“పగటి కల”…!
“Daydream”…!
డిగ్రీ అవ్వగానే ఉద్యోగాలు వెంటబడి వస్తాయ్ అనుకుని భాగ్యనగరo బస్సెక్కిన ఓ ఇద్దరు అమాయకుల కథ …!
ఈ రోజు 10–30 కి ఆ యూనివర్సిటీ వాళ్ళు డైరెక్ట్ గా ఇంటర్నెట్ లో పరీక్షా ఫలితాలను రిలీజ్ చేస్తున్నారు పొద్దునే 7గంటల ఈటీవీ వార్తల్లో చూసిన మా నాన్న నాకు చెప్పటానికి 10 గంటల దాక ఆగాల్సొచ్చింది, ఎందుకు అని అడక్కండి నేను నిద్ర లేసేది అప్పుడే మరి..!
డిగ్రీ రిజల్ట్స్ రావటం, మా దూరం చుట్టం ఎవడో నేను ఫెయిల్ అవ్వటం ముందు వాడికే తెలవాలని, ఫలానా వారి అబ్బాయ్ సుద్ద మొద్దనీ, వాడికి మా అమ్మాయికన్నా తక్కువ మార్కులొచ్చాయని, చెప్పేయాల్లన్న ఉస్సాహంతో వాడే మా నాన్నకు ఫోన్ చేసి హాల్ టికెట్ నెంబర్ తీసుకోవటం అది బెడిసి కొట్టి నేను పాస్ అవ్వటం, మన ఘనచరిత మా ఇంట్లోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల బంధువులకు కూడా తెలవటం, ఆ సందర్భంగా ఇంట్లో రవ్వలడ్డులు చెయ్యటం వాటిని తినటం అన్ని ఒక్క రోజులోనే ఐపోయ్యాయి..! ప్రభుత్వ ఉద్యోగం అయితే జీవితం జీతం బావుంటాయని ఎక్కువమంది మా నాన్నొరికి ఉచిత సలహాలు అందించటం వల్ల ప్రభుత్వ ఉద్యోగం అంతుచూడమని పిత్రువర్యుల ఆజ్ఞ…! ఓ ఏడాది తర్వాత..!
నేను : నాన్న 500 కావాలి
నాన్న: దేనికి
నేను : బ్యాంకు జాబ్ అప్లికేషన్ కి
నాన్న : 300లోసర్దుకో మీ నాన్న కోటేశ్వర్ కాదు
నేను :🤦🏻♂️ డి డి కి 500 అయితే 300 ఎలా సర్దుకుంటారు నాన్న ఇంకో 200ఇవ్వు.
నాన్న : పోయిన నెల 500 ఇచ్చా ఎదో రాసావ్ ఉద్యోగం వచ్చిందా ..? సంవస్సరం నుంచి కట్టిన ఆ డబ్బులు అన్నీ దండగే గా..!
నేను : గోవేర్నమేంట్ ఉద్యోగాలకు పోటీ చాల ఎక్కువ ఉంటుంది నాన్న కస్టపడి చాలా సార్లు రాయాలి, కొంతమందికి 5,6 సంవస్సరాలకు కూడా రాలేదు,
Tenali Ramakrishna stories in Telugu, ఆనందభట్టు
నాన్న : చెప్పింది వింటున్నా అని సోది చెప్పకు పొద్దున్న వార్తల్లో చూసా చిన్న పిల్ల మొదటి ప్రయత్నానికే కలెక్టర్ అయ్యింద్ధి ఓ అమ్మాయి..! తమరు ఏడాదైనా ఇంకా ఇవ్వాళా రేపు అని కాలం వెల్లబుస్తున్నారు నీకు ఇంట్లో సుఖం ఎక్కువైంది అన్ని నోటి దగ్గరకు వస్తున్నాయిగా కష్టం, బాధ్యత తెలీట్లేదు ఇంకో 30 రోజుల్లో ఉద్యోగం రాకపోతే నేను ఇంట్లో ఉండనివ్వను నీ బ్రతుకు నువ్వే బ్రతకాలి ఆలోచించుకో..!
నేను : నేను కూడా ప్రయత్నిస్తున్నా నాన్న కొంచెం టైం కావాలి.
అమ్మ : వాణ్ణి ఇలా ఇబ్బంది పేడితే చదువు మీద ద్రుష్టి ఎలా ఉంటుంది, 3 నెల్లలో ఎం అవ్వదు అని నీకు కూడా తెలుసు కావాలని వాణ్ణి ఇబ్బంది పెడుతున్నారు.
నాన్న : నీ గారాభం వల్ల వాడికి బాధ్యత లేకుండా పోయింది.
ఓ 6నెలల తర్వాత:
నేను : హైదరాబాద్ వెళ్తా నాన్నా, నాకు కోడింగ్ అంటే ఇష్టం, కోర్స్ చేస్తే ఉద్యోగాలు చాల ఉన్నాయట.
నాన్న : సరే, ఏదో ఒక ఉద్యోగం చేసుకోవటంలో తప్పు లేదు, సాఫ్ట్వేర్ ఉద్యోగమే కావాలని కూర్చుంటా అంటే ఇంట్లోనుంచి రూపాయి బిళ్ళ కూడా పంపను, మూడు నెలలు డబ్బు పంపిస్తా నాలుగో నెలనుంచి నువ్వు నీ సంపాదన మీదనే బ్రతకాలి తర్వాత నాకు సంబంధం లేదు.
నేను : (లోపల ఏ దైర్యం లేదు) అలాగే నాన్నా
హైద్రాబాద్ బస్సు ఛార్జీలకు ఎంత అవుతాయో కూడా తెలీని నేను ఓ బ్యాగ్ నిండా బట్టలు ఓ బ్యాగ్ నిండా మురుకులు సర్దుకుని బస్టాండ్ దాకా వచ్చామ్ నేను నా స్నేహితుడొకడు, వాడికి కూడా ఇంట్లో వాళ్ళనుంచి ఒకే సైజు వాతలు పడటం అది తెలుసుకున్న నేను, వీడైతే నాకు కరెక్ట్ అనుకుని,
మామ…! మనిద్దరం ఎన్ని కష్టాలొచ్చినా కలిసే ఉందాం రా..!
వాడు సరే మామ..! (నేను చాల దైర్యవంతుడ్ని అని వాడి ఫీలింగు).
రాత్రి 10–30 బయలుదేరిన బస్సు మహాత్మ బస్టాండ్ లో ఆగే సరికి తెల్లవారుజామున 3–30 అయింది తెలిసిన అన్న వాళ్ళ స్నేహితులు కూకట్పల్లి లో ఉంటున్నారు వాళ్ళ దగ్గర కొద్దీ రోజుల వరకు ఉండొచ్చు.
బస్టాండ్ బైటికొచ్చి ఒక ఆటో దగ్గరకు పోయి,
School Life Memory, Telugu Moral Stories మా బడి జీవితం..!
నేను : కూకట్పల్లి ఆతా హై..!
ఆటో : పాంచ్ హజార్ హోతా..!
నేను : కైకు బయ్యా ఇంత, బస్ మే పన్నెడు రూపాయ్ హై ఆటోకు ఇరవై రూపాయ్ హోత హై, ఆప్ ఇరవై మే ఆత నై ఆతా..? బోలో ( బస్సు కి 12 రూపాయలు, నీకు 20ఇస్తా వస్తావా రావా అన్నాం అన్నమాట వచ్చి రాని హిందీలో)
ఆటో : ఆవో,
పరశురామ ప్రీత్యర్దం – ఉత్సవం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
ఫ్రెండ్ : మావ నువ్వు హిందీ బాగా మాటాడుతున్నావ్ రా నాకు కూడా నేర్పు మావ, 2మిముషాల్లో ఆటో ఆగింది.
మీ : ఇత్నా జల్దీ
ఆటో : చార్ హాజర్ ధో నైతో మై నై ఆరామ్..
మీ : ఏమంటున్నాడు వీడు..? క్యా ..! నై నై మే ఇరవై దేతా హై, ..!
ఆటో : బీస్ రూపాయ్ ధో..! నికాల్ ఆటోసే…!
మీ : అసలే నిర్మానుష్యం గా ఉంది వీడితో గొడవెందుకు ఆ బీస్ ఏదో ఇచ్చేస్తే ఓ గోలపోద్ది, ఏ లో బీస్ …! ఇక్కడ్నుంచి బస్సు ఎక్కడానికి ఎలా వెళ్ళాలీ, ఎవడ్ని అడగాలి..! అన్న సంకోచంలో ఉండగా 🤦🏻♂️
అదే ఆటో : 100 రూపీస్ గివ్, డ్రాప్ యూ కూకట్పల్లి బస్ స్టాప్ ఫర్మ్ యు గెట్ కూకట్పల్లి బస్ (మా కన్నా మూడింతల మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నావ్ అన్నా)
మీ : ఓకే, చలో..! మళ్ళీ ఓ 2 నిముషాల జర్నీ, మొదట మేము ఆటో ఎక్కిన ప్లేస్ కు కొంచెం పక్కనే దింపి
ఆటో: ఆ బస్సు ఎక్కండన్నా కూకట్పల్లి పోద్ది అన్నాడు ..! ఆటోవాడికి తెలుగ్గోచ్చు…! 😂😂వీడికి తెలుగొచ్చా 😂😛😝 అడిగేలోగా వాడు జంప్ ..! (లోపల మన హిందీ కి పొద్దునే 120బొక్క)..!
తర్వాత బస్సు ఎక్కడం 12+12 : 24 రూపాయలతో కూకట్పల్లి కి చేరుకోటం, అన్న వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకెళ్లటం..!!
రానైతే వచ్చాము గాని ఎలా మొదలెట్టాలో తెలీదు, అమీర్పేట్ లో కోచింగ్ సెంటర్లు చాలా ఉంటాయని అన్న వాళ్ళ ద్వారా తెలుసుకుని అక్కడికెలితే ఏదో ఒక దాంట్లో జాయిన్ అయితే కొన్ని రోజుల్లో ఏదో దొరకకపోద్దా అని నమ్మకం..! అమీర్పేట్ లో దిగగానే ఓ పిల్లోడు అందరికి పేపర్లు పంచుతున్నాడు మా దగ్గరకొచ్చి ఓ పేపర్ చేతిలో పెట్టాడు 5500 కడితే 30రోజుల్లో 20–30వేల ఉద్యోగం అనుంది..! ఫోన్ నెంబర్ ఉంది కానీ మా ఫోన్లో బాలన్స్ లేవు రేపు చేద్దాంలే అనుకుని, ఆ రోజుకు ఆ పేపర్ ను జాగర్తగా దాచుకుని బస్సెక్కామ్ ముందు రోజు అలసిపోవడం, వచ్చేటప్పుడు సీట్ దొరక్క నిల్చుని రావటం ఎండలో తిరగటం అలసట వల్ల అనుకుంట సీట్ దొరకగానే నిద్రలోకి జారిపోయాం..!
Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu, పరమానందయ్య పరలోక యాత్ర,
“తెల్లారింది వాడికి ఫోన్ చేశాం వచ్చి కలవ మని అడ్రస్ చెప్పాడు, చివరకు 5500 కడితే ట్రయినింగ్ స్టార్ట్ చేస్తా అన్నారు నాన్నకు చెపితే ఓ అరగంటపాటు తిట్టి చివరకు డబ్బులు తెలిసిన వాళ్ళతో పంపాడు, కొద్ది రోజులు ఏదో నేర్పించారు తర్వాత ఉద్యోగంలో జాయిన్ అవ్వటం, వాళ్ళన్నట్టు 20 కాదు పదిహేను వేలు ఇస్తా అనటం ఏదో ఒకటిలే అని జాయిన్ అవ్వటం ఓ నాలుగు నెల్లలో 50 వేలు సేవింగ్ అందులో 30 వేలు కట్టి ఓ బండి కొనుక్కుని హ్యాపీగా సెలవు రోజుల్లో రోడ్ల మీద తిరుగుతూ, కనపడ్డ బిర్యానీ తింటూ, అమ్మ నాన్నలు ఫోన్లో పొగడ్తలు వింటూ ఉండగా. కండక్టర్ వచ్చి బాబు లాస్ట్ స్టాప్ వచ్చింది అందరూ దిగిపోయారు మీరేంటి ఇంకా పడుకున్నారు దిగండి బస్సు అన్నాడు”..! పగటి కల సమాప్తం 🤦🏻♂️😂😜😛😝..!
తరువాయి భాగం “కాల్ సెంటర్ ఉద్యోగం” తో మరికొన్ని రోజుల్లో మీ ముందుకు …!
ఇట్లు
మీ జ్ఞనా చారి
పట్టుబట్టల దహనం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
School Life Memory, Telugu Moral Stories మా బడి జీవితం..!