Bhagavad Gita 10 విభూతి యోగము | Vibhoothi Yogamu Telugu

Bhagavad Gita 10 విభూతి యోగము

 

Om Namo Vaasudevaayah! Bhagavad Gita 10 విభూతి యోగము

10వ అధ్యాయము: విభూతి యోగము

భగవంతుని యొక్క వైభవోపేతమైన మరియు దేదీప్యమానమైన మహిమలను గుర్తుచేసుకుంటూ ఆయనపై ధ్యానం చేయటానికి సహాయముగా అర్జునుడికి ఈ అధ్యాయము శ్రీ కృష్ణుడిచే చెప్పబడినది. తొమ్మిదవ అధ్యాయంలో, శ్రీ కృష్ణుడు భక్తి శాస్త్రాన్ని తెలియపరిచాడు మరియు తన యొక్క కొన్ని వైభవాలని వివరించాడు. ఇక్కడ ఇక, అర్జునుడి భక్తిని మరింత ఇనుమడింపచేయాలని తన అనంతమైన మహిమలని మరింత వివరిస్తున్నాడు శ్రీ కృష్ణుడు. ఈ శ్లోకాలు, చదవటానికి కమనీయంగా మరియు వినటానికి మనోరంజకంగా ఉంటాయి.

 

Bhagavad Gita 10 విభూతి యోగము | Vibhoothi Yogamu Telugu

 

Valmiki Ramayanam Telugu Balakanda Day 1 | వాల్మీకి మహర్షి రామాయణం బాలకాండ

 

ఈ జగత్తులో ఉన్న ప్రతిదానికీ తనే మూలము అని తెలియచెప్తున్నాడు శ్రీ కృష్ణుడు. మానవులలో ఉన్న విభిన్న లక్షణములు ఆయన నుండే ఉద్భవించాయి. సప్తర్షులు, నలుగురు మహాత్ములు మరియు పద్నాలుగు మనువులు ఆయన మనస్సు నుండే జనించారు మరియు వారి నుండే ఈ ప్రపంచంలోని అందరు మనుష్యులూ అవతరించారు. సమస్తమూ ఆయన నుండే ఉద్భవించాయి అన్న విషయం తెలుసుకున్నవారు ఆయన పట్ల భక్తితో దృఢ విశ్వాసంతో నిమగ్నమౌతారు. ఇటువంటి భక్తులు ఆయన మహిమల గురించి చర్చిస్తూ, ఇతరులకు ఆయన గురించి తెలియచేస్తూ ఎంతో తృప్తిని అనుభవిస్తారు. వారి మనస్సులు ఆయనతో ఏకమై పోవటం వలన, వారి హృదయములోనే వసించే భగవంతుడు, వారికి దివ్య జ్ఞానము అనుగ్రహిస్తాడు, దానిచే ఆయనను వారు సునాయాసముగానే పొందుతారు.

 

Bhagavad Gita 17 శ్రద్ధా త్రయ విభాగ యోగము | Shradhaa Traya Vibhaga Yogamu

 

 

అర్జునుడు, ఇది విన్న పిదప, శ్రీ కృష్ణుని యొక్క సర్వోన్నత స్థాయిని గురించి తాను సంపూర్ణముగా విశ్వసిస్తున్నానని ప్రకటిస్తాడు; మరియు శ్రీ కృష్ణుడే సర్వోత్కృష్ట పరమేశ్వరుడని చాటిచెప్పాడు. వినటానికి అమృతములా ఉండే ఆయన యొక్క కీర్తి విశేషాలని మరింత చెప్పమని భగవంతుడిని ప్రార్థిస్తాడు. సమస్త పదార్థములకు కృష్ణుడే ఆది, మధ్య, అంతము కావున, ఉన్నదంతా ఆయన యొక్క శక్తి స్వరూపమే అని శ్రీ కృష్ణుడు తెలియచేస్తున్నాడు. సౌందర్యము, యశస్సు, శక్తి, జ్ఞానము, మరియు ఐశ్వర్యములు అనంతమైన పరిమాణంలో కలిగిన భాండాగారము, శ్రీ కృష్ణుడు. ఎప్పుడైనా మనము మహాద్భుతమైన వైభవమును ఎక్కడైనా గమనిస్తే, ఏదైనా మనలను ఆశ్చర్యచకితులను చేస్తే, మనల్ని పారవశ్యములో ముంచి, మనకు పరమానందమును కలుగచేస్తే, అది శ్రీ కృష్ణుడి వైభవోపేతమైన ఐశ్వర్యములో ఒక చిన్న తళుకే అని తెలుసుకోవాలి. సమస్త ప్రాణులు మరియు వస్తువులు తమతమ శక్తిసామర్థ్యాలను ఆయన యొక్క మూలశక్తి భాండాగారము నుండే పొందుతాయి. తదుపరి ఈ అధ్యాయంలో, తన ఐశ్వర్యమును చక్కగా వివరించే వస్తువులు, వ్యక్తిత్వాలు మరియు కార్యకలాపములను వివరిస్తాడు శ్రీ కృష్ణుడు. చివరికి, తన యొక్క ఐశ్వర్యము, వైభవము యొక్క పరిమాణము, కేవలం ఇప్పుడు చెప్పిన దాని యొక్క మొత్తంగా మాత్రమే అనుకోవద్దు అని ఆయన అంటాడు – ఎందుకంటే, అసంఖ్యాకమైన విశ్వములను తన అస్తిత్వంలోని అతి చిన్న భాగంతోనే నిలబెట్టి సంరక్షిస్తుంటాడు, శ్రీ కృష్ణుడు. అందుకే, ఆ సమస్త ఐశ్వర్యమునకు మూలమైన భగవంతుడినే మన ఆరాధనా విషయముగా చేసుకోవాలి.

Bhagavad Gita 9 రాజ విద్యా యోగము | Raja Vidhya Yogamu Telugu


Bhagavad Gita 7 జ్ఞాన విజ్ఞాన యోగము | Gnana Vignana Yogamu Telugu

 

శ్రీ భగవానుడు ఇలా పలికెను : నా దివ్య ఉపదేశాన్ని మళ్లీ వినుము, ఓ గొప్ప బాహువులు కలవాడా. నీవు నా ప్రియ సఖుడవు కావున, నీ హితము కోరి, నేను నీకు దాన్ని తెలియపరుస్తాను. Bhagavad Gita 10 విభూతి యోగము

దేవతలకు గానీ, మహర్షులకు గానీ నా మూల స్థానము తెలియదు. దేవతలకు మరియు మహర్షులకు మూల ఉత్పత్తి స్థానమును నేనే.

 




Bhagavad Gita 14 గుణత్రయ విభాగ యోగము | Gunatraya Vibhaga Yogamu

Bhagavad Gita Telugu Pdf, Bhagavad Gita Telugu #Bhagavad Gita Telugu Book, Bhagavad Gita Telugu Lo, Bhagavad Gita Telugu Download Bhagavad #Gita Telugu Quotes, Bhagavad Gita Telugu
Bhagavad Gita Telugu Pdf Download, Bhagavad Gita Telugu Slokas, Bhagavad Gita Telugu Lyrics

నేను జన్మరహితుడను మరియు ఆది(మొదలు) లేనివాడిని అని మరియు సర్వలోక మహేశ్వరుడను అని తెలుసుకున్న మనుష్యులు మోహమునకు గురికారు మరియు వారు సమస్త పాపముల నుండి విముక్తి చేయబడుతారు.

బుద్ధి కుశలత, జ్ఞానము, ఆలోచనలో స్పష్టత, క్షమాగుణము, నిజాయితీ, మనస్సు-ఇంద్రియ నిగ్రహణ, సుఖ-దుఃఖాలు, జనన-మరణాలు, భయము-ధైర్యము, అహింస, సమత్వ-బుద్ధి, తృప్తి, తపస్సు, దానము, కీర్తి-అపకీర్తి మొదలగు – మనుష్యులలో ఉండే వివిధములైన గుణములలోని వైవిధ్యములు నా నుండే జనించాయి.

సప్త ఋషులు, వారి పూర్వం నలుగురు మహాత్ములు, మరియు పద్నాలుగు మనువులు, వీరందరూ నా మనస్సు నుండే జన్మించారు. వారి నుండే ఈ లోకం లోని సమస్త ప్రజలు అవతరించారు.

నా మహిమలను (విభూతులను) మరియు దివ్య శక్తులను యదార్థముగా తెలిసినవారు నిశ్చలమైన భక్తి యోగము ద్వారా నాతో ఏకమై పోతారు. ఈ విషయంలో ఎలాంటి సందేహానికీ తావు లేదు.

నేనే సమస్త సృష్టికి మూల ఉత్పత్తి స్థానమును. నా వలననే అన్నీ నడుస్తున్నవి. దీనిని సంపూర్ణముగా తెలుసుకున్న జ్ఞానులు నన్ను అత్యంత భక్తి విశ్వాసములతో ఆరాధిస్తారు.

వారి మనస్సులు నా యందే లగ్నం చేసి, వారి జీవితాలని శరణాగతితో నాకే అర్పించి, నా భక్తులు ఎల్లప్పుడూ నా యందే సంతుష్టులై ఉంటారు. ఒకరినొకరు నా గురించి తెలుపుకుంటూ మరియు నా వైభవాల గురించి చర్చించుకుంటూ అత్యంత తృప్తిని, పరమానందమునూ అనుభవిస్తుంటారు.

మనస్సు సదా ప్రేమ పూర్వక భక్తితో నాతో ఏకమై ఉన్న వారికి, నేను దివ్య జ్ఞానమును ప్రసాదిస్తాను దానిచే వారు నన్ను పొందవచ్చు.

 

Bhagavad Gita 10 విభూతి యోగము

వారి మీద వాత్సల్యంతో, వారి హృదయములోనే ఉండే నేను, అజ్ఞానముచే ఏర్పడిన చీకటిని, ప్రకాశవంతమైన జ్ఞాన దీపముచే నాశనం చేస్తాను.

Bhagavad Gita 10 విభూతి యోగము

Bhagavad Gita 10 విభూతి యోగము

Bhagavad Gita Telugu Pdf, Bhagavad Gita Telugu
Bhagavad Gita Telugu Book, Bhagavad Gita Telugu Lo, Bhagavad Gita Telugu Download
Bhagavad Gita Telugu Quotes, Bhagavad Gita Telugu
Bhagavad Gita Telugu Pdf Download, Bhagavad Gita Telugu Slokas, Bhagavad Gita Telugu Lyrics

అర్జునుడు ఇలా అన్నాడు: నీవే పరబ్రహ్మము, పరంధాముడవు, సర్వోన్నతమైన పవిత్రమొనర్చే వాడివి, నిత్యసనాతన భగవంతుడివి, ఆది పురుషుడివి, జన్మ రహితుడివి, మరియు అత్యున్నతమైన వాడివి. మహర్షులైన నారదుడు, అసితుడు, దేవలుడు మరియు వ్యాసుడు వంటివారు ఇది చాటిచెప్పారు, మరియు ఇప్పుడు స్వయముగా నీవే నాకు ఈ విషయాన్ని ప్రకటిస్తున్నావు.

ఓ కృష్ణా, నీవు చెప్పినదంతా సత్యమేనని నేను దృఢ విశ్వాసంతో నమ్ముతున్నాను. ఓ ప్రభూ, దేవతలు కానీ, దానవులు గానీ, నీ యదార్థ స్వరూపమును తెలుసుకోలేరు.

ఓ పురుషోత్తమా, సకలభూతముల సృష్టికర్త అయినవాడా, సర్వభూతేశా, దేవదేవా, జగత్పతే ! నిజానికి, నీవు మాత్రమే నిన్ను నీ అతీంద్రీయమైన శక్తి ద్వారా ఎరుగుదువు.

నీవు ఏఏ దివ్య విభూతుల ద్వారానైతే సమస్త జగత్తుల యందు వ్యాపించి వాటి యందు వసించి ఉంటావో, వాటిని నాకు వివరించుము. ఓ యోగేశ్వరా, నేను నిన్ను ఎలా తెలుసుకోగలను మరియు ఎలా స్మరిస్తూ ఉండేను? మరియు ధ్యానం చేస్తున్నప్పుడు ఏఏ స్వరూపాలలో నిన్ను స్మరించగలను, ఓ భగవంతుడా?

విస్తారముగా నీ యొక్క దివ్య మహిమలను మరియు అవతారములను మళ్ళీ చెప్పుము, ఓ జనార్దనా. నీ అమృతమును వింటూ ఉంటే ఎన్నటికీ తనివితీరదు.

శ్రీ భగవానుడు పలికెను : ఇప్పుడు నా యొక్క దివ్య విభూతులను నీకు క్లుప్తంగా వివరిస్తాను, ఓ కురు శ్రేష్ఠ, ఎందుకంటే వాటి వివరణకి అంతమే లేదు.

ఓ అర్జునా, నేను సర్వ భూతముల హృదయములలో కూర్చుని ఉన్నాను. నేనే సర్వ ప్రాణుల ఆది, మధ్యము, మరియు అంత్యము.

అదితి యొక్క పన్నెండుగురు పుత్రులలో నేను విష్ణువుని; ప్రకాశవంతమైన వస్తువులలో నేను సూర్యుడిని. మరుత్తులలో మరీచుడను, మరియు రాత్రి పూట ఆకాశ నక్షత్రాలలో చంద్రుడను నేను.

నేను వేదములలో సామ వేదమును, దేవతలలో ఇంద్రుడను. ఇంద్రియములలో మనస్సును; ప్రాణులలో చైతన్యమును.

రుద్రులలో నేను శంకరుడను; అసురులలో కుబేరుడను; వసువులలో అగ్నిని మరియు పర్వతాలలో మేరు పర్వతమును.

Bhagavad Gita 10 విభూతి యోగము

ఓ అర్జునా, పురోహితులలో నేను బృహస్పతిని; సేనాపతులలో నేను కార్తికేయుడను; మరియు జలాశయాల్లో నేను సముద్రమని తెలుసుకొనుము.

మహర్షులలో భృగు మహర్షిని నేను మరియు శబ్దములలో అలౌకికమైన ‘ఓం’ కారమును. జపములలో (యజ్ఞములలో) భగవన్నామమును మరలమరల జపించటమే నేను; స్థావరములలో హిమాలయమును నేను;

వృక్షములలో నేను రావి చెట్టును; దేవర్షులలో నారదుడను. గంధర్వులలో చిత్రరథుడను, సిద్దులలో నేను కపిల మునిని.

గుఱ్ఱములలో నేను, అమృత సముద్రమును చిలకటం ద్వారా జనించిన, ఉచ్చైఃశ్రవమును. భద్రగజములలో నేను ఐరావతమును మరియు మనుష్యులలో రాజును.

ఆయుధములలో వజ్రాయుధమును మరియు ఆవులలో కామధేనువును. సంతానోత్పత్తికి కారణములలో కామదేవుడను (మన్మథుడు) నేనే; సర్పములలో వాసుకిని నేను.

నాగులలో నేను అనంతుడను; నీటిలో వసించే వాటిలో వరుణుడను. పితృగణములలో నేను అర్యముడను; న్యాయ-ధర్మ పాలన అందిచే వారిలో నేను యమధర్మరాజుడను.

దైత్యులలో నేను ప్రహ్లాదుడను; అన్నింటినీ నియంత్రించే వాటిలో నేను కాలమును. నేనే, మృగములలో సింహమును మరియు పక్షులలో గరుత్మంతుడను అని తెలుసుకొనుము.

పవిత్రమొనర్చే వాటిలో నేను వాయువును; శస్త్రధారులలో రాముడను. జల జంతువులలో మకరమును (మొసలి), మరియు ప్రవహించే నదులలో గంగా నదిని.

ఓ అర్జునా, నేనే సమస్త సృష్టికి ఆది, మధ్య, మరియు అంతము అని తెలుసుకొనుము. విద్యలలో నేను ఆధ్యాత్మిక విద్యని, మరియు సంవాదములలో తర్కబద్ధ నిర్ణయమును నేనే.

 

Bhagavad Gita 10 విభూతి యోగము | Vibhoothi Yogamu Telugu

అక్షరములలో అ-కారమును; సమాసములలో ద్వంద్వ సమాసమును. నేనే అపరిమితమైన కాలమును, మరియు సృష్టికర్తలలో బ్రహ్మను.

సర్వమునూ కబళించే మృత్యువును, నేనే, ఇకముందు భవిష్యత్తులో వచ్చే వాటికి కూడా నేనే ఉత్పత్తిస్థానమును. స్త్రీ లక్షణములో నేను కీర్తిని, సిరిసంపదను, చక్కటి వాక్కును, జ్ఞాపకశక్తిని, మేధస్సు, ధైర్యము, మరియు క్షమాగుణమును.

Bhagavad Gita 16 దైవాసుర సంపద్విభాగ యోగము | Daivasura Sampadvibhaga yogamu

సామవేద మంత్రములలో నేనే బృహత్సామము అని తెలుసుకొనుము; ఛందస్సులలో గాయత్రీఛందస్సు నేనే. హైందవ పంచాంగంలో మార్గశీర్ష మాసమును, మరియు ఋతువులలో పుష్పములను తెచ్చే వసంత ఋతువును.

మోసగాళ్ళలో జూదమును నేను; తేజోవంతులలో తేజస్సును నేను. విజయులలో విజయమును నేను మరియు సంకల్పము కలవారిలో దృఢసంకల్పమును, ధర్మపరాయణులలో సద్గుణమును నేనే.

Bhagavad Gita 10 విభూతి యోగము

వృష్ణి వంశస్థులలో నేను కృష్ణుడను మరియు పాండవులలో అర్జునుడిని. మునులలో వేద వ్యాసుడను అని తెలుసుకొనుము మరియు గొప్ప ఆలోచనాపరులలో శుక్రాచార్యుడను.

న్యాయరాహిత్యాన్ని నివారించటానికి ఉన్న విధానాలలో నేను ధర్మబద్దమైన శిక్షను, జయాభిలాష కలవారిలో సత్ప్రవర్తనను. రహస్యములలో నేను మౌనమును. జ్ఞానులలో జ్ఞానమును నేనే.

సర్వ భూతముల సృష్టికి మూల ఉత్పాదక బీజమును నేనే, అర్జునా. చరాచర ప్రాణి ఏదీ కూడా నేను లేకుండా ఉండలేదు.

Bhagavad Gita Chapter 10 Vibhuti Yog | English Bhagavath Geetha




 

నా దివ్య విభూతులకు అంతము లేదు, ఓ పరంతపా. నేను ఇప్పటివరకు చెప్పింది నా అనంతమైన వైభవములలో ఒక చిన్న భాగము మాత్రమే.

నీవు ఏదైనా అందమైన దాన్ని కానీ, అద్భుతమైన దాన్ని కానీ, లేదా శక్తివంతమైన దాన్ని కానీ చూస్తే, అది కేవలం నా శోభ యొక్క తళుకుగా తెలుసుకొనుము.

ఈ విస్తారమైన జ్ఞానం ఏం అవసరం, ఓ అర్జునా? ఇంత మాత్రం తెలుసుకో చాలు, కేవలం నా యొక్క ఒక్క చిన్న అంశచేతనే, సమస్త జగత్తు యందు వ్యాపించి మరియు దాన్ని పోషిస్తూ/నిర్వహిస్తూ ఉన్నాను.

 

Bhagavad Gita 10 విభూతి యోగము

#BhagavadGita Bhagavad Gita 10 విభూతి యోగము
#BhagavadGitaTelugu Bhagavad Gita 10 విభూతి యోగము

https://indianinq8.com/category/devotional/hindu/

Bhagavad Gita 10 విభూతి యోగము

Bhagavad Gita Telugu Pdf, Bhagavad Gita Telugu
Bhagavad Gita Telugu Book, Bhagavad Gita Telugu Lo, Bhagavad Gita Telugu Download
Bhagavad Gita Telugu Quotes, Bhagavad Gita Telugu
Bhagavad Gita Telugu Pdf Download, Bhagavad Gita Telugu Slokas, Bhagavad Gita Telugu Lyrics

Bhagavad Gita 5 కర్మ సన్యాస యోగము | Karma Sanyasa Yogamu

Spread iiQ8