పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు — క్లుప్తముగా
Satyabhama Syaama Shakuntala, సత్యభామ, శ్యామ, శకుంతల
Satyabhama – సత్యభామ :
శ్రీకృష్ణుని భార్య సత్యభామ , ఈమె తండ్రి సత్రాజిత్తు (సత్రాజిత్తు ను శతధన్వుడు అనేవాడు సంహరించి శమంతక మణిని చేజిక్కించుకున్నాడు.
శమంతక మణిని అపహరించుకుపోవటమేకాకా తన మామ అయిన సత్రాజిత్తును సంహరించిన శతధన్వుడిని శ్రీకృష్ణుడు హతమార్చెను .
Syaama : శ్యామ —
హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత.
త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది.
వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.
Shakuntala : శకుంతల —
మేనక, విశ్వామిత్రుల సంతానము. దుష్యంతుని భార్య మరియు భరతుని తల్లి.
విశ్వామిత్రుడి తపస్సు భంగం చేయడానికి ఇంద్రుడు మేనక ను పంపిస్తాడు. మేనక చేత ఆకర్షితుడైన విశ్వామిత్రుడు తపస్సు నుండి రతిక్రీడ లోకి మారతాడు. రతిక్రీడ ఫలితంగా మేనక గర్భవతి అవుతుంది.
విశ్వామిత్రుడు బయటి వాతావరణం చూసి శిశిర ఋతువు అవడం గ్రహించి తపోభంగం జరిగిందని గ్రహించి, మేనకను అక్కడ నుండి పంపివేస్తాడు.
మేనక ఆడబిడ్డను ప్రసవించి, ఇసుక దిబ్బ మీద విడిచి, వెళ్ళిపోతుంది. అలా విడిచిన బిడ్డను పక్షులు తమ రెక్కలతో రక్షిస్తాయి.
ఆ మార్గములో వెళ్ళుతున్న కణ్వ మహర్షి ఆ బిడ్డను చూసి పక్షుల రెక్కల చేత రక్షింపబడడం వల్ల శకుంతల అని పేరు పెట్టి, తన ఆశ్రమంలో పెంచి పెద్దచేస్తాడు.