Lent Prayers Telugu Messages – లెంట్ ప్రార్థనలు తెలుగు సందేశాలు | ఎవరు మరణానికి పాత్రులు?

 

 

మరణమునకు పాత్రుడని ఎంచబడిన యేసుక్రీస్తు – (మన స్థానం లో మరణ శిక్ష విధింపబడిన వాడు)

 

  1. Matt 26:62-66 (Tel)

62 ప్రధానయాజకుడు లేచినీవు ఉత్తర మేమియు చెప్పవా? వీరు నీమీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా యేసు ఊరకుండెను. 63 అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచినీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవముగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాననెను. అందుకు యేసు –నీవన్నట్టే.  64 ఇది మొదలుకొని మనుష్యకుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా  65 ప్రధానయాజకుడు తన వస్త్రము చింపుకొని–వీడు దేవ  దూషణ చేసెను; మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో  ఈ దూషణ మీరిప్పుడు విన్నారు; 66 మీకేమి తోచుచున్నదని అడిగెను. అందుకు వారువీడు మరణమునకు పాత్రుడనిరి.

 

  1. Luke 23:20-22 (Tel)

20 పిలాతు   యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాటలాడినను. 21 వారు వీనిని సిలువవేయుము సిలువవేయుము అని కేకలు వేసిరి. 22 మూడవ మారు అతడు ఎందుకు? ఇతడు ఏ దుష్కార్యము చేసెను? ఇతనియందు మరణమునకు తగిన నేరమేమియు నాకు అగపడలేదు గనుక ఇతని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పెను.

Merry Christmas Wishes and Short Christmas Messages

  1. Gen 2:16-17 (Tel)

16 మరియు దేవుడైన యెహోవాఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; 17 అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను.   ( మరణ పాత్రుడవు అవుతావు )

( ఆదాము స్థానంలో మరణ పాత్రుడుగా మారాడు యేసు క్రీస్తు )

 


  1. 2Sam 19:18-21 (Tel)

18 రాజు ఎదుట నది దాటిరి; రాజు ఇంటివారిని అవతలకు దాటించుటకును రాజు దృష్టికి అనుకూలమైన దానిని చేయుటకును రేవు పడవను ఇవతలకు తెచ్చి యుండిరి. అంతట గెరా కుమారుడగు షిమీ వచ్చి రాజు యొర్దాను నది దాటిపోగానే అతనికి సాష్టాంగపడి 19 నా యేలినవాడా, నేను చేసిన ద్రోహము నామీద మోపకుము; నా  యేలిన వాడవును రాజవునగు నీవు యెరూషలేమును విడిచిన వేళ నీ దాసుడనగు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకమందుంచకుము, మనస్సునందుంచు కొనకుము. 20 ​నేను పాపము చేసితినని నాకు తెలిసినది గనుక యోసేపు వారందరితో కూడ నా యేలినవాడవును రాజవునగు నిన్ను ఎదుర్కొనుటకై నేను ముందుగా వచ్చియున్నాననెను. 21 అంతట సెరూయా కుమారుడగు అబీషై యెహోవా అభిషేకించినవానిని శపించిన యీ షిమీ మరణమునకు పాత్రుడు కాడా అని యనగా …

 

  1. Jer 26:7-11 (Tel)

7 యిర్మీయా యీ మాటలను యెహోవా మందిరములో పలుకుచుండగా యాజకులును ప్రవక్తలును జనులందరును వినిరి. 8 జనుల కందరికిని ప్రకటింపవలెనని యెహోవా యిర్మీయాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిని అతడు పలికి చాలించిన తరువాత యాజకులును ప్రవక్తలును జనులందరును అతని పట్టుకొనినీవు మరణశిక్ష నొందక తప్పదు. 9 ​యెహోవా నామమునుబట్టి ఈ మందిరము షిలోహువలె నగుననియు, ఈ పట్టణము నివాసిలేక పాడైపోవుననియు నీవేల ప్రకటించుచున్నావు అనుచు, ప్రజలందరు యెహోవా మందిరములో యిర్మీయాయొద్దకు కూడివచ్చిరి. 10 యూదా అధిపతులు ఆ సంగతులు విని రాజు నగరులో నుండి యెహోవా మందిరమునకు వచ్చి, యెహోవా మందిరపు క్రొత్త గవిని ద్వారమున కూర్చుండగా 11 యాజకులును ప్రవక్తలును అధిపతులతోను  సమస్త ప్రజలతోను ఈలాగనిరి. మీరు చెవులార వినియున్న ప్రకారము, ఈ మనుష్యుడు ఈ పట్టణమునకు విరోధముగా ప్రవచించుచున్నాడు; గనుక ఇతడు మరణమునకు  పాత్రుడు.

 

  1. 1Sam 26:14-16 (Tel)

14 ​​జనులును నేరు కుమారుడైన అబ్నేరును వినునట్లు అబ్నేరూ, నీవు మాటలాడవా? అని కేక వేయగా అబ్నేరు “కేకలు వేసి రాజును నిద్ర లేపు నీవెవడవని” అడిగెను. 15 ​​అందుకు దావీదునీవు మగవాడవు కావా? ఇశ్రాయేలీయులలో నీ వంటివాడెవడు? నీకు యజమానుడగు రాజునకు నీవెందుకు కాపు కాయక పోతివి? నీకు యజమానుడగు రాజును సంహరించుటకు జనులలో ఒకడు చేరువకు వచ్చెనే; 16 నీ ప్రవర్తన అనుకూలము కాదు, నీవు శిక్షకు పాత్రుడవే; యెహోవా చేత అభిషేకము నొందిన నీ యేలినవానికి నీవు రక్షకముగా నుండలేదు; యెహోవా జీవముతోడు నీవు మరణశిక్షకు పాత్రుడవు. రాజుయొక్క యీటె యెక్కడ నున్నదో చూడుము, అతని తలగడయొద్దనున్న నీళ్లబుడ్డి యెక్కడ నున్నదో చూడుము అని పలికెను.

  

  1. 2Sam 12:1-6 (Tel)

1 కావున యెహోవా నాతానును దావీదునొద్దకు పంపెను; అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను. ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుష్యులు ఉండిరి. 2 ఒకడు ఐశ్వర్యవంతుడు ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలును గొడ్లును కలిగియుండెను. 3 అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన యొక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమియు లేకపోయెను. వాడు దానిని పెంచు కొనుచుండగా అది వానియొద్దను వాని బిడ్డలయొద్దను ఉండి పెరిగి వాని చేతిముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వానికి కుమార్తెవలె ఉండెను. 4 అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తనయొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలోగాని గొడ్లలోగాని దేనిని ముట్టనొల్లక, ఆ దరిద్రుని గొర్రెపిల్లను పట్టుకొని, తన యొద్దకు వచ్చినవానికి ఆయత్తము చేసెను. 5 ​దావీదు ఈ మాట విని ఆ మనుష్యునిమీద బహుగా కోపించుకొని యెహోవా జీవముతోడు నిశ్చయముగా కార్యము చేసినవాడు మరణపాత్రుడు. 6 ​వాడు కనికరము లేక యీ కార్యము చేసెను గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా నాలుగు గొర్రెపిల్లల నియ్యవలెనని నాతానుతో అనెను.

  

ఇంతకు యీ మరణ పాత్రుడైన యేసు క్రీస్తుకు మరణం మీద ఎలాంటి అధికారం ఉంది?

Joshua – యెహోషువ – 1 , Telugu Bible meaning in English




 

  1. Ps 33:18-19 (Tel)

18 వారి ప్రాణమును మరణమునుండి తప్పించుటకును కరవులో వారిని సజీవులనుగా కాపాడుటకును 19 యెహోవా దృష్టి ఆయనయందు భయభక్తులుగలవారి  మీదను ఆయన కృపకొరకు కనిపెట్టువారిమీదను నిలుచుచున్నది.

 

  1. Ps 56:12 (Tel)

12 దేవా, నీవు మరణములోనుండి నా ప్రాణమును తప్పించియున్నావు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించునట్లు జారిపడకుండ నీవు నా పాదములను తప్పించియున్నావు.

 

  1. Ps 68:20 (Tel)

20 దేవుడు మా పక్షమున పూర్ణరక్షణ కలుగజేయు దేవుడైయున్నాడు మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము.

 

  1. Ps 116:8 (Tel)

8 మరణమునుండి నా ప్రాణమును కన్నీళ్లు విడువకుండ నా కన్నులను జారిపడకుండ నాపాదములను నీవు తప్పించియున్నావు.

 

  1. Ps 118:18 (Tel)

18 యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు.

 

  1. Deut 30:19 (Tel)

19 నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ యెదుటను ఉంచి, భూమ్యాకాశములను మీ  మీద సాక్షులుగా పిలుచుచున్నాను.

  1. Rev 1:18 (Tel)

18 నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి.

Joshua – యెహోషువ – 2, Telugu Bible English Meanings for Bible Translation

 

యేసు ఇలాంటి అన్యాయపు తీర్పు వలన మరణ శిక్ష విధించబడతాడని చెప్పబడిన ప్రవచనాలు

 

  1. 1Sam 20:30-31 (Tel)

30 ​​సౌలు యోనాతానుమీద బహుగా కోపపడి –ఆగడగొట్టుదాని కొడుకా, నీకును నీ తల్లి మానమునకును సిగ్గుకలుగునట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసి నది కాదా? 31 ​​​యెష్షయి కుమారుడు భూమిమీద బ్రదుకునంత  కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలుగదు గదా; కాబట్టి నీవు వర్తమానము పంపి అతనిని నా దగ్గరకు రప్పించుము, నిజముగా అతడు మరణమున కర్హుడని చెప్పెను.

  1. Ps 94:21 (Tel)

21 దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకై వారిమీద  పడుదురు దోషులని నిర్దోషులకు మరణము విధించుదురు.

 

  1. Isa 53:9-12 (Tel)

9 అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి  నియమింపబడెను ధనవంతునియొద్ద అతడు ఉంచబడెను నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు. 10 అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్నుతానే అపరాధపరిహారార్థబలిచేయగా అతని సంతానము చూచును. అతడు  దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము  అతనివలన సఫలమగును. 11 అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి నకున్న అనుభవజ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. 12 కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టెదను ఘనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయెను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసినవారినిగూర్చి విజ్ఞాపనముచేసెను

 

  1. Ezek 13:19 (Tel)

19 అబద్ధపు మాటల నంగీకరించు నా జనులతో అబద్ధఫు మాటలు చెప్పుచు, చేరెడు యవలకును రొట్టెముక్కలకును ఆశపడి మరణమునకు పాత్రులు కాని వారిని చంపుచు, బ్రదుకుటకు అపాత్రులైన వారిని బ్రదికించుచు నా జనులలో మీరు నన్ను దూషించెదరు.   ( యేసును సిలువకు అప్పగించి బరబ్బాను విడుదల చేసారు యుదులు )

 

ఇలాంటి మనుషుల విషయంలో దేవుడు ఎంత ప్రేమ చుపిస్తున్నాడో  చూడండి.

Holy Bible Deuteronomy, ద్వితియోపదేశకాండము – 1

తన మీదకు మరణ శిక్ష రాకముందే  మానవుల పాపాలకు ప్రాయఃశ్చిత్తం జరిగించడానికి అయనే మరణం వైపుగా అడుగులు వేస్తున్నాడు.

 

  1. Matt 26:38-39 (Tel)

38 అప్పుడు యేసు మరణమగు నంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది; మీరు ఇక్కడ నిలిచి, నాతోకూడ మెలకువగా నుండుడని వారితో చెప్పి 39 కొంత దూరము వెళ్లి, సాగిలపడి  నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగి పోనిమ్ము, అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్మని ప్రార్థించెను.

 

 

  1. Ezek 18:32 (Tel)

32 మరణమునొందువాడు మరణము నొందుటనుబట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రదుకుదురు;  ఇదే  ప్రభువగు  యెహోవా వాక్కు.

 

  1. John 8:51 (Tel)

51 ఒకడు నా మాట గైకొనిన యెడలవాడెన్నడును మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను.

  

  1. Hos 13:14 (Tel)

14 ​అయినను పాతాళ వశములోనుండి నేను వారిని విమోచింతును; మృత్యువు నుండి వారిని రక్షింతును. మరణమా, నీ విజయ మెక్కడ? మరణమా, నీ ముల్లెక్కడ?

 

 

  1. 1Cor 15:53-55 (Tel)

53 క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించుకొనవలసి యున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించు కొనవలసియున్నది. 54 ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు,ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించు కొనినప్పుడు, విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. 55 మరణమా, నీ విజయమెక్కడ? మరణమా, నీ ముల్లెక్కడ?

 

 

  1. Rev 20:6 (Tel)

6 ఈ మొదటి పునరుత్థాన ములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు. ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు; వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.

 

మానవాళి శత్రువైన మరణాన్ని చివరికి నాశనం చేయడానికే ఆయన యీ మరణపు శిక్షను అనుభవించాడు.

Holy Bible Deuteronomy, ద్వితియోపదేశకాండము – 2

  1. Acts 2:24 (Tel)

24 మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపెను.

  

  1. 1Cor 15:24-26 (Tel)

24 అటుతరువాత ఆయన సమస్తమైన ఆధి పత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును; అప్పుడు అంతము వచ్చును. 25 ఎందుకనగా తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను. 26 కడపట నశింపజేయబడు శత్రువు మరణము.

 

  1. 2Tim 1:10 (Tel)

10 క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షతవలన బయలుపరచబడి నదియునైన తన కృపనుబట్టియు, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తుయేసు, మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్తవలన వెలుగులోనికి తెచ్చెను.

 

  1. Heb 2:14-15 (Tel)

14 కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును, 15 జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను.

 

  1. Isa 25:8 (Tel)

8 మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మింగి వేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్పబిందువులను తుడిచివేయును భూమిమీదనుండి తన జనులనిందను తీసివేయును ఈలాగున  జరుగునని యెహోవా  సెలవిచ్చియున్నాడు.

 

  1. Rev 20:14 (Tel)

14 మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను; ఈ అగ్నిగుండము రెండవ మరణము.

  Merry Christmas Wishes and Short Christmas Messages

  1. Rev 21:4 (Tel)

4 ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.

Spread iiQ8

March 10, 2023 8:56 PM

248 total views, 1 today