Hair fall solution in Telugu
Dear All, Hair fall solution in Telugu .
శిరోజాల సమస్యలతో విసుగొస్తోందా?
Hair problem and solution hair fall in Telugu home healthy tips
‘దువ్వినప్పుడల్లా జుట్టు తెగ ఊడిపోతోంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు.’ అంటూ ఓ అమ్మాయి బెంగ పడిపోతూ ఉంటుంది.
‘ఇరవై ఏళ్లకే బట్టతలొచ్చేస్తే నాకు పిల్లనెవరిస్తారు?’ అంటూ ఓ అబ్బాయి ఆందోళన పడుతూ ఉంటాడు.
జుట్టు గురించి ఇలాంటి కంప్లెయింట్లు అందరికీ ఉండేవే! చివర్లు చిట్లిపోవటం, బిరుసెక్కిపోవటం, తెల్లబడిపోవటం… ఇలా చెప్పుకుంటూపోతే వెంట్రుకల సమస్యల చిట్టా చాంతాడంత.
కేశ సంరక్షణకు రకరకాల చిట్కాలు ఫాలో అయిపోతూ ఉంటాం. అయినా రిజల్ట్ అంతంతమాత్రమే! అయితే సమస్యలు తొలగి వెంట్రుకల్లో జీవం ఉట్టిపడాలంటే మాత్రం వాటి పోషణ మీద శ్రద్ధ పెట్టాలి అంటున్నారు.
రోజుకి 50 నుంచి 100 వెంట్రుకలు రాలిపోవటం సహజమే! వెంట్రుకల పెరుగుదలలో ‘అనాజన్, క్యాటజన్, టిలోజన్’ అనే మూడు దశలుంటాయి. ప్రతి వెంట్రుక ఫాలికిల్ నుంచి మొలకెత్తింది మొదలు 2 నుంచి 5 ఏళ్ల వరకూ పెరిగి చివరికి రాలిపోతుంది. తర్వాత వెంట్రుక కుదుళ్లు కొంతకాలం విశ్రాంతి దశలో ఉంటాయి. కొన్నాళ్లకు అక్కడి నుంచి కొత్త వెంట్రుక మొలకెత్తుతుంది.
Find everything you need.
Search Product, Service, Properties and items on a single site ShareMeBook.
అయితే మనుకు కొత్తగా మొలకెత్తే వెంట్రుకలు కనిపించవు కాబట్టి రాలిపోయే వెంట్రుకల గురించే కంగారు పడుతూ ఉంటాం. వెంట్రుకలు రాలిపోవటం అనే సమస్య వెంట్రుకలకే పరిమితం కాదు. ఈ సమస్యతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయేవాళ్లు కూడా ఉంటారు. కొందరు ఆత్మవిశ్వాసం కోల్పోతారు. చిన్న సమస్యలాగే కనిపించినా జుట్టు రాలిపోవటం అనేది కొందరికి జీవిత సమస్యగా తయారవుతుంది. అసలు వెంట్రుకలు ఎందుకు రాలిపోతాయి? జుట్టు సమస్యలకు కారణాలేంటి?
• వెంట్రుకల సమస్యలకు కారణాలెన్నో!
Magha snanam మాఘస్నానం ప్రాశ్చత్యాన్ని తెలియజేసే కథ :- http://knowledgebase2u.blogspot.com/2015/05/magha-snanam.html
Lakshmi sthothram లక్ష్మీ స్తోత్రం http://knowledgebase2u.blogspot.com/2015/05/lakshmi-sthothram.html
Vidhura, vibhishana viswarupudu విదురుడు విభీషణుడు http://knowledgebase2u.blogspot.com/2015/05/vidhura-vibhishana-viswarupudu.html
వెంట్రుకల సమస్యల్లో ఎన్ని రకాలున్నాయో, ఆ సమస్యలకు లెక్కలేనన్ని కారణాలుంటాయి. అందరి జుట్టు సమస్యలకూ ఒకే రకమైన కారణం కూడా ఉండకపోవచ్చు. వ్యక్తిని బట్టి కారణాలు మారిపోతూ ఉంటాయి. రాలడం, చిట్లడం, బిరుసెక్కడం, తెల్లబడటం, బట్టతల.. ఇలా వెంట్రుకలకు సంబంధించిన ఎలాంటి సమస్యకైనా కొన్ని కారణాలుంటాయి. అవేంటంటే..
* పౌష్టికాహార లోపం:
పౌష్టికాహార లోపం ప్రభావం చర్మం, వెంట్రుకల మీదే ఎక్కువగా ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలోని పోషాకాలు శరీరంలోని ప్రధాన అవయవాలకు వెళ్లిపోతాయి. అలా వెళ్లగా మిగిలిన పోషాకాలే వెంట్రుకలకు అందుతాయి. ఎప్పుడైతే మనం సరిపడా పౌష్టికాహారం తీసుకోలేకపోతామో అప్పుడు వెంట్రుకలకు తగినంత పోషణ అందక క్రమేపీ బలహీనపడతాయి. వెంట్రుకలు ఆరోగ్యంగా పెరగాలంటే సరిపడా ప్రొటీన్లున్న పౌష్టికాహారం తప్పనిసరి. కుదుళ్లు బలంగా ఉన్నప్పుడే వెంట్రుకలు బలంగా నాటుకుని ఉంటాయి. పోషకాహార లేమి వల్ల వెంట్రుకల కుదుళ్లు వదులుగా తయారై వెంట్రుకలు తేలికగా రాలిపోతాయి, కొత్తగా వచ్చే వెంట్రుకలు కూడా వదులుగా ఉండి ఊడివచ్చేస్తాయి. పోషకాహారం తీసుకోకపోవటంతోపాటు వేళకి తినకపోటం, తిన్నా ఏదో ఓ కూర, స్నాక్స్‌తో సరిపెట్టుకోవటం, డైటింగ్ చేయటం వల్ల వెంట్రుకలు బలహీనంగా తయారై ఊడిపోతాయి.
Hair fall solution in Telugu
Is White Fish Good For Your Health | iiQ8 Health and Yoga
* అనీమియా:
ఐరన్ లోపం వల్ల కూడా వెంట్రుకలు రాలిపోతాయి. ఆకుకూరలు తగినన్ని తీసుకోకపోతే రక్తహీనత ఏర్పడి అది అనీమియాకు దారితీస్తుంది. దాంతో వెంట్రుకలు నిర్జీవంగా తయారై ఊడిపోతాయి.
* హార్మోన్లలో అవకతవకలు:
స్త్రీ, పురుషుల్లో హార్మోన్ సమస్యలు సాధారణమైపోయాయి. సీ్త్రలలో మేల్ హార్మోన్ ఎక్కువవటం, థైరాయిడ్ హార్మోన్‌లో హెచ్చుతగ్గుల వల్ల కూడా వెంట్రుకలు రాలిపోతాయి. గర్భిణుల్లో కూడా హార్మోన్ అవకతవకలు తలెత్తుతాయి కాబట్టే ప్రసవం ముందు రాలిపోయిన జుట్టు ప్రసవం తర్వాత వచ్చేస్తూ ఉంటుంది.
* మందుల ప్రభావం:
డిప్రెషన్, ఫిట్స్, మధుమేహం వ్యాధులకు వాడే కొన్ని మందుల ప్రభావంతోనూ జుట్టు రాలిపోతుంది. కీమోథెరపీ, రేడియేషన్ లాంటి కొన్ని చికిత్సలు తీసుకున్నప్పుడూ వెంట్రుకలు రాలిపోతాయి.
* పేను కొరుకుడు:
పేరులో పేను ఉందని ఈ సమస్యకు పేలు కారణం అనుకోకూడదు. ఇది ఓ ఆటోఇమ్యూన్ డిసీజ్. కొందరిలో ఈ వ్యాధి కారణంగా తల మీద కొంత మేర ప్యాచ్‌లా వెంట్రుకలు ఊడిపోతాయి. అలాగే ‘సోరియాసి్‌స’లాంటి కొన్ని రకాల ఫంగల్ ఇన్‌ఫెక్షన్ల వల్ల కూడా జుట్టు రాలిపోతుంది.
* నీటి కాలుష్యం:
కొన్ని ప్రాంతాల్లోని నీళ్లలో సీసం (లెడ్), కాడ్మియం మొదలైన పొల్యుటెట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి నీరు ఎక్కువ కాలం తాగటం వల్ల శరీరంలో ఈ పొల్యుటెంట్స్ శాతం పెరిగి క్రమేపీ ఆ ప్రభావం జుట్టు మీద పడుతుంది. దాంతో వెంట్రుకలు రాలిపోతాయి.
* తగినంత నీరు, నిద్ర: రోజుకి 8 గ్లాసుల నీళ్లు, 8 గంటల నిద్ర తప్పనిసరి. ఈ రెండిట్లో లోపం జరిగితే ఆ ప్రభావం కచ్చితంగా వెంట్రుకల మీద పడుతుంది.
Adhomukha Svanasana, How To do | అధోముఖ స్వనాసనం ఎలా చెయ్యాలి?
* వంశపారంపర్యం: మగవారికి యుక్తవయసు నుంచి ఓ ప్యాటర్న్‌గా వెంట్రుకలు రాలుతున్నాయి అంటే అందుకు వంశపారంపర్యంగా సంక్రమించిన బట్టతలే కారణం! సాధారణంగా బట్టతల వచ్చే అవకాశం ఉన్న పురుషుల్లో వెంట్రుకలు 18 ఏళ్లకు చేరుకున్నప్పటి నుంచే రాలటం మొదలుపెడతాయి.
* ట్రాక్షనల్ అలోపేషియా: ఫ్యాషన్‌లో భాగంగా కొందరు వెంట్రుకలను వెనక్కి లాగి పోనీ టెయిల్ వేస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల నుదుటికి దగ్గరగా ఉన్న వెంట్రుకల మీద ఒత్తిడి పెరిగి ఊడిపోతాయి. దీన్నే ట్రాక్షనల్ అలోపేషియా అంటారు.
* శుభ్రత: వెంట్రుకలను సాధ్యమైనంత శుభ్రంగా ఉంచుకోవాలి. చుండ్రులాంటి సమస్యలుంటే మెడికేటెడ్ షాంపూలు వాడి తగ్గించుకోవాలి.
* తత్వాన్ని బట్టి జాగ్రత్తలు: చర్మంలాగే వెంట్రుకల తత్వాల్లో కూడా నార్మల్, డ్రై, ఆయిలీ అనే మూడు రకాలుంటాయి. కాబట్టి పొడిబారినట్టుండే జుట్టున్నవాళ్లు తల స్నానానికి గంట ముందు నూనెతో కుదుళ్లకు మసాజ్ చేసుకుని తలస్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే వెంట్రుకలను పొడిబార్చే శీకాయ, కుంకుడు కాయలకు బదులుగా మైల్డ్ షాంపూ వాడాలి. నూనె జుట్టు ఉన్నవాళ్లు ఆయిల్ బేస్డ్ షాంపూలను వాడకూడదు. వీళ్లకి కండిషనర్ అవసరం లేదు. అలాగే ఆయిలీ హెయిర్ ఉన్నవాళ్లు రోజూ తలస్నానం చేయటం మేలు.
• వెంట్రుకలు చిట్లడం
వెంట్రుకలు చిట్లడానికి ప్రధాన కారణం పోషకాహార లోపమే! అయితే కొందరు స్టయిలింగ్‌లో భాగంగా ప్రతిరోజూ స్ట్రయిటెనర్స్, డ్రయర్స్ వాడుతూ ఉంటారు. వీటి నుంచి జనరేట్ అయ్యే వేడి వల్ల వెంట్రుకల చివర్లు చిట్లే అవకాశముంది. ఎంతో అరుదుగా తప్ప ఇలాంటి అప్లయెన్సెస్ వాడకూడదు. అలాగే దగ్గరగా పళ్లున్న దువ్వెనతో పదే పదే దువ్వటం, స్టయిలింగ్ చేయటం వల్ల కూడా వెంట్రుకల చివర్లు దెబ్బతింటాయి.
Vasisthasana, Ardha Chandrasana, Utkatasana (Chair Pose), Side-Bend Asana
• వెంట్రుకల సమస్యలకు పరిష్కారాలున్నాయి …!
వంశపారంపర్యంగా సంక్రమించే సమస్యలకు తప్ప వెంట్రుకలకు సంబంధించిన ప్రతి సమస్యకూ చికిత్సలున్నాయి. వెంట్రుకలు ఊడిపోకుండా ఉండాలంటే అందుకు కారణాలను గ్రహించి వాటిని సరిదిద్దుకోవాలి. ఒకవేళ అందుకు వ్యాధులే కారణమైతే ఆ వ్యాధులకు చికిత్సనందించాలి.
వెంట్రుకలు చిట్లే సమస్యకు మూల కారణాన్ని సరిదిద్ది తరచుగా ట్రిమ్ చేస్తూ ఉంటే పరిస్థితి చక్కబడుతుంది. బిరుసెక్కినా, పొడిబారినా క్రమం తప్పక కండిషనర్ ఉపయోగించాలి. ఇక చుండ్రుకైతే మెడికేటెడ్ షాంపూలు వాడి కుదుళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. ఎంత ప్రయత్నించినా వెంట్రుకల సమస్యలు చక్కబడకపోతే ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. వెంట్రుకల పటుత్వం, ఊడిపోయే తీరు, సమస్యకు కారణాన్ని కనిపెట్టి అవసరమైన చికిత్సను అందిస్తారు.
చికిత్సలో భాగంగా నోటి మాత్రలు, హెయిర్ సీరమ్స్‌తోపాటు అవసరాన్నిబట్టి లో లేజర్ ట్రీట్‌మెంట్ చేస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ పద్ధతిని అవలంబిస్తారు.
Hair fall solution in Telugu
• అపోహలు – వాస్తవాలు •
* చుండ్రు ఉంటే: చుండ్రు ఉన్నంతమాత్రాన జుట్టు రాలిపోదు. చుండ్రు వల్ల ఫాలిక్యులైటిస్ వచ్చి ఇన్‌ఫెక్షన్‌కు గురైనప్పుడు మాత్రమే వెంట్రుకలు రాలిపోతాయి.
* హెల్మెట్ వాడితే: హెల్మెట్ వాడితే జుట్టు రాలిపోతుందన్నది నిజం కాదు. అదే నిజమైతే ఎప్పడూ హెల్మెట్ పెట్టుకుని ఉండే ట్రాఫిక్ పోలీసులందరికీ జుట్టు రాలిపోవాలిగా!
* బైక్ ప్రయాణం: బైక్ మీద స్పీడుగా వెళ్లినప్పుడు వెంట్రుకలు గాలికి వెనక్కి వెళ్లిపోతాయి కాబట్టి ఊడిపోతాయని భయపడతాం. కానీ ఇది కూడా అపోహే!
* షేవ్ చేసుకుంటే: షేవ్ చేసుకుంటే వెంట్రుకలు త్వరగా పెరుగుతాయన్నది నిజం కాదు.
* బట్టతలకు కారణం: బట్టతల తల్లివైపు నుంచే వస్తుందన్నది నిజం కాదు. తండ్రి తరఫు వారి నుంచి కూడా బట్టతల సంక్రమించవచ్చు. అంటే మేనమామ నుంచే కాకుండా తాత, బాబాయి నుంచి కూడా బట్టతల వంశపారంపర్యంగా సంక్రమించవచ్చు.
* ఒత్తిడి వల్ల: వర్క్, స్టడీ.. లాంటి మెంటల్ స్ర్టెస్ వల్ల జుట్టు రాలదు. అయితే ఒత్తిడివల్ల నిద్రపోలేకపోతే అందువల్ల జుట్టు రాలొచ్చు. అలాగే ట్రైకోటిలేమియా అనే సైకలాజికల్ కండిషన్‌లో జుట్టు పీక్కోవటం వల్ల వెంట్రుకలు ఊడిపోతాయి.
* ఆయిల్ మసాజ్‌తో: సాధారణంగా హెయిర్ సెలూన్లలో పోర్స్ ఆయిల్ మసాజ్ చేస్తే మూసుకుపోయిన పోర్స్ తెరుచుకుని జుట్టు ఒత్తుగా పెరుగుతుందని అనుకుంటారు. కానీ పోర్స్ మూసుకుపోవటం అనేది ఉండదు.
* షాంపూ మారుస్తూ ఉండాలి: ఒకే షాంపూ వాడుతూ ఉంటే అది జుట్టుకు అలవాటు పడిపోతుందని తరచుగా షాంపూని మారుస్తూ ఉండాలని అనుకోవటం కూడా అపోహే!
Hair fall solution in Telugu