ఇంతకంతయితే అంతకెంతో – Tenali Ramakrishna Stories in Telugu
కూచిపూడి అంటే భరతనాట్యం. మొదటనుంచీ భరతనాట్యానికీ, వీధిభాగవతానికీ – కృష్ణాజిల్లాలోని కూచిపూడి గ్రామమూ – ఆ గ్రామవాసులు వేదాంతం వారూ అత్యంత ప్రసిద్ధి. వారొకసారి రాయలవారి సమక్షంలో తమ కళను ప్రదర్శించాలని వచ్చారు. పెళ్ళికెళ్తూ పిల్లిని చంకనబెట్టుకున్నట్లుంటుందని -రాయలు రామలింగడిని లోపలికి రానివ్వవద్దని కట్టుదిట్టం చేయమన్నారు. రామకృష్ణుడలాటి ప్రదర్శనలకు వస్తే ఏదో ఒక అల్లరి చేశాడన్నమాటే అని రాయలవారికి అనుభవమే కదా.
రామకృష్ణుడికది తెలిసి – మారువేషంలో బయలుదేరాడు. ద్వారం దగ్గర భటులు అతన్నడ్డగించారు – అనుమానం వచ్చి.
ఇక లాభం లేదనుకుని -“ద్వారపాలకులూ! ప్రదర్శనానంతరం
ప్రభువులవారు పండితులకి బహుమానాలు పంచి పెడతారు. అది మీకు తెలియదేమో” అన్నాడు రామకృష్ణుడు. “పండితులకు పంచిపెడితే మా కేమిటి ఒరుగుతుంది?” అన్నారు వాళ్లు. (అప్పుడు కూడా లంచగొండితనం ఉందేదన్నమాట!)
Tenali Ramakrishna Stories in Telugu, కారెవరూ కవితకనర్హులు
“నాకు (ప్రదర్శన చూడడమే ప్రధానం. బహుమతులక్షరైేదు. రాయలవారు నాకేం బహుమానాలిచ్చినా వాటిని నేను ముట్టుకోను, మీ యిద్దరికీ సమంగా పంచేస్తాను” అన్నాడు. “నిజంగానా?” ఆశగా అడిగారు వాళ్లు. “దేవుడి మీదొట్టు” వాళ్లతన్ని లోపలికి పోనిచ్చారు. అప్పటికే ప్రదర్శన మొదలయింది. వేదిక మీద గోపికలు కృష్ణుడి అల్లరి పనులను యశోదకు మొరపెట్టుకుంటున్నారు. యశోద కృష్ణుణ్ని మందలిస్తున్నట్టు చక్కగా నటిస్తూంది.
ప్రదర్శన రక్తి కడుతోంది. సరిగ్గా అపుడు రామలింగడు కర్ర పట్టుకుని వేదిక మీదకెక్కి కృష్ణ పాత్రధారిని రెండు బాదులు బాదాడు. చిన్నికృష్ణుడి వేషం వేసిన అమ్మాయి కుయ్యో మొర్రోమంటూ ఏడవసాగింది.
ఇదంతా క్షణాలలో జరిగిపోయింది. ప్రదర్శన రసాభాస అయింది. “ఏమిటీ గందరగోళం?” ఆగ్రహంగా అడిగారాంధ్రభోజులు. ప్రేక్షకులలో కొందరు – రామలింగడిని – కర్రతో సహా – వారిముందు తీసుకొచ్చి నిలబెట్టారు. “ఏమిటీ దుశ్చేష్ట? ఎందుకిలా ప్రదర్శనను రసభంగం చేశావు” కోపంగా అడిగారు రాయలవారు. “నా ఉద్దేశం రసాభాస చెయ్యాలని కాదు ప్రభూ! ప్రదర్శనని మరింత రక్తి కట్టించాలనే” వినయమూ అమాయకత్వమూ నటించాడు.
“ఏమిటి నువ్వనేది?” గద్దించాడు రాజు. “యళోద -కృష్ణుడిని చిన్నగా మందలిస్తూంటూనే ప్రదర్శన అంత బాగుందే. గట్టిగా మందలిస్తే అంటే కర్రతో కొడితే… యింకా ఎంత బాగుంటుందో అనుకున్నాను. మా పిల్లలు అల్లరిచేసినప్పుడునేను మృదువుగా మందలించను. వేపావారమ్మాయి (వేపమండ) చింతావారి చిన్నవాడి (చింత బరికెతోనే వీపు మీద వివాహం చేస్తాను” అన్నాడు.
Tenali Ramakrishna Stories in Telugu, మామిడి పళ్లూ-వాతలూ
రాయలకింకా కోపంతగ్గక “ఇతనికిరవై కొరడా దెబ్బలు శిక్ష-” అని చెప్పాడు భటులతో. రామలింగడు చెక్కు చెదరకుండా,
“ఇరవై… రెండు…ఇద్దరు అంటే ఒక్కొక్కరికి పది… రెండోవాడికి పది” అంటూ లెక్కలు వేస్తూంటే – “ఏమిటి? లెక్కలు వేస్తున్నావ్?” అడిగాడు రాజు. “మరేమీలేదు ప్రభూ. నన్ను లోపలికి వదలడానికి – ఆ ద్వారపాలకులిద్దరికీ – నాకిక్కడ లభించేవి చెరిసగం యిచ్చేస్తానని మాటివ్వవలసివచ్చింది. నా కిక్కడ లభించిన ఇరవైకొరడా దెబ్బల శిక్షా వారికి సమంగా పంచెయ్యాలి కదా? అందుకని లెక్కలు వేస్తున్నాను.” అన్నాడు మహా అమాయకంగా. రాజుగారితోపాటు మిగిలినవారికీ నవ్వాగలేదు. రాయలు రామలింగడు శిక్షరద్దు పరచి వదిలేశారు.
Tenali Ramakrishna Stories in Telugu, నూతుల పెళ్ళి
Tenali Ramakrishna Stories in Telugu, పిచ్చి కోరిక
Tenali Rama Krishna kathalu telugu lo , తెనాలి రాముని చిత్రకళ