Tumburudu Urvashi, తుంబురుడు, ఊర్వశి, Trishankudu త్రిశంకుడు

పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు — క్లుప్తముగా
Tumburudu Urvashi, తుంబురుడు, ఊర్వశి, Trishankudu త్రిశంకుడు
 
Tumburudu : తుంబురుడు –
తుంబుర (వాద్య విశేషము) కలవాడు. గందర్వుడు , విష్ణు భక్తుడు మరియు దేవగాయకుడు . నారదుని తో పోటాపోటి గా నిలిచి నారద-తుంబురులు గా ప్రసిద్ధిగాంచిరి .
 
Trishankudu : త్రిశంకుడు –
1. తండ్రిని ఎదిరించుట
2, పరభార్యను అపహరించుట
3. గోమాంసము తినుట అను మూడు శంకువులు(పాపాలు) చేసినవాడు.
ఇక్ష్వాకు వంశానికి చెందిన సత్యవంతుడు అనే మహారాజు, కులగురువులైన వశిష్ఠుడి తో వైరం నొంది వశిస్టుని కుమారులచే శపించబడి చండాలరూపాన్ని పొంది , విశ్వామిత్రుని ఆశ్రయించి త్రిశంకుస్వర్గము ( విశ్వామిత్రుని చే సృస్టించబడినది ) నకు రాజైయ్యాడు .
 

Urvashi : ఊర్వశి –
ఊరువు (తొడ) నుండి ఉద్భవించినది. ఇంద్రుని సభలోని అప్సరసలలో ఒకరు. పూర్వం విశ్వామిత్రుడు తపస్సు ను భంగం చేయడానికి రంభ ను దేవేంద్రుడు పంపుతాడు.
రంభ విశ్వామిత్రుడు తపస్సు ను భంగం చేయడానికి ప్రయత్నిస్తుండగా, విశ్వామిత్రుడు రంభ గర్వమనచడానికి తన ఉర్వుల నుండి ఒక అందమైన స్త్రీ ని సృష్టించాడు.
ఆమె ఊర్వశి. విశ్వామిత్రుడు ఊర్వుల నుండి జన్మించింది కనుక ఊర్వశి అయింది. 


Spread iiQ8

May 3, 2015 6:57 PM

356 total views, 0 today