Maha Shiva Ratri Ela Cheyali | iiQ8 శివరాత్రి జరుపుకోవడంలో ప్రధానమైన విషయాలు మూడు

Maha Shiva Ratri Ela Cheyali

 

*మహాశివరాత్రి రోజున జాగారం(జాగరణ) చేస్తే పునర్జన్మంటూ ఉండదట – Maha Shiva Ratri Ela Cheyali*

 

Maha Shivaratri is a Hindu festival celebrated annually in honour of the deity Shiva, between February and March. According to the Hindu calendar, the festival is observed on the fourteenth day of the dark half of the lunar month of Phalguna or Magha.

Date: Fri, Mar 8, 2024 – Sat, Mar 9, 2024

Fri, Mar 8, 2024, 7:27 PM – Sat, Mar 9, 2024, 3:47 PM

 

శివుడికి సంబంధించిన పండుగలన్నింటినిలోనూ ముఖ్యమైనది, పుణ్యప్రదమైనది మహాశివరాత్రి. ప్రతినెలా కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధశి తిథిని మాస శివరాత్రి అంటారు. మాఘ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధశికి మహాశివరాత్రి అని పేరు.

శివరాత్రి పండుగను జరుపుకోవడంలో ప్రధానమైన విషయాలు మూడు ఉన్నాయి.

శివార్చన, ఉపవాసం, జాగరణం. శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి, స్నాన సంధ్యాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని, శివలింగాన్ని షోడశోపచారాలతో పూజించాలి.

1. శివభక్తులను పూజించి వారికి భోజనం పెట్టాలి. శివాలయానికి వెళ్లి, శివదర్శనం చేసుకోవాలి ఇది శివార్చన.

2. ఇక రెండోది ఉపవాసం. ఉపవాసమంటే శివరూపాన్ని ధ్యానిస్తూ, శివనామస్మరణం చేయడం మాత్రమే. కానీ ఉపవాసమంటే ఆహారం తీసుకోకుండా శరీరాన్ని బాధపెట్టడం కాదని వరాహోపనిషత్తు తెలియజేస్తోంది.

3. మూడోది జాగారం. శివరాత్రి నాటి సూర్యాస్తమయం మొదలు మర్నాడు సూర్యోదయం వరకు-నాలుగు జాములు నిద్రపోకుండా మేల్కొని ఉండటం. ఈ విధంగా జాగారం చేసిన వారికి మళ్లీ తల్లిపాలు తాగే అవసరం పునర్జన్మ నెత్తడం ఉండదని స్కాంద పురాణం చెబుతోంది. శివరాత్రి రోజున భగవన్నామ స్మరణం సమస్త పాపాలను నశింపజేస్తుంది.

 

Valmiki Ramayanam Telugu Balakanda Day 1 | వాల్మీకి మహర్షి రామాయణం బాలకాండ

 

శివరాత్రి నాడు చేసే జాగారాన్ని వ్యర్థ ప్రసంగాలతూనో, ఎటువంటి ప్రయోజనమూ లేని వాటిని చూస్తునో కాకుండా శివనామాన్ని స్మరిస్తూ, శివగాధలను చదువుకుంటూ శివలీలలను చూస్తూ చేసినట్లైతే కాలాన్ని సద్వినియోగం చేసుకున్నట్లవుతుంది. ఇంకా పుణ్యమూ, పురుషార్థమూ రెండూ లభిస్తాయని పురోహితులు చెబుతున్నారు.

పూర్వం గుణనిధి అనే దుర్మార్గుడు శివరాత్రి నాటి రాత్రి ఆకలితో ఒక శివాలయంలోకి వెళ్లాడు. నైవేద్యం కోసం ఉంచిన అన్నాన్నీ పిండి వంటలనూ కాజేద్దామనుకున్నాడు. తెల్లవార్లూ కునుకులేకుండానే ఉన్నాడు. దీప జ్వాల కొండెక్కుతుంటే వత్తిని ఎగదోశాడు. ఉత్తరీయం అంచును చించి, దారపు పోగులను వత్తిగా చేసి, ఆవునెయ్యిపోసి వెలిగించాడు.

Click here for




Happy Maha Shivratri Wishes

 

ఆ వెలుతురులో అన్నపు గిన్నెను కాజేసి, పరిగెత్తుతూ తలారి వేసిన బాణపు దెబ్బవల్ల మరణించాడు. ఈ పుణ్యానికే ఆ గుణనిధి మరుజన్మలో కళింగ దేశాధిపతియైన అరిందముడికి దముడు అనే కుమారుడిగా జన్మించాడు.

ఆ జన్మలో మహారాజై, అనేక శివాలయాల్లో అఖండ దీపారాధనలు చేయించి, ఆ పుణ్యం వలన ఆ పై జన్మలో కుబేరుడిగా జన్మించి ఉత్తర దిక్పాలకుడైనాడు. ఇలా పరమేశ్వరుడికే ప్రాణసఖుడైనాడని పురణాలు చెబుతున్నాయి. అందుచేత మహాశివరాత్రి రోజున మనం కూడా ముక్కంటిని భక్తి శ్రద్ధలతో పూజించి పుణ్యఫలాల్ని పొందుదాం..!

 

Image Maha Shiva Ratri Ela Cheyali

Maha Shiva Ratri Ela Cheyali

 

 

Who is Dushala and Saindhav in Mahabharata | iiQ8 info

*ఓం హర హర మహదేవ్*🙏

Maha Shivratri WhatsApp Status, Stickers, GIFs, Messages iiQ8

 

Maha Shivaratri
Maha Shivratri
Maha Shivaratri Date
Maha Shivaratri Date
Maha Shivaratri

https://sharemebook.com/ https://sharemebook.com/ https://sharemebook.com/
Maha Shivaratri
Maha Shivaratri Wishes
Mahashivratri

 

Maha Shiva Ratri Ela Cheyali | iiQ8 శివరాత్రి జరుపుకోవడంలో ప్రధానమైన విషయాలు మూడు

Maha Shivratri Images
Maha Shivratri Status

 

Sri Lalitha Sahasranama Stotram | శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం iiQ8 Devotional

Spread iiQ8

March 7, 2024 8:00 AM

473 total views, 0 today