రామలింగడి గుర్రం పెంపకం – Tenali Ramakrishna Stories in Telugu
రాయలవారు తమ అశ్వదళాన్ని అభివృద్ధిచేయాలని నిశ్చయించుకున్నారు.
ఆ కార్యక్రమం కోసం తమ సంస్థానంలోని ప్రముఖులొక్కక్కరికీ ఒక్కక్క గుర్రాన్నీ, దానిని పోషించడానికి నెలకిరవైయైదు వరహాలనీ యిప్పించారు. అలా గుర్రాన్నీ, దాని పోషణఖర్చునీ పొందిన వాళ్లలో రామలింగడు కూడా ఒకడు గుర్రాలనిస్తూ -మూడునెలలకొకసారి గుర్రాన్ని తెచ్చి చూపాలి. అని ఆజ్ఞాపించారు.
రామలింగడు తన గుర్రాన్ని- అటూఇటూ కదలడానికేనా వీలులేనిచిన్న యిరుకయిన చీకటిగదిలో ఉంచాడు. ఆ గది గోడకి మూడడుగుల ఎత్తులో ఒక కన్నం పెట్టి ప్రతిరోజు పిడెకెడు గడ్డిపరకలు మాత్రం తినిపించసాగాడు.
అవి తప్ప దానికి మరేమీ పెట్టే వాడు కాడు. కొంచెం నీళ్ళు మాత్రం పోసేవాడు. తనకిచ్చిన గుర్రాన్ని అలా తిండికీ నీరుకీ ముఖం వాచేలా తయారుచేసేవాడు. ప్రతినెలా రాయలవారి ఖజానా నుంచి యిరవయ్యయిదు వరహాలూ తీసుకుని కుటుంబ ఖర్చులకు ఉపయోగించుకునేవాడు. ఇలాగ మూడునెలలు గడిచిపోయాయి.
రాయలవారికి గుర్రాలను తీసుకెళ్లి చూపవలసిన రోజు వచ్చేసింది. మిగిలిన వాళ్లందరూ తాము పెంచుతున్న గుర్రాలని చక్కగా ముస్తాబు చేసి తీసుకెళ్లి చూపిస్తున్నారు. రామలింగడు తన గుర్రాన్ని చూపించవలసీన తరుణం వచ్చేసింది.
గుర్రంలేకుండా వచ్చిన రామకృష్ణుణ్ని – “మీరు పెంచుతున్న గుర్రమేదీ ? అని రాయలవారడిగారు. అప్పుడు రామకృష్ణుడు – “మహారాజా! దానినిక్కడికి తీసుకొచ్చి చూపించే శక్తి నాకులేదు.
అది ఎంత పెంకి గుర్రమో నేను చెప్పలేను. ప్రతిరోజూ నేను పెట్టే గడ్డి తింటూకూడా అదినన్ను దగ్గరకు రానివ్వడంలేదు. అంచేత అశ్వదళంలో ఉండు వారినెవరినయినా పంపి దాన్నిక్కడికి తెప్పించే ప్రయత్నంచెయ్యండి.”- అని అతివినయంగా ప్రార్థించాడు.
Tenali Ramakrishna Stories in Telugu, మామిడి పళ్లూ-వాతలూ
మీ గుర్రం అంత బలంగా తయారయిందా? బలంగా ఉండే గుర్రానికి పొగరుండడం సహజమే.” అంటూ అశ్వశిక్షకుడినొకని పిలిపించి ‘రామకృష్ణకవిగారింటికి వెళ్ళి వీరు పెంచుతున్న గుర్రాన్నిక్కడికి తీసుకురా అని ఆజ్ఞాపించారు. ఆ అశ్వశిక్షకుడు – మహమ్మదీయుడు. బలమయినవాడు. అతనికి పొడయిన గడ్డం ఉంది. అతను, రామకృష్ణుడితో అతనింటికి వెళ్లి “ గుర్రం ఎక్కడుందో చూపించండి ” అని, అడిగాడు.
“అదుగో, ఆ గదిలో ఉంది. దాన్ని పట్టి ఆపడం నావశం కాక ఆ గదిలో ఉంచి … కన్నంలోంచి ఆహారం, నీళ్లూపెడుతున్నాను రోజూ ఈ కన్నంలోంచి చూడు” అన్నాడు. “మీగుర్రం అంతపెంకిదా? చూస్తాను”అంటూ అతనా కన్నంలో తలదూర్చి చూశాడు. అది ప్రతిరోజూ రామలింగడు గుర్రానికి గడ్డిపరకలందించే సమయం. అందుచేత గుర్రం గడ్డికోసం కన్నందగ్గరే కాచుకుని ఉంది. మవోామ్మదీయుడి పొడవయిన గెడ్డాన్ని చూసిచూడడంతోనే గడ్డిపరకలనుకుని గడ్డాన్ని నోటితో అందుకుని తినబోయింది.
గుర్రం అలా తన గెడ్డాన్ని లాగేస్తూంటే గెడ్డాన్ని కాపాడుకోలేకా, బాధభరించలేకా “అరె! అల్లా! అల్లా! ఇదెంత పొగరుమోతు గుర్రం! నా గెడ్డం లాగేస్తూంది. నాతలని మొండెంనుంచి లాగేసేటట్లుందీ భడవ. రక్షించండి, రక్షించండి!- అంటూ అరుస్తూ ఏడవసాగాడు. అశ్వశిక్షకుడు, అతనెంత ఏడ్చినా వదలకుండా గుర్రం అతని గడ్డాన్ని పట్టి పీకెయ్యసాగింది. ఆవెంట్రుకలనే తినెయ్యసాగింది. ఆకలికి తాళలేక.
అతని వెంటవచ్చిన వారు ఆ దృశ్యం చూసి భయపడీ జాలిపడీ పరుగుపరుగున వెళ్ళి రాయలవారికి విన్నవించారు. వెంటనే అంగరక్షకులని వెంటబెట్టుకుని అక్కడికి వచ్చారు రాయలవారు. గుర్రం నోటిలో చిక్కిన తనగద్డాన్ని విడిపించుకోలేక విలవిలలాడుతున్న అతన్ని చూసి జాలిపడి- ఆమహ్మదీయుడి గెడ్డాన్ని కత్తెరతోకత్తిరింపజేసి అతన్ని విడిపించారు. అతని బాధ కొంత తగ్గింది.
Tenali Ramakrishna Stories in Telugu, నూతుల పెళ్ళి
తరువాత ఆ గది తలుపులు తెరిపించి చీకటిలోనూ చిన్నగదిలోనూ చిక్కిశల్యమై ఉన్న గుర్రాన్ని చూసి బాధపడి రామకృష్ణుని మీద చాలా కోపం చెందారు.
“ఖరీదయిన గుర్రానికి కడువునిండా తిండి పెట్టకుండా మాడద్చిచంపడమూ, మాకు నష్టం కలిగించడమూ నేరమని మీకు తెలియదా? మావద్ద నెలనెలా తీసుకున్న సొమ్మునేంచేశారు? కడుపునిండా చాలినంత గడ్డయినా పెట్టొద్దా? ఈ గుర్రమింత హీన స్థితిలో ఉండడానికి కారణమేమిటి? తగిన సంజాయిషీ యివ్వండి”-గద్దించారు రాయలువారు.
రామకృష్ణుడు వినయంగా చేతులుకట్టుకుని ప్రభూ! తమరు కళ్లారా చూస్తూ అడిగితే నేనేం చెప్పగలను? ఒక్కవిషయం ఆలోచించండి. ఈగుర్రానికి తిండిపెట్టకుండా ఎండగడితేనే యింత పొగరుగా శిక్షకుడిని కూడా గెడ్డం పీకేసిందే, కడుపునిండా తిండిపెడితే యింకెంత పొగరుగా తయారౌతుందో? అప్పుడు దీన్ని పట్టడం ఎవరిశక్యమైనా అవుతుందా?” అని అడిగాడు.
అతని యుక్తికి రాయలవారు మనసులో నవ్వుకుని – చావడానికి సిద్ధంగా ఉన్న ఆ గుర్రాన్ని అశ్వశాలకి పంపించి- ఆ గుర్రంవల్ల నానాబాధ పడిన అశ్వశిక్షకుడికి కొంత సొమ్ము పరిహారంగా యిచ్చాడు. రామకృష్ణుడికి తెలివికిది మరో మచ్చుతునక.
Tenali Ramakrishna Stories in Telugu, కారెవరూ కవితకనర్హులు
Tenali Rama Krishna kathalu telugu lo , తెనాలి రాముని చిత్రకళ