Easter … Christian, పునరుత్థాన పండుగ . . ఈస్టర్, Festival Christianity
Easter ... పునరుత్థాన పండుగ . . ఈస్టర్
ఈస్టరు పండుగ క్రీస్తు జీవితాన్ని,శిలువపై ఆయన మరణాన్ని సమాధి నుంచి పునరుత్థానం చెందడాన్ని జ్ఞాపకం చేసుకునే పవిత్ర దినం . మార్చి 30 తరువాత వచ్చే పౌర్ణమి వెళ్ళాక మొదటి ఆదివారం నాడు ఈస్టరు పండుగ చేస్తారు . క్రైస్తవులకు అతి ముఖ్యమైన పండుగ ఈస్టరు . క్రైస్తవ గ్రంధాలను బట్టి క్రీస్తు శిలువ వేయబడిన తరువాత,మూడవ రోజు పునరుత్థానం చెందాడు . అంటే . . . సమాధి నుండి తిరిగి లేచాడు . ఆ రోజునే ఈస్టర్ దినంగా జరుపుకొంటారు .
ప్రపంచ వ్యాప్తంగా ఈస్టర్ సంప్రదాయాలు.
దాదాపుగా ఇంగ్లీష్ మాట్లాడే దేశాలన్నీ ఈస్టర్ పండుగను ఒకే విధంగా జరుపుకొంటాయి . గుడ్ ఫ్రైడే ను ఆచరించిన తరువాతి రోజైన శనివారం ఇంటిని ఈస్టర్ గుడ్లతో అలంకరిస్తూ ఉత్సాహంగా గడుపుతారు . ఆదివారం ఉదయం నిద్ర లేవగానే అలంకరించిన గుడ్లు , చాక్లెట్ ఆకారపు గుడ్లు ,చాక్లెట్ కుందేళ్ళు మొదలైన వాటిని అందరికీ పంచుతారు . పరిశుభ్రంగా తయారై చర్చి కి వెళ్లి ప్రార్ధనలో పాల్గొంటారు . మధ్యానం పూట విందు ఆరగిస్తారు . దాదాపుగా అన్ని చోట్లా వేడుక ఒకేలా ఉన్నా . . కొన్నిచోట్ల కొద్దిపాటి మార్పులు కనిపిస్తూ…
Read more
about Easter … Christian, పునరుత్థాన పండుగ . . ఈస్టర్, Festival Christianity