శ్రీ చక్రం గురించి ఒక ఆలోచన………!!!!
sri chakram oka alochana devuni gudi lo aradhana
ఈ నాడు శ్రీ చక్రాన్ని మనందరం పూజిస్తాం. ఇంటి లో దేవుని గుడిలో పెట్టి ఆరాధిస్తాం ఎందుకు.
Sri Chakram Oka Alochana, Devuni Gudi lo Aradhana
శ్రీ చక్రానికి అధి దేవత శ్రీమాత. ఆది పరాశక్తి. అంటే శక్తిని ఆరాధిస్తున్నాం. అంతేనా ఇంకేమైనా రహస్య సంకేతాలు దీనిలో ఉన్నాయా అనేది ఆలోచించం. మన ఋషులు మనకు అన్ని విషయాలనూ సంకేత రూపంలో అందించారు. ఈ ఆరాధనలో రెండు మార్గాలను ఇమిడ్చారు.
ఒకటి ఆధ్యాత్మిక సాధన రెండు బౌతిక సాధన. రేండూ మానవ మనుగడకు అవసరమే. బౌతిక సాధన లేని ఆద్యాత్మికం వ్యర్థమే, ఆధ్యాత్మిక సాధనలేని భౌతికము వ్యర్థమే.
మానవుడు చతుర్విద ఫలపురుషార్థాలను సాధించాలని మన శాస్త్రాలు బోధిస్తాయి.
ధర్మం, మోక్షం ఆధ్యాత్మికమైతే. అర్థం, కామం భౌతికం. ఈ రెండింటినీ సమానంగా తీసుకువెళ్ళగలిగారు కనుకనే మన వారు మహర్షులయ్యారు.
ఏమిటి సైన్సును గురించి మాట్లాడే వాడు ఆధ్యాత్మికం గురించి మాట్లాడుతున్నాడని అనుకుంటున్నారా….. విషయం అటువంటిది…..
శ్రీ చక్రం శక్తికి చిహ్నం. ఎలా…..
మీరి శ్రీచక్రాన్ని జాగ్రత్తగా గమనిస్తే శ్రీచక్ర నిర్మాణం నేటి గేర్ సిస్టంను పోలి ఉంటుంది. భరద్వాజ మహర్షి వైమానిక శాస్త్రంలో ఒక విమాన చిత్రం ఇవ్వబడింది.
అది కూడా శ్రీ చక్రాన్ని పోలి ఉంటుంది. నేడు మన వెహికల్స్ అన్నీ శక్తి ఉత్పత్తి జరిగాక ఆ శక్తిని గేర్లకు అనుసంధానంచేసి వాహనం లేదా యంత్రం తిరేగేటట్లు చేస్తున్నారు.
Sri Chakram Oka Alochana, Devuni Gudi lo Aradhana
అవే గేర్లు శక్తి ఉత్పాదన చేస్తే……. చేస్తాయి. ఎలా……శ్ర్ చక్రం ఒక శక్తి ఉత్పత్తి సాధనంగా భావించండి. అప్పుడు కొత్త ఆలోచనలు వస్తాయి.
భరద్వాజుమహర్షి వైమానిక శాస్త్రంలో పాదరసాన్ని సూర్యశక్తితో అనుసంధానించి శక్తి ఉత్పత్తి చేసినట్లు వ్రాశారు. శివకర్ బాపూజీ తల్పడే గారు కూడా పాదరసం(మేర్క్యురీ) సూర్యశక్తి(సోలార్ ఎనర్జీ) తో విమానాన్ని తయారు చేసినట్లుగా చెప్పబడింది.
ఆలయ గోపురాలు కూడా శ్రీచక్ర రూపాన్ని పోలే ఉంటాయి. ఆలయ గోపురాన్ని విమాన గోపురం అని అంటాం.
అంటే శ్రీచక్రానికి గేర్ సిస్టంకు, ఆలయగోపురాలకు, విమానాలకు సంబంధించి ఏదో రహస్య శక్తి ఉత్పాదక విధానం ఉంది అనేది చూచాయగా అర్థం అవుతుంది కదా.
మన మన శాస్త్రాలను ఆధ్యాత్మిక విధానం లోనే కాకుండా బౌతిక విధానంలో కూడా అద్యయనం చేయవలసిన అవసరం చాలా ఉంది. దీనికి నేటి యువతే నడుంకట్టాలి.
పండితుల నేతృత్వంలో యువత ఈలాంటి పరిశోధనలు చేపడితే అధ్బుతాలు సృష్టించడానికి ఎంతోసమయం పట్టదు.
Sri Chakram Oka Alochana, Devuni Gudi lo Aradhana
Find everything you need.