Bibi Nancharamma …  *బీబీ నాంచారమ్మ ఎవ్వరు…..*

*Who is Bibi Nancharamma…..* *బీబీ నాంచారమ్మ ఎవ్వరు…..*

 

*ఆ కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి తెలియని వారుండరు. అలాగే చాలామందికి “బీబీ నాంచారమ్మ” గురించి చాలా అపోహలు ఉన్నాయి. అసలు ఈ బీబీ నాంచారమ్మ ఎవరు? ఆమె నిజంగానే ముస్లిం వనితా? ఆమె దైవస్వరూపం ఎలాఅయ్యారు?…*

*బీబీ నాంచారమ్మ! “నాచియార్” అనే తమిళపదం నుంచి “నాంచారమ్మ” అన్న పేరు వచ్చింది. అంటే భక్తురాలు అని అర్థం. ఇక “బీబీ” అంటే భార్య అని అర్థం. బీబీ నాంచారమ్మ గాథ ఈనాటిదికాదు. కనీసం 700 సంవత్సరాల నుంచి ఈమె కథ జనపదంలో నిలిచిఉంది…*

*బీబీ నాంచారమ్మ, ‘మాలిక్ కాఫిర్’ అనే సేనాని కుమార్తె. ఆమె అసలుపేరు సురతాని. స్వతహాగా హిందువైన మాలిక్ కాఫిర్, అల్లాఉద్దీన్ ఖిల్జీకి సేనానిగామారి తానుకూడా ముస్లింమతాన్ని స్వీకరించాడు. తన రాజ్యాన్ని విస్తరించే బాధ్యతను ఖిల్జీ, మాలిక్ కాఫిర్ మీద ఉంచాడు. దాంతో మాలిక్ కాఫిర్ దక్షిణ భారతదేశం మీదకి విరుచుకుపడ్డాడు. తమ దండయాత్రలో భాగంగా మాలిక్, శ్రీరంగాన్ని చేరుకున్నాడు…*

*అతను శ్రీరంగం చేరుకునేసరికి రంగనాథుని ఆలయం, భక్తులు సమర్పించిన కానుకలతో ధగధగలాడిపోతోంది. పంచలోహాలతో రూపొందించిన ఆయన ఉత్సవమూర్తిని చూసిన కాఫిర్ కళ్లు చెదిరిపోయాయి. అలాంటి విగ్రహాలను కరిగిస్తే ఎంతో ధనమొస్తుంది కదా అనుకున్నాడు. అలా తన దండయాత్రలో దోచుకున్న వందలాది విగ్రహాలలోకి రంగనాథుని ఉత్సవ విగ్రహాన్ని కూడా చేర్చుకుని హస్తినకి బయలుదేరాడు…*

Varasidhi Vinayaka Temple, Kanipakam

 

*హస్తినకి చేరుకున్న తర్వాత తాను దోచుకున్న సొత్తుని తన కుటుంబం ముందర గొప్పగా ప్రదర్శించాడు మాలిక్. వాటన్నింటిమధ్య శోభాయమానంగా వెలిగిపోతున్న రంగనాథుని విగ్రహాన్ని చూసిన అతని కూతురు, తనకు ఆ విగ్రహాన్ని ఇవ్వమని తండ్రినడిగింది. ఆ విగ్రహం తనచేతికి అందిందే తడవుగా దాన్ని తన తోడుగా భావించసాగింది. విగ్రహానికి అభిషేకం చేయడం, పట్టువస్త్రాలతో అలంకరించడం, ఊయల ఊపడం…*

*అలా తనకుతెలియకుండానే ఒక ఉత్సవమూర్తికి చేసే కైంకర్యాలన్నింటినీ ఆ విగ్రహానికి అందించసాగింది. ఆ విగ్రహంతో ఒక్కో రోజూ గడుస్తున్నకొద్దీ దానిమీదే సురతాని మనసు లగ్నం కాసాగింది. మరో పక్క రంగనాథుని ఉత్సవమూర్తి లేని శ్రీరంగం వెలవెలబోయింది. దండయాత్రలో చనిపోయిన కుటుంబాలు ఎంతగా బాధపడ్డాయో, రంగనాథుని విగ్రహం కోల్పోయిన భక్తులూ, పూజారులు అంతే బాధలో మునిగిపోయారు. చివరకి వారంతా ధైర్యం చేసి ఆ మాలిక్ కాఫిర్నే వేడుకునేందుకు హస్తినకి ప్రయాణమయ్యారు…*

*రంగనాథుని ఉత్సవమూర్తిని వెతుక్కుంటూ తన ఆస్థానాన్ని చేరుకున్న అర్చకులు భక్తుల విన్నపాలుచూసి మాలిక్ కాఫిర్ మనసు కరిగిపోయింది. ఆ విగ్రహాన్ని వారు తిరిగి తీసుకెళ్లేందుకు సంతోషంగా అంగీకరించాడు. అయితే ఆపాటికే రంగనాథుని మీద మనసుపడిన సురతాని మాత్రం విగ్రహం ఇవ్వటానికి ఇష్టపడలేదు, అయితే అర్చకులు ఆమె ఆదమరిచి నిద్రపోయే సమయంలో ఆ విగ్రహాన్ని ఊరుదాటించారు…*

*సురతాని ఉదయాన్నే లేచిచూస్తే విగ్రహం కనుమరుగైంది. ఎవరు ఎంత ఓదార్చినా సురతాని మనసు శాంతించలేదు. ఆ విష్ణుమూర్తినే తన పతిగా ఎంచుకున్నానని కరాఖండిగా చెప్పేసింది. ఆ విగ్రహాన్ని వెతుకుతూ తానుకూడా శ్రీరంగానికి పయనమైంది. శ్రీరంగం చేరుకున్న సురతాని ఆ రంగనాథునిలో ఐక్యమైందని చెబుతారు. ఇప్పటికీ శ్రీరంగంలో ఆమె నిలువెత్తు రూపాన్ని చూడవచ్చు…*

*మరొక కధ ఏమిటంటే : ఆ విగ్రహం రంగనాథునిదికాదు. మెల్కోటే (కర్నాటక)లో ఉన్న తిరునారాయణునిది అని చెబుతారు. దానికి సాక్ష్యంగా ఇక్కడి ఆలయంలోకూడా బీబీ నాంచారమ్మ విగ్రహం కనిపిస్తుంది. ఇంకొందరు భూదేవి అవతారమే బీబీ నాంచారమ్మ అని నమ్ముతారు. కలియుగదైవమైన వేంకటేశ్వరునికి తోడుగా నిలిచేందుకు ఆమెకూడా అవతరించిందని భక్తుల విశ్వాసం. అందుకనే తిరుపతిలోనూ బీబీనాంచారమ్మ విగ్రహంకూడా కనిపిస్తుంది. ఏదేమైనా ఆమె “ముసల్మాను స్త్రీ” అన్న విషయంలో మాత్రం ఎలాంటి వివాదమూలేదు…*

 

Rishi Mandvya, ऋषि मांडव्य, రిషి మాండవ్య

 

*ఎందుకంటే తుళుక్క నాచియార్ అంటే తమిళంలో తురష్క భక్తురాలు అని అర్థం. బీబీ నాంచారమ్మను చాలామంది ముసల్మానులు సైతం వేంకటేశ్వరునికి సతిగా భావిస్తారు. కర్నాటకను హైదర్ఆలీ అనే రాజు పాలించేకాలంలో, అతను ఓసారి తిరుమలమీదకు దండయాత్రకు వచ్చాడట.

అయితే ఆ ఆలయం ఒక ముస్లిం ఆడపడుచును సైతం అక్కున చేర్చుకుందన్న విషయాన్ని తెల్సుకుని వెనుతిరిగాడట. ఇదీ బీబీ నాంచారమ్మ కథ !!!!.*

🙏🕉️🙏 🕉️🪷🕉️ 🙏🕉️🙏

 

*Who is Bibi Nancharamma…..*

 

* There is no one who does not know about that Kali Yuga Lord Sri Venkateswara Swamy. Also many people have many misconceptions about “Bibi Nancharamma”. Who is this Bibi Nancharamma? Is she really a Muslim? How did she become a divine form?…*

* Bibi Nancharamma! The name “Nancharamma” is derived from the Tamil word “Nachiyar”. It means devotee. And “Bibi” means wife. The story of Bibi Nancharamma is not of today. Her story has been in folklore for at least 700 years…*

*Bibi Nancharamma was the daughter of a Senani named ‘Malik Kafir’. Her real name is Suratani. Malik Kafir, a Hindu by nature, became a soldier of Allahuddin Khilji and converted to Islam himself. Khilji entrusted Malik Kafir with the responsibility of expanding his kingdom. With that, Malik Kafir invaded South India. As part of their invasion, Malik reached Srirangam…*

*When he reached Srirangam, Ranganatha’s temple was overflowing with gifts offered by devotees. The Kafir’s eyes were dazzled when he saw his Utsavamurti made of five metals. He thought that melting such idols would fetch a lot of money. So he left for Hastina, including the ceremonial idol of Ranganatha among the hundreds of idols looted in his raid…*

*After reaching Hastinak, Malik displayed his loot in front of his family. His daughter, seeing the idol of Ranganatha shining brightly in the midst of it all, asked her father to give her the idol. As soon as she got hold of the statue, she began to consider it as her companion. Anointing the idol, adorning it with silk, swinging the cradle…*

*Unknowingly, she offered all the kainkarya to the idol. As he spent each day with that statue, Suratani’s mind became fixated on it. On the other hand, Srirangam, without the utsavamurti of Ranganatha, has faded away. As much as the families of those who died in the invasion suffered, the devotees and priests who lost the idol of Ranganatha were in the same pain. At last they all took courage and traveled to Hastina to beg that Malik Kafirne…*

 

Holi Ka Dahan, Vatapi Ganapati

 

* Malik Kafir’s heart melted when he saw the pleadings of the devotees of the priests who reached his court in search of Ranganatha’s Utsavamurti. He happily agreed to let them take the idol back. But Suratani, who had already set her heart on Ranganatha, did not want to give the idol, but the priests passed the idol while she was asleep…*

*When Suratani woke up in the morning, the idol was gone. Suratani’s mind did not calm down no matter how much anyone consoled. She sarcastically said that she had chosen Vishnumurthy as her husband. She also went to Sriranga in search of that idol. It is said that Suratani who reached Srirangam was united in that Ranganatha. Her standing form can still be seen in Srirangam…*

*Another story is: That statue is not of Ranganatha. It is said to belong to Thirunarayan in Melkote (Karnataka). As a proof of that, the idol of Bibi Nancharamma is also seen in the temple here. Others believe that Bibi Nancharamma is an incarnation of Bhudevi. It is the belief of the devotees that she also incarnated to accompany Lord Venkateswara, the god of Kali Yuga. That is why Bibinancharamma statue is also seen in Tirupati. However, there is no dispute about her being a “Muslim woman”.

 

Sanskrit is the language of God, సంస్కృతం దేవభాష

 

*Because Tulukka Nachiyar means Turashka Bhaktura in Tamil. Many Muslims also consider Bibi Nancharamma to be the sati of Lord Venkateswara. During the reign of King Hyder Ali of Karnataka, he once came to Tirumala on a raid.

But she turned back knowing that the temple had also admitted a Muslim girl. This is the story of Bibi Nancharamma !!!!.*

 

*बीबी नानचरम्मा कौन हैं…..*

 

* ऐसा कोई भी व्यक्ति नहीं है जो उस कलियुग के भगवान श्री वेंकटेश्वर स्वामी के बारे में न जानता हो। साथ ही कई लोगों को “बीबी नानचरम्मा” के बारे में कई गलतफहमियाँ हैं। कौन हैं ये बीबी ननचरम्मा? क्या वो सच में मुसलमान है? कैसे बनीं दिव्य रूप?…*

*बीबी ननचरम्मा! “नानचरम्मा” नाम तमिल शब्द “नचियार” से लिया गया है। इसका अर्थ है भक्त। और “बीबी” का अर्थ है पत्नी। बीबी ननचरम्मा की कहानी आज की नहीं है। लोककथाओं में उनकी कहानी कम से कम 700 साल से है…*

 

Varasidhi Vinayaka Temple, Kanipakam

 

*बीबी नानचरम्मा ‘मलिक काफ़िर’ नाम के एक सेनानी की बेटी थीं। उसका असली नाम सूरतानी है। मलिक काफिर स्वभाव से हिंदू था, वह अल्लाहुद्दीन खिलजी का सैनिक बन गया और खुद इस्लाम कबूल कर लिया। खिलजी ने मलिक काफिर को अपने राज्य के विस्तार की जिम्मेदारी सौंपी। उसके साथ, मलिक काफिर ने दक्षिण भारत पर आक्रमण किया। उनके आक्रमण के भाग के रूप में, मलिक श्रीरंगम पहुंचे…*

*जब वे श्रीरंगम पहुंचे, तो रंगनाथ का मंदिर भक्तों द्वारा चढ़ाए गए उपहारों से भरा हुआ था। काफिर की आंखें तब चौंधिया गईं जब उसने पांच धातुओं से बनी अपनी उत्सवमूर्ति देखी। उसने सोचा कि ऐसी मूर्तियों को पिघलाने से बहुत धन प्राप्त होगा। इसलिए वह अपने छापे में लूटी गई सैकड़ों मूर्तियों के बीच रंगनाथ की औपचारिक मूर्ति सहित हस्तिना के लिए रवाना हो गया…*

* हस्तिनाक पहुँचने के बाद, मलिक ने अपने परिवार के सामने अपनी लूट का प्रदर्शन किया। उनकी बेटी ने रंगनाथ की मूर्ति को इन सबके बीच चमकते हुए देखकर अपने पिता से मूर्ति देने के लिए कहा। मूर्ति के हाथ लगते ही वह उसे अपना साथी मानने लगी। मूर्ति का अभिषेक करना, रेशम का श्रृंगार करना, पालना झुलाना…*

* अनजाने में, उसने सभी कैंकर्य को मूर्ति को अर्पित कर दिया। जैसे-जैसे वह उस मूर्ति के साथ दिन बिताता गया, सुरतानी का मन उसी पर स्थिर होता गया। दूसरी ओर, श्रीरंगम, रंगनाथ के उत्सवमूर्ति के बिना फीका पड़ गया है। आक्रमण में मारे गए लोगों के परिवारों को जितना कष्ट हुआ, रंगनाथ की मूर्ति को खोने वाले भक्तों और पुजारियों को उतनी ही पीड़ा हुई। अंत में उन सभी ने साहस किया और उस मलिक काफ़िरने से भीख माँगने के लिए हस्तिना की यात्रा की … *

* रंगनाथ के उत्सवमूर्ति की खोज में उनके दरबार में पहुंचे पुजारियों के भक्तों की याचना देखकर मलिक काफिर का हृदय द्रवित हो उठा। वह खुशी-खुशी उन्हें मूर्ति वापस ले जाने के लिए तैयार हो गया। लेकिन सुरतानी, जो पहले से ही रंगनाथ पर अपना दिल लगा चुकी थी, मूर्ति नहीं देना चाहती थी, लेकिन जब वह सो रही थी तब पुजारियों ने मूर्ति को पास कर दिया…*

*सुबह जब सुरतानी उठी तो मूर्ति जा चुकी थी। किसी के लाख समझाने पर भी सूरतानी का मन शांत नहीं हुआ। उसने व्यंग्य करते हुए कहा कि उसने विष्णुमूर्ति को अपने पति के रूप में चुना था। वह उस मूर्ति की खोज में श्रीरंगा भी गई। कहा जाता है कि श्रीरंगम पहुंचे सुरतानी उस रंगनाथ में विलीन हो गए थे। श्रीरंगम में उनका खड़ा रूप आज भी देखा जा सकता है…*

*एक और कहानी है: वह मूर्ति रंगनाथ की नहीं है। यह मेलकोट (कर्नाटक) में थिरुनारायण से संबंधित कहा जाता है। उसी के प्रमाण के रूप में यहां के मंदिर में बीबी नांचरम्मा की मूर्ति भी देखी जाती है। दूसरों का मानना ​​है कि बीबी नानचरम्मा भूदेवी का अवतार हैं। भक्तों की यह मान्यता है कि वह कलियुग के देवता भगवान वेंकटेश्वर के साथ अवतार लेने के लिए भी अवतरित हुई थीं। इसीलिए तिरुपति में बिबिनंचरम्मा की प्रतिमा भी देखी जाती है। हालाँकि, उनके “मुस्लिम महिला” होने पर कोई विवाद नहीं है।

*क्योंकि तुलुक्का नचियार का अर्थ तमिल में तुरश्का भक्तुरा है। कई मुसलमान बीबी नांचरम्मा को भगवान वेंकटेश्वर की सती भी मानते हैं। कर्नाटक के राजा हैदर अली के शासनकाल के दौरान, वह एक बार एक छापे पर तिरुमाला आए।

लेकिन वह यह जानकर पीछे हट गई कि मंदिर में एक मुस्लिम लड़की को भी प्रवेश दिया गया है। यह है बीबी ननचरम्मा की कहानी !!!!.*

Ramakrishna Paramahamsa

Spread iiQ8

March 11, 2023 2:59 PM

33 total views, 0 today