Katyaanyini Kali, కుమార స్వామి, కాత్యాయిని, కాళి-
Kumaara swaami : కుమార స్వామి –
శివ పార్వతుల ఇద్దరి కుమారులలో చిన్నవాడు కుమారస్వామి. ఇతనికి ఇద్దరు బార్యలు — శ్రీవల్లి , దేవసేన .
Katyaayini : కాత్యాయిని —
హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.
Kali : కాళి —
హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత.
త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది.
వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.
కాళిదాసు, Kalidasu :
ఒక గొప్ప సంస్కృత కవి మరియు నాటక కర్త. “కవికుల గురువు” అన్న బిరుదు ఇతని యొక్క ప్రతిభాపాటవాలకు నిలువెత్తు సాక్షం.
గొప్ప శివ భక్తునిగా భావింపబడే కాళిదాసు, తన యొక్క కావ్యములు మరియు నాటకములు చాలావరకు హిందూ పురాణ మరియు తత్త్వ సంబంధముగా రచించాడు. కాళిదాసు అను పేరుకు అర్థం కాళి యొక్క దాసుడు.
Karnudu : కర్ణుడు —
పుట్టుకతో ‘కర్ణ‘కుండలాలు కలవాడు. మహాభారత ఇతిహాసములో ఒక వీరుడు.
దూర్వాస మహర్షి కుంతీభోజుని కుమార్తెయైన కుంతి కి ఇచ్చిన వరప్రభావంతో సూర్య దేవునికి ఆమెకు కలిగిన సంతానము కర్ణుడు.
సూర్యుని అంశాన సహజ కవచకుండలాలతో జన్మించిన కర్ణుడు సూర్యతేజస్సుతో ప్రకాశించినాడు.
kaushikudu : కౌశికుడు –
ధర్మ వ్యాధునివల్ల ధర్మ విశేషాలు తెలుసుకున్నవాడు . విశ్వామిత్రునికి మరో పేరు .