Daughter of a Saint Panchatantra Friendship stories  సాధువు కుమార్తె

సాధువు కుమార్తె Daughter of a Saint Panchatantra Friendship stories

 

ఒకప్పుడు ఒక నది ఒడ్డున ఒక సాధువు మరియు అతని భార్య నివసించేవారు. అతని భార్యకు పిల్లలు లేరు. ఒక రోజు సాధువు నది మధ్యలో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒక డేగ ఆకాశంలో నది గుండా వెళుతుంది, అప్పుడు డేగ ఒక ఆడ ఎలుకను సాధువు  చేతిలో పడేసింది.

సాధువు తన కళ్ళ తెరిచి చూడగా తన చేతుల్లో ఎలుకను చూసి, దానిని తన భార్య కోసం ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇంటికి చేరుకున్న తరువాత, అతను తన భార్యతో ఎలుక గురించి చెప్పాడు.

వారు ఎలుకను చిన్నఆడపిల్లగా మార్చాలని నిర్ణయించుకున్నారు. సాధువు మరియు అతని భార్య ఆ ఆడపిల్లగ మార్చి ఆమెను మంచిగా చూసుకోవడం ప్రారంభించారు, ఆమెను తమ సొంత కుమార్తెగా పెంచారు.

ఆ అమ్మాయికి పదహారేళ్ళ వయసులో ఒక అందమైన కన్యగా ఎదిగింది. ఆ వయస్సులో, సాధువు  అమ్మాయి కోసం పెళ్ళిచేయడానికి ఒక మంచి సంబంధం కనుగొనాలని నిర్ణయించుకున్నాడు.

Rabbit and Lion, తెలివైన కుందేలు మరియు సింహం, Panchatantra Telugu Friendship stories

అతను మరియు అతని భార్య సూర్య దేవుడు తమ అమ్మాయికి ఆదర్శవంతమైన మ్యాచ్ అని నిర్ణయించుకున్నారు. కాబట్టి, సాధువు సూర్య దేవుడు కనిపించాలని ప్రార్థించాడు, ఒకసారి సూర్య దేవుడు కనిపించినప్పుడు తన కుమార్తెను వివాహం చేసుకోమని కోరాడు.

కానీ, సాధువు కుమార్తె, “క్షమించండి, నేను సూర్య దేవుడిని వివాహం చేసుకోలేను, ఎందుకంటే అతను చాలా తీవ్రమైన వేడితో ఉంటాడు. మరియు నేను అతని వేడికి బూడిద అయిపోతాను”. అని తన తండ్రితో చెప్పింది.

సాధువు అసంతృప్తి చెందాడు, మరియు మంచి వరుడిని సూచించమని సూర్య దేవుడిని కోరాడు. సూర్య దేవుడు ‘మేఘాల ప్రభువు’ పేరు చెప్పాడు. ఎందుకంటే, మేఘం సూర్యుని కిరణాలను సులభంగా ఆపగలదు.

అప్పుడు సాధువు ‘మేఘాల ప్రభువు’ కోసం ప్రార్థించాడు. అప్పుడు అతను కనిపించిన తర్వాత అతన్ని తన కుమార్తె వద్దకు తీసుకువెళ్ళాడు. కుమార్తె తనకు వరుడిగా నచ్చలేదని మరోసారి చెప్పింది. ఆమె, “నేను అతనిలాగ నల్లగా ఉన్న వ్యక్తిని వివాహం చేసుకోవటానికి ఇష్టపడను. అంతేకాక, అతను చేసే ఉరుములకు నేను భయపడుతాను”. అని అంది.

సాధువు మరోసారి నిరాశకు గురయ్యాడు, మరియు తన కూతురికి తగిన వరుడి కోసం మేఘాల ప్రభువును అడిగాడు. మేఘాల ప్రభువు, “మీరు ‘గాలి దేవుడు’ ను అడగండి, ఎందుకంటే అతను నన్ను సులభంగా చెదరగొట్టగలడు” అని సూచించాడు.

అప్పుడు సాధువు ‘గాలి దేవుడు’ కోసం ప్రార్థించాడు. గాలి దేవుడు కనిపించిన తరువాత, అతన్ని తన కుమార్తె వద్దకు తీసుకువెళ్ళాడు. అతని కుమార్తె మరలా తిరస్కరించింది, ఆమె, “ఎల్లప్పుడూ అటు ఇటు కదిలే గాలి దేవుడి లాంటి బలహీనమైన వ్యక్తిని వివాహం చేసుకోలేనని చెప్పింది.”


Snake with Gold, బంగారం ఇచ్చే పాము, Panchatantra Telugu Friendship stories

మరోసారి నిరాశకు గురైన సాధువు గాలి దేవుడిని సలహా కోరాడు. గాలి దేవుడు ‘పర్వతం ప్రభువు’ ను సూచించాడు, “అది రాతితో  దృడంగా ఉంటుంది మరియు గాలిని సులభంగా ఆపివేస్తుంది.” అని చెప్పాడు

కాబట్టి, సాధువు  అప్పుడు ‘పర్వత ప్రభువు‘ వద్దకు వెళ్లి తన కుమార్తెను వివాహం చేసుకోవాలని కోరాడు. కానీ, కుమార్తె “పర్వతం దృడంగా ఉంటుంది కాబట్టి, నాకు ఇష్టం లేదు” అని మరోసారి పర్వత ప్రభువును తిరస్కరించింది.

ఆమె చెప్పిన మాటలు విని పర్వత దేవుడు సాధువుతో, ‘మృదువైన వ్యక్తి’ ని కనుగొనమని ‘ఎలుక’ ను సూచించాడు. ఎందుకంటే, ఎలుక మృదువైనది మరియు ఇంకా పర్వతంలో రంధ్రాలు చేయగలదు.

ఈసారి కుమార్తె చాల సంతోషంగా ఉంది మరియు ఆమె ఎలుకను వివాహం చేసుకోవడానికి అంగీకరించింది.

అందుకు సాధువు  ఇలా అన్నాడు, “విధి నీకు ఏమి ఇస్తుందో చూడు నీవు ఎలుకగా మొదలయ్యావు, చివరికి ఎలుకను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నావు. కాబట్టి  ఇలాగె  ఉండు”.  అని అతను ఆమెను తిరిగి ఆడ ఎలుకగా మార్చాడు. అప్పుడు ఆడ ఎలుక, మగ ఎలుకను వివాహం చేసుకుంది.

Elephant & Rats, ఏనుగులు మరియు ఎలుకలు Panchatantra Telugu Friendship stories


Daughter of a Saint Panchatantra Friendship stories

Once upon a time there lived a saint and his wife on the bank of a river. His wife has no children. One day while the saint was praying in the middle of the river, an eagle flew across the river in the sky, then the eagle dropped a female rat in the saint’s hand.
The saint opened his eyes and saw the rat in his hands and took it home for his wife. After arriving home, he told his wife about the rat.

They decided to turn the rat into a little girl. The saint and his wife marched on the girl and began to take good care of her, raising her as their own daughter.
The girl grew up to be a beautiful virgin at the age of sixteen. At that age, the saint decided to find a good relationship to marry for the girl.

He and his wife decided that ‘Sun God’ was the ideal match for their girl. So, the saint prayed that the sun god would appear, and once the sun god appeared he asked him to marry his daughter.
But, the saint’s daughter said, “Sorry, I can not marry the sun god, because he is very hot. And I will be burnt to ashes by his heat.” Said his father.

 Day Dreaming Priest, పగటి కలల పూజారి, Panchatantra Telugu Friendship stories



The saint was dissatisfied, and asked the sun god to suggest a good groom. The sun god said the name ‘Lord of the Clouds’. Because, the cloud can easily block the sun’s rays.
Then the saint prayed for the ‘Lord of the Clouds’. Then he took him to his daughter after he appeared. The daughter said once again that she did not like being a groom. She said, “I do not want to marry a black man like him. Also, I’m afraid of the thunder he does.” That is.

The saint was once again disappointed, and asked the lord of the clouds for a suitable groom for his daughter. The lord of the clouds suggested, “You ask the ‘god of wind’, for he can easily scatter me.”
Then the saint prayed for the ‘god of wind’. After the wind god appeared, he took him to his daughter. His daughter refused again, saying, “You can not marry a weak man like the ever-moving wind god.”

Once again the despairing saint sought the advice of the wind god. The wind god referred to the ‘Lord of the Mountains’ as “it is solid with stone and can easily stop the wind.” Said
So, the saint then went to the ‘Lord of the Mountains’ and asked him to marry his daughter. But, the daughter once again rejected the mountain lord saying “I do not like it, because the mountain is strong.”

Upon hearing her words, the mountain god instructed the ‘rat’ to find a ‘gentle man’ with the saint. Because, the rat is soft and can still make holes in the mountain.
This time the daughter was very happy and she agreed to marry the rat.

The saint said, “Look what fate gives you. You started as a rat, and finally decided to marry a rat. So stay that way.” He turned her back into a female rat. Then the female rat married the male rat.


Mongoose and farmer’s wife, ముంగీస మరియు రైతు భార్య, Panchatantra Telugu Friendship stories



friendship stories in telugu, friendship story in telugu, telugu moral stories on friendship, చదువు గురించి నీతి కథలు, heart touching moral stories in telugu,friendship moral stories in telugu, puli meka story in telugu,friends story in telugu,sneham goppatanam telipe katha in telugu, telugu friendship stories,pattudala story in telugu, friendship neethi kathalu in telugu, friendship short stories in telugu language with moral, puli meka katha, putukku jara jara dubukku me, short story on friendship in telugu with moral, putukku jara jara dubukku me meaning in telugu,sneham viluva story in telugu, story on friendship in telugu, telugu friendship stories pdf, telugu stories for elders, friendship stories in telugu pdf, elephant and friends story in telugu
Spread iiQ8