Friday Lakshmi Pooja, శుక్రవారం రోజున లక్ష్మీదేవి పూజా ఫలితం

friday lakshmi pooja శుక్రవారం రోజున లక్ష్మీదేవి పూజా ఫలితం
devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus
friday lakshmi pooja శుక్రవారం రోజున లక్ష్మీదేవి పూజా ఫలితం
28434b63bf85fe226fa854f5443e66bd

జీవితంలో ఏ సమస్య వచ్చినా … ఏ అవసరమొచ్చినా అప్పటికది పెద్దదిగానే … ముఖ్యమైనదిగానే కనిపిస్తూ వుంటుంది. అయితే కొన్ని సమస్యలు డబ్బుతోనే పరిష్కారమవుతాయి. కొన్ని అవసరాలు డబ్బుతోనే తీరతాయి. అందువలన డబ్బుకి అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతూ వుంటుంది. అలాంటి ధనానికి ఇబ్బందిపడే పరిస్థితులు రాకుండా ఉండాలంటే, అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం కావలసి వుంటుంది.

ఆ తల్లి కటాక్షం కావాలంటే అంకితభావంతో కూడిన పూజాభిషేకాలు జరపవలసి వుంటుంది. శుక్రవారం రోజున భక్తిశ్రద్ధలతో సేవించవలసి వుంటుంది. అందువలన అమ్మవారు ప్రీతిచెందుతుందనీ, ఫలితంగా దారిద్ర్యం తొలగిపోయి సంపదలు ప్రసాదించబడతాయని చెప్పబడుతోంది.

అంతే కాదు అమ్మవారిని అర్చించడం వలన శుక్ర గ్రహ సంబంధమైన దోషాలు కూడా తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

శుక్రగ్రహ దోషం వలన మంచి మార్గాలకి దూరమైపోవడం .. ఫలితంగా అవమానాలు ఎదురుకావడం … అనారోగ్యంతో బాధలుపడుతూ వుండటం జరుగుతూ వుంటుంది.
ఇలాంటి బాధల నుంచి బయటపడాలంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవిని అర్చించవలసి వుంటుంది. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి, అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణలు చేయడం వలన …
పూజాభిషేకాలు జరపడం వలన ఆశించిన ఫలితం కనిపిస్తుందని స్పష్టం చేయబడుతోంది.

devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus
Spread iiQ8

April 20, 2015 8:59 PM

710 total views, 0 today