Karthika Puranam Day 3, Karthika Maasa Snanam | కార్తీకపురాణం – 3 వ అధ్యాయము – కార్తీక మాస స్నాన మహిమ

Karthika Puranam Day 3, Karthika Maasa Snanam

 

Dear All, OM Namah Shivayah! Karthika Puranam Day 3, Karthika Maasa Snanam

కార్తీకపురాణం – 3 వ అధ్యాయము *కార్తీక మాస స్నాన మహిమ* *బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుగుట*

జనక మహరాజా ! కార్తీక మాసమున యే ఒక్క చిన్న దానము చేసిననూ , అది గొప్ప ప్రభావము గలదై వారికి సకలైశ్వర్యములు కలుగుటయే గాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు. కానీ , కొంత మంది

ఆస్థిరములైన భోగ భాగ్య ములు విడువలేక , కార్తీక స్నానములు చేయక , అవినీతి పరులై , భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి , కుక్క , పిల్లిగా జన్మింతురు.. అధమము కార్తీక మాస శుక్ల పార్ణమి రోజు అయిననూ స్నాన దాన జప తపాదులు చేయక పోవుట వలన ననేక చండాలాది జన్మ లెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టెదరు. దీనిని గురుంచి నాకు తెలిసిన యితిహాసమొకటి వినిపించెదను. సపరివారముగా శ్రద్దగా ఆలకింపుము.

*బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుగుట*

ఈ భారత ఖండ మందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామములో మహా విద్వాంసుడు , తపశాలి , జ్ఞానశాలి , సత్య వ్యాక్య పరిపాలకుడు అగు ‘ తత్వనిష్టుడు’ అను బ్రాహ్మణుడొక డుండెను. ఒక నాడా బ్రాహ్మణుడు తీర్ధ యాత్ర సక్తుడై అఖండ గోదావరికి బయలుదేరును.

 

ఆ తీర్ధ సమీపమున ఒక మహా వట వృక్షంబు పై భయంకర ముఖములతోను , దీర్ఘ కేశములతోను , బలిష్టంబులైన కోరలతోను , నల్లని బాన పొట్టలతోను , చూచువారుకి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచూ , ఆ దారిన పోవు బాట సారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంత మంతయు భయకంపితము చెయుచుండిరి.

 

Karthika Puranam 2 Part, Somavara Vratha Mahima | కార్తీకపురాణం-2, వ్రత మహిమ, కుక్క కైలాసానికి వెళ్లుట

 

తీర్ధ యాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్య క్షేత్రమున పితృ దేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు అ వృక్షము చెంతకు చేరుసరికి యథా ప్రకారము బ్రహ్మ రాక్షసులు క్రిందకు దిగి అతనిని చంపబోవు సమయమున , బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజ గజ వణుకుచూ యేమియు తోచక నారాయణ స్తోత్రం భిగ్గరగా పటించుచు ‘ ప్రభో ! ఆర్త త్రాణ పరాయణ ! అనాధ రక్షక ! ఆపధలోనున్న గజేంద్రుని , నిండు సభలో అవమానాలు పలగుచున్న మహాసాద్వి ద్రౌపదిని , బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే –

ఈ పిశాచములు బారినుండి నన్ను రక్షించు తండ్రీ ! అని వేడుకొనగా , ఆ ప్రార్ధనలు విన్న బ్రహ్మ రాక్షసులకు జ్ఞానోదయం కలిగి *’మహానుభావా ! మీ నోటినుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం అయినది మమ్ము రక్షింపుడు’* యని ప్రాదేయపడిరి.

 

Karthika Puranam Day 3, Karthika Maasa Snanam

 

వారి మాటలకూ విప్రుడు ధైర్యం తెచ్చుకొని *’ ఓయీ ! మీరెవరు ? ఎందులకు మీకి రాక్షస రూపంబులు కలిగెను ? మీ వృత్తాంతము తెలుపుడు’* అని పలుకగా వారు *’విప్ర పుంగవా ! మీరు పూజ్యులు , ధర్మాత్ములు , వ్రతనిష్టాపరులు , మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వ జన్మ మందలి కొంత జ్ఞానము కలిగినది.

ఇక నుండి మీకు మా వలన యే ఆపద కలగదు’* అని అభయమిచ్చి , అందొక బ్రహ్మ రాక్షసుడు తన వృత్తాంతము ఈవిదముగా చెప్పసాగెను.

 

నాది ద్రావిడ దేశం బ్రహ్మనుడను నేను మహా పండితుడనని గర్వము గలవాడినై యుంటిని. న్యాయాన్యాయ విచాక్షణలు మాని పసువునై ప్రవర్తించితిని , బాటసారుల వద్ద , అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా దానం లాగుకోనుచు , దుర్వ్యసనాలతో భార్య పుత్రాదులను సుఖపెట్టక , పండితులను అవమానపరచుచు , లుబ్దుడనై లోక కంటకుడిగ నుంటిని.

ఎట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా నాచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమర్ధన చేయు తలంపుతో పదార్ధ సంపాదన నిమిత్తము దగ్గరున్న

Karthika Puranam 1 Part, Karthika Maasa Vratha Vidhanam | కార్తీకపురాణం -1 వ అధ్యాయం, ర్తీక మాసం మహత్యం, కార్తీక మాస వ్రతవిధానం



నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చేను. వచ్చిన పండితుని నేను దూషించి , కొట్టి అతని వద్ద ఉన్న ధనము , వస్తువులు తీసుకోని ఇంటినుండి గెంటి వేచితిని. అందులకు విప్రునకు కోపము వచ్చి *’ఓరి నీచుడా ! అన్యక్రాంతముగ డబ్బు కూడా బెట్టినది చాలక , మంచి చెడ్డలు తెలియక , తోటి బ్రాహ్మణుడని గూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకొంటివి , నివు రాక్షసుడవై , నరభక్షకుడవై నిర్మానుష్య ప్రేదేశాములలో నుందువు’ గాక !* అని శపించుటచే నాకీ రాక్షస రూపము కలిగినది.

బ్రహ్మస్త్రమునైన తప్పించుకొవచ్చును కానీ బ్రాహ్మణ శాపమును తప్పించలేము గదా ! కాన నా అపరాదము క్షమింపుమని వారిని ప్రార్దించితిని.

 

అందులకతడు దయతలచి’ ఓయీ ! గోదావరి క్షేత్రమందొక వట వృక్షము గలదు. నివందు నివసించుటచే బ్రాహ్మణుడి వలన పునర్జన్మ నొందుదువు గాక’ అని వేడలిపోయాను. ఆనాటి నుండి నేని రాక్షస స్వరుపమున నరభక్షణము చేయుచుంటిని.

కాన , ఓ విప్రోతమ ! నన్ను నా కుటుంబము వారిని రక్షింపుమని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును జెప్పెను.

 

Image Karthika Puranam Day 3, Karthika Maasa Snanam

ఇక రెండవ రాక్షసుడు – ‘ ఓ ద్విజోత్త మా ! నేను కూడా పూర్వ జన్మలో బ్రహ్మనుడనే. నేను నీచుల సహవాసముచేసి తల్లితండ్రులను భాదించి వారికీ తిండి పెట్టక మాడ్చి అన్నమో రామచంద్రాయను నటులచేసి , వారి యెదుటనే నా బార్య బిడ్డలతో పంచభక్ష్య పరమన్నములతో భుజించుచుండేడివాడను.

 

నేను యెట్టి దానధర్మములు చేసి ఎరుగను , నా బంధువులను కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించితిని.

 

కావున , నాకీ రాక్షస సత్వము కలిగెను. నన్ని పాప పంకిలము నుండి ఉద్దరింపుము’ అని బ్రాహ్మణుని పాదములపై పడి పరి పరి విధముల వేడుకొనెను.

 

Pushpavathi Niyamalu, Mature function process, అమ్మాయి పుష్పవతి అయిన సమయములో చేయవలసినవి | iiQ8

మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును యిటుల తెలియ జేసెను. ‘ మహాశయా ! నేనొక సంపన్న కుటుంబములో పుట్టిన బ్రహ్మణుడను. నేను విష్ణు ఆలయములో అర్చకునిగా నుంటిని. స్నాన మైనను చేయక , కట్టుబట్టలతో దేవాలయములో తిరుగుచుండేడి వాడను భగవంతునికి ధూప దీప నైవేద్యము లైనను అర్పించక , భక్తులు గొనితేచ్చిన సంభావమును నా వుంపుడు గత్తెకు అందజేయుచు మద్యం మాంసము సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణనంతరము ఈ రూపము ధరించితిని , కావున నన్ను కూడా పాప విముక్తిని కావింపు’ మని ప్రార్ధించెను.

Karthika Puranam Day 3, Karthika Maasa Snanam- ఓ జనక మహారాజ ! తపోనిష్టుడగు ఆ విప్రుడు పిశాచములు దినలపము లాలకించి *’ఓ బ్రహ్మ రాక్షసులరా ! భయపడకుడు. మీరు పూర్వ జన్మలో చేసిన ఘోర క్రుథ్యంబులవల్ల మీకీ రూపములు కలిగెను. నా వెంట రండు మీకు విముక్తిని కలిగింతును’* అని , వారి నోదార్చి తనతో గొనిపోయి ఆ మువ్వురి చేతన విముక్తి సంకల్పము చెప్పుకొని తనే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్య ఫలమున ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు దారపోయగా

 

వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంటమున కేగిరి. కార్తిక మాసములో గోదావరి స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది , వారికీ సకలైశ్వర్యములు ప్రసాదించుదురు.

అందువలన , ప్రయత్నించి అయినా సరే కార్తీక స్నానాలను ఆచరించాలి.

*ఇట్లు స్కాంద పురాణాంతర్గత, వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య* *ముందలి*

*మూడవ అధ్యాయము -* *మూడవ రోజు పారాయణము సమాప్తము.*

🙏
Karthika Puranam Day 3, Karthika Maasa Snanam

Find everything you need.

 

Search Product, Service, Properties and items on a single site ShareMeBook.

Diwali Govardhan Pooja Importance, iiQ8 info గోవర్ధన్ పూజ పండుగ

Spread iiQ8

November 16, 2023 1:09 PM

202 total views, 1 today