Uma Parvathi Usha Ushana, ఉమ – పార్వతి, ఉష, ఉశన
పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు — క్లుప్తముగా
Uma : ఉమ – పార్వతి ( Parvati)
హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది.
వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.
Usha : ఉష —
వెయ్యి బాహువులు కల్గిన బాణాసురుడు బలి చక్రవర్తి కుమారుడు. బాణాసురుని కూతురే ఉష . శ్రీకృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుడి కుమారుడు అనిరుద్ధుడు ఈమె భర్త. వీరి కుమారుడు వజ్రుడు.
బాణాసురుని వంశపరంపర->
* బ్రహ్మ కుమారుడు పరిచుడు
* పరిచుని కుమారుడు కాశ్యపుడు
* కాశ్యపుని కుమారుడు హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు
* హిరణ్యకశ్యపుని కనిష్ఠ పుత్రుడు ప్రహ్లాదుడు
* ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు
* విరొచుని కుమారుడు బలి చక్రవర్తి
* ఆ బలి కొడుకే ఈ బాణాసురుడు
* ఆ బాణాసురుని భార్య కండల.
Ushana : ఉశన —
భృగువు భార్య , శుకృడి తల్లి .