డబ్బుల్లేని ధనికులు
Rich people without Money, Telugu Moral Stories
పుట్టినూరు తప్ప ఇంకో ఊరు తెల్వదాయె, వ్యవసాయం తప్ప ఇంకేదీ రాదాయె, పిల్లలు మంచి సదువులు చదవాలంటే ఈ ఊరు వదిలి బైటికి పోతే కానీ అవ్వదే..!
నిజమేనయ్యా ..! కానీ నేను ఇంటర్ కాడికి సదివేసరికి ఎక్కువ సదివితే పెద్ద సంబంధాలు ఇవ్వాలి కట్నాలు మనతోని అయ్యే పని కాదని మా అయ్య సధువాపించే, నువ్వేమో పది కాడనే ఆపితివి ఇప్పుడు పట్నం పోతే మన సదువులకు మనకు ఎవరు పనిస్తరు, మనకేమొస్తది ..?
అది కాదే మనూరు నుంచి పోయిన పిల్లలు శానా మంది అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఈ సంక్రాంతికి ఇళ్లకు వస్తారుగా కలిసి, పట్నంలో ఏదైనా సదువుతో సంబంధం లేని పని చూపించమని అడుగుతా, మన కష్టం చూసి ఒక్కరైనా సాయం చెయ్యకపోతారంటావా..!
“సంక్రాంతికి అనుకున్నట్టే తెలిసిన వాళ్ళను పనిగురించి ఆరా తియ్యగా ఒకరిద్దరు పట్నం పోయాక కబురు చేస్తాం అనటంతో కాస్త దైర్యం వచ్చింది”
ఊర్లో ఉన్న షావుకారి కాయిన్ బాక్సుకు ఫోను
సేటు : ఎవరు కావాలి,
సోమన్న తో మాట్టాడాలి,
Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu, పరమానందయ్య పరలోక యాత్ర,
సే : లైన్లో ఉంటారా..? మళ్లీ చేస్తారా..! పోయి పిలుచుకురవాలి ఓ పదైదు నిముషాలవ్వుద్ది,
నేను మళ్ళీ చేస్తా వచ్చి మీ దగ్గర కూర్చోమనండి.
సే: సరే ..! సోమన్నా..! ఓ సోమన్నా ..!
వాళ్ళావిడ : సోమన్న లేడండి పొలానికెళ్లాడు…!
మీకెవరో పట్నం నుంచి ఫోన్ చేశారు, మళ్ళీ చేస్తాం అన్నారు కొట్టుకాడ కూర్చో…!
సోమన్న భార్యకు కంగారుతో కాళ్ళు చేతులు ఆడట్లేదు
“పని కావాలని అడిగాడు ఎం పనో ఏంటో ఒకవేళ ఈయన ఏదైనా పొరపాటు చేస్తే పాపం మాకు సాయం చేద్దాం అనుకున్న వాళ్లకు చెడ్డపేరొస్తుంది ఇక్కడే ఏదోఒకటి చేసుకు బ్రతికేద్దాం, మా వల్ల మంచి వాళ్లకు చెడ్డ పేరొద్దు అనుకుంటూ కొట్టుకాడికి నడుస్తుండగా సోమన్న ఎదురొచ్చాడు”
ఎవయ్యో ఎవరో పట్నం నుంచి ఫోన్ చేసారంట, నీకు కబురు చెప్పేటప్పటికీ లెటవ్వుద్దని అక్కడికే వెళ్తున్నా పోయిరాపో,
సోమన్న : చెప్పనైతే చెప్పా కానీ, ఎం పనో ఏంటో నువ్వూరావే నాకు అర్ధం కాకపోతే నువ్వైనా మాట్లాడొచ్చు.
సేటు : సోమన్నా పట్నంలో మీకు చుట్టాలు లేరుగా ఎవరు నీకు ఫోన్ చేసింది..?
సో : ఊర్లో మా వ్యవసాయం ఎం బాలేదుగా సేటు అందుకే మొన్న సంక్రాంతికి వచ్చినప్పుడు పట్నంలో ఉండే మనూరోళ్లకు కొంతమందికి ఏదైనా పని చూడమని చెప్పా వాళ్లే అయ్యుంటారు,
సేటు : నువ్వు సదువుకోలేగా పట్నం అంటే అంతా హిందీ, ఇంగ్లీష్ వాళ్లే ఉంటారు వచ్చినా తెలుగు మాట్లాడరు, బస్సులు కూడా ఆపరు, వెళ్తున్న బస్సులోంచి దిగాలి, వెళ్తున్న బస్సులోనే ఎక్కాలి, అంతా మోసగాళ్ళు ఉంటారు, పనిచేపించుకుని డబ్బులు ఇవ్వరు గట్టిగా పైసలు అడిగితే కొట్టి చంపేస్తారట పేపర్లో రోజు ఇలాంటివే చదువుతుంటా, ఇవ్వన్నీ అవసరమా సోమన్నా నీకు..? ఊర్లో ఉన్న వ్యవసాయం చూసుకోక, పైగా మీ ఆవిడను తీసుకెళ్లాలి, ఇద్దరు పిల్లలు ఏమి ఖర్చులేని ఇక్కడే పెట్టలేక బాధపడుతున్నావ్, పట్నం అంటే అంత ఖర్చు నీ వల్ల అవ్వుద్దా చెప్పు .? ఇంటి కిరాయిలే వేలకు వేలు కట్టాలి, ఒకటో తారీకు కిరాయి ఇవ్వకపోతే సామాన్లు రోడ్డున వేస్తారు, పరువు పోతుంది, నా మాటిని పట్నం ఊసు మానుకో ఏమంటావ్..?
సోమన్న : నిజమే..!! ఇవన్నీ నేను ఆలోచించలేదయ్యా, ఇక్కడ బతకలేని పరిస్థితి, పైసలకు కూడా ఇబ్బంది ఉంది మొన్న వానకు ఇళ్ళు కూలిపోతే బాబాయ్ వాళ్ళింట్లో ఉంటున్నాం, ఏదో పనిచేసుకుని నాలుగు పైసలు వెనకేసుకుంటే పిల్లలకు మంచి బతుకు ఉంటదని అనుకున్నాం అంతేగానీ మీరన్నట్టు మిగతావాటి ఆలోచన తట్టలేదు మాకు,
మక్కికి మక్కీ జవాబు, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
సేటు : కావాలంటే ఆ అరెకరం నాకు అమ్ము, ఎకరం రెండున్నర లక్షలుంది పదివేలు ఎక్కువిస్తా దాంతో ఇళ్ళు బాగు చేసుకో, మిగిలిన పైసలు వడ్డీకి ఇచ్చుకో, పిల్లల చదువు బావుంటుంది, ఆలోచించుకో …!
సోమన్న : ఉన్న ఆ అరెకరం అమ్మేస్తే ఆధారం లేకుండా పోతుందేమో సేటు..! ఆలోచించి చెప్తాలే,
మాట్లాడుతుండగానే ఫోన్ రింగు
సోమన్న : హలొ నేను సోమన్నను మాట్లాడుతున్నా ఎవరండీ..?
అవతల : నేను శాస్త్రి గారి రెండో కొడుకుని, నాన్న మీకు ఏదైనా పని చూడమని చెప్పారు, మాకు తెలిసిన వాళ్ళ కంపెనీలో ఉంది అందుకే చేశా..!
సోమన్న : అలాగా బాబూ సంతోషం, నేనే మొన్న సంక్రాంతికి వచ్చినప్పుడు మీతో చెప్పమని చెప్పాను, బాబు నాకు ఇంగ్లీష్ , హిందీ మాట్లాడటం రాదు, పైగా అక్కడ బస్సులు ఆపరంట, మోసాలు ఎక్కువంటా, నేను పది వరకే చదువుకున్నా, మా యావిడది కూడా పన్నెండే అయింది, పైగా మేం ఏదైనా తప్పు చేస్తే మీ పేరు చెడిపోద్ది బాబు, పైగా మా తెలివితక్కువతనానికి మాకేమైనా ఐనా నలుగురు మిమ్మల్ని తప్పు పడతారు వద్దులే బాబూ మీకెందుకు ఇబ్బంది, ఇక్కడే ఏదో ఒకటి చేసుకుంటాంలే తప్పుగా అనుకోమాకండి,
ఎవరు చెప్పారు ఇక్కడ హిందీ, ఇంగ్లీష్ తప్ప ఇంకోటి మాట్లాడరని అలాంటిది ఎం లేదు మీరేం బయపడకండి, అవన్నీ అబద్దాలు, మేమంతా ఉన్నాంగా ఏదైనా ఇబ్బందైతే మేం చూసుకుంటాంలే మీరు ఈఆదివారం రండి, నేను అన్నా ఇంట్లోనే ఉంటాం మీరిద్దరూ వస్తే తీసుకెళ్తా కాస్త పొద్దునే రండి..! పని,జీతం మాట్లాడుకుని కావాలంటే ఓ పది రోజులు చేసి నచ్చకపోతే ఇంటికెల్దురు చేసిన రోజుల డబ్బులూ ఇస్తారు మంచోళ్ళే వాళ్ళు, నచ్చలేదంటే నేనే మిమ్మల్ని బస్ ఎక్కిస్తా.
అలాగే బాబు, ఓసారి మీ నాన్న గారితో మాట్లాడి మీతో మాట్లాడమంటా,
నేను చెప్తాలే నాన్నతో ఎక్కడికి రావాలో,
నా ఫోన్ నెంబర్ కూడా రాసిస్తాడు దిగినాక నాకోసారి ఫోన్ చెయ్యండి ఉంటా మరి.
ఇంటికొచ్చి అలా ఆలోచిస్తూ అరుగుమీదనే నిద్రలోకి జారుకున్నాడు సోమన్న
ఏమయ్యా ..!
ఏమయ్యోయ్ ..!
Not easy to live in Hut, Telugu Moral Stories, గుడిసెలో బ్రతకడం అంత సులువా
School Life Memory, Telugu Moral Stories మా బడి జీవితం..!
ఏంటే ..? నిద్ర ఎలా పట్టిందయ్యా నీకు, నాకసలు కాళ్ళు చేతులు ఆడట్లేదు, ఆదివారం అంటే ఎల్లుండే, అవునూ ఆ సేటు ఉన్న మన అరెకరం మీద కన్నేశాడు అనుకుంట అందుకే భయపెట్టి ఇక్కడే ఉండమంటున్నాడు కదా, నాకు అదే అనిపిస్తుంది ఉన్నదాయనకిచ్చి మనం ఎం చెయ్యాలో ..!
- ఆదివారం *
బాబూ మేము అంబేత్మర్ బొమ్మకాడ నిలబడ్డాం, ఈ ఫోను చాయి బండాయనది ఆయనకిస్తున్నా ఓ సారి మాట్లాడండి మీకు అడ్రస్ చెప్తాడు “వద్దులే నాకు అర్ధం అయింది అక్కడే ఉండండి వస్తున్నా” కంపెనీ మాకు తెలిసిన వాళ్లదే మీరేమి బయపడకండి అన్నీ మాట్లాడాను, అంతా వాళ్ళు నేర్పింస్తారు
అదొక ప్లాస్టిక్ డబ్బాలు తయారు అయ్యే కంపెనీ
ఓనర్ : రోజూ తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు దాకా ఉండాలి, ఐదో తారీకు జీతం ఇస్తారు, ప్రతి సోమవారం సెలవు, ఇవ్వాళ ఇక్కడే ఉండండి ఈరోజు ఎం పని చేస్తారో రోజూ అదే పని రోజూ ఉంటుంది,
ఈయన పేరు శ్రీనివాస్ మీ సూపర్వైజర్ ఈయన చెప్పినట్టు చెయ్యండి.
శ్రీనివాస్ ..! వీళ్ళిద్దరూ కొత్తగా చేరుతున్నారు, మా పక్క ఊరు వాళ్ళు నాకు కావాల్సిన మనుషులు, జాగ్రత్త. ఇవాళ, రేపు వచ్చి పని నచ్చితే వచ్చే వారం నుంచి వస్తారు, వెళ్ళేటప్పుడు చెరో ఐదొందలు ఇచ్చి పంపండి, వాళ్లకు మధ్యాన్నం భోజనం ఇక్కడికే తెప్పించండి.
ఆరు అయ్యింది ఒక్కొక్కరు వెళ్లిపోతున్నారు, శ్రీనివాస్ మీరు ఇవ్వాల్టికెళ్ళండి, ఇదే పని రోజూ ఉంటుంది, పని నచ్చిందా..? రేపు వస్తారా..!
బావుంది సార్ కష్టమైన పనేం కాదు, ఇద్దరం చెయ్యగలం,
శ్రీనివాస్ :ఆపీసు దగ్గరకి రండి మీ డబ్బులు తీసుకుని వెల్దురు.
అవునయ్యా మనం ఇప్పుడెలా వెళ్ళాలి, బాబు ఫోన్ నెంబర్ ఉన్న కాగితం బట్టల సంచిల పెట్టిన తేలేదు, నెంబర్ కూడా గుర్తులేదు, అవునే మనిద్దరికీ దారి తెలవదు, ఇప్పుడెలా బాబు వాళ్ళ ఇంటికి పోతాం,
ఆపీసు దగ్గరికి వెళ్లేసరికి బాబూ వాళ్ళ అన్నయ ఇద్దరూ కూర్చుని ఓనర్ సార్తో మాట్లాడుతున్నారు
బాబు : మీరు కంగారు పడతారని తీసుకెళదామని వచ్చా..!
ఓనర్ : పని ఎలా ఉంది..! నచ్చిందా..? చెయ్యగలరా..? సోమన్న మీకు పదివేలు, ఆవిడకు ఎనిమిది వేలు, ఆలోచించుకుని రేపు చెప్పండి ఎదయ్యింది
School Life Memory, Telugu Moral Stories మా బడి జీవితం..!
“బావుంది సార్ చేసేస్తాం”
సార్ ఏమి అనొద్దు నన్ను కూడా వీళ్ళను అన్నట్టే బాబు అనండి నాకు నచ్చింది మీరు అలా అంటుంటే,
నవ్వులు
అన్నట్టూ మాది మీ పక్కన ఊరే, పైగా వీళ్ళిద్దరూ నాకు చాలా మంచి ఫ్రెండ్స్ , మీగురించి అంతా చెప్పాడు, మీరేం కంగారు పడకండి, శ్రీనివాస్ కి చెప్పా రెండ్రోజుల్లో మీకు దగ్గర్లో ఇల్లు చూస్తాడు కిరాయి నేను కడతాను, మేము కూడా దగ్గర్లోనే ఉంటాం, ఏదైనా అవసరం ఐతే ఇబ్బంది పడకుండా నాకు ఫోన్ చెయ్యండి.
అన్నట్టే శ్రీనివాస్ వాళ్లకు దగ్గర్లో ఇల్లు చూసాడు
ఓ గది, వంటగది రెండు కుటుంబాలకు కలిపి ఓ స్నానాల గది ఉంది.
ఏమయ్యా చూస్తుండగానే రెణ్ణెళ్లయింది
అన్ని ఖర్చులు పోనూ ఇచ్చిన జీతంలో పాతిక వేలు దాచగలిగాం వాటితో పిల్లలకు ఎం కొనాలి, ఎక్కడ కొనాలి అని ఆలోచిస్తున్నా, ఊరి నుంచి శ్రీనివాస్ కి ఫోన్
సార్ సోమన్న వాళ్ళ అబ్బాయిని, మా నాన్నకు ఫోన్ ఇస్తారా..!!
నాన్నా..! సెలవులు అయిపోయాయి పదమూడు నుంచి బళ్ళు అంట నాకు కొత్త డ్రెస్కావాలి, అక్కకి షూస్ కావాలంట,
సరే వచ్చేవారం అమ్మా నేను రావాలనుకుంటున్నాం, వచ్చేటప్పుడు తెస్తాంలే జాగర్తగా ఉండండి.
ఏమయ్యా మన దగ్గర పాతిక వేలు ఉన్నాయ్ గా ఆ పైసల్తో పిల్లల్ని ఇక్కడే బళ్ళో చేర్పిద్దాం అనిపిస్తుంది ఏమంటావ్, పాతికలో పదిహేను సేటుకు అప్పుకు కడితే కాస్త తగ్గుద్ది వచ్చే ఏడు లోపు అప్పంతా తీర్చేద్దాం, ఈ ఏడు ఎలాగోలా అక్కడే ఉండనీ, మంచి బట్టలూ, బ్యాగ్ బూట్లు కొనిద్దాం సంతోషంగా వెళ్తారు. బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గరైతే ఇబ్బంది ఉండదు, పైగా వాళ్ళింట్లో టీవీ ఉంది ఫ్యాన్ ఉంది సుఖంగా ఉంటారు.
Call Center Job, Telugu Moral Stories కాల్ సెంటర్ ఉద్యోగం
శ్రీనివాస్ సార్..! ఓ నాలుగు రోజులు సెలవులు కావాలి ఊరెళ్తున్నాం, పిల్లల బళ్ళు ఇస్టార్ట్ అవుతున్నాయ్ వాళ్లకు బట్టలు అవి కుట్టించాలి,
నేను సార్కి ఫోన్ చేసి కనుక్కుని చెప్తా, సార్ వీళ్లు ఓ నాలుగు రోజులు ఊరెళ్ళి వస్తా అంటున్నారు, ఎప్పుడు వెళ్ళమంటారు..? సార్ మిమ్మల్ని ఆపీసుకు రమ్మన్నాడు ఏదో మాట్లాడాలంట.
మీరు ఇక్కడా పిల్లలు అక్కడా ఎందుకు, సెలవులు అయిపోగానే ఇక్కడికి తీసుకురండి మనకు తెలిసిన వాళ్ళ స్కూల్స్ ఉన్నాయ్ ఇక్కడే, ఐనా మీరిద్దరూ ఇక్కడికి రావటానికి కారణం పిల్లలే అంటగా, మరేం ఆలోచించకండి తీసుకొచ్చేయండి ఇక్కడే చేర్పిద్దాం, నేను మాట్లాడుతాను. అదికాదు బాబు ఊర్లో అప్పుంది వాళ్లకు కట్టేస్తే మిగిలిన డబ్బుకు ఫీజు కట్టలేము, అంత ఎక్కువ ఎం ఉండదు పీజు కావాలంటే పీజు డబ్బులు నేనిస్తాను తర్వాత ఇద్దురుగాని, వద్దు బాబు ఇంకో అప్పు, అదీ మీ దగ్గర.
సరే అయితే ఓ పని చెయ్యండి పీజు ఒకేసారి కాకుండా సంవత్సరానికి నాలుగు సార్లు కొంచెం కొంచెం కట్టండి స్కూల్ వాళ్ళతో మనం మాట్లాడొచ్చు, మీకు ఇబ్బంది ఉండదు ఏమంటారు, శ్రీనివాస్ వీళ్లిద్దరికీ వారం లీవ్ ఇవ్వండి, సోమవారం నుంచి శనివారం వరకు లీవ్ మళ్ళీ సోమవారం వచ్చి జాయిన్ అవ్వండి. ఇక వెళ్లి మీ పనులు చూసుకోండి
సోమన్నా నువ్వు ఈ ఆటోలో వెళ్ళు మెకానిక్ వస్తాడు నీతో వాళ్ళు చూపించినవి ఆటోలోకి ఎక్కుంచుకునిరా, టైం పడుతుంది తినేసిపో, నువ్వూ వెళ్ళమ్మా పని చేసుకోపో,
*హఠాత్తుగా పెద్ద శబ్దం, సోమన్న భార్య చీరంతా రక్తం *
శ్రీనివాస్ : సార్ పైనున్న డబ్బా ఒకటి జారి సోమన్న భార్య తల మీద పడింది, దెబ్బతగిలి రక్తం పోతుంది స్పృహలో లేదు, సోమన్నను బైటికి పంపించాం ఆయనకు ఫోన్ లేదు, హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాం మీరు రండి,
ఏమైంది డాక్టర్..! తలకు దెబ్బ తగిలి నాలుగు కుట్లు పడ్డాయ్, కంగారు ఎం లేదు, దెబ్బ గట్టిగా తగలటం వల్ల స్పృహ పోయింది ఎందుకైనా మంచిది 🅜🅡🅘 స్కాన్ ఒకటి చేపించండి లోపల ఏదైనా డామేజ్ వుంటే తెలుస్తుంది,
సోమన్నకు విషయం తెలిసి కుప్పకూలి పొయ్యాడు, సాయంత్రానికి ఆవిడకు మెలకువ వచ్చింది
సచ్చిపోయిన అనుకున్నా అయ్యా..! పిల్లలే గుర్తోచిర్రు అనే సరికి బోరున ఏడ్చేశాడు భార్యతో పాటు సోమన్న,
“వాళ్ళ ఇద్దరిమధ్య ప్రేమ చూసి పక్కనున్న శ్రీనివాస్ వాళ్ళ సారూకీ ఇద్దరికీ కళ్ళనిండా నీళ్లు నిండాయి”
డాక్టర్ : రిపోర్టులు భానే ఉన్నాయ్, మీరు ఆవిడని తీసుకెళ్లండి వారం రోజుల్లో కుట్లు మానిపోతాయ్, తీసేద్దాం, నొప్పి ఎక్కువగా ఉంటె ఈ టాబ్లెట్స్ వాడండి, దెబ్బతగిలిన చోటును తడపకండి.
సోమన్న: సార్…! మేం ఇంటికెళ్ళిపోతాం సార్…! మాకు భయంగా ఉంది, ఈ పనులకు మిషన్లకు కొత్త , మేం పల్లెటూరోళ్ళం ఊర్లో ఏదో పనిచేసుకు బ్రతికేస్తాం, తప్పుగా అనుకోకండి.
ఓనర్: చూడండి సోమన్న..! ప్రమాదాలు ఎక్కడైనా జరుగుతాయి, ఊర్లో మాత్రం దెబ్బలు తగలవా చెప్పు బయపడకండి, కొన్ని రోజులు మీరిద్దరూ ఊరెళ్ళండి, మీకెప్పుడు రావాలని అనిపిస్తే అప్పుడు రండి మీకు పని ఎప్పుడూ ఉంటుంది ఇక్కడ, ఇక్కడే కాదు కష్టపడే మీ లాంటి వాళ్లకు ఎక్కడైనా ఎప్ప్పుడైనా పని ఉంటుంది..! “ఇక ఏమీ ఆలోచించకండి జాగ్రత్తగా వెళ్ళిరండి🙏🏻 “
Day Dream, Telugu Moral Stories పగటి కల
తిరిగి వస్తారా లేదో జ్ఞానీ కి సమయం దొరికేదాకా ఎదురు చూద్దాం..!
(Images Google source)
ఇట్లు
జ్ఞానా చారి
*******
పరశురామ ప్రీత్యర్దం – ఉత్సవం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu