Largest Hindu Temples in the world, The uniqueness of temples, ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయాలు
ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయాలు………!!
మన దేవాలయాల విశిష్టత.. మన పూర్వీకులు చాలా గొప్ప వైదిక విజ్ఞానం కలిగిన వారు… వారి వారసులమైన మనం దీనికెంతో గర్వించాలి, పెద్దలు పూర్వకాలంలో దేవాలయాలు (కోవెలలు,గుడులు) నిర్మీంచేటప్పుడు ఒక ప్రత్యేకత కలిగి ఉండేటట్టు నిర్మించేవారు. అయితే ఒక్కొక్క కోవెలకు ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉండేది. ఉదాహరణకు కొన్ని చూద్దాం.
1) ఉత్సవవిగ్రహం లేకుండా మూలవిగ్రహమే బయటకు మాడవీధులకు వచ్చేది చిదంబరం నటరాజస్వామి.
2) కుంబకోణంలో ఐరావతేశ్వరస్వామి గుడి తారాసురం అనే గ్రామంలో వుంది. అక్కడశిల్పకళా చాతుర్యం చాలా గొప్పగా చెక్కబడివుంది. ఒక స్తంభము నుంచి చూస్తే వాలిసుగ్రీవులు యుద్ధం మట్టుకే తెలుస్తుంది , కొంచం దూరంలో ఇంకొక స్తంభములో రాముడు ధనుర్దారిగా ఉండేటట్టు చెక్కబడివుంది. ఇందులో గొప్ప ఏమిటి అంటే మొదటి స్థంభము నుంచి చూస్తే శ్రీరాముడు కనపడడు కాని.. రెండవ స్తంభము నుంచి చూస్తే వాలిసుగ్రీవుల యుద్దము చాల బాగా తెలుస్తుంది.
3) ధర్మపురి(తమిళనాడు)మల్లికార్జునస్వామీ కోవెలలోన వంగామంటపం అంటే తొమ్మిదిస్తంభముల మంటపం అన్నమాట. ఇందులో రెండు స్థంభములు భూమిపై ఆనకుండా గాలిలో వేలాడుతున్నట్టుగా ఉంటాయి .
4) కరూర్(కోయంబత్తూర్) సమీపంలోని కుళిత్తలై అనే ఊరిలో కదంబ వననాధస్వామి కోవెలలో రెండు నటరాజ విగ్రహములు ఒకే మండపములో ప్రతిష్ట గావించబడి వున్నాయి.
5) గరుడుడు నాలుగుకరములతో( చేతులతో) అందులో రెంటిలో శంఖచక్రములతో దర్శనము ఇచ్చేది కుంబకోణం ప్రక్కన వేల్లియంగుడి అనే గ్రామదేవాలయంలో మాత్రమే.
6) కుంభకోణంలో నాచ్చియార్కోవిల్ అనే స్థలంలో విష్ణుగుడి వుంది. అక్కడ గరుడవాహనం రాతితో చేసినది స్వామీ సన్నిధిలో ఉంది. అది నలుగురు మోసే బరువు వుంటుంది. కాని క్రమంగా ఒక్కొక్క ప్రాకారందాటి బయటకు వస్తుంటే రానురాను 8,16,32 అలా బయటవీదిలోకి వచ్చేటప్పటికి 64 మంది మోసే అంత బరువు అయిపోతుంది. మరి స్వామి గుడిలోనికి పోతున్నప్పుడు అదేవిధముగా బరువు తగ్గిపోతూ వుంటుంది. ఇక బయటవీధికి వచ్చేటప్పటికి గరుడవిగ్రహమునకు చెమటపట్టడం కూడా ఒక విచిత్రమే.
7) చెన్నైసమీపంలో శ్రీపెరుంబుదూర్ అనే స్థలములో రామానుజుల వారి గుడి వుంది. అక్కడ మూలస్థానంలో విగ్రహం రాతిది కాదు. పంచలోహవిగ్రహము కాదు కేవలం కుంకుమపువ్వు పచ్చకర్పూరం మూలికలతో చేసినది, ఆశ్చర్యం కదా.
8) తిరునల్వేలి కడయం మార్గములో నిత్యకల్యాణి సమేత విశ్వనాథస్వామి దేవాలయంలో ఒక బిల్వచెట్టు స్థలవృక్షం గా వుంది. ఆ చెట్టుకు కాచే బిల్వకాయలు లింగాకారంలో వుంటాయి.
9) కుంభకోణం సమీపంలో తిరునల్లూరు అనే స్థలంలో ఈశ్వరుని గుడి వుంది. అక్కడ శివలింగం రోజుకు ఐదువర్ణములుగా మారుతూ వుంటుంది. అందుకే ఆ కోవేలని పంచవర్నేశ్వరుడు కోవెల అని పిలుస్తారు.
10) విరుదునగర్ ప్రక్కనా ధన్పుదూర్ అనే ఊరిలోని తవ(తపస్)నందీశ్వరుని కోవెలలో నందికి కొమ్ములు చెవులు వుండవు.
When is Ugadi (Gudi Padwa) 2022 in India?, Ugadi Wishes & Messages
11) ఆంధ్రప్రదేశ్ సామర్లకోటలో మూడువీదుల సంగమములో ఒకపెద్ద ఆంజనేయ విగ్రహం వుంది. దీని ప్రత్యేకత ఆంజనేయ విగ్రహం కనులు భద్రాచల శ్రీరామసన్నిధిలో శ్రీరాముని పాదములు ఒకే ఎత్తులో వుండడం.
12) వేలూర్ సమీపంలో విరించిపురం అనే వూరి కోవెలలో ఒక స్థంభములో అర్ధచంద్రాకారముగా ఒకటి నుండి ఆరు వరకు,ఆరునుండి పన్నెండు వరకు అంకెలు చెక్కబడి వున్నది, పైన వుండే పల్లము నుండి మనము ఒక పుల్లను పెడితే నీడ ఏ అంకెపై పడుతుందో అదే అప్పటి సమయం, గడియారం చూసుకొనఖ్ఖర లేదు.
13) చెన్నైనుంచి తిరుపతి వెళ్ళే దారిలో నాగలాపురం వద్ద వేదనారాయణస్వామి కోవెలలో మూలవిగ్రహం శిరస్సునుంచి నడుమువరకు మానవఆకారం నడుమునుంచి పాదములవరకు మత్స్యఆకారంలో వుంటుంది.
14) ధర్మపురి(తమిళనాడు)పక్కన పదుహారు అంటే పదిమైళ్ళదూరంలో అభీష్టవరదస్వామీ అనే విష్ణుగుడిలో నవగ్రహములు స్త్రీ రూపముతో ఉంటారు.
15)ద్వాదశం రాశుల పై సూర్య కిరణ ప్రసారం..-శృంగేరి, కర్ణాటక రాష్ట్రం లో పడమటి కనుమలలో వున్న దివ్య క్షేత్రమే శృంగేరి . ఋష్య శృంగ మహర్షి పావనం చేసిన ప్రదేశం . శృంగ గిరే శృంగేరి గా మారింది.
ఆది శంకరాచార్యులు ఇక్కడ శారదా పీఠం నెలకొల్పారు . శారదాలయానికి కుడి ప్రక్కన విద్యా శంకరాలయం వుంది. శ్రీ విద్యారణ్య స్వామి గురువు శ్రీ విద్యా శంకరులు..105 సంవత్సరాలు పీఠాది పత్యం వహించిన పుణ్య పురుషులు.
అందుకని శిష్యుడు కృతజ్ఞత గా ఈ ఆలయాన్ని కట్టించారు . ఇది 1338 లో నిర్మితమైంది . ఇక్కడ ముఖ మండపం లో 12 రాతి స్తంభాలున్నాయి.ఇవి 12 రాశుల పేర్లతో వుంటాయి . సూర్యుడు ఏ రాశి లో ప్రవేశిస్తే , ఆ పేరు గల స్థంభం మీద ఆ రోజున సూర్య కిరణాలు పడటం ఇక్కడ విశేషం . ఖగోళ ,జ్యోతిష ,గణిత ,వాస్తు శాస్త్రాలలో అపూర్వ పాండిత్యం గల శిల్పులు మలచిన అద్భుత విన్యాసం . స్తంభాల పై సింహం ఆకారం లో జీవ మృగ మూర్తులున్డటం విచిత్రం . వాటి నోటిలో వ్రేలాడే రాతి బంతులు , పై కప్పు నుంచి వేలాడే రాతి గొలుసులు , అన్నీ ఒకే శిలతో నిర్మింపబడి ఉండటం ఆశ్చర్యకరం ఆలయం బయట గోడలు కోణాలు ,కోణాలుగా చెక్కబడి వుండటం ఇంకో విచిత్రానుభూతి . పొడవైన రాతి పలకలు ప్రక్క ప్రక్కగా నిలబెట్టి అతికించినట్లు గా అనిపిస్తుంది . ఇక్కడి శిల్ప సంపద అసదృశం గా వుంటుంది . 16)శైవ జైన వైష్ణవ సామరస్యానికి ప్రతీక ధర్మస్థల.
16) కర్ణాటకలో మంగుళూరు నుంచి ౪౦ కి.మీ.దూరంలో వున్న చిన్న గ్రామమే ధర్మ స్థలి . ఇక్కడి శివుడు మంజునాధుడు . పూజారులు రాజా కుటుంబాలకు చెందిన వైష్ణవులు . ఆలయ నిర్వాహకులు జైనులు . ఇదీ ఇక్కడి విశేషం . మత సామరస్యానికి ఒక గొప్ప ఉదాహరణ ధర్మస్థలం .
మంజు అంటే కన్నడం లో మంచు అని అర్ధం . శివుడు మంచు పర్వతమైన కైలాసగిరి పై ఉంటాడు కనుక ఆ పేరు. ”వాడి రాజా తీర్ధులు ”అనే వైష్ణవ స్వామి స్వయం గా ఇక్కడ లింగ ప్రతిష్ట చేశారు . దేవ రాజ హేగ్గడే అనే జైన మతస్తుడు మొదటగా విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు తెలుస్తోంది. ”కుడుము ”అనే పేరు వున్న ఈ గ్రామం క్రమం గా ధర్మస్థలి అనే పేరుగా మార్పు చెందింది . జైన దేవుని అతి పెద్ద విగ్రహం అత్యాకర్షణీయం గా ఇక్కడికి దగ్గరలో శ్రావణ బెల్గోలా లో వుండటం మరో వింత . నిజాయితీ కి మారు పేరు ధర్మ స్థలి . దొంగతనం అనేది వుండదు . ఎక్కడ పడేసిన వస్తువులు అక్కడే ఎంత కాలమైనా వుంటాయి . అందుకే ఆ పేరు వచ్చింది .
17)విరూపాక్ష దేవాలయం హంపి వద్ద ఉంది. ఇది కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నుండి 350 కిలో మీటర్ల దూరంలో ఉంది. విరూపాక్ష అనగా శివుని రూపం. ఈ దేవాలయానికి 3 ప్రాకారాలు ఉన్నాయి. 9 ఖానాలతో 50 మీటర్ల ఎత్తు ఉన్న తూర్పు గోపురములోని రెండు ఖానాలు రాతితో నిర్మించబడ్డాయి. మిగతా 7 ఖానాలు ఇటుకలతో నిర్మించబడ్డాయి. ఈ తూర్పు గోపురం నుండి లోపలికి ప్రవేశిస్తే బయటి నుండి ఆలయంలోకి వెళ్ళే మొదటి ప్రాకారం స్తంభాలు లేకుండా ఆకాశం కనిపించేటట్లు ఉంటుంది. ఈ ప్రాకారాన్ని దాటి లోపలికి వెళ్తే స్తంభాలతో కూడి కప్పబడిన వసారా ఉంటుంది. స్తంభాలతో కూడి ఉన్న వసారాలో చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి. దీనిని కూడా దాటి లోపలి ప్రాకారంలోకి వెళ్ళితే గర్భ గుడి వస్తుంది.
18) తుంగభద్రనది నుండి ఒక చిన్న నీటి ప్రవాహం ఆలయంలోకి ప్రవేశించి గుడి వంటగదికి నీరు అందించి బయటి ప్రాకారం ద్వారా బయటకు వెడుతుంది. విరూపాక్ష దేవాలయంలోని బయటి ప్రాకారంలో ఏకశిలలో చెక్కబడిన నంది ఒక కి.మీ. దూరం వరకు కనిపిస్తుంది.
గర్భాలయానికి వెనుక, బయటకు వెళ్లడానికి మెట్లదారి ఉంది. అక్కడ పది మెట్లు ఎక్కగానే, కుడి వైపు ఒక చీకటి గది ఉంది. ఆ గదికి తూర్పు వైపున 7 అడుగుల ఎత్తులో ఒక రంధ్రం ఉంది. అందులో నుండి వెలుతురు వచ్చి ఎదురుగా ఉన్న గోడ పై పడి బయట ఉన్న రాజ గోపురం నీడ తల క్రిందులుగా చాల స్పష్టంగా కనబడుతుంది. దాని కెదురుగా ఒక తెల్లని గుడ్డ అడ్డం పెడితే దాని మీద కూడా ఆ గోపురం ప్రతి బింబం కనబడుతుంది. అందరూ దీన్ని చాల వింతగా చూస్తుంటారు. ఆ వస్తున్నది సూర్య కిరణాలు కాదు, కేవలం వెలుగు మాత్రమే. ఈ వింత బయట వెలుగు ఉన్నంత సేపు ఉంటుంది. ఇలా మనకు తెలియని , తెలిసినా పట్టించుకోకుండా గొప్పగా చెప్పుకోనివి ఇంకా ఎన్నో ప్రత్యేకతలు పూర్వకాలంలో ఆగమవిధానంగా కట్టిన దేవాలయాలు వున్నాయి.
Happy Maha Shivratri Wishes, Status, Quotes, Wallpapers, Messages, and Greetings
Source – గురు భక్తి – Guru Bhakthi Facebook
Largest Hindu Temples in the world………!! The uniqueness of our temples..
Our ancestors are very great Vedic knowledge The ones who have..
We, their descendants, must be proud of this, elders were builders who had a speciality in building temples (cows,eggs) in ancient times. But each cowel had its own speciality. Let’s see some for example.
1) Without a festival idol, the original idol will come out to the streets. Chidambaram Natarajaswamy.
2) Airavateswara Swamy temple in Kumbakonam is located in a village called Tarasuram. The craftsmanship there is so majestic. If you see from one pillar, you will know that the war is on the verge of valisugrivalu At a distance, in another pillar, it is carved as if Rama was an archer.
What is great in this is that if you see from the first pillar, you cannot see Sri Rama but.. If you see from the second pillar, you can clearly see the war of Valisugriva.
3) Dharmapuri (Tamil Nadu) Mallikarjunaswamy Kovelona Vanga Mantapam means nine pillars hall. In this, two pillars look like they are hanging in the air, not happy on the ground.
4) Kadamba Vananadhaswamy Kovela in a village called Kulitthalai near Karur (Coimbatore) Two Nataraja statues are decorated in the same hall.
5) Gurudu with four hands (hands) in two of them with conch chakras, near Kumbakonam Velliyam temple Only in the village temple.
6) In the scam, Vishnu temple is there in a place called Nachiyarkovil. There Garudavahana made of stone is in the presence of Swami. That’s a weight 4 people can carry. But gradually, I will not come out one by the time 8,16,32 comes out, the weight of 64 people will be lifted. When you go into the temple of Swamy, the weight will be reduced in the same way. By the time you come out to the street, you will have to sweat for the Garuda statue Just a weirdo.
7) Ramanujula temple is there in a place called Sriperumbudur near Chennai. Statue in there basement not rock Not a statue of the five but only Saffron flower is made of yellow karpuram herbs, isn’t it amazing.
8)In Vishwanathaswamy temple along with Nityakalyani on the way to Tirunelveli Kadayam A palm tree is a land tree. That tree will have fruits in Lingakaram.
How British Destroyed India’s Temple Connection to Education
Get FREE Energized Rudraksha Diksha Pack at Home from Sadhguru Isha Foundation
9) There is a temple of God in a place called Thirunalluru near the scam. There Shiva Lingam is changing into five colors per day. That is why that Kovelani Panchavarneswara Kovel So called as.
10) Nandi will not have horns and ears in Tava (Tapas) Nandeeswara’s Kovela in a village named Dhanpudur next to Virudunagar.
11) In Andhra Pradesh Samarlakota, there is a big statue of Anjaneya in the three streets society. The specialty of this is Anjaneya statue eyes Sri Rama’s feet being at the same height in Bhadrachala Sri Rama temple.
12) Half moon in a pillar in a village called Viripuram near Velore Numbers carved from one to six, six to twelve, If we keep a pickle from the top tooth, the shadow falls on which number, that is the time, not looking at the clock.
13) On the way from Chennai to Tirupati, the main idol of Vedanarayanaswamy at Nagalapuram is in the shape of a fish from head to waist.
14) Next to Dharmapuri (Tamil Nadu), fifteen means ten miles away, in the Vishnu temple called Abhishthavaradaswamy, nine planets in the form of a woman.
15) Sun rays broadcast on twelve zodiac signs.. -Sringeri is the divine place in the western Kanumala of Sringeri, Karnataka state. The place where Rishya Srunga Maharshi performed pavanam. Sringagire has become Sringeri. Adi Shankaracharya established Sharada Peetam here. Vidya Shankaralayam is located right beside Saradalayam.
Sri Vidyaranya Swamy teacher Sri Vidya Shankararu.. He held the chair for 105 years Men of virtue. So the disciple built this temple out of gratitude. This one was built in 1338. There are 12 stone pillars in the front porch here. These will be with the names of 12 zodiac signs. Sun enters in which zodiac sign, The speciality here is that the sun’s rays are falling on the pillar with that name on that day. A wonderful work of sculptures with unique knowledge in Astrology, Astrology, Mathematics, Architecture.
It is strange that there are lion shaped animal figures on the pillars. Balls of rock floating in their mouths, Stone chains hanging from the top cup, It is amazing that all are built with the same stone. The walls outside the temple are in corners and corners. Being carved is another weird feeling. Looks like the tall slabs of rock are glued together. The wealth of sculpture here is unmatched.
16) Dharmasthala is the symbol of harmony of Shiva Jaina Vaishnava. From Mangalore to 2019 in Karnataka. Thank you for your support. The small village in the distance is the place of Dharma. Here Shiva is Manjunathu. Priests are Vaishnavas belonging to Raja families.Temple administrators are Jains.This is something special right here.Dharmasthalam is a great example of religious harmony. Manju means Manchu in Kannada. Lord Shiva lives on the mountain of ice, Kailasagiri, so that name.
Vaishnava swamy himself has established a linga here. It is known that Devaraja Heggade was the first to install an idol. This village named “Kudumu” regularly
It has been changed as Dharmasthali.
The biggest statue of Jaina god is very attractively located near here in Sravana Belgola Another one of the weirdos. Dharmasthali is another name for honesty.
There is no such thing as theft. Objects will stay there forever wherever they are thrown. That’s why the name came from.
17) Virupaksha temple located at hampi. This is from Bangalore in Karnataka state 350 kilometers away from here. Virupaksha means the form of Lord Shiva. This temple has 3 types. Two canals of the 50-meter high eastern tower with 9 canals are built of stone. The other 7 channels are built of bricks.
Entering from this eastern tower, the first exit to the temple from the sky appears without pillars. Passing this type and entering will have a wasara covered with pillars. Small temples will be there in the Vasara with pillars. If you go beyond this and go inside The temple of the womb is coming.
A small stream of water from Tungabhadranadi enters the temple and supplies water to the temple kitchen and flows out through the outside. Nandi carved in Ekasi according to the outside of Virupaksha temple. Thank you for your support. Can be seen from a distance. Behind the uterus, stairway to exit. Ten steps up there, to the right is a dark room. 7 feet tall to the east of that room There is a hole in it.
The light comes from that and falls on the wall in front and the shadow of the royal tower outside Upside down is pretty clear. If a white cloth is placed on its side, every image of that tower can be seen on it. Everyone finds this so weird. That’s not the sun rays coming, There is nothing but light.
This wonder will last as long as there is light outside. There are temples built in ancient times which we don’t know, even if we know, we don’t care about it, but we don’t boast about it.
Happy Maha Shivratri Wishes, Status, Quotes, Wallpapers, Messages, and Greetings