“ఉద్యోగ వేట”
“Job Hunting”
టైం 8 – 30అవుతుంది, ఇంటర్వ్యూ 10 – 30కి అని అన్నా.వ్ కూకట్పల్లి నుంచి హైటెక్ సిటీ అంటే అరగంటకన్నా ఎక్కువే. మళ్ళీ బస్ స్టాప్ నుంచి ఇంటర్వ్యూ లొకేషన్ కి ఎంత సేపు పడుతుందో ఏంటో. ఇంకా ఇక్కడే ఉంటె లేట్ ఐపోతావురా త్వరగా స్టార్ట్ అవ్వు.
మొహమాటంతో లిఫ్ట్ అడగకుండా ఉండకు ఏదోలా టైంకి చేరుకోవడం ముఖ్యం. రెసుమె ప్రింటౌట్ మర్చిపోకు. అక్కడ తప్పకుండా అడుగుతారు. ఎందుకైనా మంచిది రెండు సెట్లు తీసుకెళ్ళు. సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఒక ప్రింట్ తీసుకో అక్కడ కూర్చున్నప్పుడు చూసుకో ఎలాగైనా జాబ్ కొట్టాలి. “ఇవి ఊరినుంచి వచ్చి మొదటి ఇంటర్వ్యూ కి వెళ్ళినప్పుడు నా స్నేహితుడు చెప్పిన మాటలు”.
When Tenali Raman was Blessed by Goddess Kali, Sanaatan Tales
దార్లో ఉన్న ఇంటర్నెట్ షాపులో రెండు సెట్లు ప్రింట్స్ తీసుకున్నా కూకట్పల్లి నుంచి హైటెక్ సిటీ వెళ్లే బస్సు ఎక్కి కిటికీ పక్కన కూర్చుని హైద్రాబాద్లో ఎలా బ్రతకాలో ఆలోచిస్తున్నా. ఓ అరగంట ప్రయాణం తరువాత నేను దిగాల్సిన స్టాప్ వచ్చింది. గూగుల్ మ్యాప్స్ లేని కారణంగా ఓ ముగ్గురు తెలుగు ఆటోవాళ్ళతో హిందీలో మాట్టాడి బిల్డింగ్ అడ్రస్ కనిపెట్టా. లోపలికి 10 – 30కి వెళ్లినా.
సాయంత్రం 5 దాటినా నాపేరు రాలేదు. నీళ్లు తాగటానికో ఏదైనా తింటానికో,కనీసం పాట పాడటానికైనా పోదామంటే, వాళ్లొచ్చి పేరు పిలిచి నేను లేక అర్ధాంతరంగా రిజెక్ట్ చేస్తే..! వామ్మో బస్సుకు పెట్టిన 12రూపాయలు, ప్రింట్స్ కి పెట్టిన 10 రూపాయలు, వెళ్ళడానికి పెట్టాల్సిన ఇంకో 12 రూపాయలు బొక్కా వద్దులే ఉన్నోళ్ళం ఎలాగో ఉన్నాం ఇంకాసేపు ఉందాం.
పక్కనే ఒకతను బ్రో మీరు వెళ్లి తినేసి రండి. నీ పేరు, మొబైల్ నెంబర్ నాకు ఇవ్వండి వాళ్ళు అడిగితే నేనే అని చెప్పి నీకు కాల్ చేస్తా స్టార్ట్ అయ్యి లోపలి వెళ్ళేలోపు మేనేజ్ చేస్తా పరుగెత్తుకు వచ్చేయ్. నువ్వు వచ్చాక నేను వెళ్తా. ఈ ఐడియా నాకు పొద్దునే వచ్చింది మొహమాటానికి అడగలేకపోయా.
Rich people without Money, Telugu Moral Stories, డబ్బుల్లేని ధనికులు
నేనంటే పల్లెటూరు బ్యాచ్ వాడికేం పోయేకాలం ఇక్కడోడిలాగే ఉన్నాడు నాకులాగే పాట పాడకుండా ఇంతసేపు ఎందుకున్నాడు వీడు వీడి మొహమాటం ఐనా ఇలా ఉన్నాడంటే నాకన్నా పెద్ద మొహమాటస్థుడే నాలోంటోడికి ఇలాంటోడే సోల్మెట్ . తింటానికి కాంటీన్కి వెళ్లి ఖమ్మం – హైదరాబాద్ వచ్చే బస్ టికెట్ రేటుతో ఓ కొన్ని పదార్థాలు, ఎంజీబీస్ – కూకట్పల్లి కి వచ్చే షేర్ ఆటో రేటుతో శాండ్విచ్ లాంటివి కనపడ్డాయ్.
మనం ఇప్పుడు అఫిషియల్ హైదరాబాద్ వాస్తవ్యులం కాబట్టి ఎంజీబీస్ – కూకట్పల్లి కొనుక్కుని తినేసి వచ్చి నా సోల్మెట్ని బ్రేక్ కి పంపేసా. మునుపెన్నడూ మనుషులనే చూళ్ళేదు అన్నంతగా అక్కడ తిరుగుతున్న వాళ్ళ మొహాల్ని చూస్తుండగా ఇంతలో అందమైన పేద హెచ్ఆర్ వచ్చి ఇవాళ్టికి ఇంటర్వ్యూస్ అయిపోయాయి.
మిగిలిన వాళ్ళ రెస్యూమ్స్ రేపు కండక్ట్ చేస్తాం పొద్దునే 10 – 30 కి కొత్తబట్టలు వేసుకు రండి అని ఇంగ్లీష్ లో చెప్పి వెళ్ళింది. (అంతమంది ఉన్నారు మరి అక్కడ. కారణం అదో పెద్ద కంపెనీ మరి) ఊసూరుమనుకుంటూ బైటికొస్తుండగా నా సోల్మెట్: నువ్వు ఎటు వెళ్ళేది. మీ విత్ నీరసం + ఉద్యోగం లేకుండా ఇంటికెళ్లాల్సొస్తుంది అన్న పేస్ వేసుకుని : కూకట్పల్లి, మీరు ..? మేట్ : నేనూ అటే వెళ్ళేది డ్రాప్ చేస్తాపద. అనడంతో హమ్మా 12 రూపాయలు సేవ్.
Tenali Ramakrishna Stories in Telugu, Tilakasta Mahisha, తిలకాష్ట మహిష బంధం
రేపొద్దున ఈ 12 ఇక్కడికి రాటానికి పనికొస్తాయి అనుకుని ఆనందంతో బైక్ ఎక్కా. ఇంకా ఏమైనా ఇంటర్వ్యూ లొకేషన్స్ తెలుసా అనగా, లేదు ఇదొక్కటే కంఫర్మ్ అయింది ఇంకా వస్తే చెప్తాను, స్టడీ గురించి ఫ్యామిలీ గురించి మాట్టాడుకుంటూ కూకట్పల్లి కి చేరుకున్నాం.
ఫాస్ట్ ఫాస్ట్ గా రూమ్ కి. వెళ్లిపోయి కడుపునిండా తిని. యమర్జంటుగా పక్క రూంలో అప్పుడే బీటెక్ జాయినైన ఫ్రెష్ ఆణిముత్యం దగ్గరకెల్లా.వాళ్ళింట్లో బీటెక్ తర్వాత మాంచి సాఫ్ట్వేర్ జాబ్ రావాలంటే కచ్చితంగా ఫస్ట్ ఇయర్ లోనే 🅓🅔🅛 కంపెనీకి చెందిన 35 వేల రూపాయల లాప్టాప్ తోనే సాధ్యం అని ఇంట్లో నిజం చెప్పి తెచ్చుకున్నాడు.
పక్క అపార్ట్మెంట్ వాడి పాస్వర్డ్ లేని వైఫై పుణ్యమాని సాగరసంగమం సినిమాలో కమలాసన్ తాగినట్టు వీడు వాళ్ళ వైఫై ని విపరీతంగా రేయి పగలు తేడాలేకుండా తాగుతూ. సాఫ్ట్వేర్ చరిత్రలోనే చరిత్ర సృష్టించిన అప్లికేషన్ ఐనటువంటి టొరెంట్ లో 1080 క్వాలిటీ ఉన్న సినిమాలను మాత్రమే డౌన్లోడ్ చేసుకు చూస్తుంటాడు.
Tenali Ramakrishna Stories in Telugu, Kapi – Kavi, కపి-కవి
వాడిదగ్గరకెల్లి అన్నా (నాకన్నా మూడేళ్లు చిన్నోడే ఐనా వాణ్ణి అన్నా అనాలి ఎందుకంటే వాడిదగ్గర డెల్ ఉంది పైగా అవసరం మనది). కాస్త లాప్టాప్ కావాలి మెయిల్స్ చెక్చేసుకుని ఇచ్చేస్తా. వాడేమో పది నిముషాల్లో కావాలన్నా అర్జంటుగా “C#” ప్రాక్టీస్ చేసుకోవాలి. (నేనడిగానని ఏదో సినిమా మధ్యలో ఆపాడు.
ఎప్పుడు కుర్చున్నాడో ఏంటో లాప్టాప్ ముందు తిన్న ప్లేట్లు, ఓ నాలుగు అరిటి తొక్కలు, వాటర్ బాటిల్స్ , రైస్ కుక్కర్, కర్రీ బౌల్, లేస్ పాకెట్స్ అన్ని మన ghmc వాళ్ళు పెట్టిన చెత్తకుండీల చుట్టూ పడేసిన చెత్తలాగా లాప్టాప్ చుట్టూరా పేర్చాడు.
వీడి సినిమా పిచ్చి తగలెయ్య అనుకుని). వచ్చిన నౌకరి ఎమైల్స్ అన్నింటినీ అప్లై చేసుకుంటూ, ఇమెయిల్ ఐడీలు ఉన్న వాటికి జాగర్తగా ఇమెయిల్ పంపిస్తే పనిఅయిపాయె. 19rs అన్లిమిటెడ్ యూనినార్ టూ యూనినార్ సౌజన్యంతో ఓ రెండుగంటలు ఊర్లో వాల్తో బాతాఖానీ, నిద్ర. “పొద్దున్నే ఫ్రెండ్ ఫోన్” 9 – 45 కి సిద్ధంగా ఉండు బీజేపీ ఆపీస్ దగ్గరకు వచ్చేస్తా అని.
Telugu Moral Stories, Rich people without money, డబ్బుల్లేని ధనికులుV2.O
రావడం, బండి ఎక్కడం, వెళ్లి కూర్చోటం, పిలుపు రావడం అన్నీ చకచకా జరిగిపోయాయి. మిస్టర్ జ్ఞానా ప్లీజ్ కం. ఓ లేడి వాయిస్ “ ప్లీజ్ కం విత్ మీ”. లోపల ఇంకో లేడి హెచ్ఆర్ కి నా రెసుమె హ్యాండోవర్ చేసి ఏదో చెప్పింది బహుశా నన్ను ఇంటర్వ్యూ చేసేవాళ్ళ పేరు చెప్పిందనుకుంటా.
హిమాయత్ నగర్లో 113k బస్ కోసం ఎదురు చూస్తున్న కూకట్పల్లి వాసుల్లాగా హెచ్ఆర్ల పిలుపుల కోసం బైట కళ్ళు కాయలు కాసేలా చూసిన మొహాలన్నీ ఇక్కడ దార్లో కనిపిస్తున్నారు. ఈ లేడి నన్నో ఇంకో లేడి హెచ్ఆర్ కి అప్పజెప్పి ఇంకొంతమందిని పికప్ చేసుకోడానికి డిపో నుంచి వెళ్లిన ఖాళీ బస్సు లాగా వెళ్లి పోయింది.
హెచ్ఆర్: మిస్టర్ జ్ఞానా “వుయ్ హావ్ టోటల్ ఫైవ్ రౌండ్స్ ఫర్ థిస్ ఇంటర్వ్యూ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఐ విల్ కండక్ట్. కంమ్యూనికేషన్ రౌండ్, గ్రూప్ డిస్కషన్, టెక్నికల్ రౌండ్. అండ్ ఫైనల్ 🅗🅡 రౌండ్. నేను : ఓకే మేడం. “వారం నుంచి ఇరగదీస్తున్నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ సంపేస్తా చూడు. ఈ రౌండ్లో నన్ను కేఏ పాల్ కూడా ఆపలేడు అని మనసులో అనుకుంటూ ఉండగా”.
హెచ్ఆర్ : టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ బాక్గ్రౌండ్ ఇన్ ఫైవ్ మినిట్స్.
నేను విత్ 5000% కాన్ఫిడెన్స్: మై నేమ్ ఈజ్ ఖమ్మం, ఐ కేం ఫ్రమ్ జ్ఞానా టౌన్ , మై ఫాదర్ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ విత్ 66% ఫ్రమ్ కాకతీయ యూనివర్సిటీ.
“ఓకే మిస్టర్ జ్ఞానా ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్ వి విల్ కాల్ యు”.
దొబ్బింది…! మన ఈ ఇంగ్లిష్ దెబ్బకు పాపకు రాత్రి జ్వరం రాకుండా అరుంధతి సినిమాలో షియాజీ షిండే కూడా ఆపలేడు అనుకుంటూ బైటకొచ్చి కూర్చున్నా. కాసేపటికి సోల్మెట్ కూడా వచ్చేసాడు.
సూపర్ చెప్పా మామా ఈ రౌండ్ ఐపోయినట్టే అన్నాడు. ఒక్క సెకండ్ ఫ్రెండ్షిప్ కట్ చేద్దాం అనుకున్నా ఈలోపే మొదట్లో నన్ను లోపలికి తీసుకెళ్లిన పాప లిస్ట్ పట్టుకొచ్చి సెలెక్ట్ ఐన వాళ్ళ పేర్లు చదివింది. మా ఇద్దరి ప్రతిభను వాళ్లు గుర్తించకుండా వాళ్ళ కంపెనీని మా నుంచి కాపాడుకున్నారు.
నేను విత్ కన్నింగ్ మొహం: నాకెందుకో ఇవన్నీ బ్యాక్ డోర్ లో క్లోజ్ చేస్తున్నారు అనిపిస్తుంది మామా.
సోల్మెట్: అవుననుకుంటా మామా రిఫరెన్స్లు ఉంటాయి వాళ్ళకే ఇస్తారు అనుకుంటా. మనలాంటి టాలెంట్ ఉండి సర్కిల్ లేనోళ్లకు రావు.
Day Dream, Telugu Moral Stories పగటి కల
నేను : “మనసులో వీడెవడో నా స్కూలోడే” అవును మామా నిజాయితీపరులకు న్యాయం దొరకదు ఈ దేశంలో.
పోనిలే నాకు ఇంకో కొన్ని ఇమెయిల్స్ వచ్చాయ్ ట్రై చేద్దాం అని పేపర్ మీద రాసుకొచ్చిన అడ్రస్లు చూపించా. ఇలా రోజుకు రెండూ, మొదటి రౌండ్ లోనే పంపిస్తే ఒకోసారి మూడూ ఇంటర్వూస్ కి వెళ్లి మొత్తానికి ఓ రెనెళ్లకు కంపెనీలో నాలుగు రౌండ్లకు సరిపడా జ్ఞానం సంపాదించా. (వాడికి నాలోగోదో ఐదో దానికో జాబ్ వచ్చేసింది)
మొత్తానికి ఫైనల్ రౌండ్
హెచ్ ఆర్ : మిస్టర్ జ్ఞానా యువర్ సెలెక్టెడ్ పర్ దిస్ రోల్.
Not easy to live in Hut, Telugu Moral Stories, గుడిసెలో బ్రతకడం అంత సులువా
జీతం పదిహేను వేలు మూడు నెలలు ట్రైనింగ్ . తర్వాత పద్దెనిమిది. ఈజ్ థిస్ ఓకే పర్ యూ..? వెన్ యు కెన్ ఏబుల్ టు కంఫర్మ్ జాయినింగ్ డేట్.
మీ :విత్ “15రూపీస్ ఆన్ మై పాకెట్ అండ్ 253 రూపీస్ ఎట్ మై ఎస్బిఐ బల్కంపేట బ్రాంచ్ అకౌంట్ ” ఎస్ సర్..! ఐ కెన్ జాయిన్ నెక్స్ట్ వీక్. ఐ యామ్ ట్రావెలింగ్ టూ ఖమ్మం టూ సెలెబ్రేట్ దసరా.
ఇట్లు
మీ జ్ఞానాచారి