Yashoda, yaagyavalkudu
Yashoda, yaagyavalkudu పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు — క్లుప్తముగా వాటి వి
వరాలు
Yashoda : యశోద —
యశస్సును (కీర్తి) కలిగించునది. భాగవతము లో యశోద నందుని భార్య గోకులవాసి .. శ్రీకౄష్ణుని పెంపుడు తల్లి . బలరాముడు , సుబద్రలు ఈమె వద్దనే పెరిగేరు . యశోదా-నందులకు ‘ ఏకనంగా ‘ అనే సొంత కూతురు ఉందటారు .
YaagyavalkuDu :యాజ్ఞవల్కుడు —
ప్రాత: స్మరణీయులైన ఋషిపరంపరలో యాజ్ఞవల్క్య మహర్షి ఒకరు. ఈయన భాష్కలుని వద్ద ఋగ్వేదము, జైమిని వద్ద సామవేదము అరుణి దగ్గర అధర్వణవేదమును అభ్యసించారు.
వైశంపాయుని వద్ద యజుర్వేదాద్యయనము కూడా చేసాక విద్యాహంకారము కలిగి గురుశాపానికి గురై తాను నేర్చుకున్న వేదజ్ఞానమంతా రుధిర రూపము లోగక్కి శాపాన్ని బాపుకున్నారు.
ఆయన గక్కిన పదార్దాన్ని తిత్తిరిపక్షులు తిని తిరిగి అవి పలుకగా ఉపనిషత్తులయ్యాయి. అవే తైత్తిరీయోప నిషత్తులుగా ప్రసిద్దికెక్కాయి.
ఆతరువాత యాజ్ఞవల్కుడు సూర్యభగవానుని ఆరాధించి ,శుక్లయజుర్వేదాన్ని నేర్చుకొని గురువుకన్నా గొప్పవాడయ్యాడు. సరస్వతీదేవిని ఉపాసించి సమస్త విద్యలు సాదించాడ. తరువాత కాత్యాయిని అనే ఆమెను వివాహము చేసుకున్నాదు.
గార్గి శిష్యురాలైన మైత్రేయి యాజ్ఞవల్కుని తప్ప మరొకర్ని వివాహము చేసుకోనని శపధముచేసి , కాత్యాయిని స్నేహము సంపాదించి ఆమె సమ్మతితో యాజ్ఞవల్కుని రెండవ భార్య అయినది. మహాజ్ఞాని,తపోనిధి, అయిన యాజ్ఞవల్కునికి మాఘ శుద్ద పౌర్ణమినాడు యోగీంద్ర పట్టాభిషేకము చేసారు.
ఆయన ఋషులకు తెలియజేసిన విషయాలే యోగశాస్త్రమని,యోగయాజ్ఞవల్కమని ప్రసిద్ధికెక్కాయి. కర్మజ్ఞానము వలన మోక్షము కలుగుతుందని తెలియజేసిన ప్రా:స్మరణీయుడు యాజ్ఞవల్కుడు .
ఆయన జయంతి రోజు నాడు ఆయన్ని ఆరాధిస్తే జ్ఞానసంపత్తి కలుగుతుంది.