దొంగలను మించిన దొంగ * Tenali Ramakrishna Stories in Telugu
శ్రీకృష్ణదేవరాయలొకనాడు కారాగారములనూ వానియందుండే ఖైదీలనూ తనిఖీ చేయవలెనని వెళ్లగా- ఖైదీలు కొందరు -“ప్రభూ! మా తప్పులను క్షమించి విడుదల చెయ్యమని ప్రార్ధించు కుంటున్నాం” అన్నారు. ఇద్దరు మాత్రం- “రాజు! దొంగతనం చేయడమనే కళలో మేము చాలా నైపుణ్యం సంపాదించిన వాళ్లం. మా చోరకళను పరీక్షించి మమ్ము విడుదల చెయ్యండి. మేము మా వృత్తి వదులుకుంటాం” అన్నారు.
వారి మాటలు ప్రత్యేకంగా తోచి – “ఐతే మీరీ రాత్రి రామలింగడి యింట దొంగతనం చెయ్యండి. మీరు దొరికిపోకుండా దొంగతనం చేయగలిగితే – మీకు ఖైదునుంచి విముక్తి కలిగిస్తాను. దొరికిపోయారో – మళ్లీ మీకు చెరసాలే’ అన్నారు రాజు.
చీకటి పడుతూంటే ఆ దొంగలిద్దరూ రామకృష్ణుని యిల్లు చేరి – పెరటిలోని దట్టమయిన పాదుకింద దాక్కున్నారు రాత్రయ్యాక యింటికి కన్నం వెయ్యొచ్చని, కాని రామలింగడు వారిని పసికట్టేశాడు. భార్యకేదో రహస్యంగా చెప్పి పెరటిలోనికి తీసుకువచ్చి దొంగలకు వినపడేలా,
“ఊరిలో దొంగల బెడద ఎక్కువగా ఉంది. నీ నగలన్నీ మూటగట్టి తీసుకురా.” అన్నాడు. “ఎందుకూ?” అమాయకంగా అడిగిందామె. “ఆ నగల మూటని నూతిలో పడేద్దాం. దొంగలభయం తీరాక తీసుకోవచ్చు. నీ నగలేకాదు యింట్లోని బంగారం, వెండి అంతాను”.
“సరే” అని కొంచెం సేపటిలో ఆవిడ మూట తెచ్చింది. దానిని నూతిలో పడేశాడు రామకృష్ణుడు. నిండానీరు ఉన్న నూతిలోపడి ఆ మూట పెద్ద శబ్దం చేసింది. ఆ దంపతులు యింట్లోకి వెళ్లిపోయారు.
“ఇది మరీ బాగుంది. వెతకబోయిన తీగ కాళ్ళకు దొరికింది. నూతిలో నీరు మరీ ఎక్కువగా ఉన్నట్లుంది. కొంత మేరకు తోడేశాక – అప్పుడు నూతిలోకి దిగి నగలమూటని తీసుకోవచ్చు. ఏమంటావ్?” అన్నాడు చోరద్వయంలో ఒకడు.
Tenali Ramakrishna Stories in Telugu, కారెవరూ కవితకనర్హులు
“ఔను. అలాగే చేద్దాం. నీరు తగ్గితే తప్ప నూతిలోకి దిగలేం. ఇంకెందుకూ ఆలస్యం? వాళ్లు యింట్లోకి పోయారు. మనం నీరు తోడడం మొదలు పెడదాం. ఒక్కసారే అన్ని నగలూ అందుకోవచ్చు శ్రమలేకుండా. ఇక్కడ రెండు బొక్కెనలున్నాయి – మన కోసమే అన్నట్లు” అన్నాడు రెండో చోరుడు. ఇద్దరూ నీరుతోడడం ప్రారంభించారు.
చాటునదాగి ఉన్న రామకృష్ణుడానీటిని విశాలమయిన పెరటిలోని మిరపమొక్కలకూ, వంగమొక్కలకూ, అరటిచెట్లకూ, అన్ని పాదులకూ మళ్లించసాగాడు. వాటికి ఇక నీరు చాలనిపించాక – దొంగల వద్దకు వచ్చి,
Tenali Ramakrishna Stories in Telugu, నూతుల పెళ్ళి
“బాబూ! నాయనా! మా మొక్కలకి మీరు తోడిన నీరు చాలు. ఇక ఆపెయ్యండి తోడడం. మా కోసం.. మా పెరటి తోట కోసం… మీరెంతో శ్రమపడ్డారు. అందుకు మీకు చాలా కృతజ్ఞతలు” అని చెప్పేసరికి వాళ్లిద్దరూ, కంగారుగా గోడదూకారు. గోడవతల – వీధిలో గస్తీ తిరుగుతున్న రాజభటులు
వాళ్లని పట్టుకుని – మళ్లీ ఖైదులో పెట్టారు. మరుసటి రోజు -రాయలవారడుగగా రామకృష్ణుడు రాత్రి జరిగినదంతా చెప్పాడు. రాయలు రామలింగడి యుక్తికెంతో మెచ్చుకున్నారు.
Tenali Ramakrishna Stories in Telugu, పిచ్చి కోరిక
Tenali Ramakrishna Stories in Telugu, గూని మందు
Tenali Rama Krishna kathalu telugu lo , తెనాలి రాముని చిత్రకళ