Tapati Taara Taataki, తపతి , తార, తాటకి

 పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు — క్లుప్తముగా
Tapati Taara Taataki, తపతి , తార, తాటకి
 
Tapati : తపతి —
సూర్యుని కుమార్తె . — సంజ్ఞ రూపంలో చాయ సూర్యుడికి చాలాకాలం సేవలు చేసింది. ఆమెకు సూర్యుడి వల్ల శనీశ్వరుడు, తపతి కలిగారు. తపతి అందాల బొమ్మ, సుగుణాల ప్రోగు. ఆమెకు యుక్త వయస్సు వచ్చేసరికి మరింత అందంగా తయారైంది.
సూర్యుడు కుమార్తెకు పెళ్ళిచేయాలని నిశ్చయించుకున్నాడు. తగిన వరుడికోసం అన్వేషిస్తున్నాడు. చంద్రవంశ రాజు ఋక్షుని కుమారుడు సంవరణుడు తో ప్రతిష్ఠానపురంలో వారిద్దరి వివాహం వశిష్టుడి ఆధ్వర్యంలో అతి వైభవంగా జరిగింది.
ఆ దంపతులకు కురు వంశానికి మూలపురుషుడైన కురువుజన్మించాడు. వింధ్య పర్వతాలకు పశ్చిమంగా ప్రవహించి ప్రజల పాపాలు పోగొట్టమని భాస్కరుడు తన కుమార్తెను దీవించాడట.
తండ్రి ఆశీస్సును అనుసరించి తపతీదేవి నదీమతల్లిగా మారి నర్మదానదిలో లీనమై ప్రవహిస్తోంది.
 
Taara : తార —
తారుని కుమార్తె . వాలి భార్య . అంగదుని తల్లి . వాలి మరణించిన అనంతరము తనను కూడా చంపి భర్త దగ్గరకు పంపమని తార రాముని ప్రాధేయపడింది. కాని అది వీలుపడదని కర్మా-ధర్మాలను అనుభవించవసిందేనని తాను నిమిత్తమాత్రుడునని హితవు పలికెను . వాలి సోదరుడు సుగ్రీవుడు ఈమెను వివాహమాడెను .
 

Taataki : తాటకి —
లేదా తాటక రామాయణ ఇతిహాసంలో కనిపించే ఒక యక్ష రాక్షసి పేరు. ఈమె వివిధ రూపాలలోకి మారగలదు.
ఈమె తండ్రి యక్షరాజైన సుకేతుడు పిల్లల కోసం తపస్సు చేశాడు. బ్రహ్మ ఇతని తపస్సుకు మెచ్చి అతను కొడుకును కోరుకున్నా ఒక బలమైన మరియు అందమైన కూతుర్ని ప్రసాదించాడు. ఈమె రాక్షస రాజైన సుమాలి ని పెళ్ళిచేసుకుంటుంది.
వీరిద్దరికి కలిగిన పిల్లలే సుబాహుడు, మారీచుడు మరియు కైకసి. వీరిలో కైకసి విశ్రావసుని వలన రావణుడు, విభీషణుడు మరియు కుంభకర్ణుల్ని పుత్రులుగాను, శూర్పణఖ అనే పుత్రికను పొందుతుంది. 



Spread iiQ8

May 3, 2015 6:56 PM

333 total views, 0 today