Glory Varanasi Kashi in Telugu, iiQ8 info, Indian Kaashi – వారణాసి కాశీ వైభవం
Glory Varanasi Kashi in Telugu, iiQ8 info – వారణాసి కాశీ వైభవం :—
కాశీవైభవాన్ని పూర్తిగా తెలపడం దేవతలకు కూడా సాధ్యం కాదు సముద్రం నుండి నీటి బిందువు లాంటి సంక్షిప్త సమాచారం.
కాశీపట్టణం గొడుగు లాంటి పచ క్రోశాల పరిధి లో ఏర్పడ్డ భూభాగం ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారం లో ఉంటుంది.కాశి బ్రహ్మదేవుని సృష్టి లోనిది కాదు.విష్ణు మూర్తి హృదయం నుండి వెలువడి సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక స్థలం ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని ప్రపంచ సాంస్కృతిక నగరం.
- స్వయంగా శివుడు నివాసముండే నగరం.
ప్రళయ కాలంలో మునుగని అతి ప్రాచిన పట్టణం శివుడు ప్రళయ కాలంలో తన తన త్రిశూలం తో కాశిని పైకెత్తి కాపాడతాడు.
- కాశి భువి పైన సప్త మోక్ష ద్వారాలలో ఒకటి, కాశి పన్నెందు జోతిర్లింగాలలో కెల్లా శ్రేష్ఠమైనది పద్నాలుగు భువన బాండాలలో విశేషమైన స్థలం.
కాశీలో గంగా స్నానం,బిందు మాధవ దర్శనం, అనంతరం మొదట డిండి వినాయకుడు, విశ్వనాథుడు,విశాలాక్షి, కాలభైరవ దర్శనము అతి ముఖ్యం.
ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడు బైరవుడు జీవిని కాశి లోనికి అనుమతించడు
కాశి లో మరణించిన వారికీ యమ బాధ పునర్ జన్మ ఉండదు.
కాశి ప్రవేశించిన జిీవి యొక్క చిట్టా చిత్రాగుప్తుని నుండి మాయం అయి కాలభైరవుని వద్దకు చేరుతుంది. డిండి గణపతి కాల బైరవుడు పరిశీలించి యమ యాతన కంటే 32 రేట్లు అధిక శిక్షసులు విధించి మరు జన్మ లేకుండా చేస్తాడు కాబట్టే కాశీలో కాల భైరవ దర్శనం తరవాత పూజారులు వీపు పై కర్రతో కొట్టి దర్శించిన వారు కాశి దాటి వెళ్లి పోయినా పాపలు అంటకుండా రక్ష నల్లని కాశీదారం కడతారు.
Who is Ashwathama in Telugu | iiQ8 అశ్వత్థామ
కాశీవాసం చేసే వారికి సమస్త యాగాలు తపస్సులు చేసిన పుణ్యం తో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమైతాయి.
కాశీలో మరణించిన ప్రతి జిీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు.
అందుకే కాశ్యాన్తు మరణాన్ ముక్తి అని శాస్త్ర వచనం కాబట్టే చివరి జీవితం చాలా మంది కాశీపూరిలో గడుపుతారు.
మరణించిన వారి ఆస్తికలు కాశీ గంగలో కలిపితే గతించిన వారు మల్లి కాశీలో జన్మించి స్వయంగా విశ్వనాథునిచే ఉద్దరింప బడతారు.
గోముకం నుండి బయలుదేరే గంగమ్మ విచిత్రంగా దారి మల్లి దక్షిణ దిశగా ప్రవహించి దన్నుసాకారపు కాశిీపట్టన్నాని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది. ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశీ ఘాట్లను వదిలి దూరం జరగలేదు.
శివుని కాశిలోని కొన్ని వింతలు
కాశీలో గ్రదలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు వాసన పట్టవు, కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది.
- కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తోవ సంధులు కలిగి అట్టి సంధులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహం లాగా కొత్త వారికీ గూడి జాడ దొరకకుండా ఉంటుంది.
కానీ పూర్వం ఇక్కడ అనేక సుందర వనాలు పులచెట్లు మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండ యాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగలాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు. - అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్ర వేత్తలు వచ్చి కాశి లో అనేక రీసెర్చ్ లు జరిపి ఆశ్చర్య పోయ్యారు అస్సలు ఇ కాస్మోర్స్ ఎక్కడి నిండి వస్తున్నాయి
అప్పటి పూర్వికులు శక్తి చలనం వున్న చోటల్లా మందిరాలు నిర్మించారు అంత పరిజ్ఞ్యానం ఆ రోజుల్లో వారికీ ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురైనారు. - కాశీ విశ్వేసురునికి శవ భస్మ లేపనం తో పూజ ప్రారంభిస్తారు
- కాశీలోని పరాన్న బుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లబిస్తుంది
- కాశి క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రేట్లు ఫలితం ఉంటుంది, పాపం చేసినా కోటి రేట్ల పాపం అంటుతుంది.
- విశ్వనాథుణ్ణి అభిషేకించిన తరవాత చేతి రేఖలు మారిపోతాయి
ఇక్కడి శక్తి పీఠం విశాలాక్షి అమ్మవారు
Glory Varanasi Kashi in Telugu, iiQ8 info, Indian Kaashi – వారణాసి కాశీ వైభవం
జగత్అంతటికీ అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి నివాస స్థలం కాశీ..
ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశిలోనే వున్నది
కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు వున్నాయి ఇందులో దేవతలు,ఋషులు,రాజులూ, తో పాటు ఎందరో తమ తపశక్తితో నిర్మించిన వి ఎన్నో వున్నాయి.
అందులో కొన్ని
1, దశాశ్వమేధఘాట్ బ్రహ్మ దేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినది ఇక్కడే.. రోజు సాయకాలం విశేషమైన గంగా హారతి జరుగుతున్నది.
2,ప్రయాగ్ ఘాట్ ఇక్కడ భూగర్భంలో గంగతో యమునా,సరస్వతిలు కలుస్తాయి
3, సోమేశ్వర్ ఘాట్ చంద్రుడు చేత నిర్మితమైనది
4,మీర్ ఘాట్ సతి దేవీ కన్ను పడిన స్థలం విశాలాక్షి దేవి శక్తి పీఠం. ఇక్కడే యముడు ప్రతిష్టించిన లింగం ఉంటుంది
5,నేపాలీ ఘాట్ పశుపతి నాథ్ మందిరం బంగారు కళశంతో నేపాల్ రాజులూ కట్టినాడు
6, మని కర్ణికా ఘాట్ ఇది కాశీలో మొట్ట మొదటిది దీనిని విష్ణు దేవుడు స్వయంగా సుదర్శన చక్రం తో తవ్వి నిర్మించాడు ఇక్కడ సకల దేవతలు స్నానమ్ చేస్తారు .ఇక్కడ గంగ నిర్మలంగా పారుతుంది ఇక్కడ మధ్యాహ్నం సమయంలో ఎవరైనా సుచేల స్నానం చేస్తే వారికి జన్మ జన్మల పాపలు తొలిగి పోతాయి జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ ముఖ బ్రహ్మ దేవుడు కూడా వర్ణించలేడట
7, విష్వేవర్ ఘాట్ ఇప్పుడు సిందియా ఘాట్ అంటారు ఇక్కడే అహల్యా బాయి తప్పసు చేసింది ఇక్కడ స్నానం చేసే బిందు మాధవుణ్ణి దర్శిస్తారు
8, పంచ గంగా ఘాట్ ఇక్కడే బూగర్భం నుండి గంగలో 5 నదులు కలుస్తాయి
9,గాయ్ ఘాట్ గోపూజ జరుగుతున్నది
10,తులసి ఘాట్ తులసి దాస్ సాధన చేసి రామాచరిత మానస్ లిఖించమని శివుని ఆదేశం పొందినది
11,హనుమాన్ ఘాట్ ఇక్కడ జరిగే రామ కథ వినడానికి హనుమంతుడు వస్తుంటాడు ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలార్క్ కుండం వున్నది ఇక్కడే శ్రీ వల్లబచార్యులు జన్మించారు.
12,అస్సి ఘాట్ పూర్వం దుర్గా దేవి శుంభ, నిశుంభ అను రాక్షసులను చంపి అట్టి ఖడ్గంను వెయ్యడం వల్ల ఇక్కడ ఒక తీర్థం ఉద్బవించింది.
Read Also for Latest Kuwait Jobs News, Accommodation and Bus Routes Information
13,హరిశ్చంద్ర ఘాట్ సర్వం పోగొట్టుకొని హరిశ్చంద్రుడు ఇక్కడ శవ దహనం కూలీగా పని చేసి దైవ పరక్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొందినాడు
నేటికి ఇక్కడ నిత్యం చితి కాలుతూ ఉంటుంది
14,మానస సరోవర్ ఘాట్ ఇక్కడ కైలాసపర్వతం నుండి బుగర్భ జలాధార కలుస్తున్నది ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం లబిస్తున్నది
15,నారద ఘాట్ నారదుడు లింగం స్థాపించాడు.
Religious Sects in India Vaishnavism | iiQ8 Vishnu, Narayana, Bhaga
16, చౌతస్సి ఘాట్ ఇక్కడే స్కంధపురాణం ప్రకారం ఇక్కడ 64 యోగినిలు తపస్సు చేసినారు ఇది దత్తాత్రేయునికి ప్రీతి గల స్థలం
ఇక్కడ స్నానం చేస్తే పాపలు తొలిగి 64 యోగినిలు శక్తులు ప్రాప్తిస్తాయి.
17,రానా మహల్ ఘాట్ ఇక్కడే పూర్వం బ్రమ్మ దేవుడు సృష్టి కార్యంలో కలిగే విజ్ఞాలను తొలగించమని వక్రతుండ వినాయకున్నీ తపస్సు చేసి ప్రసన్నున్ని చేసుకున్నాడు
18, అహిల్యా బాయి ఘాట్ ఈమె కారణంగానే మనం ఈరోజు కాశీ
విశ్వనాథుణ్ణి దర్శిస్తున్నాము. కాశీలోని గంగా నది ప్రవాహంలో అనేక ఘాట్ల ద్ధగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసి ఉంటాయి
- పూర్వం కాశిలో దేవతలు ఋషులు రాజులూ నిర్మించిన అనేక మందిరాలు కట్టడాలు వనాల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో వైభవోపేతంగా వెలుగొందింది. కానీ మొహమ్మదీయ దండ యాత్రికులు కాశిని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసి ధ్వంసం చేసిన తరవాతి కాశిని మనం చూస్తున్నాము
- విశ్వనాథ ,బిందు మాధవ తో పాటు ఎన్నో అనేక మందిరాలను కూల్చి మసీదులు కట్టినారు నేటికీ విశ్వనాథ మందిరంలొ నంది మజిీదు వైపు గల కూల్చ బడ్డ మందిరం వైపు చూస్తోంది.
- అక్కడే శివుడు త్రిశుాలం తో త్రవ్విన జ్ఞ్యాన వాపి తీతం బావి ఉంటుంది
- ఈరోజు మనం దర్శించే విశ్వనాథ మందిరం అసలు మందిరానికి పక్కన ఇండోర్ రాని శ్రీ అహల్యా బాయి హోల్కర్ గారు కట్టించారు.
*సేకరణ – మన సంస్కృతి
Maha Mruthyunjaya Mantram Telugu | మహామృత్యుంజయ మంత్రం ప్రయోజనం అర్థం iiQ8
Glory Varanasi Kashi in Telugu, iiQ8 info, Indian Kaashi – వారణాసి కాశీ వైభవం