Tenali Ramakrishna Stories in Telugu, Kapi – Kavi, కపి-కవి

Tenali Ramakrishna Stories in Telugu, Kapi – Kavi, కపి-కవి

 

తెనాలి అగ్రహారంలో – జక్కమాంబ, రాయనిమాత్యుల పుత్రుడయిన రామకృష్ణుడు చిన్నప్పటినుంచే రాలుగాయీ, రణపెంకీ. చదువంటే శ్రద్ధ లేదు. సాటివారితో కయ్యాలు తెచ్చేవాడు. తెగ అల్లరి చేసేవాడు. వట్టి దుందుడుకు. భయమన్నది ఎరుగడు. అమ్మానాన్నల మాట వినేవాడు కాదు. అల్లరి చిల్లరిగా తిరిగేవాడు.

ఒకరోజు తననొక సన్యాసి చూశాడు. ఆ సన్యాసికతని మీద ఎందుకో ముచ్చటేసింది. దగ్గరకు పిలిచాడు.

“నీకు కాళికాదేవిని చూడాలనుందా?” అని అడిగాడు.

 

“లక్షసార్లు చూశానా గుడిలో రాతిబొమ్మని. మళ్లీ చూసేందుకేముంది?” నిర్లక్ష్యంగా చెప్పాడు రామకృష్ణుడు.

“బొమ్మనికాదు, అమ్మనే. నిజంగా కాళీమాతని . చూస్తే నువ్వు తట్టుకోలేవులే. భయంకరంగా ఉంటుంది కాళి. జడుసుకుంటావు” కవ్విస్తున్నట్లే అన్నాడు సన్యాసి.

“భయమా! జడుపా! నాకా?” పౌరుషంగా చూశాడతను సన్యాసి వైపు. “ఆ దేవిని చూబెట్టు. ఎంత భయంకరంగా ఉంటుందో చూస్తాను” అన్నాడు సవాలు అంగీకరిస్తున్నట్లు.

ఎలాగైనా ఆ భయంకర రూపాన్ని చూసి తీరాలనిపిస్తూందతనికి. పట్టుదల వచ్చింది. “జగదాంబ అలా తేలికగా కనపడిపోతుందేమిటీ?” నవ్వాడు. “మరెలా కనపడుతుందీ? ఏంచేస్తే కనపడుతుందీ? చెప్పు. నీ మాటలు ఎంతవరకు నిజమో నేను చూసి తేల్చుకోవాలి కాళి ఎంత భయంకరమో… పరీక్షించాలి”.

Tenali Ramakrishna Stories in Telugu, దొంగలను మించిన దొంగ

“నేను నికొమంత్రం చెబుతాను. ఆలయంలో కూర్చుని అమ్మ కనిపించేవరకూ స్మరించు. నీకయితే తొందరగానే దర్శనమిస్తుందిలే. తీరా అంబ కనిపించేసరికి భయపడకేం?..” అంటూ మంత్రం ఉపదేశించాడు సన్యాసి.

లేడికి లేచిందే పరుగన్నట్లు రామకృష్ణుడు కాళికాదేవి ఆలయానికి బయలుదేరాడు. ఆ కోవెల ఊరవతల ఉంది. విజయదశమికి తప్ప ఊరివారటు చూడనూ చూడరు, పట్టించుకోనూ పట్టించుకోరు. అందుచేత ఆ దారి నిర్జనంగానూ తుప్పలూ మొక్కలూ పెరిగి ఉంది. పాములు స్వేచ్చగా తిరిగేలా అనువుగా ఉంది. కాని రామకృష్ణుడు కొంచెమయినా జంకకుండా దుర్గ ఆలయానికి చేరుకుని కొలనులో మునిగి దేవి విగ్రహం ముందు కూర్చుని దీక్షగా మంత్రం జపించసాగాడు.

చీకటి పడుతోంది. కీచురాళ్లు అరుపులు మొదలెట్టాయి. రాత్రవుతున్న కొద్దీ ఆ నిర్జన ప్రదేశంలో – నక్కల వూళలు…. గుడ్లగూబల అరుపులు.

Tenali Ramakrishna Stories in Telugu, Srungaram Parvam, శృంగారం

తమ కొడుకు కోసం వెదుకుతున్న తల్లిదండ్రులు రామకృష్ణుడు యిలాంటి భయంకరమయిన ప్రదేశంలో ఉండొచ్చునని ఊహించక యిటురానేలేదు.

అర్ధరాత్రవుతూంది. అంధకారబంధురమయిన కాళీమాత ఆలయంలో రామకృష్ణుడు కళ్లు మూసుకుని, తదేక దీక్షతో ‘దేవి’ స్వరూపాన్నే మనసులో నిలుపుకుని మంత్రజపం చేయసాగాడు. ఆ బాలుడిమీద అప్పటికి దయకలిగి ‘కాళీమాత’ ప్రత్యక్షమయింది.

“రామకృష్ణా! నీ దీక్షకు మెచ్చితిని. పట్టుదలకు పరమానందముచెందితిని. నీకొక వరము ప్రసాదించుచున్నాను. ఏమి కావలయునో కోరుకో”అంది వాత్సల్యంగా.

Tenali Ramakrishna Stories in Telugu, ఇంతకంతయితే అంతకెంతో

మహాతేజస్సుతో వెలిగిపోతున్న జగన్మాతను చూస్తూ చేతులు జోడించి ఆశ్చర్యంలోనూ ఆలోచనలోనూ పడిపోయాడు రామకృష్ణుడు – కొన్ని క్షణాలపాటు. “ఓహో! కుర్రవాడివి కనుక ఏమి కావలయునో తెలిసికొనలేక తత్తరపడిపోవుచున్నట్లున్నావు. ఇటు చూడు. ఈ వెండిగిన్నె యందు పాలున్నవి.

వీటిని తాగిన అఖండ విద్యావంతుడివి అవుతావు. ఈ వెండి గిన్నె యందు పెరుగు కలదు. దీనిని తాగిన అపర కుబేరుడివగుదువు. ఏది కావాలో కోరుకొనుము. విద్యయా? విత్తమా?” అడిగింది జగదంబ. “రెండు గిన్నెలూ ‘ నాకిమ్ము. చూసి నిర్ణయించు కొందును”

భవాని ఆ గిన్నెలు రెండింటినీ యివ్వగా… చిలిపీ, దుడుకూ అయిన రామకృష్ణుడు రెండింటిలోని పాలు, పెరుగులను చటుక్కున త్రాగివేశాడు. దాంతో – మహిషాసురమర్ధనికి ఆగ్రహం కలిగి – వంద శిరస్సులతో చేతులతో తన ఉగ్రరూపాన్ని దాల్చింది. ఆ భయంకర రూపాన్ని చూసికూడా రామకృష్ణుడు కొంచెమయినా భయపడలేదు సరికదా పకపకనవ్వుతూ… “లోకమాతా! జగజ్జననీ! నా సందేహమును తీర్చుము.

ఒక్కటే ముక్కూ రెండు చేతులూ కలిగిన మాకే రొంపపడితే ముక్కుబీదుకొనుటకు చేతులు నొప్పులు పెట్టునే, నూరు శిరస్సులూ నూరు ముక్కులుకల నీకు పడిసెము పట్టినచో ఎటుల చీదుకొనెదవో, ఏలాగున బాధపడెదవో ఏమిచేసెదవో అని నా మనసున అనుమానము పీడించుచున్నది-” అన్నాడు. అతని కొంటె ప్రశ్నకీ చిలిపి సందేహానికీ దేవికి నవ్వొచ్చేసింది.

Tenali Ramakrishna Introduction, తెనాలి రామకృష్ణుడి పరిచయం

“అది సరేలే. నేనొక గిన్నెలోనిది తాగమంటే- నీవు రెండుగిన్నెలలోనివీ ఎందుకు తాగితివి? నా పట్ల అంత నిర్లక్ష్యమా?” అని గద్దించింది.

రామకృష్ణుడు జగన్మాతకు మోకరిల్లి “అమ్మా! నీవనిన నాకు భక్తియే అలక్ష్యమేమాత్రమునూ లేదు. కేవలమూ విద్యవలన ధనసంపాదన చేయుట అసాథ్యము. కేవలమూ ధనము వలననూ ప్రయోజనము న్వల్పమే. సర్వజ్ఞురాలివగు నీకు తెలియనిదేముండును? మానవజీవితము సక్రమముగానూ సుఖముగానూ ప్రయోజనకరముగానూ సాగవలెనన్న విద్యయూ విత్తమూ రెండూ అత్యవసరమే కదా?.

లక్ష్మీ, సరస్వతులిద్దరి ప్రసాదములలోనూ దేనిని తిరస్మరించిననూ తప్పే అన్నతలంపుతోనూ, అమ్మలగన్నయమ్మ అయిన మాయమ్మ యీ పుత్రునియందభిమానముతో, వాత్సల్యముతో, కరుణతోనే రెండింటినీ అందించినదని భావించి రెండింటినీ త్రాగివేసితిని. అమ్మా! నేను చేసినది నేరమే అయినచో తల్లివి కదా! ఆ తల్లి మనసుతో యీ తప్పు కాయుము” అని ప్రార్థించగా – కాళికాదేవి హృదయము కరిగిపోయినది. అతని మీద కరుణ కలిగింది. ఐతే అతని అవిధేయత శిక్షించబడాలి కదా?

అందుకని – “రామకృష్ణా! నీవు విద్వాంసుడివౌతావు. కాని వికటకవి గా మాత్రమే పేరు ప్రఖ్యాతులూ, రాజగౌరవాలూ పొందుతావు” అని దీవించి అంతర్జానమయింది.

ఇందువలననే అతను వికటకవి అయ్యాడు.

ఏదేమయినా … కోతిచేష్టలు చేసే కుర్రవాడు, కవి కాగలడం అబ్బురమే కదా? ఇలాగ…. రామకృష్ణుడు – మొదట – కపి. తరువాత – కవి అయ్యాడు.

Tenali Ramakrishna Stories in Telugu, మతం సమ్మతం కాదు

 


Tenali Rama Krishna kathalu telugu lo , తెనాలి రాముని చిత్రకళ

 

friendship stories in telugu, friendship story in telugu, telugu moral stories on friendship, చదువు గురించి నీతి కథలు, heart touching moral stories in telugu,friendship moral stories in telugu, puli meka story in telugu,friends story in telugu,sneham goppatanam telipe katha in telugu, telugu friendship stories,pattudala story in telugu, friendship neethi kathalu in telugu, friendship short stories in telugu language with moral, puli meka katha, putukku jara jara dubukku me, short story on friendship in telugu with moral, putukku jara jara dubukku me meaning in telugu,sneham viluva story in telugu, story on friendship in telugu, telugu friendship stories pdf, telugu stories for elders, friendship stories in telugu pdf, elephant and friends story in telugu

 

Tenali Ramakrishna Stories in Telugu, Vikata Kavi, వికటికవికి రెండు వైపులా పదునే

 

Spread iiQ8