Manmadhudu Mahishasura, మన్మధుడు, మహిషాసురుడు, మారీచుడు

Manmadhudu Mahishasura, మన్మధుడు, మహిషాసురుడు, మారీచుడు
 
పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు —
 
ManmadhuDu : మన్మధుడు –
మన్మధుడు అంటే మనస్సు కలత పెట్టువాడు , మనసుని మధించేవాడని పురాణాలు వర్ణించాయి. మన్మధుడు పూవిలుకాడు.
పూల బాణాలు వేసి గుండెలలో ప్రేమను పెంచును. ఈయనకు మనసిజుడు అని , అనంగుడని , పుష్పధన్యుడు అని పేర్లు ఉన్నాయి .
మంచి రూపం కలిగిన వాడు. విష్ణువు కు మానస పుత్రుడు. రతీదేవి ఈయన భార్య. .
 
Mahishasura : మహిషాసురుడు —
హిందూ పురాణాలలో రాక్షసుడు

 

1. మహిషుని తండ్రి అసురుల రాజైన రంభుడు ఒకనాడు మహిషం‘ (గేదె) తో కలిసి రతిలో పాల్గొన్న మూలంగా జన్మించాడు.
అందువలన మహిషాసురుడు మనిషి లాగా దున్నపోతులాగా రూపాంతరం చెందగల శక్తి కలవాడు.

2. ‘మహిష్మతిఅనే ఆమె శాపం వలన మహిషమై(గేదె) ఉండి సింధు ధ్వీపుడనే రాజు రేతస్సును మింగి గర్భాన్నిధరించి మహిషాసురుడు కి జన్మనిస్తుంది.
దుర్గాదేవి మహిషున్ని ఎదిరించి తొమ్మిది రోజులు తీవ్రంగా పోరాడుతుంది. పదవ రోజున ఇంతటి బలమైన రాక్షసున్ని వధిస్తుంది.
 
Mahishaasura mardhini : మహిషాసుర మర్ధిని —
మహిషాసురుడనే రాక్షసుడిని చంపడం వల్ల పార్వతికి ఈ పేరు వచ్చినది .

 

 
MaareechuDu : మారీచుడు :
రాక్షసి తాటక కి కుమారుడు . సీతాపహరణ సమయం లో రావణుడు ఇతన్ని బంగారు జింక గా 
మారమని అదేశిస్తాడు …
తరువాత రాముని చే హతమార్చబడినాడు . ఇతని సోదరి కైకసి , సోదరుడు సుబాహుడు .


Spread iiQ8

May 2, 2015 7:51 PM

367 total views, 0 today