రామేశ్వరము తమిళనాడు రాష్ట్రము, Rameswaram in Tamilnadu !!

రామేశ్వరము తమిళనాడు రాష్ట్రము! Rameswaram in Tamilnadu !!

రామేశ్వరము తమిళనాడు రాష్ట్రములొని రామనాథపురం జిల్లా లోని ఒక పట్టణం. ఈ  పట్టణములొ ద్వాదశ జోత్యిర్లింగాలలొ ఒకటైన రామనాథ స్వామి దేవాలయం ఉన్నది.

రామేశ్వరము తమిళనాడు రాష్ట్రము, Rameswaram in Tamilnadu !! 1


తమిళనాడు రాజధాని చెన్నై కి 572 కి.మి దురములొ ఉన్న ఈ పట్టణం ప్రధాన భూభాగం నుండి పంబన్ కాలువ ద్వారా వేరు చేయబడింది. హిందు ఇతిహాసాల ప్రకారం ఇక్కడే శ్రీ రాముడు సేతువు నిర్మించి లంకాధీనేతైన రావణాసురుడు పరిపాలించిన లంక కు చేరాడు. ఇక్కడ రాముడు నిర్మించిన సేతువు ని రామసేతువు అని పిలుస్తారు.రావణాసురిడిని నిహతుడిని చేశాక తనకి అంటిన బ్రహ్మ హత్యాపాతకం నిర్మూలించుకోవడం కొరకు రామేశ్వరము లొ రామనాథేశ్వర స్వామి ప్రతిష్ఠించాడు. రామేశ్వరము శైవులకు, వైష్ణవులకు అత్యంత పవిత్ర స్థలము. రామేశ్వరము తీర్థ స్థలమే కాక ఇక్కడ ఉన్న బీచ్ ల వల్ల పర్యాటక స్థలము కూడా ప్రాముఖ్యకత సంపాదించుకొంది.

Moles Results in Telugu, Puttu Machalu Phalithalu, పుట్టుమచ్చలు – ఫలితాలు, About Moles for men and women

 



రామేశ్వరము సముద్రమట్టానికి 10 మీటర్ల్ ఎత్తు లొ ఉన్న ఒక ద్పీపము. ప్రధాన భూభాగం నుండి ఈ ద్వీపాన్ని పంబన్ కాలువ వేరుచేస్తోంది. 9.28° N 79.3° E. ఈ శంఖు ఆకారములొ ఉన్నఈ ద్వీపము విస్తీర్ణం 61.8చదరపు కి.మి. ఈ ద్వీపము యొక్క భూభాగాని ఎక్కువగా రామనాథస్వామి దేవాలయం ఆక్రమిస్తుంది.ఈ దేవాలయం ద్రవిడ శిల్పకళా చాతుర్యానికి ఒక మచ్చు తునక. ఇక్కడ నుండి శ్రీలంక దేశము కనిపిస్తూ ఉంటుంది. శ్రీలంక ప్రధాన పట్టణం కొలంబొ112 కి.మి దురములొ ఉన్నది.

ఉదయపు  రామేశ్వరాలయ తూర్పుగోపురం
భారతీయులలో హిందువులు అనేకమంది కాశీయాత్ర రామేశ్వరం చూసిన తరువాతకాని పూర్తికాదని విశ్వసిస్తున్నారు. కాశీ గంగా తీర్ధం తీసుకు వచ్చి రామేశ్వరం సముద్రంలో కలిపినట్లైతే కాశీయాత్ర పూర్తి ఔతుందని దేశంలోని సకల తీర్ధములు చూసిన ఫలం దక్కుతుందని హిందువులు విశ్వసిస్తున్నారు. ఇక్కడ ప్రధానదైవం అయిన శివుని రామేశ్వరుడు అంటారు. ఈశ్వరుడి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. గర్భాలయాన్ని 10వ శతాబ్ధంలో శ్రీలంక చక్రవర్తి అయిన పరాక్రమబాహు చేత నిర్మించబడింది. భారతీయ నిర్మాణకళా వైభవాన్ని చాటిచెప్పే కట్టడాలలో ఒకటి అయిన ఈ ఆలయ లోపలి నడవ (నడిచేదారి) దేశంలో అతిపెద్దదని సగర్వంగా చెప్పుకుంటున్నారు. 12వ శతాబ్ధం నుండి ఈ ఆలయనిర్మాణం వివిధ రాజుల చేత నిర్మించబడినది. ఆలయంలోని పెద్ద భాగమైన నడవ లేక గర్భగుడి తరువాత ఉన్న ప్రాకారం 1219 అడుగుల 3.6 మీటర్ల ఎత్తైన వైభవంగా అలంకరించబడి తగిన విధముగా స్థాపించబడిన స్థంభాలతో నిర్మించిన నిర్మాణం. ఈ నిర్మాణం అడ్డంకులు లేని 230 మీటర్ల పొడవు ఉంటుంది.
ఇక్కడి ఇసుకలింగం (సైకత లింగం) శ్రీరాముని చేత ప్రతిష్టించబడినది. రావణుడు బ్రహ్మమనుమడు కనుక బ్రాహ్మణుడు కనుక అతడిని రణరంగమున సంహరించడం చేత తనకు బ్రహ్మహత్యా పాతకం వస్తుందని అందుకు పరిహారంగా మహామునుల అదేశానుసారం శ్రీరామచంద్రుడు సీతాదేవితో కలిసి శివలింగ ప్రతిష్ట చేసి ఆరాధించాడని పురాణ కథనాలు వివరిస్తున్నాయి. ఇక్కడ లింగప్రతిష్ఠ చేయడానికి కైలాసం నుండి లింగం తీసుకురమ్మని శ్రీరాముడు హనుమంతుడిని పంపాడు. హనుమంతుడు నిర్ణీతముహూర్తానికి లింగం తీసుకురాని కారణంగా ఋషులు సీతాదేవి స్వహస్థాలతో చేసిన ఇసుకలింగమును శ్రీరాముడి చేత ప్రతిష్ఠ చేయించాడు. ముహూర్తం దాటిన తరువాత కైలాసగిరి నుండి తాను తీసుకు వచ్చిన లింగంతో హనుమంతుడు తాను తీసుకువచ్చిన లింగం ప్రతిష్ఠ చేయలేక పోయినందుకు మిక్కిలి వేదన చెందాడు.. అది చూసిన శ్రీరాముడు హనుమ తీసుకువచ్చిన లింగాన్ని కూడా ప్రతిష్టింపజేసి ముందుగా హనుమ తీసుకు వచ్చిన లింగానికి పూజలు చేసి తరువాత తాను ప్రతిష్టించిన లింగానికి పూజలు చేయాలని ఆదేశించాడు అని పురాణ కథనాలు వివరిస్తున్నాయి.

ఏది ఏమైనప్పటికీ పై కథనానికి మహర్షి వాల్మికి రచించిన మూలరామాయణంతో కాని తమిళంలో కంబర్ రచించిన కంబరామాయణంతో కాని సమన్వయం కుదరడం లేదు. తరువాత 15వ శతాబ్ధంలో తులసీదాసు వంటి వారి చేత వ్రాయబడిన రామాయణాలతో దీనికి సమన్వయం కుదరవచ్చు.

ప్రాతఃకాల మణిదర్శనకాలంలో పవిత్రమైన స్పటిక లింగదర్శనం చేయవచ్చు. ఈ లింగాన్ని చేసిన మణి ఆదిశేషుని చేత ఇవ్వబడినదని పురాణకథనఅలు వివరిస్తున్నాయి.
రామచంద్రుడు నిర్మించినట్లుగా చెప్పబడుతున్న వంతెన ఉన్న ప్రదేశాన్ని సేతుకరై (సేతు తీరం)అంటారు. రామాయణంలో వర్ణించబడిన ఈ సేతువు ను రామేశ్వరం సమీపంలో ఉన్న ధనుష్కోటి నుండి శ్రీలంకలో ఉన్న తలైమన్నార్ వరకు నిర్మించబడిందని పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి.

పంబన్ రైలు వంతెన

రామేశ్వరం దీవి, సముద్ర కెరటాలు, పక్షులు, బంగారు రంగులో మెరిసిపోయే ఇసుకతిన్నెలు, బంగారం లాంటి మనసులు, యాత్రికులు, రామనాథస్వామి గుడి, చిన్న చిన్న అంగళ్ళు, గవ్వలతో చేసిన వస్తువులు, గుర్రపు బళ్ళు, నీలి రంగులో మైమరపించే సముద్రం ఎన్నాళ్ళు చూసినా తనివి తీరదు. రామేశ్వరం ఒక అధ్యాత్మిక ప్రదేశమే కాదు అంతకంటే అద్భుతమైనది. తమిళనాడు లో వున్న ఒక దీవి. రామేశ్వరంలో చూడాలి గాని చాలా ప్రదేసాలు వున్నాయి. రామనాథస్వామి గుడి , కొటి తీర్థాలు, రామపాదాలు,ధనుష్కోడి , విభిషనాలయం, ఇంకా చాలా చాలా వున్నాయి.
దీవి లోనికి వెళ్ళటానికి వీలుగా సముద్రం పై రైలు వంతెన ,బస్ లు ఇతర వాహనాల కోసం వేరే వంతెన వున్నాయి. ఈ వంతెనలు సుమారు రెండున్నర కిలొమీటర్లు సముద్రం పై నిర్మించబడ్డాయి.రైలు వంతెన షిప్ లు వచ్చినప్పుడు రెండుగ విడి పోతుంది.ఇక్కడ బీచ్ లొ కుర్చుని సుర్యొదయం, సుర్యాస్తమయం చూస్తు ఆ అనుభూతి అనుభవిస్తే మనసుకు ఏంతో ప్రశాంతంగ ఉంటుంది .
Spread iiQ8

April 14, 2015 8:20 PM

597 total views, 0 today