All Good Habits but had cancer, అన్నీ మంచి అలవాట్లే… ఐనా క్యాన్సర్….? iiQ8

All Good Habits but had cancer, అన్నీ మంచి అలవాట్లే… ఐనా క్యాన్సర్….? iiQ8

 

 

అన్నీ మంచి అలవాట్లే… ఐనా క్యాన్సర్….? all good habits but had cancer

ఏజ్ – 30 … నో సిగరెట్… నో మందు… నో గుట్కా…. అసలే చెడు అలవాట్లు లేవు… పైగా రోజూ ఎక్సర్ సైజ్… అప్పుడప్పుడు యోగా… అయినా… ఏం జరిగిందో తెలుసా….?

 

ఏదో చిన్న సమస్యతో టెస్ట్ లు చేయించుకుంటే క్యాన్సర్ ఉందంటూ… షాకింగ్ న్యూస్….! ఇదెలా..ఎలా..ఎలా..? ఆ యువకుడు తలలు బద్దలు కొట్టుకున్నా అర్థం కాలేదు… ఇలా మన దేశంలో …. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎందరో…?ఇంతకీ అన్నీ మంచి అలవాట్లే ఉన్నా… చిన్న ఏజ్ లోనే క్యాన్సర్ ఎందుకు వస్తోంది…?అసలు కారణమేంటి…? మన తండ్రులు, తాతలు ఇప్పటికీ అరవైలు, ఎనభైల్లోనూ ఉల్లాసంగా ఉంటే.. మన తరానికే ఏంటీ మాయరోగాలు…?

 

వెరీ సింపుల్… పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా… మనం తినే తిండీ, తాగే నీరు, పీల్చేగాలి అన్నీ కాలుష్యమయం, రసాయనాలమయం… పొద్దున్నే ప్లాస్టిక్ బ్రష్, బ్రిస్టల్స్… దాని మీద కృత్రిమ రసాయనాలు.. ఇంకా వీలైతే బొమికల పొడి, రసాయనాలు కలిపిన పేస్టులు…

 

ఇక అలా మొదలైతే.. ప్లాస్టిక్ ప్లేట్లలో వేడి వేడి టిఫిన్లు… తాగే నీళ్ల బాటిల్ నుంచి నిల్వ ఉంచే ప్రతి ఆహార పదార్థాలు ప్లాస్టిక్… అలా 24 గంటలూ.. 365 రోజులు ప్లాస్టిక్ జీవితం గడుపుతున్నాం… బై వన్ …గెట్ వన్ లాగా… ఒక దరిద్రానికి … మరో దౌర్భాగ్యం ఫ్రీ అన్నట్టు…

 

పాలు, పండ్లు, కూరగాయలు వీటిల్లో రసాయనాలు… పురుగుల మందులు ఎక్స్ ట్రా… ఇలా కూడా క్యాన్సర్ కారకాలు సరిపోవు అనుకునేవాళ్లు… పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింక్ లు… ఇప్పుడు చెప్పండి… 30 ఏళ్లకే క్యాన్సర్ ఎందుకు రాకూడదో….?

 

All Good Habits but had cancer, అన్నీ మంచి అలవాట్లే… ఐనా క్యాన్సర్….? iiQ8

 

Is White Fish Good For Your Health | iiQ8 Health and Yoga

All Good Habits but had cancer,

All Good Habits but had cancer,

– మరి.. అప్పటివాళ్లు ఎందుకు గట్టిగా ఉన్నారు….?

Find everything you need.

 

Search Product, Service, Properties and items on a single site ShareMeBook.

ఒక్కసారి చిన్నప్పటి రోజులు గుర్తు తెచ్చుకోండి..అమ్మమ్మ ఇంట్లోనో..నానమ్మ ఇంట్లోనో మీ బాల్యం ఎలా గడిచేది…? వేపపుల్లతో తోముకున్నాం.. లేదంటే…

 

పళ్లపొడి చేతిలో వేసుకుని వేలితో శుభ్రంగా పళ్లుతోముకోవటం… తర్వాత… సున్నిపిండితో స్నానం…

 

ఇత్తడి కంచాల్లో భోజనం, రాగి గ్లాసులు, చెంబుల్లో నీళ్లు.. ఇంటి పెరట్లోనే ఉన్న గేదెల నుంచి ఆరోగ్యకరమైన పాలు…

Adhomukha Svanasana, How To do | అధోముఖ స్వనాసనం ఎలా చెయ్యాలి?
ఏ కాలుష్యం లేని వేపచెట్టు గాలి… ఇంకా ఆటలు,ఈతలు… అప్పట్లో… అసలు ప్లాస్టిక్ బకెట్ తో స్నానం చేసినట్టు గుర్తుందా…?

 

ఇత్తడి గంగాళాలు, నీళ్లు కాచుకోవటానికి రాగి బాయిలర్ లు… ఇంట్లో లేదా పొలం నుంచి వచ్చిన తాజా కూరగాయలు… బాగా ఆడిపాడి… పుష్టికరమైన ఆహారం తిని..

 

ఆరుబయట గాలిలో… నులకమంచం లేదా నవారు మంచం మీద నిద్ర… నో ఏసీ… నో …కూలర్….. ఇలా ఒకటా రెండా… అన్నీ ఆరోగ్యకరమైన అలవాట్లే.. సో… మరి వందేళ్లు బతకమంటే ఎందుకు బతకరు మరి…!

 

Vasisthasana, Ardha Chandrasana, Utkatasana (Chair Pose), Side-Bend Asana

 

కాబట్టి ఇప్పుడు చెప్పండి… క్యాన్సర్ మనల్ని కబళిస్తోందా…? మనమే రెడ్ కార్పెట్ వేసి మరీ దానిని ఆహ్వానిస్తున్నామా….? ఆధునికత మంచిదే….. కానీ… అది మరీ మనల్ని మనమే చంపుకునేంత గొప్పది కానంత వరకే…

 

 

Pranayama, Dietary Habits | ప్రాణాయామం, ఆహారపు అలవాట్లు


Tittibhasana Fire Fly pose, Ardha Chakrasana | తిట్టిభాసన (ఫైర్ ఫ్లై భంగిమ), అర్ధ చక్రాసనంAll Good Habits but had cancer, అన్నీ మంచి అలవాట్లే… ఐనా క్యాన్సర్….? iiQ8

Spread iiQ8

March 1, 2016 7:38 PM

171 total views, 2 today