Kalpavrukshamu Kashyapudu Khandavam, కల్పవృక్షము, కశ్యపుడు, ఖాండవం

పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు —
Kalpavrukshamu Kashyapudu Khandavam, కల్పవృక్షము, కశ్యపుడు, ఖాండవం
 
Kalpavrukshamu : కల్పవృక్షము —
కోరిన కోరికలు ఇచ్చే చెట్టు. ఇది దేవతలు దానవులు కలిపిచేసిన క్షీర సాగర మథనం సమయంలో పుట్టింది. దీనిని దేవతలకు రాజైన ఇంద్రుడు గ్రహిస్తాడు.
బహుళ ప్రయోజనాలున్న తాటి, కొబ్బరి మొదలైన కొన్ని చెట్లను కల్పవృక్షాలుగా పేర్కొంటారు.
కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన విశిష్టమైన పద్య కావ్యము రామాయణ కల్పవృక్షం అంటారు ..
 
kashyapuDu : కశ్యపుడు —
ప్రజాపతులలో ముఖ్యుడు. వాల్మీకి రామాయణం ప్రకారం బ్రహ్మ కొడుకు కొడుకు(మనమడు). ఇతనికి ఇరవైఒక్క మంది భార్యలు. వీరిలో దితి, అదితి, వినత, కద్రువ, సురస, అరిష్ట, ఇల, ధనువు, సురభి, చేల, తామ్ర, వశ, ముని మొదలైనవారు దక్షుని కుమార్తెలు.
ఇతనికి బ్రహ్మ, విషానికి విరుగుడు చెప్తాడు. పరశురాముడు ఇతనికి భూమినంతా దానం చేస్తాడు. ఇతనికి అరిష్టనేమి అనే పేరుంది.
 

Khandavam , ఖాండవం (వనము) :
ఇంద్రుని వనము . అగ్నిదేవుడు ప్రార్ధించగా కృష్ణార్జునులు దానిని అతనికి ఆహారము గా ఇచ్చారు .
 
కృపి ,Krupi :
మహాభారతంలోని పాత్ర. ఈమె కృపాచార్యుని సోదరి మరియు ద్రోణుని భార్య..
జననం–
శరధ్వంతుడు ఒక రాజు. ధనుర్విద్య ఇతనికి పుట్టుక తోనే ప్రాప్తించింది. కొంతకాలం తపస్సు చేసి అన్ని యుద్ధవిద్యల్లో ఆరితేరాడు. ధనుర్విద్యలో తిరుగులేని మహావీరుడైనాడు. ఇంద్రుడు అద్భుత సౌందర్య రాశియైన జలపది అనే దేవకన్యను ఆయన బ్రహ్మచర్యాన్ని ఆటంకపరచేందుకు నియమించాడు.
మహా సౌందర్యవతి అయిన ఆమెను చూచినదే సత్యధృతి చేతిలోని విల్లమ్ములు జారి క్రిందపడ్డాయి. అది గ్రహించి తన కామోద్రేకమును నిగ్రహించుకొనెను.
కాని, అతనికి రేతః పతనమై ఆ వీర్యము రెల్లుగడ్డిలో పడెను. అది రెండు భాగములై అందులోనుంచి ఒక బాలుడు, ఒక బాలిక జన్మించారు.

Moles Results in Telugu, Puttu Machalu Phalithalu, పుట్టుమచ్చలు – ఫలితాలు, About Moles for men and women

 


కొంతకాలమునకు శంతన మహారాజు వేటాడుచు అక్కడికి వచ్చి వారిని చూచి తన బిడ్డలుగా పెంచుకొన్నాడు.
వారికి జాతక కర్మాది సంస్కారములు గావించి తనచే కృపతో పెంచబడ్డారు కావున వారికి కృపుడు మరియు కృపి అని నామకరణము చేయించాడు.
కృపుడు విలువిద్యయందు పరమాచార్యుడై భీష్ముని ప్రార్ధనమున కౌరవ పాండవులకు గురువు అయ్యాడు. కృపిని ద్రోణాచార్యుడు పరిణయం చేసుకున్నాడు. వీరికి కలిగిన పుత్రుడే అశ్వత్థామ.

Bhagavad Gita in 100 Sentences Telugu , భగవద్గీత, మహాభారతము సమగ్ర సారాంశము


Spread iiQ8

May 2, 2015 7:49 PM

348 total views, 0 today