తెనాలి రామకృష్ణుడి పరిచయం – Tenali Ramakrishna Introduction
తెనాలి రామకృష్ణుడు…. తెనాలి రామలింగడు…. రెండు పేర్లూ ఒకరివే. 17వ శతాబ్దంలో – విద్యానగరాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు స్
వారి ఆస్థానంలో- అల్లసానిపెద్దన, నందితిమ్మన, అయ్యలరాజు రామభద్రుడు, భట్టుమూర్తి, ధూర్జటి, పింగళి సూరన్న, మల్లన్న, తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిదిగురు కవులుండేవారు. ఈ ఎనిమిదిగురూ కవిత్వం చెప్పడంలో చాలా ఘనులు. అందుకే యీ ఎనిమిదిగురినీ కలిపి “అష్టదిగ్గజాలు” అనేవారు. వీరిలో తెనాలి రామకృష్ణుడు ప్రత్యేకమయిన కవి.
Tenali Ramakrishna Stories in Telugu, నూతుల పెళ్ళి
ఎందుకంటే రామకృష్ణుడు “పాండురంగ మాహాత్యం”వంటి కొన్ని భక్తిగంథాలు రాసినా, ప్రధానంగా హాస్యకవిత్వమే చెప్పాడు. ఇతని మరో ప్రత్యేకత ఏమిటంటే – చాలా మంది కవులు, రచయితలలా హాస్యకథలు చెప్పడమో, రాయడమోకాక స్వయంగా తను వాటిని నిర్వహించాడు.
వాటన్నిటిలోనూ తను పాత్ర ధరించాడు, నేటి భాషలో తెనాలి రామలింగనివి “ప్రాక్టికల్ జోక్స్” అన్నమాట. అందుకే అతనికి “వికటకవి” అని మరో మారు పేరు. ఈ మాటని ఎటునుంచి చదివినా ఒకటే. రామకృష్ణుడి హాస్యానికి రెండువైపులా పదునే. వికటం అంటే మోతాదుమించిన వేళాకోళం.. హాస్యం… వ్యంగ్యం… ఆటలు పట్టించడం… రామలింగడి మాటలూ, చేతలూ కూడా ఎక్కువగా వికటంగానే ఉండేవి. తమాషాగానే ఉండేవి. పదునుగా ఉండేవి.
Tenali Ramakrishna Introduction, తెనాలి రామకృష్ణుడి పరిచయం
రామకృష్ణుడి జీవితం మొదటినుంచీ తమాషాగానే విచిత్రంగానే సాగుతూ వచ్చింది. లేకపోతే – బడిదొంగా, చదువుకి మొద్దూ, అయిన రామకృష్ణుడు మహోన్నత వికటకవి ఎలా కాగలిగాడు?
చిన్నప్పటినుంచీ చిత్రమే అయిన అతని జీవితం గురించీ, జీవితంనిండా హాస్యాన్నీ హాస్యంలో జీవితాన్నీ నింపుకున్న – రామకృష్ణుడి గురించీ వివరంగా చూద్దాం.
Tenali Ramakrishna Stories in Telugu, గూని మందు
Tenali Ramakrishna Stories in Telugu, పిచ్చి కోరిక
Tenali Rama Krishna kathalu telugu lo , తెనాలి రాముని చిత్రకళ