Life history of Ayyappa Swamy | అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర | iiQ8 Devotional

Life history of Ayyappa Swamy | అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర

 

Dear Readers, In this post we have – Life history of Ayyappa Swamy | అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర !

 

శ్రీ అయ్యప్ప స్వామి వారి జన్మవృత్తాంతము క్లుప్తముగా అందరికి అర్థమయ్యే విధంగా సూక్ష్మ కథతో వ్రాయడము జరిగింది.

అమృతము కొరకు దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగారమును, మంధర పర్వతమును కవ్వముగా చేసి వాసుకి అను సర్పమును తాడుగా చేసి మధించు సమయమున ముందుగా ఉద్భవించిన హాలహలమును గాంచి భయబ్రాంతులై అందరూ పరుగులు తీస్తుండగా, అది చూసిన పరమేశ్వరుడు హాలహలమును మ్రింగి ఆ వేడిని తట్టుకోలేక తన కంఠమందు బందించి గరళకంఠుడై వెడలెను. అందులకు సంతోషించిన దేవదానమవులు మరల క్షీరసాగారమును మధించగా అమృతభాండము లభించినది, ఆ అమృతమును గూర్చి దేవదానవులు వాదులాడు కొనుచు యుద్ధమునకు సిద్ధము కాగా, జగన్మాత ఆదేశము మేరకు శ్రీ మహావిష్ణువు అతిలోకసౌందర్యవంతురాలైన జగన్మోహిని అవతారమున ప్రత్యక్షమై రాక్షసులను మాయా మోహంబున బంధించి అమృత భాండమును దేవతల కందించి వెడలుచుండగా, ఆ అతిలోకసుందరి మోహిని రూపలావణ్యమును గాంచిన పరమేశ్వరుడు జగన్మాయలీలలను గ్రహించిన వాడై మోహము నొందెను.

మోహిని గాఢoగా వయ్యారము ఒలకబోసి పరమేశ్వరుని గాంచి అధమరిచి కవ్వించెను. అంత ఆ హరిహరుల గాఢపరిష్వంగంలో జాలువారిన శ్వేత బిందువుల కలయిక వలన నల్లని శరీరఛాయతో ఉగ్రరూపధారియై ఉద్భవించిన కుమారుడు జన్మించెను. అది తెలుసుకున్న చతుర్ముఖుడు బ్రహ్మదేవుడు ఆ పసిబాలునికి హరిహరసుతుడను నామకరణము చేసెను.తల్లి అయిన మోహిని (శ్రీహరి) తన కంఠమందున్ను మనిహారమును తీసి బాలుని మెడలో వేసి మణికంఠుడని, తండ్రి అయిన పరమేశ్వరుడు సకల భూతాలపైన ఆధిపత్యమును ప్రసాదించి భూతనాధుడని పిలిచారు. శివకేశవుల తత్వమున ఉత్భవించిన హరిహరసుతుడు సర్వధర్మములను శాసించుచూ ధర్మశాస్తాగా ఖ్యాతి గడించెను.

అలా అండగా మహిషాసురిని అకృత్యాలను భరించలేని దేవతలు జగన్మాతను శరణు వేడిరి. ఆ తల్లి ఆశిర్వాదముతో శ్రీలక్ష్మీ, సరస్వతి, పార్వతి దేవేరుల నుండి ఉద్భవించిన శక్తి స్వరూపిణి దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుని సంహరించెను. తన సోదరుని మరణవార్త విని భరించలేని మహిషి ప్రతీకారము తీర్చుకొనుటకై ముల్లోకములను అల్లకల్లోలము చేయుటకు నిశ్చయించుకొని తనకు మరణము లేని వరము పొందుటకు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసెను. మహిషి తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై నీ కోరికను తెలియజేయమనగా, మహిషి తనకు చావులేని వరమును ప్రసాదించమనెను. అందులకు బ్రహ్మదేవుడు నీ కోరిక సమంజసమైనది కాదు అది ఆ హరిహరాదులకు కూడా సాధ్యము కాదని తిరస్కరించగా, అందులకు మహిషి చింతించకుండా ఆ హరిహరులకు కుడా సాధ్యపడదని మీరే సెలవిస్తిరి కాన వారిద్దరికి జన్మించిన మానవుడు భూలోకములో నాపై జయించునట్లుగా వరమడిగెను.అందుకు సమ్మతించిన బ్రహ్మదేవుడు సరే అని వరమిచ్చెను.

Karthika Puranam 1 Part, Karthika Maasa Vratha Vidhanam | కార్తీకపురాణం -1 వ అధ్యాయం, ర్తీక మాసం మహత్యం, కార్తీక మాస వ్రతవిధానం



అంత ఆ మహిషి హరిహరులకు సంగమముతో బాలుడు జన్మించునా! జన్మించినను భూలోకమందు ఎలా జన్మించును! అది ఎలా సాధ్యమగును? అయినను ఇద్దరు పురుషులకు శిశువు ఎలా పుడతాడు? అయినా నేను ఈ లోకముము వదిలి నేనెలా భూలోకమునకు వెల్లుదుననే అజ్ఞాతముతో మహిషి ముల్లోకములను అల్లకల్లోలము చేయసాగెను. మహిషి పెట్టె బాధలు భరించలేని దేవతలు, దేవేంద్రునీతో కలిసి పరమశివుని వద్దకు వెళ్లి వారి బాధలను చెప్పుకొనిరి. వారి మొర ఆలకించిన పరమేశ్వరుడు భూలోకమున జన్మించమని భూతనాధునికి ఆజ్ఞాపించెను. తండ్రి మాటలను శిరోధార్యముగా భావించిన భూతనాధుడు సమ్మతించెను. ఇంతలో మహిషి ఆగడాలను అరికట్టేందుకు మన్మధుని ప్రయోగించి మన్మధ బాణాలను వదిలి మహిషిని మొహపరవశము చేశాడు, అలానే దత్తాత్రేయుడు కూడా మగ మహిషముగా మారి కామవాంఛలకు లోబడ్డ మహిషిని లోబరచి భూలోకమందున్న అలుదానది తీరమునకు తీసుకొని పోయి కామకేళి విలాసముతో మైమరపించుచుండెను.

కేరళదేశము నందు పందళ రాజ్యమును పరిపాలించు రాజశేఖర పాండ్యుడనే రాజు ఉండేవాడు, అతడు పరమ శివభక్తుడు, ఆయన భార్యా సాధ్వీమణి కూడా శ్రీ మహావిష్ణు భక్తురాలు, అయినా వారికి చాలాకాలము వరకు సంతానము కలుగలేదు. అందుకోసం ఆ దంపతులు నిరాశ చెందకుండా ఎన్నో నోములు, వ్రతములు, పూజలను జరిపించిన సంతానము కలుగలేదని బాధపడక భగవంతుని పూజలు మాత్రము మానలేదు. ఒకనాడు రాజశేఖర పాండ్యుడు పంబానదీ తీర అడవి ప్రాంతములోని క్రూరమృగముల బాధపడలేక తన పరివారమును వెంటబెట్టుకొని వేటకు వెళ్ళాడు, అంతలో పంబానదీ తీరమున సర్పము నీడన పవళించి ఏడుస్తున్న బాలుని గాంచినంతనే అబ్బురపడి ఆనందముగా బాలుని ఎత్తుకుని ఈయన ఆ భగవంతుని వర ప్రసాదముగా భావించి, ఆ బాలుని గొనివచ్చి మహారాణికి అందించెను. ఆమె మహా ఆనందముగా బాలుని ఎత్తుకుని అక్కున చేర్చుకొని ఆనందపరవశురాలైనది. ఆ బాలుని కంఠమున మనిహారము దివ్యకాంతులు వెదజల్లుతున్న ఆ బాలుని మణికంఠుడని నామకరణము చేసి ఆ దంపతులు అల్లారుముద్దుగా పెంచుకొనుచున్నారు.

ఆ మణికంఠుడు అడుగు పెట్టిన మహత్యమో ఏమో కాని మొత్తానికి పందల రాజ్యము సుభీక్షముగా నుండెను. అంతనే కాక పందళరాణి కూడా గర్భము దాల్చి ఒక కుమారున్ని ప్రసవించెను. వారి ఆనందములకు అవధులు లేకుండెను. మణికంఠునికి అయిదవ ఏట రాగానే అక్షరాభ్యాసము గావించి విద్యాభ్యాసమునకు గురుకుల ఆశ్రమమునకు పంపిరి. అక్కడ మణికంఠుడు అనతికాలములోనే సకల విద్యలు అభ్యసించి సకల శాస్త్రపారంగతుడై గురుదక్షిణగా గురుపుత్రునికి మాటను మరియు దృష్టిని ప్రసాదించెను.ఇంతలో ప్రజలను భయభ్రాంతులు చేస్తున్న వావరు అను బందిపోటు దొంగను ఎదుర్కొని అతనిని మణికంఠుడు ఓడించి తన భక్తునిగా మార్చి స్నేహితునిగా చేసుకొనెను.

 

108 Names Of Lord Shiva | Meanings of Lord Shiv Names

 

Life history of Ayyappa Swamy | అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర

 

మణికంఠుడు దినదిన ప్రవర్ధమానమై దివ్యకాంతులు వెదజల్లుతున్న మణికంఠుని చూసి ఓర్వలేని మహామంత్రి సింహాసనము తనే అధిష్టించునేమో అనుకొని ఎలాగైనా తనని తప్పించాలని అనేక పన్నాగాలు పన్నెను. ఇంతలో మహామంత్రి మహారాణి వద్దకు పోయి తమ సొంత కుమారుడు ఉండగా ఎక్కడో దొరికిన అనామకుడికి సింహాసనము అధిష్టించి యువరాజుగా పాలించే అర్హత లేదు యను నెపంతో రాణిగారికి దుర్భోద చేసి మహారాణి అనుజ్ఞతో మణికంఠునికి అనేక కష్టాలు పెట్టించెను.

 

కేరళ రాజ్య మాంత్రికులచే మహామంత్రి అనేక ప్రయోగములు చేయించగా, పరమేశ్వరుడు అడ్డుకుని మణికంఠుని కాపాడేవాడు. అంతటితో చాలక మహామంత్రి విష ఆహారమును పెట్టించెను. దానిని శ్రీహరి పంపిన గరుత్మంతుడు విషాన్ని తీసి అమృతమును చిలికించి కాపాడి వెళ్ళాడు. మణికంఠుని వదిలించుకొనుటకు ఏ కుతంత్రములు ఫలించుటలేదని నిరాశ నిస్పృహలకు లోనై చివరి ప్రయత్నంగా మహారాణికి శిరోవేదన మొదలయినది అని నాటకమాడి పరీక్షించుటకు వచ్చిన రాజవైద్యులు ప్రలోభాలకు లోనైన వారై మహామంత్రి మాటలు విని అప్పుడే ప్రసవించిన పులిపాలు తెచ్చిన వ్యాధి నయమగును అని సెలవిచ్చేరు.

ప్రసవించిన పులి ఎదుట నిలబడగల వారెవ్వరు యని మహారాజు చింతాక్రాంతుడైనాడు. పులిపాలు తెచ్చి పెంచిన తల్లిదండ్రుల ఋణమును తీర్చుటకై మణికంఠుడు అనుజ్ఞ అడుగగా మహారాజు కృంగిపోయాడు. పట్టువదలని మణికంఠుడు మరీ మరీ బ్రతిమాలి అడగగా మహారాజు అనుజ్ఞ ఇవ్వక తప్పలేదు. పులిపాల కొరకు బయలుదేరిన మణికంఠునికి పందళరాజు ఎత్తిన ఇరుముడిని తలపైదాల్చి చేతిలో విల్లమ్ములు ధరించి వస్తున్న మణికంఠునికి అడవి దారిలో దేవేంద్రుడు ఎదురై స్వామి యొక్క జనన వృత్తాంతమును తెలిపెను. మహిషి ఆగడాలు మితిమీరిపోయాయి, సంహరించుటకు తగిన సమయము ఆసన్నమైనదని సెలవిచ్చాడు.

 

Diwali Govardhan Pooja Importance, iiQ8 info గోవర్ధన్ పూజ పండుగ

 

అందుకు స్వామి వారు దేవేంద్రుడికి మరియు దేవతలకు అభయమిచ్చి అలుదానదీ తీరమువైపు పయనమైనాడు. అచట దత్తాత్రేయుడు మగమహిష రూపము చాలించి దేవలోకమునకు వెళ్ళెను. తన చెలికాడు ఎచటకు వెళ్ళాడో తెలియని మహిషి రంకెలు వేయుచు వెదుకుచుండెను. ఆ సమయమున నారదమహర్షి మహిషికి ఎదురై నిను సంహరించుటకు బాలుడు వస్తున్నాడని చెప్పి వెళ్ళిపోయెను. ఆ మాట వినగానే మహాఉగ్రురాలై మహిషి కరుడు గట్టిన రాక్షతత్వంతో జూలు విదిలించి స్వామిని మానవ మాత్రుడుగా తలచి ఎదుర్కొనెను. వారిరువురి మధ్య ఘోరమైన యుద్ధము జరిగినది. మణికంఠుడు తన రెండుచేతులతో మహిషిని లేవనెత్తి గిరగిర త్రిప్పుతూ అలుదానది తీరమున పడవేసెను.

అంతట మహిషిలో నుండి శాపవిమోచము పొందిన లీలావతి ప్రత్యక్షమై స్వామి వారిని వివాహము చేసుకోమని ప్రార్థించెను. అందుకు స్వామివారు సమ్మతించక ఈ జన్మలో నేను నిత్యబ్రహ్మచారినై సకల మానవాళికి రక్షకుడనై ఉండెదను, కాబట్టి నేను నిన్ను వివాహము చేసుకోలేను అని మణికంఠుడు చెప్పగా, అపుడు లీలావతి స్వామి వద్దకు పోయి మీ కోసమై పరితపించిన నా సంగతి ఏమిటి స్వామీ! అని అడుగగా, మణికంఠుడు ఆమె వద్దకు పోయి దేవీ నీవు కుడా నా ప్రక్కనే మాళిగాపురోత్తమ్మగా వెలుగొంది నాతోపాటు నీవు కుడా పూజలను అందుకొని నా దీక్షబూని వచ్చిన స్వాములను భాదించక కాపాడి ఉండమని సెలవిచ్చెను. అపుడు మంజుమాతాదేవి స్వామివారితో మన వివాహము సంగతి చెప్పండి అని అడుగగా, దేవీ! మొదటిసారి మాలధరించి కన్నెస్వామిగా 41 రోజుల దీక్షబూని ఇరుముడి తలపై దాల్చి నా సన్నిధికి రారో అప్పుడు మనము వివాహము చేసుకుందామని స్వామివారు మంజుమాతకు మాటిచ్చారు.

 

Life history of Ayyappa Swamy | అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర

 

 

మహిషి సంహారము జరిగినందుకు ఆనందముతో దేవతలు యుండగా దేవేంద్రుడు స్వామివారి వద్దకు వెళ్ళి, స్వామి! మీరు మీ తల్లి గారికి కావలసిన పులిపాల కొరకు వచ్చిన సంగతి మరిచారు అని గుర్తుచేసి , ఇంద్రుడే పులిగా మారి స్వామివారిని తనపై కూర్చుండబెట్టుకొని దేవతలందరూ పులిపిల్లలుగా మారి వెంటరాగా స్వామివారు పందళ రాజ్యం చేరుతారు. అంతా ప్రజలు అందరూ భయభ్రాంతులై ఉండగా, పందళరాజు ఎదురువచ్చి ఆనందముతో మణికంఠుని కౌగిలించుకొని, నాయన మణికంఠ నీవు సామాన్యుడవు కాదు దైవాంస సంభూతుడివి, మా తప్పులు మన్నించి, మహారాణి, మహామంత్రితో కలిసి చేసిన కుతంత్రములను మన్నించి రాజ్యభారమును స్వీకరించమని ప్రార్థించెను. మణికంఠుడు అంగీకరింపక నాకవసరము లేదు. ఆ రాజ్యభారము తమ్ముడు రాజరాజనుండుకి ఇవ్వండి.

 

Importance of 5 Number, 5 Yokka Pramukyatha | 5 యొక్క ప్రాముఖ్యత

 

నా అవతారము పరిసమాప్తి అవుతుంది. మీ అనుమతి కొరకు వచ్చితిననగా, మహారాజు, మహారాణి, మరియు ప్రజలంతా శోక సముద్రములో మునిగిపోయారు. అంతట పందళరాజు అయ్యా నీ పట్టాభిషేకము కోసము చేసిన ఆభరణములైన స్వీకరించమనగా, మహారాణి అప్పా మా తప్పులు మన్నించి మా వద్దనే ఉండమని అర్థించగా, వారి ఆవేదనను గమనించిన మణికంఠుడు వారి అభీష్టము మన్నించి, తల్లిదండ్రులైన మీరు చాలా చక్కగా నన్ను ఆదరించి అయ్యా + అప్పా అని పిలిచి కన్నకొడుకుగా చుసుకున్నందుకు అయ్యప్పగా అందరితో పిలుచుకుంటూ, నేను ఒక బాణము సంధిస్తాను అది ఏ స్థలములో లభిస్తుందో ఆ చోట నా కొరకు ఆలయమును నిర్మించండి. ఆ ఆలయమునకు ముందు పద్దెనిమిది సిద్ధులకు సాంకేతముగా మెట్లతో నిర్మించినచో ప్రతీ మకర సంక్రాంతి పర్వదినాన మకర నక్షత్ర జ్యోతి రూపముతో మీతో పాటు నా భక్తులకు దర్శనమిస్తాను. ఆ సమయమున మీరు నా కోసమై చేయించిన ఆభరణములు నియమ నిష్టాగరిష్టులై తీసుకొని వచ్చి పడునెట్టాంబడిని దాటి నా సన్నిధిలో నన్ను అలంకరించి నన్ను దర్శించిన వారికి ఆయురారోగ్య అష్ట ఐశ్వర్య ప్రదాతనై వారికి జీవస్ముక్తిని ఇవ్వగలనని సెలవిచ్చారు.

 

Find everything you need.

 

Search Product, Service, Properties and items on a single site ShareMeBook.

 

స్వామివారు చెప్పిన విధంగా భక్త శబరికి మోక్షమిచ్చుటకు పంబానది తీరాన శబరితల్లి తపస్సు చేసిన స్థలము ఎంచుకొని ఆ స్థలానికి శబరిమలై అని పిలుచుకుంటూ అదే చోట ఆలయమునకు ముందర పదునెనిమిది మెట్లతో పందళరాజు రాజశేఖర పాండ్యుడు ఆలయాన్ని నిర్మించారు. నాటి నుండి నేటి వరకు ప్రతీ మకర సంక్రాంతి దినమున సాయంకాలము సమయమున జ్యోతి స్వరూపముగా స్వామివారు దర్శనమిచ్చి కలియుగ ప్రత్యక్ష దైవమై విరాజిల్లుతున్నాడు అయ్యప్ప స్వామి.

ఓం శ్రీ మణికంఠ దైవమే శరణం అయ్యప్ప.🙏

 

Life history of Ayyappa Swamy

 

Here is the rough translation from Telugu to English by Internet.

Sri Ayyappa Swamy’s birth anniversary was briefly written with a subtle story so that everyone can understand.

For the sake of nectar, the gods and demons together made the Ksheera Sagaram, Mandhara mountain as a cave and the snake named Vasuki as a rope, and the noise that emerged earlier at the time of meditation, while everyone was running away, Parameswar who saw that, was unable to bear the heat, tied the noise in his neck and went to Garala Kantha. When the devadanams were happy, they got the elixirasagaram again, the devadanams argued about that elixir and got ready for the war, as per the order of Jaganmata, Sri Mahavishnu appeared in the form of the most beautiful Jaganmohi and tied the demons in the magic face and made the elixir basin to the goddesses, The temptation has come to pass.

 

Life history of Ayyappa Swamy  Brihadeeswara Temple is one of the greatest structures ever built | బృహదీశ్వరాలయం ఇంతవరకు నిర్మించిన గొప్ప కట్టడాల్లో ఒకటి

 

We have become Mohini Gadhoo. We bowed down to Parameshwara and made him to sing. Due to the combination of white dots in the Gaaparishvangam of all those Hariharas, a son who emerged as a terrorist with a black body was born. Chathurmukhudu Brahmadev who came to know that, named that child as Hariharasuthuda. Mohini (Srihari) who is the mother removed her voice from Maniharam and put the boy around his neck and Manikanthu, father Parameswara gave dominance over all ghosts and called him Bhutanathuda. Hariharasuthu, who emerged from the philosophy of Sivakesavas, gained fame as Dharmasasta by ruling all the religions.

Goddesses who cannot tolerate Mahishasuri’s atrocities, Saranu Vediri. With the blessings of that mother, Durga Devi Mahishasurudan, the form of power emerged from Sri Lakshmi, Saraswati, Parvati devas, has abducted the demon. Mahishi, who could not bear hearing the news of her brother’s death, decided to stir the thorns in order to take revenge, committed severe penance about Brahma God to get the boon without death. The Brahma who liked Mahishi’s repentance appears and express your desire, Mahishi will offer him immortal boon. Therefore, Lord Brahma, your wish is not reasonable. It is not possible even for those Hariharadas. Without worrying about Mahishi, you yourself are the one who is born to two of them, who has won over me on this earth. Brahmadevudu who agreed for that and blessed him with a good deed. Is a boy born with the association of Hariharas! How can one born in this world even if he is born! How is that even possible? But how can a baby be born to two men?

Life history of Ayyappa Swamy | అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర

 

Download Bhagavad Gita Telugu pdf | శ్రీమద్ భగవద్గీత | Bhagavad Gita In Telugu PDF free download

 

Even then how did I leave this world and go to the earth, with the ignorance of Mahishi’s turbulence. Goddesses who cannot bear the pains of Mahishi, go to Lord Shiva along with Devendruni and tell their pains. Parameshwara who heard their cry ordered Bhutanadhu to be born on earth. Bhutanathu accepted the words of his father as his head wife. Meanwhile, Mahishi used Manmadhu to curb the stops, Manmadhu left the arrows and made Mahishi proud. Similarly, Dattatreya also changed into male Mahishu, who was subjected to lust, took Mahishi to the shore of the earthly Aludanadi and mesmerized with the luxury of Kamakeli.

Rajasekhara Pandya used to be the king who ruled the Pandala kingdom in Kerala, he was a devotee of Supreme Shiva, his wife Sadhvi was also a devotee to Sri Mahavishnu, but they did not have children for a long time. For this reason, the couple did not get disappointed and did not stop praying to God as they did not feel sad that they did not get a child. Once upon a time, Rajasekhara Pandyudu went on a hunt due to the wild animals in the banks of Pambanadi forest area. In that, on the banks of Pamba river, he was amazed and happyly picked up the boy and considered the God as a gift and offered the boy to the queen. With great joy, she lifted the boy and joined him and became happy. The boy who is shining with the divine lights on his voice, the couple is lovingly nurturing him as Manikanthu.

Don’t know whether it’s the greatness that the manikanthu stepped in, but at the end, the kingdom of pandala was good. Not only that Pandalarani also conceived and gave birth to a son. There is no limit to their happiness. As soon as Manikanthu reached fifth year, he was taught alphabets and sent to Gurukula Ashram for education. There, Manikanthu studied all the studies in the ancient times and became a scientist and gave the word and attention to the Gurudakshina. In the meantime, I faced a bandit thief called Vavaru who is terrorizing people and made him his devotee and made him a friend.

Mahamantri who was not able to tolerate seeing Manikanthu in his daily behavior and tried to avoid him thinking that he will take the throne. Meanwhile, the great minister went to the queen and was found somewhere while his own son was not eligible to take over the throne and rule as a prince. In the name of empress, he has misbehaved the queen and caused many difficulties to Manikanthu with the help of the queen. While the Mahamantri had made many experiments by the Kerala State Wizards, Parameswara would have prevented and saved Manikanthu. With that, the clever Chief Minister gave poisonous food. It was sent by Sri Hari, the great soul removed the poison and squeezed the elixir and saved it. For the desperate and unconscious people that no conspiracies to get rid of Manikanthu, Lonai’s last attempt that the queen had a headache and the royal doctors who came to test were tempted and listened to the words of the Mahamantri and said that the disease brought by the tigers who gave birth to her was cured.

Life history of Ayyappa Swamy | అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర

 

Maharaju is worried that no one can stand in front of the tiger that has given birth. The king of Manikanthu surrendered to pay off the debt of his parents who brought tigers milk and raised him. Maharaju gave the obeisance asking Manikanthu to live more and more. On the way to forest, Devendra will show the birth cycle of Swami. Mahishi’s stances are exaggerated, says it’s time to reconcile That’s why Swami left Devendra and the Goddesses and went towards the banks of Aludanadi. Achata Dattatreyudu went to the temple in the form of a male.

9 Evidences which prove that Ramayan is not a myth, it is our History

Mahishi, who does not know where his younger brother has gone, searched for him by putting his hands on him. At that time Narada Maharshi Mahishi went in front of him saying that a boy is coming to kill you. On listening to that word, Mahishi became great terrorists, with demonism, I opened the jool and faced Swamy as a human. A deadly battle took place between them. Manikanthu lifted Mahishi with his two hands and made him fall on the banks of Aludanadi by spinning the mountain.

Leelavathi, who was freed from Mahishilo, appeared and prayed to Swamy to marry them. So without the consent of Swami, I would have been a Nitya Brahmachari and the saviour of all mankind, so when Manikanth told me that I cannot marry you, then what about me who went to Leelavathi Swami and prayed for you Swami! As I asked, the wrist went to her and Devi, you also lit up next to me as Maliga Prothamma. You also along with me took the pujas and told me to protect the swamis who came to my dikshabun. Then I asked you to tell about our marriage with Manjumata Devi Swamy, Devi! Swamy promised Manjumata that we will get married when she comes to my abode wearing garland for the first time as Kanneswamy.

Devendra went to Swamy with the happiness of Mahishi’s massacre, Swamy! Remembering that you have forgotten that you came for the tigers you wanted for your mother, Indru himself became a tiger and made Swami to sit on him, all the gods will become tigers and join the kingdom of Pandala. While all the people were terrified, Pandalaraju came in front of me and hugged Manikanta with happiness and said, my Lord Manikanta you are not an ordinary person but a divine entity, he forgave our mistakes and forgave the conspiracies done with Maharani and Mahamantri and prayed to take over the kingdom. I don’t need Manikanthu to agree. Give that royal burden to brother Rajarajanundu. My avatar is coming to an end. Seeking your permission, the King, the Queen, and all the people drowned in a sea of mourning.

That’s it Pandalaraju Ayya to accept the ornaments made for your coronation, Maharani Appa to forgive our mistakes and understand us to stay with us, Manikanthu who noticed their agony forgives their agony, you parents have very nicely respected me by calling me Ayyappa + Appa and treating me as a son. Calling all, I will shoot an arrow wherever it is found. Build me a temple on the spot In front of that temple, the temple built with steps as a symbol of eighteen Siddhas, on every Makara Sankranti festival, I will visit my devotees in the form of Makara Nakshatra Jyoti. At that time, the ornaments you had made for me were brought to bed as a devotee and adorned me in my abode and visited me and said that I would give them life, wealth, and life.

According to Swami, Pandalaraju Rajasekhara Pandyudu built the temple with eighteen steps in front of Sabarithalli on the banks of Pambanadi for the salvation of devotee Sabarimala. Ayyappa swamy is appearing as the direct deity of Kaliyuga on every Makara Sankranti day in the evening in the form of a lamp.

Om Sri Manikantha God is our refuge Ayyappa. 🙏
· ·

Life history of Ayyappa Swamy

108 Names Of Lord Shiva | Meanings of Lord Shiv Names

Life history of Ayyappa Swamy | అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర

Spread iiQ8

October 16, 2023 1:06 PM

269 total views, 0 today