Meaning of OM NAMAH SHIVAYA in Telugu, మహా శివుడిని స్మరించే గొప్ప మంత్రం

🎻🌹🙏ఇది మహా శివుడిని స్మరించే గొప్ప మంత్రం

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

Meaning of OM NAMAH SHIVAYA in Telugu

🌸సృష్టిలో ముఖ్యమైన దేవుళ్లైన
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఒకడైన
అత్యంత శక్తివంతమైన దేవుడు మహా శివుడు.

🌿ఓం నమః శివాయ అనే మంత్రం శివుడికి
చాలా ప్రత్యేకమైనది. హిందువులకు ముఖ్యమైన దేవుడు శివుడు. శివ భక్తులు ఎప్పుడూ ఆ పరమేశ్వరుడిని ఓం నమః శివాయ అనే మంత్రం ద్వారా స్మరిస్తూ ఉంటారు.

🌸ఈ గొప్ప మంత్రాన్ని స్మరించడం వల్ల..
శారీరక, మానసిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని.. ఆధ్యాత్మిక వేత్తలు సూచిస్తున్నారు. ఈ మంత్రాన్ని జపించడం వల్ల ప్రశాంతత, మానసిక సంతోషం కలుగుతుంది.

The 13 Temples of Tilaka Marked on The Body of a Vaishnava, Sanaatan Tales

🌿అంతేకాదు శివ భక్తులు వీలైనప్పుడల్లా
ఓం నమః శివాయ అని స్మరించుకుంటూ ఉంటే.. అద్భుతమైన ఫలితాలు, మార్పులు చూడవచ్చట. మరి ఈ మంత్ర స్మరణ వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..

🌹వాస్తవాలు🌹

🌸ఓం నమః శివాయ అనే మంత్రంలో న, మ, శి, వా, య అనే ఐదు అక్షరాలున్నాయి.
ఇవి ప్రకృతికి సంబంధించిన భూమి, నీళ్లు, అగ్ని, గాలి, విశ్వాన్ని సూచిస్తాయి.

🌷స్మరణ

🌿యజుర్వేదం ప్రకారం ఈ మంత్రాన్ని శ్రీ రుద్ర చమకం పూజలో ప్రస్తావించారు.

🌷ప్రయోజనాలు

🌸ఓం నమః శివాయ అనే మంత్రాన్ని శ్రద్ధా భక్తులతో స్మరించడం వల్ల మనసు ప్రశాంతంగా,
నిర్మలంగా ఉంటుంది. జీవితాన్ని ధర్మంగా అనుభవించేలా చేస్తుంది.

🌷అనుకూల పరిస్థితులు

🌿ఓం నమః శివాయ మంత్రాన్ని జపించడం వల్ల అనుకూల పరిస్థితులు ఎనలేని శక్తిని ప్రసాదిస్తాయి. దుష్టశక్తులు దరిచేరకుండా కాపాడుతుంది.

🌷తీవ్రమైన మానసిక ఒత్తిడి

🌸ఈ మంత్రాన్ని క్రమంతప్పకుండా స్మరించడం వల్ల మెదడు, శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే డిప్రెషన్, నిద్రలేమి, మానసిక అనారోగ్య సమస్యలను నివారిస్తుంది. ఒత్తిడి తగ్గించి, ప్రశాంతత కలిగిస్తుంది.

How many philosophies are there in man?, మనిషిలో ఎన్ని తత్వాలున్నాయి

🌷108 సార్లు

🌿ప్రతి రోజూ ఓం నమః శివాయ మంత్రాన్ని 108 సార్లు స్మరించడం వల్ల కోపం, ఆవేశం తగ్గుతాయి. జీవితంలో ప్రశాంతత పొందుతారు.

🌷ఎప్పుడు స్మరించాలి?

🌸ఓం నమః శివాయ మంత్రం స్మరించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. వేకువ జామున స్నానం చేసి, కాళ్లు ముడుచుకుని, నిటారుగా కూర్చోవాలి. కళ్లు మూసుకుని జప మాల తీసుకుని ఓం నమః శివాయ మంత్ర జపం మొదలుపెట్టాలి.

🌿ఒకవేళ జపమాల లేకపోతే.. వేళ్లతో లెక్కపెట్టుకోవచ్చు.

🌷ధ్యానం

🌸108 సార్లు మంత్ర జపం పూర్తి అయిన తర్వాత అలాగే.. కొన్ని నిమిషాలు కళ్లు మూసుకుని ప్రశాంతంగా కూర్చోవాలి. దీనివల్ల మీ చుట్టూ ఉన్న ఎనర్జీ మీ శరీరం గ్రహిస్తుంది.

 

🌷సర్వే జనాః సుఖినో భవంతు

🌿అన్యధా శరణం నాస్తి,త్వమేవ | శరణం మమ, తస్మాత్కారుణ్య భావేనా || రక్షరక్ష మహేశ్వరా..స్వస్తి..🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

Spread iiQ8

November 20, 2022 11:30 AM

423 total views, 0 today