శొంఠికొమ్ము వైద్యం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
గ్రామగ్రామానా ఉన్న అనేకానేక శిష్యకోటిలో రామావధానులు ఒక్కడు. అతడు అప్పుడప్పుడూ పరమానందయ్య గారిని సందర్శిస్తూ నాలుగు మంచి ముక్కలు చెప్పించుకుని వెళ్తూందేవాడు.
నా అనేవాళ్లేవరూ లేని అవధాన్లుకి అన్యాయార్జితమైన ఆస్థి చాలా ఉంది. ఒకసారి తన ఇంటికి దయచేయమని అతడు గురువుగార్ని ఎప్పుడూ కోరుతూండడం, ప్రతీసారీ అలాగే అంటూ పరమానందయ్య వాయిదా వెయ్యడం జరుగుతూ వస్తోంది.
పరశురామ ప్రీత్యర్దం – ఉత్సవం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu, గుర్రం గుడ్డు బేరం
ఇక అంత్యదశ సమీపించడంతో….. అవధాన్లు తాను రాలేక గురువుగార్నే శిష్యసమేతంగా రమ్మని కబురంపాడు. ఇక తప్పదని బయల్దేరారు అందరూ.
వెళ్ళాక వారూహించని విధంగా అవధాన్లు కన్నీళ్ళ పర్యంతమై “నేనిక బతకను గురువుగారూ!” అంటూ బావురుమన్నాడు. “భయపడకు” అని ధైర్యం చెప్పి “నా శిష్యులలో కొందర్ని వైద్యంలో పరిపూర్జులను చేశాను. వారి వైద్యంతో నువ్వు ఇంచక్కాలేచి తిరగ్గలవు” అన్నారు పరమానందయ్య,
వైద్యంలో ఒకేఒక్క అంశం తెలిసిన నలుగుర్నీ అవధానికి వైద్యం చెయ్యమని పురమాయించారు. ఒకడు శొంఠిపొడుని మాత్రలుగా కట్టి ఇచ్చాడు. ఇంకొకడు శొంఠకొమ్ము గంధం అరగదీసి అవధానికి ఒళ్ళంతా పట్టించాడు. ఇంకొక శిష్యుడు శొంఠి కషాయం ఆరారా పట్టించసాగాడు. మరొక శిష్యుడు నిమ్మకాయంత శొంఠి ముద్దవలె నూరి నదినెత్తిన పట్టు వేశాడు. ఈ యావత్ శొంఠి వైద్యం అపారమైన వేడిమిని పుట్టించి, అవధాని హాహాకారాలు చేయసాగాడు. “చచ్చాను మొర్రో” అని గోల పెట్టసాగాడు.
“శిష్యులు చేస్తున్న శొంఠి వైద్యానికి గోలపెడుతున్నాడు అవధాని”
“ఎంత అరచి గీ పెట్టినా, చివరికి మీ ప్రాణాలు మాత్రం ఎటూ పోనివ్వం! మీ దేహంలోనే మీ ప్రాణాల్ని బందీలుగా చేస్తాం!” అంటూ అవధాని నవరంధ్రాల్లో శొంఠిముద్ద కూరారు పదిమంది శిష్యులూ కలిసి. ఎప్పుడో జరగాల్సిన పని తక్షణమే జరిగి అవధాని హరీమన్నాడు. శొంఠకొమ్ములు నాణ్యమైనవి దొరక్కపోవడం వల్లనే ఆయన ప్రాణాలు పోయాయని, లేకుంటే తప్పకుండా ప్రాణాలు నిలబడేవని శిష్యులు వాపోయారు. పరమానందయ్య వారితో ఏకీభవించారు.
Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu, గుర్రం గుడ్డు బేరం
పరమానందయ్య పరలోక యాత్ర, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
A gift to a Brahmin Panchatantra Friendship stories బ్రాహ్మణుడికి బహుమతి
Three friends Panchatantra Friendship stories, ముగ్గురు స్నేహితులు
Rabbit, Hawk and Cat Panchatantra Friendship stories, కుందేలు, చకోరపక్షి మరియు పిల్లి
Source of the content : https://kathalu.wordpress.com/