About Ugadi Telugu, ఉగాది వసంత బుతువులో
About Ugadi Telugu, ఉగాది వసంత బుతువులో | iiQ8 info
Ugadi ఉగాది
ఉగాది పండుగ తెలుగులో Ugadi Festival in telugu
ఉగాదిని తెలుగు సంవత్సరాది అని అంటారు. తెలుగువారి మొదటి పండుగ ఉగాది.
ఉ – అంటే నక్షత్రం
గ – అంటే గమనం
నక్షత్ర గమనాన్ని లెక్కించటం ప్రారంభించే రోజును ఉగాదిగా జరుపుకుంటాం.
ఉగాది అనే పదం యుగాది అనే పదం నుండి వచ్చింది. అనగా సంవత్సరంలో మొదటి రోజు. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకోబడుతుంది. నూతన ఉత్సాహాలకు నంది మన తెలుగువారి ఉగాది.
About Ugadi Telugu, ఉగాది ఉగాది పుట్టుక Origin / History of Ugadi in telugu
చైత్ర శుద్ధ పాడ్యమి నాడి బ్రహ్మ దేవుడు విశ్వాన్ని సృష్టించాడని పురాణాలు చెపుతున్నాయి.
ఇంకొక కథనం ప్రకారం సోమకారుడు బ్రహ్మ దగ్గరనుండి వేదాలను దొంగిలించాడు. అప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారం వెళ్లి సోమకారుణ్ణి వాదించి వేదాలను తీసుకొని వచ్చి, బ్రహ్మ దేవుడికి అప్పగించాడట. ఆ రోజునే ఉగాదిగా జరుపుకుంటామని పురాణాలు చెపుతున్నాయి.
ఉగాది రోజు నుండి తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి తెలుగు వారి మొదటి పండుగ, ఇల్లు, వాకిలి, శుభ్రపరుచుకోవటం, తలంటుస్నానాలు, కొత్తబట్టలు ధరించటం జరుగుతుంది. ఈ రోజున కొత్త పనులను ప్రారంభిస్తారు.
మన దేశంలో వివిధ ప్రాంతాలలో ఈ పండుగను వివిధ పేర్లతో పిలుస్తారు.
ఆంధ్ర, కర్ణాటక – ఉగాది
మహారాష్ట్ర – గుడిపడ్వా
తమిళులు – పుత్తాండు
మళయాళీలు – విషు
పంజాబీలు – వైశాఖి
బెంగాలీలు – పొయ్ లా బైశాఖ్
అస్సాం – బిహు
కేరళా – కొళ్ళ వర్షం
ఉగాది ప్రత్యేకతలు – Special in ugadi
1. ఉగాది పచ్చడి ( ugadi pacchadi preparation )
వసంతఋతు ఆగమనం ప్రారంభమైన రోజు. ఈ రోజున షడ్రుచులు కలిపిన పచ్చడి తయారు చేసి తింటారు.
షడ్రుచులు గల ఈ పచ్చడిని తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే రుచులు గల బెల్లం, చింతపండు, ఉప్పు, కారం, వేపపువ్వు, మామిడికాయలు తగిన మోతాదులో మన రుచికి తగినట్టుగా కలిపి తయారు చేస్తారు.
2. పంచాంగ శ్రవణం
తెలుగువారు ఉగాది నాడు పంచాంగ శ్రవణం జరుపుట ఆచారంగా వస్తుంది. పంచాంగ శ్రవణంలో ఆ సంవత్సరంలో మన స్థితిగతులను ముందే తెలుసుకోవొచ్చు. మరియు ఆ సంవత్సరంలో మనం తీసుకునే నిర్ణయాలను జాగ్రత్తగా అలోచించి తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. పంచాంగ శ్రవణంలో తిథి, వారం, నక్షత్రం, యోగం, కారణం అనే ఐదు అంశాల గురించి ప్రస్తావిస్తారు.
3. కవి సమ్మేళనం
సాయంకాలం కవులు ఒక చోట చేరి కవిసమ్మేళనం నిర్వహిస్తారు. ఇందులో కవితలు, పద్యాలు పాడుకోవటం జరుగుతుంది.
About ugadi telugu
ఉగాది వసంత బుతువులో వస్తుంది. అనేక రకాల విషజ్వరాలు, ఆటలమ్మ, ఇంకా చాల రకాల వ్యాధులు వ్యాపించే సమయమిది. అనేక మంది వీటి బారిన పడి మరణిస్తుంటారు. ఈ సమయాన్నే మన బుషులు
About Ugadi Telugu ‘యమద్రంస్టలు’అన్నారు. యమద్రంస్టలంటే యముడు తన కోరలు బయటకు పెట్టి అనేక మంది జనాలను నాశనం చేస్తాడని అర్ధం. కాబట్టి జనం ఈ కాలంలో ఆరోగ్య జాగ్రత్తలు బాగా తీసుకోవాలి. ఉగాది వెను ఉన్న వైజ్జానికి అంశం కూడా ఇదే…
ఉగాది పచ్చడి ఒక మహాఔషదం. ఈ పచ్చడిని ఒక్క ఉగాది రోజు మాత్రమే కాదు, ఉగాది మొదలుకొని శ్రీరామనవమి వరకూ లేదా చైత్ర పౌర్ణిమ వరకూ ప్రతి రోజూ స్వీకరించాలి.
ఈ విధంగా 9 లేదా 15 రోజుల పాటు ఈ ఉగాది పచ్చడి తినడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఆ సంవత్సరం మొత్తం రోగాలు దరిచేరవు. ఉగాది పచ్చడిలో ఉండే వేపపువ్వు కడుపులో ఉన్న నులిపురుగులను చంపేస్తుంది. వేపగాలి ఆటలమ్మ, అమ్మోరు మొదలైన వ్యాధులను దగ్గరకు రానీయదు. మామిడి యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉన్నది. ఇది కఫము, వాతము, పైత్యాలనే మూడు దోషాలను అదుపులో ఉంచుతుంది ఈ ఉగాది పచ్చడి. మనకు వచ్చే జబ్బుల్లో చాలా వరకూ వీటి వల్లే వస్తాయి.
About Ugadi Telugu, ఉగాది
ఉగాది రోజు చేసే తైలభ్యంగన స్నానం (శరీరానికి నువ్వులు నూనె పట్టించి నలుగుపిండితో చేసే స్నానం)శరీరంలో ఉన్న టాక్సిన్స్ (విషపదార్థాలు)ను తొలగిస్తుంది.
ఉగాది కోసం ఇల్లు శుభ్రం చేస్తాం. పాత చెత్త, పనికిరాని వస్తువులు తీసేస్తాం. ఇళ్ళు చక్కగా కడిగి, గడపకు మామిడి తోరణాలు, బంతిపూలు కడతాం. ఇలా శుభ్రం చేయడం వల్లన మన చుట్టూ ఉన్న వాతావరణం నుంచి మనకు రోగాలు సంక్రమించే అవకాశం తగ్గిపోతుంది. బంతి పూలు యాంటీసెప్టిక్, యాంటీ బయోటిక్ లక్షణాలు కలిగినవి. మామిడి ఆకుల గురించి ఇందాకే చెప్పుకున్నాం. ఇవి ఇంట్లోకి రోగకారక క్రిములు రాకుండా ఆపేస్తాయి.
About Ugadi Telugu
ఉగాది నుంచి శ్రీరామనవమి వరకూ 9 రోజుల పాటూ వసంతనవరాత్రులు పేరుతో అమ్మవారిని, శ్రీరామచంద్ర మూర్తిని విశేషంగా పూజిస్తాం. చైత్రపౌర్ణమి వరకూ దమన పూజ పేరుతో రోజుకొక దేవుడిని ప్రత్యేకంగా పూజించాలి.
వైజ్ఝానికంగా చూస్తే, ఒక్క రోజుకాదు, దాదాపు 15 రోజుల పాటు ఎంతో శుచిశుభ్రతగా ఉంటూ, రోజు దేవుడికి నివేదన చేయడం కోసం పవిత్రంగా తయారుచేసిన ఆహారం తింటూ గడిపేస్తాం.
మొత్తంగా చూస్తే ఉగాది పచ్చడి శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతుంది,
కాబట్టి శరీరంలో ఉన్న క్రిములు నాశనం అవుతాయి. ఉగాది స్నానం శరీరంలో
మలినాలను, విషాలను తీసేస్తుంది. ఇంటి శుభ్రత మంగళ తోరణాలు బయట నుంచి వ్యాధులు సంక్రమించకుండా రక్షిస్తాయి. ఈ 15రోజుల పాటు నియమబద్ద జీవితం, పవిత్రమైన, పుష్టికరమైన ఆహారం ఆరోగ్యానికి హేతువులు. ఇవి ఉగాదిలో ఉన్న కొన్ని వైజ్ఝానికి అంశాలను మాత్రమే.
చూశారా మన బుషులు ఒక పండుగ చేసుకోమని చెప్తే అందులో ఎన్ని అంశాలుంటాయో. అందుకే హిందువైనందకు గర్వించండి.
Arunachala Giri Pradakshina – * అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసే విధానం *
devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus
Arunachala Giri Pradakshina – * అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసే విధానం *