Sri Shankara Acharya శ్రీ శంకరాచార్య విరచిత గురు అష్టకం..!
Sri shankara acharya శ్రీ శంకరాచార్య విరచిత గురు అష్టకం..!
శ్రీ శంకరాచార్య విరచిత గురు అష్టకం..!
శరీరమ్ సురూపమ్ తథా వా కళత్రమ్
యశస్చారు చిత్రమ్ ధనమ్ మేరుతుల్యమ్
మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్ !
చక్కని రూపం గల అందమైన భార్య ఉన్నప్పటికి, గొప్ప కీర్తి, మేరు పర్వతమంత డబ్బు ఉన్నప్పటికి గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?
కళత్రమ్ ధనమ్ పుత్ర పౌత్రాధి సర్వమ్
గృహమ్ బాంధవా సర్వ మేతాధి జాతమ్,
మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్ !
భార్య, సంపద, పుత్రులు, మనుమలు, మంచి ఇల్లు, బంధువులు ఉండి గొప్ప కుటుంబములో పుట్టినప్పటికీ, గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?
షడన్గాది వేదో ముఖే శాస్త్ర విద్య
కవిత్వాది గద్యమ్, సుపద్యమ్ కరోతి
మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్ !
నీవు ఆరు అంగముల లోను, నాలుగు వేదముల లోను, పారంగతుడవైనా కాని, గద్య, పద్య రచనలో ప్రజ్ఞావంతుడైన గాని, గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?
విదేశేషు మాన్య, స్వదేశేషు ధన్య
సదాచార వృత్తేషు మత్తో న చాన్యా
మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్ !
నిన్ను విదేశములో గొప్పగా, స్వదేశములో ధనవంతునిగా, సదాచార వృత్తి గలవానిగా జీవించు వాడవని పొగడ బడినా, గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?
క్షమా మండలే భూప భూపాల వృందై
సదా సేవితమ్ యస్య పాదారవిందమ్
మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్ !
నీవు ఒక దేశానికి రాజువైనా, ఎందఱో రాజులు, రారాజులు నీ పాదాలు సేవించినను, గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?
యశో మే గతమ్ భిక్షు దాన ప్రతాప
జగద్వస్తు సర్వమ్ కరే యః ప్రసాదత్
మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్ !
దానగుణం వలన నీ కీర్తి అన్ని దిశల వ్యాపించినాను, ప్రపంచం మొత్తం నీ పక్షాన ఉన్నప్పటికీ, గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?
న భోగే, న యోగే, న వా వాజి రాజౌ
న కాంతా ముఖే నైవ విత్తేషు చిత్తమ్
మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్ !
భోగము, యోగము, అగ్నిహోమము, స్త్రీ సుఖము, ధనము నందు నీవు శ్రద్ధ చూప నప్పటికీ, గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?
అరణ్యే న వాసస్య గేహే న కార్యే
న దేహే మనో వర్తతే మే త్వనర్ఘ్యె
మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్ !
అడవిలో, ఇంటిలో ఉండాలని కోర్కెలేని వారైనా, ఏదైనా సాధించాలని గాని, తన వంటి మీద శ్రద్ధగాని లేని వారైన గాని, గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?
ఫలశృతి:
గురోరష్టకమ్ యః పఠేత్ పుణ్యదేహి
యతిర్ భూపతిర్, బ్రహ్మచారీ చ గేహీ
లబేత్ వాంఛితార్థమ్ పదమ్ బ్రహ్మ సజ్ఞమ్
గురోరుక్త వాక్యే, మనో యస్య లగ్నమ్ !
ఈ గురు అష్టకమును ఎవరు పారాయణం చేస్తారో, గురువు మాటను సావధానులై వినెదరో, గురువును శ్రద్ధతో సేవించెదరో, వారు పవిత్రులైనా, సంయాసులైనా, రాజైనా, సజ్జనులైనా, బ్రహ్మచారు లైనా, ఎలాంటి వారైనా వారు కోరినవి వారికి లభించి పరబ్రహ్మను చేరుకుందురు.
devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus
కలెక్టరు – పేదరికం – IAS Collector – Poor Story
సహాయపడే అద్భుతమైన కథ! Excellent story helping hand Telegu lo stories
అబద్దం – శిక్ష Lie – Punishment
A Letter from Father to Kids ఓ తండ్రి తన పిల్లలకు రాసిన లేఖ