Kids Funny Story Telugu | iiQ8 ఏడుగురు మూర్ఖులు (నవ్వుల్లో ముంచెత్తే జానపద హాస్య కథ)

Kids Funny Story Telugu

 

ఏడుగురు మూర్ఖులు (నవ్వుల్లో ముంచెత్తే జానపద హాస్య కథ) Kids Funny Story Telugu
*****************************

ఒకూర్లో ఒక రాజుండేటోడు. ఆయనకొక రోజు మూర్ఖులంటే ఎట్లా వుంటారో చూడాలి అనిపించింది. వెంటనే మంత్రిని పిలిపించి “మంత్రీ! మంత్రీ! నాకు మూర్ఖులు ఎట్లా వుంటారో చూడాలని వుంది. నువ్వెట్లాగైనా సరే వచ్చే నెల ఒకటో తేదీ సాయంత్రానికల్లా ఏడుమంది మూర్ఖులని పట్టుకోని నా దగ్గరికి తీస్కోని రావాల” అన్నాడు.

రాజు చెప్పినాక చేయాల గదా… మంత్రి లోపల్లోపల గొణుక్కుంటా మూర్ఖుల కోసం బైలుదేరినాడు. అట్లా వెదుకుతా పోతావుంటే దారిలో ఒకడు చెట్టు కింద ఏందో వెదుకుతా కనబన్నాడు.
మంత్రి వాని దగ్గరికి పోయి “ఏంరా… ఏం పోయింది? ఎందుకు వెదుకుతా వున్నావు” అనడిగినాడు.

దానికి వాడు “నా పెండ్లినాడు మా అత్త పెట్టిన బంగారు ఉంగరం పడిపోయింది. దాని కోసం వెదుకుతా వున్నా” అన్నాడు. అప్పుడా మంత్రి “అట్లాగా! ఉంగరం యాడ పడిపోయింది’ అనడిగినాడు. దానికి వాడు దూరంగా వేలు చూపిస్తా “ఇదిగో అక్కడ ముండ్లకంపల్లేవూ. దాండ్లల్లో పడిపోయింది” అన్నాడు. దానికి మంత్రి ఆచ్చర్యపోతా ఉంగరం అక్కడ ముండ్ల కంపలల్లో పడిపోతే, మరి నువ్వేమి ఇక్కడ చెట్టు కింద వెదుకుతా వున్నావ్’ అనడిగినాడు.

దానికి వాడు కోపంగా “అక్కడంతా ముల్లులు ఎట్లా వున్నాయో చూడు. దానికి తోడు ఎండ సుర్రుమంటోంది. ఆ ఎండలో ముండ్ల మధ్య వెదకడం కన్నా చల్లగా ఈ చెట్టు నీడన వెదకడం మేలు గదా” అన్నాడు.
వస్తువు పోయిన చోట వెదుక్కోకుండా వేరొకచోట వెదుకుతా వున్న వాన్ని చూసి మంత్రి “హమ్మయ్య! ఒక మూర్ఖుడు దొరికినాడు” అని లోపల్లోపల నవ్వుకోని “వచ్చే నెల ఒకటో తేదీ సాయంత్రం రాజభవనానికి రా, రాజుకి నీ తెలివితేటల గురించి చెప్పి ఇంతకంటే మంచి ఉంగరమిప్పిస్తా” అన్నాడు. వాడు సరేనని తలూపినాడు.

మంత్రి ఇంగో మూర్ఖుని కోసం వెదుకుతా పోసాగినాడు. అట్లా పోతా వుంటే ఒకడు నెత్తిన గడ్డిమోపు పెట్టుకోని, గుర్రమ్మీద కూచోని వస్తా కనబడినాడు. అది చూసి మంత్రి అచ్చర్యపోయి “గడ్డిమోపు గుర్రమ్మీద పెట్టుకోని రాకుండా నెత్తిమీద పెట్టుకోని వస్తా వున్నావ్ ఏంది సంగతి” అని అడిగినాడు.




Tenali Ramakrishna Stories in Telugu, Thaatha, oothuna, తాతా, ఊతునా? iiQ8

 

దానికి వాడు “ఏం చెయ్యమంటావ్ మహామంత్రీ! గుర్రం ముసలిదయిపోయింది. నన్ను మోయడానికే దానికి శక్తి లేదు. ఇంక గడ్డిమోపునేం మోస్తాది. అందుకే దాని మీద బరువు పెట్టకుండా నేనే గడ్డిమోపు మోస్తా వున్నా” అన్నాడు.

గడ్డిమోపు నెత్తి మీద పెట్టుకున్నా గుర్రమ్మీద పెట్టుకున్నా ఒకటే అని తెలియని వాడి మూర్ఖత్వానికి మంత్రి ఆచ్చర్యపోయి హమ్మయ్య మరో మూర్ఖుడు దొరికినాడని లోపల్లోపల నవ్వుకోని “వచ్చేనెల ఒకటో తేదీ సాయంత్రం రాజభవనానికి రా, నీ మంచితనం గురించి చెప్పి రాజుతో మంచి బహుమానమిప్పిస్తా” అన్నాడు. వాడు సరే అని తలూపినాడు.

మంత్రి మూడో మూర్ఖుని కోసం వెదుకుతా పోసాగినాడు. అట్లా పోతావుంటే ఒకరోజు ఒకచోట ఇద్దరు కిందా మీదా పడి కొట్టుకుంటా కనబన్నారు. అది చూసి మంత్రి వురుక్కుంటా పోయి వాళ్ళిద్దరినీ విడిపిచ్చి “ఎందుకట్లా కొట్లాడుకుంటా వున్నారు? ఏంది మీ బాధ” అనడిగినాడు.
దానికి ఒకడు కోపంగా “చూడు మంత్రీ! వీడు నా బంగారంలాంటి ఆవును చంపుతానంటున్నాడు” అన్నాడు. మంత్రి రెండోవానివైపు చూసేసరికి వాడు కోపంగా “ఆ దొంగ సచ్చినేది నా తోటంతా తిని పాడు చేస్తావుంటే ఎట్లా వూరుకునేది. అందుకే చంపుతానంటున్నా” అన్నాడు.
మంత్రి కాసేపాలోచించి “ఇంతకీ నీ తోట యాడుంది” అన్నాడు. దానికి వాడు “తోటనా ఇంగా ఎయ్యలేదు గదా” అన్నాడు.

 

Kids Moral Story Lion and Fox | iiQ8 Telugu Neethi Kathalu సింహానికి ఆకలేసింది…పక్కనే ఉండే నక్కను

ఆ మాటలకు మంత్రి ఆచ్చర్యపోయి, రెండోవానికెళ్ళి తిరిగి “మరి నీ ఆవేది” అన్నాడు. దానికి వాడు “ఇంగా కొనలేదు గదా” అన్నాడు. మంత్రి ఆ మాటలకు మరింత ఆచ్చర్యపోయి “నువ్వు తోటా ఎయ్యలేదు. వాడు ఆవూ కొనలేదు. మరెందుకు ఇద్దరూ కొట్లాడుకుంటా వున్నారు” అనడిగినాడు. దానికి ఒకడు “నేను మా యింటి పక్కనే తోట ఎయ్యాలనుకుంటా వున్నా, వానిది మా పక్కిల్లే. వాడు ఆవును కొనాలి అనుకుంటా ఉన్నాడు. రేప్పొద్దున ఆ ఆవు పక్కనే వుంది గదా అని నా తోటలోనికి వచ్చి పాడు చేస్తాది గదా” అన్నాడు. వాళ్ళిద్దర్నీ చూసి మంత్రి లోపల్లోపల నవ్వుకోని హమ్మయ్య ఈసారి ఏకంగా ఇద్దరు మూర్ఖులు దొరికినారని సంబరపడి “వచ్చే నెల ఒకటో తేదీ సాయంత్రం రాజభవనానికి రాండి. రాజుకి చెప్పి మీ తగవు తీరుస్తా” అన్నాడు. వాళ్ళు సరేనని తలలూపినారు. Kids Funny Story Telugu

 

మంత్రి ఐదో మూర్ఖుని కోసం వెదుకుతా పోసాగినాడు. అట్లా పోతావుంటే ఒకచోట ఒకడు ఏడుస్తా ఆకాశం కేసి చూస్తా కనబడినాడు. మంత్రి వాన్ని చూసి “ఎందుకట్లా ఆకాశంలో వెదుకుతా ఏడుస్తా వున్నావు? ఏంది నీ బాధ” అనడిగినాడు.

దానికి వాడు ఏడుస్తా “ఏం చెప్పమంటావు మహామంత్రీ! పోయిన్నెల నా మిత్రుడొకడు తీర్థయాత్రలకని పోతా పోతా దాచి పెట్టమని ఒక చెంబు నిండా బంగారు వరహాలిచ్చి పోయినాడు. రాత్రిపూట ఏ దొంగలో వస్తే కష్టంగదా… అందుకని అర్ధరాత్రి ఎవరూ చూడకుండా ఈ అడవిలో ఒక గుంత తీసి దాచిపెట్టినా. యాడ దాచిపెట్టినామో గుర్తు పెట్టుకోవాల గదా, అంతా వెతికితే సరిగ్గా గుంత పైన్నే ఒక నల్లమేఘం పెద్దది కనబడింది. దాన్ని గుర్తు పెట్టుకున్నా. నా మిత్రుడు వచ్చేది రేపే. వాని చెంబు వానికిద్దామని ఈడికొచ్చి చూస్తే ఆ మేఘం యాడా కనబడ్డం లేదు. ఎవడో వరహాలతో బాటు మేఘాన్ని గూడా ఎత్తుకొని పోయినట్టున్నాడు. అందుకే యాడన్నా కనబడతాదేమోనని వెదుకుతా వున్నా” అన్నాడు.

 

Kids Funny Story Telugu

 

When Tenali Raman was Blessed by Goddess Kali, Sanaatan Tales




ఆ మాట విన్న మంత్రి “ఎవడైనా గాలికి చెదిరిపోయే మేఘాన్ని గుర్తు పెట్టుకుంటాడా మూర్ఖుడు కాకపోతే” అని లోపల్లోపల నవ్వుకోని “వచ్చే నెల ఒకటో తేదీ సాయంత్రం రాజభవనానికి రా, రాజుకి చెప్పి నీ చెంబూ, బంగారం నీకిప్పిస్తా” అన్నాడు. వాడు సరేనని తలూపినాడు.
ఒకటో తేదీ సాయంత్రానికి వాళ్ళంతా రాజభవనానికి చేరుకున్నారు. మంత్రి వాళ్ళు చేసిన పనులన్నీ ఒకొక్కటే వివరించి చెబుతా వుంటే రాజు వాళ్ళ మూర్ఖత్వానికి కిందామీదా పడి నవ్వినాడు.

ఆ తర్వాత రాజు వాళ్ళందరినీ లెక్కబెట్టి “అవునూ… నేను ఏడుమంది మూర్ఖులను తెమ్మంటే… నువ్వేంది. ఐదుమందినే పట్టుకోనొచ్చినావు” అనడిగినాడు.

దానికి మంత్రి “నువ్వేమీ అననని మాటిస్తే మిగతా ఆ ఇద్దరిని కూడా చూపిస్తా రాజా” అన్నాడు. సరేనని రాజు మాటిచ్చినాడు.

అప్పుడు మంత్రి “ఆ మిగతా ఇద్దరూ ఎవరో కాదు మహారాజా! నువ్వూ, నేనూ” అన్నాడు. దానికి రాజు ఆచ్చర్యపోతూ “మనిద్దరమా? అదెట్లా” అన్నాడు.

అప్పుడు మంత్రి “చూడు రాజా! ఈ దేశాన్ని పరిపాలించాల్సింది నువ్వూ నేనే గదా. మనం ప్రజల గురించి, వాళ్ళ బాగోగుల గురించి ఆలోచించాల గానీ ఇట్లా మూర్ఖుల గురించి ఆలోచిస్తే ఎట్లా? నెలరోజులపాటు పరిపాలన గాలికి వదిలేసి మూర్ఖులను పట్టుకొని రమ్మన్న నువ్వొక మూర్ఖునివి. నువ్వు అట్లా చెప్పడం ఆలస్యం మారు మాట్లాడకుండా సరేనంటూ అన్నీ వదిలేసి బైలుదేరిన నేనొక మూర్ఖున్ని నిజమా కాదా” అన్నాడు.

ఆ మాటలకు తప్పు తెలుసుకున్న రాజు చిరునవ్వుతో మంత్రి భుజం తట్టి మెచ్చుకున్నాడు.
*****************************

కథ నచ్చితే *SHARE* చేయండి. Kids Funny Story Telugu | iiQ8 ఏడుగురు మూర్ఖులు (నవ్వుల్లో ముంచెత్తే జానపద హాస్య కథ)

Kids Funny Story Telugu | iiQ8 ఏడుగురు మూర్ఖులు (నవ్వుల్లో ముంచెత్తే జానపద హాస్య కథ)

Kids Funny Story Telugu | iiQ8 ఏడుగురు మూర్ఖులు (నవ్వుల్లో ముంచెత్తే జానపద హాస్య కథ)

#Laddu #Telugustories #MoralStories #telugustories #SHARING #kathalu #LifeStories #తెలుగుకథలు #stories #pedaraasipeddamma #పేదరాశిపెద్దమ్మ

 

Seven fools (folk comedy story that will make you drown in laughter)
*****************************

Once upon a time there was a king. I wanted to see how he would be with fools. Immediately called the minister and said “Minister! The Minister! I want to see how stupid people are. Whatever you are, he said, don’t catch seven fools and take them to me on a date evening of next month.

Should be done after Raju says… The minister is going out for the sake of fools. If you are going to search like that, someone on the way was searching for something under the tree.

Went to the minister and said “what man… What’s lost? “Why are you searching” he asked.

For that he said “My wife is married, the golden ring that my aunt kept has fallen. He said, “I am looking for it”. That’s it minister “like that! The ring has fallen off’ he said. I will point my finger to him from far away “here and there are Mundlakampal. He said it fell into the rails. The minister was surprised that if the ring falls in the thorns, then what are you looking for here under the tree’ he asked.

He was angry at that “look how thorns are all over there. The sun is accompanied by it. It is better to search under the shade of this tree than to search among the thorns in that hot sun” he said.

Minister said “Hammayya!” after seeing the person who is searching somewhere else instead of searching for the lost item A fool has been caught” laughed inside and said “come to Rajabhavan on the evening of next month, I will tell the king about your wisdom and give you a ring better than this”. He found out he was ok.

Minister Ingo searched for the fool. If I was going like that, one was seen with a grass snake on his head and riding on a horse. Minister was surprised to see that and asked “I will come with grass on head instead of coming with grass on horse, what’s the matter”.

For that he said “What do you say to do Mahamantri! The horse is getting old. It has no strength to carry me. Now what will the grass mopuncher carry. That’s why I am the one who is mowing grass instead of putting any weight on it” he said.

The minister was surprised by the foolishness of the man who did not know whether a grass mower is on the head or a horse is the same. He laughed inside and said “Come to the Rajabhavan on one of the next month evening, I will tell about your goodness and give you a good gift with the king”. He found out he was ok. Kids Funny Story Telugu | iiQ8 ఏడుగురు మూర్ఖులు (నవ్వుల్లో ముంచెత్తే జానపద హాస్య కథ)




Tenali Ramakrishna Stories in Telugu, Kapi – Kavi, కపి-కవి

 

The minister has searched for the third fool. If you are going like that, one day two people were seen hitting on the ground or on the ground. Minister would have shrunk seeing that and made both of them mad and “why are you fighting? “What is your problem” he said.

One angry at that “see minister! He says he will kill my golden cow” When the minister looked at the second person, he angrily said “That thief is dead, if you eat my whole garden and spoil it, how would it be possible. He said, “that’s why I will kill”.

The minister thought for a while and said “by the way your garden has grown”. For that he said “The garden has not grown here right?”

Minister was surprised by those words, went to the second person and said “What about you?” And he said “didn’t buy it here, right?” Minister was more surprised by those words “You did not grow the garden. He didn’t even buy a cow. Why are both fighting” he asked. One said “I want to plant a garden next to my house, it’s next door. He wants to buy a cow. Tomorrow morning that cow will be beside me, will it come to my garden and spoil me” he said. The minister who did not laugh at both of them, celebrated that two fools were caught at the same time, “Come to the Rajabhavan on the evening of next month. He said that I will solve your hunger by telling the king. They nailed it right.

The minister has searched for the fifth fool. If you go like that, I will cry somewhere, I will look at the sky and he is seen. Looking at the minister, “Why are you crying in the sky? “What is your problem” he said.

I will cry for that “What do you want to say Mahamantri! Yesterday, one of my friends gave me a golden rug to hide the pilgrims. Isn’t it difficult to come in any thief at night… That is why I dug a hole in this forest and hid it in the middle of the night. Should remember if we have hidden it, if we searched everything, we found a big black cloud just above the hole. Just remembered that. My friend is coming tomorrow. When he came to see that the cloud is not visible at all. Looks like someone has taken the cloud of the path with the floods. That’s why I am searching for Yadanna to be seen” he said. Kids Funny Story Telugu | iiQ8 ఏడుగురు మూర్ఖులు (నవ్వుల్లో ముంచెత్తే జానపద హాస్య కథ)

The minister who heard that word, “If not a fool, will anyone remember the cloud scattered in the air” laughed inside and said, “Come to the Rajabhavan on the evening of the next month, tell the king and I will give you your gold and gold”. He found out he was ok.

On a date evening, they all reached the Rajabhavanam. If I was explaining all the works done by the ministers one by one, the king laughed at their stupidity.
After that, the king counted all of them and said “Yes… If I bring seven fools… what are you. He said, “You have come to catch only five people.”

 

Kids Moral Story Lion and Fox | iiQ8 Telugu Neethi Kathalu సింహానికి ఆకలేసింది…పక్కనే ఉండే నక్కను

For that minister said “if you talk that you will not say anything, I will show those two also Raja”. The king has spoken ok.

Then minister “Those other two are not anyone Maharaja! He said you and me”. The king is wondering at that “is it human? He said like that”.

Then minister “see raja! I am the one who should rule this country. We have to think about people and their good people, but what if we think about fools like this? You are a fool who said to leave the administration to the wind for a month and catch the fools. You are late to say like that, instead of talking, I am a fool, who left everything and went out saying that it is okay, is it true or not?

The king who understood the mistake of those words, with a smile, the minister tapped his shoulder and appreciated.




*****************************

*SHARE* if you like the story. Kids Funny Story Telugu | iiQ8 ఏడుగురు మూర్ఖులు (నవ్వుల్లో ముంచెత్తే జానపద హాస్య కథ)
#Laddu #Telugustories #MoralStories #telugustories #kathalu #LifeStories #తెలుగుకథలు #stories #pedaraasipeddamma #పేదరాశిపెద్దమ్మ Kids Funny Story Telugu | iiQ8 ఏడుగురు మూర్ఖులు (నవ్వుల్లో ముంచెత్తే జానపద హాస్య కథ) Kids Funny Story Telugu | iiQ8 ఏడుగురు మూర్ఖులు (నవ్వుల్లో ముంచెత్తే జానపద హాస్య కథ) Kids Funny Story Telugu | iiQ8 ఏడుగురు మూర్ఖులు (నవ్వుల్లో ముంచెత్తే జానపద హాస్య కథ)

Durasha Dukhaniki Cheytu | iiQ8 Moral Stories దురాశ_దుఖఃమునకు_చేటు

Kids Funny Story Telugu | iiQ8 ఏడుగురు మూర్ఖులు (నవ్వుల్లో ముంచెత్తే జానపద హాస్య కథ)

Spread iiQ8