Moles Results in Telugu, Puttu Machalu Phalithalu, పుట్టుమచ్చలు – ఫలితాలు, About Moles for men and women

💐💐💐 పుట్టుమచ్చలు – ఫలితాలు 💐💐💐

Moles Results in Telugu, Puttu Machalu Phalithalu, About Moles for men and women , పుట్టుమచ్చలు – ఫలితాలు

• తల కుడి భాగము, తల ఎడమ భాగము, రెండు కను బొమ్మల మధ్య, కుడి కనుబొమ్మ మీద, నుదుటున కుడి భాగమున, కుడి కణిత మీద, ఎడమ కణిత మీద, కుడి కంటిమీద, కుడి కనురెప్ప లోపలి భాగములో, ముక్కుకు కుడివైపు, ముక్కుకొన అడుగుభాగమున పుట్టుమచ్చలు ఉంటె శుభఫలితాలను ఇస్తాయి
• నాలుక పైభాగమున కానీ చివరన కానీ పుట్టుమచ్చ ఉంటె వాక్చాతుర్యం ఉంటుంది, కీర్తిప్రతిష్టలు కలుగుతాయి. శాస్త్రప్రవీణ్యం ఉంటుంది
• గడ్డమునకు మధ్య భాగమున గానీ, కుడిభాగమున గానీ పుట్టుమచ్చ ఉంటె సంగీత,సాహిత్యాలలో కీర్తిప్రతిష్టలు సంపాదిస్తారు
• కుడి,ఎడమ చెవి ప్రక్కన పుట్టుమచ్చ ఉంటె పుట్టుకతో ఐశ్వర్యవంతులవుతారు
• రెండు చెవుల పైభాగాన రెండు పుట్టుమచ్చలుంటే ఆగర్భశ్రీమంతులవుతారు
• కంఠమునకు ఏ వైపున పుట్టుమచ్చ ఉన్న బంధువుల ఆస్తులు పొంది శ్రీమంతులవుతారు
• రొమ్మునకు కొంచెం పైభాగములో పుట్టుమచ్చ ఉంటె జీవితాంతం ధనధాన్యాలతో తులతూగుతారు
• రొమ్మునకు కుడి భాగమున పుట్టుమచ్చ ఉంటె ఏదొక రంగంలో శాశ్వత కీర్తినిపొందుతారు
• ముంజేతిమీద పుట్టుమచ్చ ఉంటె వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందుతారు
• మణికట్టు మీద పుట్టుమచ్చ ఉంటె ధనసంపాదనపరులు అవుతారు
• మోచేతిమీద పుట్టుమచ్చ ఉంటె ఐశ్వర్యవంతులు,సకలసుఖాలు అనుభవించేవారు అవుతారు.
• కుడి చేయి చిటికిన వ్రేలిమీద పుట్టుమచ్చ ఉంటె ధనం బాగా సంపాదిస్తారు
• అరచేయి చితికినవ్రేలిక్రింద పుట్టుమచ్చ ఉంటె ధనం బాగా సంపాదిస్తారు
• కుడి అరచేతిలో ఎడమవైపు పుట్టుమచ్చ ఉంటె అకస్మాత్తుగా ధనప్రాప్తి కలుగుతుంది
• వెన్నుమీద ఉబ్బెత్తుగా పుట్టుమచ్చ ఉంటె రాజకీయనాయకులు అవుతారు
• కుడి తొడమీద పుట్టుమచ్చ ఉంటె పరస్త్రీ వలన ఆస్తి కలుగుతుంది
• కుడి వృషణాలమీద పుట్టుమచ్చ ఉంటె బంధుమిత్రుల్లో కీర్తిని పొందుతారు
• కుడి మోకాళ్లమీద పుట్టుమచ్చ ఉంటె అనుకూలమైన భార్య, సుఖమయ దాంపత్యం అనుభవిస్తారు.

• ఎడమకంటి గ్రుడ్డులో కుడిభాగమున, ఎడమ కంటి రెప్ప మీద, ఎడమకంటి గ్రుడ్డులో ఎడమవైపు, ఎడమ కంటిమీద, ముక్కుకు క్రింద భాగమున, క్రింది పెదవి మీద, క్రింది పెదవి లోపలి భాగమున, గడ్డమునకు ముందు భాగమున, కుడి చెవి క్రింది భాగమున, ఎడమ చెవి క్రింది భాగమున, కంఠముమీద వెంట్రుకలతో కూడిన పుట్టుమచ్చ, రొమ్ముకు ఎడమ భాగమున, ఎడమ భుజము మీద పుట్టుమచ్చలు ఉంటె చెడుఫలితాలను ఇస్తాయి
• రొమ్ము మధ్య భాగములో వెంట్రుకలు లేని పుట్టుమచ్చ ఉంటె దేశాటన చేసి దరిద్రులవుతారు. ఎక్కడ స్థిరంగా ఉండలేరు, ఏపని చేయలేరు
• భుజము నుండి బొడ్డు వరకు కుడి వైపుగానీ, ఎడమవైపు గానీ పుట్టుమచ్చ ఉంటె జీవితాంతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు
• ఎడమ భాగమున ప్రక్కటెముకల మీద పుట్టుమచ్చ ఉంటె దరిద్రులవుతారు
• కుడిచేయి మధ్యవ్రేలు క్రింది భాగమున పుట్టుమచ్చ ఉంటె స్త్రీలోలులవుతారు, పిత్రార్జితం పాడు చేస్తారు
• కుడిచేయి చూపుడువ్రేలు మీద పుట్టుమచ్చ ఉంటె నీచ జీవితం గడుపుతారు. శత్రు భయం ఉంటుంది
• కుడిచేయి మణికట్టు అడుగు భాగమున పుట్టుమచ్చ ఉంటె ఒంటరి జీవితం గడుపుతారు
• ఎడమ తొడ మీద పుట్టుమచ్చ ఉంటె నీచ స్త్రీ సాంగత్యంతో గౌరవంలేని జీవితాన్ని గడుపుతారు
• కుడి పిరుదమీద పుట్టుమచ్చ ఉంటె బానిస బ్రతుకుతో దరిద్రం కలుగుతుంది
• ఎడమ పిరుదు మీద పుట్టుమచ్చ ఉంటె సమయానికి ధనం రాక కష్టాలు పడుతారు
• గజ్జల భాగములో పుట్టుమచ్చ ఉంటె బానిసగా బ్రతుకుతారు, అల్పాయుష్షు
• ఎడమ మోకాలి మీద పుట్టుమచ్చ ఉంటె పరస్త్రీ సాంగత్యం వలన సర్వం పోగొట్టుకుని సమస్యలతో సతమతమవుతారు.

Maha Mrityunjaya Mantra [108 times] – महामृत्युंजय मंत्र | Lyrics & Meaning, iiQ8


Sri Rama Navami – Indian Festival – iiQ8, Shri Ram Navami

• ఇక్కడ వివరిస్తున్న పుట్టుమచ్చలు గలవారు భవిష్యత్తులో ధనవంతులుకాగలరు. మంచి తెలివితేటలు, లౌకికం,సులువుగా పనులు చేయించుకోవడం, సులువుగా డబ్బులు సంపాదించే నేర్పరితనం ఉంటుంది. వీరు ప్రారంభంలో సామాన్య జీవితం గడిపిన క్రమేపి అభివృద్ధి చెందుతూ ధనవంతులు అవుతారు
• కుడి కణిత మీద పుట్టుమచ్చ
• ఎడమ కణిత మీద పుట్టుమచ్చ
• కుడి కనుబొమ్మ మీద పుట్టుమచ్చ
• కుడి కంటిలో నల్ల గ్రుడ్డుకు ఎడమ భాగమున పుట్టుమచ్చ
• కుడి కనురెప్ప విభాగాలలో పుట్టుమచ్చ
• నుదురు కుడి భాగమున పుట్టుమచ్చ
• ముక్కుకు కుడి వైపున పుట్టుమచ్చ
• గడ్డానికి సరిగ్గా మధ్యభాగాన్న పుట్టుమచ్చ
• కంఠమునకు ఇరువైపులా ఏపక్కన ఉన్న పుట్టుమచ్చ
• రొమ్ముకు కుడి వైపున పుట్టుమచ్చ
• కుడి అరచేతి ఎడమభాగములో పుట్టుమచ్చ ఉంటె అనుకోకుండా ధనప్రాప్తి కలుగుతుంది
• కుడి అరచేయి చిటికిన వ్రేలు క్రింద పుట్టుమచ్చ
• కుడి చేయి చిటికిన వ్రేలిమీద పుట్టుమచ్చ
• మణికట్టు కుడి లేదా ఎడమ భాగములలో పుట్టుమచ్చ
• కుడి తొడమీద పుట్టుమచ్చ ఉంటె పరస్త్రీ వలన ధనప్రాప్తి కలుగుతుంది
• కుడి వృషణం మీద పుట్టుమచ్చ
• కుడి మోకాలు మీద పుట్టుమచ్చ ఉంటె సకల ఐశ్వర్యాలు కలుగుతాయి

• క్రింది తెలపబడుతున్న స్థానాలలో పుట్టుమచ్చ ఉన్నవాళ్లు పెద్దలు సంపాదించినా ఆస్తులను తమ విలాసాలకు ఖర్చు చేసి చివరికి హీన స్థితిని పొందుతారు. పరస్త్రీ కోసం ప్రాకులాడి పరువును పోగొట్టుకుంటారు
• ఎడమ కంటి గ్రుడ్డులో కుడి పక్కన పుట్టుమచ్చ
• ముక్కుకు క్రింద భాగములో పుట్టుమచ్చ
• క్రింది పెదవి మీద పుట్టుమచ్చ
• కంఠముమీద పుట్టుమచ్చ ఉంటె విలాసజీవితాలకి అలవాటు పడి ఆస్తి పోగొట్టుకుని పేదరికాన్ని పొందుతారు
• కుడిచేతి మధ్యవ్రేలు క్రింది భాగములో ఉంటె స్త్రీ మూలముగా ఆస్తిని పాడుచేస్తారు
• కుడి కుచము మీద పుట్టుమచ్చ ఉంటె అనుకోని సంఘటనల వలన పూర్వ ఆస్తిని కూడ పరులపాలుచేసి కష్టాలుపడతారు.

• నుదురు భాగము విశాలముగా ఉండి కుడివైపున పుట్టుమచ్చ ఉంటె అనుకోకుండా ధనప్రాప్తి కలుగుతుంది
• కుడి లేదా ఎడమ కణిత మీద పుట్టుమచ్చ ఉంటె లాటరివలన, వారసత్వం వలన అకస్మాత్తుగా ధనప్రాప్తి కలుగుతుంది
• కుడి కంటిలో నల్లగ్రుడ్డుకు కుడి భాగమున పుట్టుమచ్చ ఉంటె అకస్మాత్తుగా ధనప్రాప్తి కలుగుతుంది, భోగభాగ్యాలు అనుభవిస్తారు
• ముక్కుపై కుడి భాగమున పుట్టుమచ్చ ఉంటె మంచి జరుగుతుంది
• గడ్డము క్రింద భాగమున పుట్టుమచ్చ ఉంటె మంచిది
• కంఠానికి ఏవైపునైనా ప్రక్కగా పుట్టుమచ్చ ఉంటె వారసత్వ లేదా బంధువుల వలన ఆస్తి కలుగుతుంది
• కుడి అరచేతి ఎడమభాగాన్న పుట్టుమచ్చ ఉంటె ఎటువంటి ప్రయత్నం లేకుండానే లాటరివల్ల, గుర్రం పందాలవల్ల గాని ధనప్రాప్తి కలుగుతుంది
• కుడి తొడమీద పుట్టుమచ్చ ఉంటె భార్య వల్ల గాని పరస్త్రీ వల్ల గాని ధనప్రాప్తి కలుగుతుంది.

G.A.M.E (GITA FOR ALL MADE EASY), iiQ8, Bhagavad Gita Online Course 2021


Help Line Number for Sabarimalai in Kerala, iiQ8 info, Shabari Malai Customer Care

• కుడి కనుబొమ్మమీద పుట్టుమచ్చ ఉంటె భార్యవలన లేదా భార్య వచ్చిన తరువాత ధనప్రాప్తి కలుగుతుంది. లేదా పరస్త్రీ వలన ధనప్రాప్తి కలుగుతుంది
• ఎడమ కనుబొమ మీద పుట్టుమచ్చ ఉంటె భార్యవలన ధనప్రాప్తి కలుగుతుంది
• కుత్తుకపై పుట్టుమచ్చ ఉంటె భార్య వైపు నుండి ఆస్తి కలిసివస్తుంది
• కంఠము క్రింద భాగాన్న పుట్టుమచ్చ ఉంటె భార్య వలన ధనప్రాప్తి కలుగుతుంది
• కుడి తొడమీద పుట్టుమచ్చ ఉంటె పరస్త్రీ వలన ధనప్రాప్తి కలుగుతుంది.

• ఎడమ కంటిలో గ్రుడ్డునకు కుడివైపున పుట్టుమచ్చ ఉంటె పరస్త్రీ లోలత్వం వలన స్థిరాస్తిని పోగుట్టుకుంటారు
• ముక్కుకు ఎడమ భాగమున పుట్టుమచ్చ ఉంటె స్త్రీల విషయములలో ధనం వృధాగా ఖర్చుచేస్తుంటారు
• క్రింది పెదవి లోపలి భాగమున పుట్టుమచ్చ ఉంటె స్త్రీ కాంక్ష వల్ల ఆస్తిని పోగొట్టుకుంటారు
• కుడిచేతి మధ్య వ్రేలు క్రింద భాగమున పుట్టుమచ్చ ఉంటె స్త్రీల వలన ఆస్తిని మంచినీళ్లవలె ఖర్చు చేస్తారు
• గజ్జల్లో పుట్టుమచ్చ ఉంటె పరస్త్రీ వల్ల ధనం పోగొట్టుకుని దారిద్య్రాన్ని అనుభవిస్తారు
• ఎడమ తొడలయందు పుట్టుమచ్చ ఉంటె నీచ స్త్రీ సంబంధం వలన సర్వం కోల్పోతారు.

• రెండు నొసళ్ల మధ్య భాగమున పుట్టుమచ్చ ఉంటె వ్యభిచారానికి అలవాటుపడతారు. నష్టాలు ఏర్పడతాయి
• తల వెనుక వైపున పుట్టుమచ్చ ఉంటె పరస్త్రీ కోసం ప్రాకులాడుతారు
• ఎడమ కంటిలో గ్రుడ్డునకు కుడిభాగమున పుట్టుమచ్చ ఉంటె పరస్త్రీ సాంగత్యం కోరుకుంటారు
• ముక్కుకు ఎడమ భాగములో పుట్టుమచ్చ ఉంటె నీచస్త్రీల వెంట తిరుగుతారు
• పైపెదవిమీద లేదా క్రింది పెదవి మీద పుట్టుమచ్చ ఉంటె ఇతరులకు తెలియకుండా వ్యభిచరిస్తారు
• ఎడమ చెవి కొనమీద పుట్టుమచ్చ ఉంటె పరస్త్రీ వలన సుఖవ్యాధులతో బాధపడతారు
• కంఠముపైన నల్లని పుట్టుమచ్చ ఉంటె స్త్రీ వలన ఆస్తిని పోగొట్టుకుని దారిద్య్రాన్ని అనుభవిస్తారు
• ఎడమ స్థనంపై పుట్టుమచ్చ ఉంటె స్త్రీ వాంఛ ఎక్కువ
• రొమ్ము మధ్య వెంట్రుకలతో కూడిన నల్లని పుట్టుమచ్చ ఉంటె తక్కువ జాతిస్త్రీ తో తిరుగుతారు
• ఎడమ చంకలో పుట్టుమచ్చ ఉంటె స్త్రీ వాంఛ ఎక్కువ,స్త్రీలవలన నిరాశ పాలవుతారు
• కుడి వృషణాలపై పుట్టుమచ్చ ఉంటె అనేక మంది స్త్రీ లతో శారీరక సంబంధం కలిగి వుంటారు
• ఎడమ తొడమీద పుట్టుమచ్చ ఉంటె నీచస్త్రీ వలన ధనం పోగొట్టుకుంటారు
• ఎడమ మోకాలిపైనా పుట్టుమచ్చ ఉంటె నీచ స్త్రీ సాంగత్యం వలన ధనం పోగొట్టుకుంటారు

• క్రింది తెలిపిన స్థానాలలో పుట్టుమచ్చ ఉంటె అహంకారం,గర్వం ఎక్కువగా ఉంటుంది. ఇతరులను లెక్కచేయరు
• కుడి కంటి మీద పుట్టుమచ్చ
• ఎడమ కంటి గ్రుడ్డులో ఎడమ వైపు పుట్టుమచ్చ
• ముక్కుకు చివరి భాగమున పుట్టుమచ్చ
• రెండు చెవులపైనా రెండు పుట్టుమచ్చలు
• ఎడమ స్థానం మీద పుట్టుమచ్చ

• ఎడమ కంటి కోలుకులో పుట్టుమచ్చ ఉంటె అకాలమరణం ఏర్పడుతుంది
• ఏకంటి చివరిపైనా పెసరగింజంత పుట్టుమచ్చ ఉంటె అకాలమరణం ఏర్పడుతుంది
• మెడవెనుక పుట్టుమచ్చ ఉంటె అకాలమరణం
• ఎడమ చంకయందు పుట్టుమచ్చ ఉంటె పరస్త్రీ వలన విరోధం ఏర్పడి అకాలమరణం పొందుతారు
• గజ్జల్లో పుట్టుమచ్చ ఉంటె అకాలమరణం కలుగుతుంది.

• లలాటము పుట్టుమచ్చ ఉంటె తరచుగా తలనొప్పి, తలతిప్పటం ఉంటుంది
• చెవుల వెనుక భాగమున పుట్టుమచ్చ ఉంటె చెవిపోటుతో తరచూ బాధపడతారు
• కడుపుకు రెండువైపులా పుట్టుమచ్చ ఉంటె ఉదరసంబంధమైన వ్యాధులతో బాధపడతారు
• వక్షస్థలం మధ్య భాగంలో గాని కుడి ప్రక్కన గాని పెద్ద పుట్టుమచ్చ ఉంటె ఊపిరితిత్తులు, గుండెకు సంబందించిన వ్యాధులకు లోనవుతుంటారు
• నోరు క్రింది భాగములో పుట్టుమచ్చ ఉంటె ఉబ్బసపు వ్యాదిగ్రస్తులవుతారు
• కనుబొమలమీద పుట్టుమచ్చ ఉంటె పక్షవాతముచే బాధపడుతుంటారు
• మెడవెనుక భాగములో పుట్టుమచ్చ ఉంటె చర్మవ్యాధులతో బాధపడతారు
• చేతివేళ్ళమధ్య గాని కాళ్ళ వ్రేళ్ళ మధ్య గాని పుట్టుమచ్చ ఉంటె ప్రమాదాలవల్ల గాయాలు అవుతాయి
• చంకల్లో,పిరుదల మీద పుట్టుమచ్చ ఉంటె దీర్ఘరోగాలతో బాధపడుతుంటారు.

• లలాటం,గడ్డం,పైపెదవి,మడమిలో ఎర్రని పుట్టుమచ్చ ఉంటె శ్రీమంతులవుతారు, భర్తవలన సుఖసౌఖ్యాలు అనుభవిస్తారు. పుత్ర సంతానం కలుగుతుంది
• రోమాలతో కూడిన పుట్టుమచ్చ ఉంటె దరిద్రులవుతారు
• కాళ్ళయందు,మెడయందు పుట్టుమచ్చ ఉంటె పతిభక్తి ఉన్న దారిద్రంతో బాధపడతారు
• ముక్కుమీద,నొసళ్లమీద పుట్టుమచ్చ ఉంటె కోపము,అందరితో విరోధము కలిగి ఉంటారు
• చెవులకు వెనుకవైపు తొడలమీద పుట్టుమచ్చ ఉంటె స్త్రీలు ఇతరులను బాగా ఆకర్షిస్తారు. చమత్కారము కలవారు అవుతారు

Help Line Number for Sabarimalai in Kerala, iiQ8 info, Shabari Malai Customer Care


• నాలుక మీద, తుంటి మీద పుట్టుమచ్చ ఉంటె మగ ప్రవర్తన కలిగి ఉంటారు
• పిరుదులమీద,కుడి స్తనాలపైనా పుట్టుమచ్చ ఉంటె పెళ్ళైన కొంతకాలానికే వైధవ్యాన్ని పొందుతారు
• కడుపు రెండువైపులా పుట్టుమచ్చ ఉంటె ఉదరవ్యాదులతో బాధపడతారు
• భుజం పైభాగమున పుట్టుమచ్చ ఉంటె చిన్న వయసులోనే సంతానవంతులవుతారు
• బొడ్డుకి పైభాగములో ఉంటె ఆలస్యంగా సంతానం కలుగుతుంది
• తలమీద మాడుకు ముందుభాగమున పుట్టుమచ్చ ఉంటె దీర్ఘాయుష్షు కలిగి ఉంటారు.

 

Spread iiQ8

December 23, 2021 7:35 PM

972 total views, 0 today