Karthika Puranam Part 4, Deeparadhana Shatrujith Katha | కార్తీకపురాణం – 4 వ అధ్యాయం *దీపారాధన మహిమ – శతృజిత్ కథ*

Karthika Puranam Part 4, Deeparadhana Shatrujith Katha

 

Dear All, Karthika Puranam Part 4, Deeparadhana Shatrujith Katha

కార్తీకపురాణం – 4 వ అధ్యాయం *దీపారాధన మహిమ* *శతృజిత్ కథ*

ఈ విధముగా వశిష్టుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందెదరని చెప్పుచుండగా జనకుడు *’మహితపస్విత ! తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలది తనివి తిరకున్నది. కార్తీక మాసము ముఖ్యమైనవి యేమేమి చేయవలయునో , ఎవరి నుద్దేశించి పూజ చేయవలయునో వివరింపుడు’* అని కోరగా వశిష్టుల వారు యిట్లు చెప్పదొడగిరి.

జనకా ! కార్తీక మాసమందు సర్వ సత్కార్యములనూ చేయవచ్చును. దీపారాధన మందు అతి ముఖ్యము దీని వలన మిగుల ఫలము నొంద వచ్చును. సూర్యాస్తమయ మందు , అనగా , సంధ్య చీకటి పడు సమయమున శివకేశవులు సన్నిధినిగాని ప్రాకారంబునందు గాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంట ప్రాప్తి నొందుదురు. కార్తీకమాస మందు హరి హరాదులు సన్నిధిలో ఆవునేతితో గాని , కొబ్బరి నూనెతో గాని , విప్ప నూనెతో గాని , యేది దొరకనప్పుడు అముదముతో గాని దీపము వెలిగించి వుంచవలెను.

దీపారాధన యే నూనెతో చేసిననూ మిగుల పుణ్యత్ములుగాను , భక్తి పరులగాను నగుటయేగాక అష్టైశ్వర్యములూ కలిగి శివ సన్నిధి కేగుదురు. ఇందు కొక కథ గలదు, వినుము.

Karthika Puranam Part 4, Deeparadhana Shatrujith Katha

శతృజిత్ కథ :

పూర్వము పాంచాల దేశమును పాలించు చున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి , తుదకు విసుగుజెంది తీరమున నిష్ఠతో తపమాచరించు చుండగా నచ్చుటకు పికెదుడను ఇడీముని పుంగవుడు వచ్చి *’పాంచాల రాజా ! నివెందుల కింత తపమాచరించు చున్నావు ? నీ కోరిక యేమి?’* యని ప్రశ్నించగా , *’ఋషిపుంగవా ! నాకు అష్ఠ ఐశ్వర్యములు , రాజ్యము , సంపదావున్ననూ , నావంశము నిల్పుటకు పుత్ర సంతానము లేక , కృంగి కృశించి యీ తీర్ధ స్థానమున తపమాచరించు చున్నాను’* అని చెప్పెను.

అంత మునిపున్గావుడు *’ఓయీ ! కార్తిక మాసమున శివ సన్నిధిని శివ దేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన యెడల ని కోరిక నేర వేరగలదు’* యని చెప్పి వెడలిపోయెను.

వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడలి పుత్ర ప్రాప్తి కై అతి భక్తి తో శివాలయమున కార్తీక మాసము నెలరోజులూ దీపారాధన చేయించి , దాన ధర్మాలతో నియమను సారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు , విడువకుండా నెలదినములూ అటుల చేసెను. తత్పుణ్య కార్యమువలన ఆ రాజు భార్య గర్భవతియై క్రమముగా నవమాసములు నిండిన తరువాత నొక శుభ ముర్తుమున నొక కుమారుని గనెను.

రాజ కుటుంబికులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవములు చేయించి , బ్రాహ్మణులకు దానధర్మాలు జేసి , ఆ బాలునకు శత్రుజిత్ యని నామకరణ ము చేయించి అమిత గారాబముతో పెంచుచుండిరి. కార్తీకమాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు , దీపారాధనలు చేయుడని రాజు శాసించెను.

Karthika Damodara Masam | iiQ8 కార్తీక దామోదర మాసము




Karthika Puranam Part 4, Deeparadhana Shatrujith Katha

 

రాకుమారుడు శత్రుజిత్ దినదిన ప్రవర్థమానుడగుచు సకల శాస్త్రములు చదివి , ధనుర్విద్య , కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను. కాని , యవ్వనమునము రాగానే దుష్టుల సహవాసము చేతను , తల్లితండ్రుల గారాబము చేతను తన కంటి కింపగు స్రీలకు బలాత్కరించుచు , యెదిరించిన వారిని దండించుచు తన కామవాంఛా తిర్చుకోను చుండెను.

తల్లితండ్రులు కూడా , తమకు లేక లేక కలిగిన కుమారుని యెడల చూచి చూడనట్లు – విని విననట్లు వుండిరి. శత్రుజిత్ ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పు వారలను నరుకుదున ని కత్తి పట్టుకుని ప్రజలను భయకంపితులను జేయుచుండెను. అటుల తిరుగుచుండగా నొక దినమున నొక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను.

ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ భార్య మిగుల రూపవతి. ఆమె అందచందములను వర్ణించుట మన్మదునకైననూ శక్యము గాదు. అట్టి స్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కోయ్యబోమ్మవలె నిశ్చేష్టుడై కామవికరముతో నామెను సమీపించి తన కమవాంఛ తెలియచేసేను. ఆమె కూడా నాతని సౌదర్యానికి ముద్దురాలై కులము , శిలము , సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన శయన మందిరానికి తీసుకొనిపొయి భోగములను భావించెను.

ఇట్లు ఒకరికొకరు ప్రేమలో పరవశులగుటచేత వారు ప్రతి దినము నర్ద రాత్రివేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసు కొనుచు తమ కామవాంచ తీర్చు కొనుచుండిరి. ఇటుల కొంత కాలం జరిగెను. ఎటులనో యీ సంగతి ఆమె మగనికి తెలిసి , పసిగట్టి , బార్యనూ , రాజకుమారుని ఒకేసారిగా చంపవలయునని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను.

 

ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురు శివాలయమును కలుసుకొనవలెనని నిర్ణయించుకొని , యెవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి యెటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భ గుడిలో దాగి యుండెను. అ కాముకులిద్దరూ గుడిలో కలుసుకొని గాడాలింగన మొనర్చుకొను సమయమున ‘ చీకటిగా వున్నది, దీపముండిన బాగుండును గదా ,’ యని రాకుమారుడనగా , ఆమె తన పైట చెంగును చించి అక్కడ నున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగెంచెను.

 

Karthika Puranam Day 3, Karthika Maasa Snanam | కార్తీకపురాణం – 3 వ అధ్యాయము – కార్తీక మాస స్నాన మహిమ

 

తర్వాత వారిరువురూ మహానందముతో రతి క్రీడలు సలుపుటకు వుద్యుక్తులగుచుండగా , అదే యదనుగా నామె భర్త , తన మొలనున్న కత్తి తీసి ఒక్క వ్రేటుతో తన భర్యనూ , ఆ రాజకుమారుని ఖండించి తనుకూడా పొడుచుకుని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి , సోమవారమగుట వలనను , ఆ రోజు ముగ్గురునూ చనిపోవుట వలననూ శివదూతలు ప్రేమికులిరువురిని తీసుకొని పోవుటకునూ – యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకును అక్కడకు వచ్చిరి.

అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు ‘ ఓ దూతలార ! నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు ? కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన అ వ్యభిచారుల కొరకు శివ దూతలు విమానములో వచ్చుటేల ? చిత్రముగా నున్నదే ! అని ప్రశ్నించెను .

 

Karthika Puranam 2 Part, Somavara Vratha Mahima | కార్తీకపురాణం-2, వ్రత మహిమ, కుక్క కైలాసానికి వెళ్లుట

 

అంత యమకింకరులు *’ ఓ బాపడ ! ఎవరెంతటి నీచులైననూ , యీ పవిత్ర దినమున , తెలిసో తెలియకో శివాలయములో శివునిసన్నిదిన దీపం వేలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నియును నశింఛిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకొనిపోవుటకు శివధూతలు వచ్చినారు’* అని చెప్పగా – యీ సంభాషణ మంతయు వినుచున్న రాజకుమారుడు *’ అల యెన్నటికిని జరగనివ్వను.

తప్పొప్పులు యెలాగునున్నపటికి మేము ముగ్గురమునూ ఒకే సమయములో ఒక స్థలములో మరణించితిమి. కనుక ఆ ఫలము మా యందరికి వర్తించ వలసినదే ‘ అని , తాము చేసిన దీపారాధన ఫలములో కొంత అ బ్రాహ్మణునకు దానము చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమానమెక్కించి శివ సాన్నిద్యమునకు జేర్చిరి.

Karthika Puranam Part 4, Deeparadhana Shatrujith Katha – వింటివా రాజా ! శివాలయములో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు పాపములు పోవుటయేగాక , కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కాన , కార్తిక మాసములో నక్షత్రమాల యందు దీపముంచిన వారు జన్మరాహిత్య మొందుదురు.

*ఇట్లు స్కాంద. పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమందలి*
*నాలుగో అధ్యయము- నాల్గవ రోజు పారాయణము సమాప్తం.*

 

🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏

Karthika Puranam Part 4, Deeparadhana Shatrujith Katha

 

Karthika Puranam 1 Part, Karthika Maasa Vratha Vidhanam | కార్తీకపురాణం -1 వ అధ్యాయం, ర్తీక మాసం మహత్యం, కార్తీక మాస వ్రతవిధానం

Find everything you need.

 

Search Product, Service, Properties and items on a single site ShareMeBook.


Diwali Govardhan Pooja Importance, iiQ8 info గోవర్ధన్ పూజ పండుగ

Spread iiQ8

November 17, 2023 9:17 PM

248 total views, 1 today