Radha Rathidevi Renuka, రేణుక,రాధ లేదా రాధిక, రతీదేవి

 పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు —
Radha Rathidevi Renuka, రేణుక,రాధ లేదా రాధిక, రతీదేవి
క్లుప్తముగా
 
Radha : రాధ లేదా రాధిక —
శ్రీకృష్ణుని ప్రియురాలు , నందుని చెల్లెలు . కొందరు వైష్ణవులు రాధను శక్తి అవతారంగా భావిస్తారు.
భారతదేశంలో రాధాకృష్ణులకు చాలా దేవాలయాలు ఉన్నాయి. రాధాకృష్ణులను ప్రేమకు చిహ్నాలుగా ఎంతోమంది కవులు, చిత్రకారులు కొన్నిశతాబ్ధాలుగా వర్ణిస్తూ, చిత్రీకరిస్తూనే వున్నారు..
 
Rathidevi : రతీదేవి —
దక్ష ప్రజాపతి కూతురు . మన్మధుని భార్య , మన్మథుడు లోకాలన్నిటినీ మోహింప చేయగల శక్తి ఉన్నవాడు. అలాంటి మన్మథుడినే మోహింప చేయగల శక్తి ఉన్న అతిలోక సర్వావయవ సౌందర్యవతి రతీదేవి. ఈ ఇద్దరికీ వివాహం ఎప్పుడు ఎలా అయింది? అనే విషయాన్ని కామ వివాహం అనే పేరున శివపురాణం రుద్ర సంహితలోని మూడు, నాలుగు అధ్యాయాలు వివరిస్తున్నాయి.
మన్మథుడు బ్రహ్మ మనస్సు నుంచి జన్మించిన తర్వాత ఆ బ్రహ్మ దేవుడు తనతో సహా అందరినీ మోహింప చేయగల శక్తిని మన్మథుడికి అనుగ్రహించాడు.
 

Renuka : రేణుక —
రేణుక భృగు వంశానికి చెందిన మహర్షి జమదగ్ని భార్య,. జమదగ్ని, రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు.. భృగు మహర్షి వీరి వంశానికి మూల పురుషుడు. 


Spread iiQ8

May 3, 2015 6:51 PM

327 total views, 0 today