kethu graha dosham కేతుగ్రహ దోష నివారణకు వినాయకుడిని పూజించండి!
వినాయకుడిని పూజించడం వలన కార్యాలు సఫలీకృతం కావడమే కాకుండా, గ్రహ సంబంధమైన దోషాలు కూడా తొలగిపోతాయి.
వినాయకుడికి ప్రదక్షిణలు చేయడం వలన, కేతుగ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయని పురోహితులు అంటున్నారు.
కేతు గ్రహదోషాల నుంచి నివారణ లభించాలంటే మంగళవారం పూట వినాయకుడిని పూజిస్తే ఫలితం ఉంటుంది. కేతుగ్రహ దోషం వలన అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది.
అభివృద్ధిపరంగా అడుగుముందుకు పడకపోవడం … అందుకు సంబంధించి చేసే పనుల్లో అవమానాలు ఎదురుకావడం జరుగుతూ వుంటుంది.
Y O G A
ఇలాంటి పరిస్థితుల్లో గణపతిని అంకితభావంతో పూజించడం వలన, కేతువు శాంతిస్తాడని చెప్పబడుతోంది. ఎందుకంటే కేతు గ్రహానికి అధిష్ఠాన దేవతగా ‘గణపతి‘ వ్యవహరిస్తుంటాడు.
అందువలన కేతుగ్రహ సంబంధమైన దోషంతో బాధలుపడేవాళ్లు, గణపతికి ప్రదక్షిణలు చేస్తూ .. పూజలు చేస్తూ సేవించడం వలన ఆశించిన ఫలితం అందుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
Maha Mrityunjaya Mantra [108 times] – महामृत्युंजय मंत्र | Lyrics & Meaning, iiQ8
Help Line Number for Sabarimalai in Kerala, iiQ8 info, Shabari Malai Customer Care
Understand Gita in 18 Days, iiQ8 Devotional, Bhagavad Gita Online Course for FREE