Hindhu hanuman sena 🌹ఆయుత చండీయాగము

Hindhu hanuman sena 🌹ఆయుత చండీయాగము

 

🌹ఆయుత చండీయాగము 🌹 అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరగనున్న అయుత చండీయగానికి సంబంధించి అసలేం జరుగుతుందంటే.. ఎవరూ స్పష్టంగా చెప్పేది లేదు. ఇంతకీ ఈ చండీయాగం జరిగే రోజుల్లో ఏం చేస్తారుఅదెంత భారీగా అన్న విషయంపై చాలామందికి స్పష్టత లేదు.
ఎంతమంది భోజనాలు చేయనున్నారు?
ఎంతమంది ప్రముఖులు వస్తున్నారు?
ఎంత భారీగా ఏర్పాట్లు చేశారన్న విషయాలపై మీడియాలో వార్తలు వస్తున్నాయి.
కానీ.. చండీ అంటే ఏమిటిఆ యాగం సందర్భంగా రుత్వికులు ఏం చేస్తారన్న దానిపై స్పష్టత లేదు. దీనిపై ప్రధానార్చకులు పురాణం మహేశ్వర శర్మ యాగానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు చెప్పుకొచ్చారు. అవేమంటే..
=చండీ అంటే ఒక స్తోత్రం. వ్యాసుడు 18 పురాణాలు రాసి.. ఒక్కొక్క పురాణంలో ఆయా దేవతల గొప్పతనాన్ని వివరిస్తూ అవసరం వచ్చినప్పుడు వారిని కీర్తించారు. మార్కండేయ పురాణంలోనిదీ చండీ స్తోత్రం.
ఇందులో 700 శ్లోకాలు ఉంటాయి. మిగిలిన స్తోత్రాల కంటే ఇది చాలా విశేషమైంది.
మిగిలిన స్తోత్రాల్ని పఠించి.. అనుష్టానం చేస్తే ఫలితం వస్తుంది. కానీ.. చండీ స్తోత్రాన్ని వింటేనే ఫలితం వస్తుందన్నది నమ్మకం.
చండీ విధానంలో నవచండీ.. శత చండీ.. సహస్ర చండీ.. లక్ష చండీ.. కోటి చండీలు ఉన్నాయి.
మన దేశంలో లక్ష చండీలు చేశారు.
శృంగేరీ బయట చేస్తున్న అయుత చండీ ఇదే మొదటిది కావొచ్చు.
నవాక్షరీ మంత్రం ఉపదేశం తీసుకున్న వారు మాత్రమే చండీ పారాయణం చేస్తారు.
దీన్ని ప్రతి రుత్వికుడు తొలి రోజు 4వేలు.. రెండో రోజు 3 వేలు.. మూడో రోజు 2వేలు.. నాలుగురోజు వెయ్యి చొప్పున మూలమంత్రం చేస్తారు.
అంటే.. యాగం పూర్తయ్యే నాటికి మొత్తం కోటి జపం పూర్తి అవుతుంది.
ప్రతి రుత్వికుడు చండీపారాయణాన్ని తొలిరోజు ఒకసారి ప్రారంభించి.. నాలుగు రోజులు గడిచేసరికి పదిసార్లు పూర్తి చేస్తారు.
అయుత చండీ యాగం హైలెట్స్ చూస్తే..
అయుతం అంటే సంస్కృతంలో పదివేలు. 10వేల చండీ సప్తశతీ పారాయణాలు పూర్తి చేసి అందులో పదోవంతు హోమం చేసి పూర్ణాహుతులు సమర్పించటమే అయుత చండీయాగంగా చెప్పొచ్చు.
ఈ మహా క్రతువును ఏకోత్తర వృద్ధి విధానంలో శృంగేరీ పీఠ సంప్రదాయంలో నిర్వహిస్తారు.
ఈ మహా క్రతువులో 1100 మంది రుత్వికులు.. ఏక కంఠంతో సప్తశతీపారాయణం చేస్తారు.
ఐదు రాష్ట్రాల నుంచి 1500 మంది రుత్వికులు పాల్గొంటున్నారు. http://devotionaldata.blogspot.com/

మొత్తం 40 ఎకరాల్లో సాగుతున్న ఈ కార్యక్రమంలో మొత్తంగా 3 ఎకరాలు కేవలం యాగశాల కోసం కేటాయించారు.   

12631386 908433955876958 8681345187372205296 n

 

= 108 హోమ గుండాలు సంప్రదాయ సిద్ధంగా తయారు చేశారు.
= 2011 ఏప్రిల్ లో కర్ణాటకలోని శృంగేరీలో అయుత చండీయాగం నిర్వహించారు. ఆ తర్వాత ఏకోత్తర వృద్ధి విధానంలో ఎర్రవల్లిలో జరుగుతోంది.
ఈ యాగం కోసం 30 టన్నుల (టన్ను అంటే వెయ్యి కిలోలు) మోదుగ సమిధలు.. 12 టన్నుల పాయసం.. 4వేల కిలోల ఆవునెయ్యి.. రోజూ వెయ్యి కమలాలతో హోమం.
రోజువారీగా ప్రసాదాల కోసం ఇప్పటికి 3 లక్షల లడ్డూలు తయారు చేశారు.
రోజూ 50 వేల మందికి భోజనాలు వడ్డించనున్నారు.

Hindhu hanuman sena

Spread iiQ8