గురువు గారికి గుర్రం కోసం వెతుకులాట
శిష్యుల ఐకమత్యం పుణ్యమా అని, అంతా కలసి పరమానం దయ్య గారి కాలు కుళ్ళబొడిచిన కారణంగా, అది చీముపట్టి మూడవనాటికి కాలు ఇంత లావున వాచిపోయింది. కాలు క్రింద పెట్టలేక నానా అవస్థ పడుతూంటే, చురకత్తి లాంటి శిష్యుడొకడికి చురుక్కుమనే ఆలోచన స్ఫురించింది.
“ఇక గురువు గారి పని అయిపోయింది. ఆయన నడిచెల్లడం కల్ల, ఆయన స్వంతంగా వైద్యం తెలిసిన వాళ్ళు కనుక కాలు కుళ్ళిపోకుండా కాపాడుకున్నాా వృద్ధాప్యం మీద పడుతూన్నందున పూర్వం మాదిరిగా నడవలేరు. మనం ఎలాగైనా ఒక గుర్రాన్ని సంపాదించాలి. అదీగాక రాజులు-రాజాధికారులు సైతం గురువుగార్ని సలహాల కోసం కబురంపుతారు. వాళ్ళదగ్గర కెళ్ళేటప్పుడు నడిచివెళ్తే చిన్నతనంగా ఉంటుంది. అదే” గుర్రంమీద అయితే, కొంత ఠీవీ-దర్పమూనూ…” అని ఆ శిష్యపరమాణువు అందర్నీ ఉద్దేశించి ఉపన్యసించాడు.
గురువు గారికి గుర్రం కోసం వెతుకులాట, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
“గురువుగారికి మంచి గుర్రం కొనాలని ఆలోచిస్తున్నారు శిష్యులు”
Rabbit, Hawk and Cat Panchatantra Friendship stories, కుందేలు, చకోరపక్షి మరియు పిల్లి
అందరూ అతడి ఆలోచన ప్రశస్త్యంగా ఉందని ప్రశంసించారు. ఇంతమంది ఏకగ్రీవంగా చెపుతుంటే, అది దివ్యమైన అలోచనే అయి వుంటుందని అంచనాగా లెక్కలుకట్టే పరమానందయ్య కూడా అవునవునని తలవూపి “అలాగే కానివ్వండి! మీ అందరి దయా ఉంటే నాకు లోటేమిటీ?” అన్నారు.
“హమ్మమ్మమ్మ! ఎంతమాట గురువుగారు! మీరు పెద్దలు. మీ దయ మాయందు ఉండేలా మీరే అనుగ్రహించాలి” అనడంతో తన శిష్యుల వినయానికి మురిసి ఓ మంచి గుర్రం ఎత్తు, లావు, రంగు అన్నీ సరిగ్గా ఉండేలాగ చూసి కొనుక్కు రావడానికి ఇద్దరు శిష్యులను నియమించారు.
Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu, పరమానందయ్య పరలోక యాత్ర,
Elephant and Sparrows Panchatantra Friendship stories, ఏనుగు మరియు పిచ్చుకలు
Three friends Panchatantra Friendship stories, ముగ్గురు స్నేహితులు
Blue fox Panchatantra Friendship stories, నీలం రంగు నక్క
Source of the content : https://kathalu.wordpress.com/