పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు — క్లుప్తముగా వాటి వివరాలు
Jaraasandhudu Jaambavanthudu Kamadhenuvu, జరాసంధుడు, జాంబవంతుడు, కామధేనువు
Jaraasandhudu : జరాసంధుడు —
పరమ శివ భక్తుడు మరియు రాక్షసుడు.
జరాసంధుడు బృహధ్రద్రుడి కుమారుడు.
మగధను పరిపాలించిన మహారాజు. మహాభారతంలో సభాపర్వం లో వచ్చే పాత్ర.
బృహద్రధ మహారాజు మగధని పరిపాలిస్తుండేవాడు. ఆయనకు ఇద్దరు భార్యల వలన సంతానం లేదు.
సంతానము కోసము రాజు కోరిక మేరకు ఋషి చందకౌశిక మహర్షి ఆయనకు ఒక ఫలాన్ని ఇచ్చి, దాన్ని మహారాజు భార్య సేవిస్తే సంతానం కలుగుతుందని చెబుతాడు.
(ఆ ఋషికి బృధ్రదుడికి ఇద్దరు భార్యలు ఉన్నారనే విషయం తెలియదు).
రాజధాని చేరి అంతఃపురంలో ఉన్న ఇద్దరు భార్యలకు ఆ ఫలాన్ని సగ భాగం చేసి ఇద్దరికి పెడతాడు. ఆ సగ భాగాన్ని స్వీకరించిన ఇద్దరి భార్యలకు శిశువులు సగ భాగాలు జన్మిస్తారు.
దీనితో దిబ్భాంత్రి లొనైన మహారాజు ఆ శిశు భాగాలను రాజధాని ఆవల విసిరి వేయమని తన సేవకులకు అప్పగిస్తాడు. సేవకులు రాజు చెప్పినట్లు రాజధాని ఆవల విసిరి వేస్తారు.
అలా విసిరిన శిశువులు జరా అనే రాక్షసికి దొరుకుతారు. జరా అనే రాక్షసి ఆ శిశువులను దగ్గరకు తెచ్చి కలుపుతుండి. ఆ శిశువుకి ప్రాణం వచ్చి అరుస్తుంది.
ఆ రాక్షసి శిశువుకి ప్రాణం రావడంతో తిరిగి మహారాజుకి తీసుకొని వెళ్ళి జరిగిన వృంత్తాంతాన్ని చెబుతుంది.
Jaambavanthudu : జాంబవంతుడు —
బ్రహ్మ ఆవులించగా పుట్టిన భల్లూకరాజు. కృత యుగం నుండి ద్వాపర యుగం వరకు జాంబవంతుని ప్రస్తావన ఉంది.
క్షీరసాగర మధనం సమయంలోను, వామనావతారం సమయంలోను జాంబవంతుడు ఉన్నాడు.
రామాయణంలో రాముని పక్షాన పోరాడాడు. కృష్ణునికి శమంతకమణిని, జాంబవతిని ఇచ్చాడు.
Kamadhenuvu– కామధేనువు :
కోరిన కోరికలు తీర్చే దివ్య శక్తులు గల గోవు.