Comedy Rules in Telugu, కామెడీ రూల్స్
కామెడీ రూల్స్ – – శరత్ చంద్ర కండ్లకుంట
కంపెనీకి లాభాలు తక్కువగా రావాడం వల్ల, ఈ కింద పేర్కొనబడిన కొత్త కొత్త రూల్స్ పెడుతున్నాము. ఉద్యోగులు సహకరించగలరని మనవి.
1) సిక్ లీవులు ఇవ్వము.డాక్టర్ సర్టిఫికెటు తెచ్చినా ఇవ్వము. లాజికల్ గా ఆలోచిస్తే..డాక్టర్ దగ్గరకు వెళ్ళగలిగే ఒపిక ఉందంటే,ఆఫీసుకు కూడా వచ్చే ఒపిక ఉండాలి. కాబట్టీ, సిక్ లీవులు ఇవ్వము.
2) మరణం:- ఒకవేళ మీరు చనిపొతే,మీ స్థానం లో మళ్ళీ ఒక కొత్త ఉద్యొగిని నియమించడానికి మాకు సమయం పడుతుంది. కాబట్టి, మీ చావు గురించి మాకు దయచేసి 2 వారాలు ముందుగా తెలియజేయాల్సి ఉంటుంది. లేకపొతే,ఇన్సురెన్సె ఇవ్వము.
3) సెలవులు:- సంవత్సరానికి 54 సెలవులు ఇస్తాము.అవి 52 ఆదివారాలు, ఆగస్టు 15, జనవరి 26.
4) అర్జెంట్ పర్మిషన్:- ఉదాహరణకు మీ వాళ్ళు ఎవరయినా టపా కట్టారని అర్జెంట్ గా పర్మిషన్ కావాలని అడిగితే, తప్పకుండా ఇస్తాము. ఐతే, కేవలం ఆ పర్మిషన్ లంచ్ సమయం లో మాత్రమే ఇస్తాము..అదీ ఒంటి గంట నుండి రెండు వరకు.
5) లంచ్ విరామం:- బక్క పల్చగా ఉన్నవారికి గంట సేపు, మధ్యస్థం గా ఉన్న వారికి అర గంట, లావుగా ఉన్న వారికి ఐదు నిమిషాలు, మరీ లావుగా ఉన్న వారికి సున్న నిమిషాలు లంచ్ విరామం ఇస్తాము. ఎందుకంటే, సన్నగా ఉన్న వాళ్ళు కాస్త వొళ్ళు చేసి,ఆరొగ్యంగా ఉండాలి…కాబట్టి ఎక్కువగా తినాలి.మధ్యస్థం గా ఉన్న వాళ్ళు,కరెక్టుగా తిని, అదే పర్సనాలిటీ మేంటేయిన్ చెయ్యాలి. లావుగా ఉన్న వారు గ్లాసు మంచి నీళ్ళూ మరియూ ఒక గ్లాస్ జూస్ తాగడం కొసం ఆ ఐదు నిమిషాల పర్మిషన్.
దీన్ని ఎవరైనా అతిక్రమిస్తే, ఒక రోజు వెతనం కట్ చేస్తాం. రేపే ఒక డాక్టర్ వచ్చి బక్కగా,మధ్యస్థంగ,లావుగ,అతి లావుగా అనే సర్టిఫికెట్ జారీ చెస్తాడు.
6) ఉద్యోగులు బాత్రూముల్లో ఎక్కువ సేపు గడపడం వల్ల,ఆఫీసు పని తక్కువగా ఔతోంది.దాని వల్ల కస్టమర్ల నుండి సమస్య వస్తొంది.అందుకే దీనికీ ఒక రూల్ పెట్టాము.
“అ” అనే అక్షరం తో మొదలయ్యే పేర్లు గల ఉద్యోగులు 9 నుండి 9:15 లోపల బాత్ రూం కి వెళ్ళి రావాలి. “ఇ” తో మొదలయ్యే పేర్లు గల ఉద్యోగులు 9.15 నుండి 9:30 లోపల వెళ్ళి రావాలి. ఒక వేళ మీకు కేటాయించబడిన సమయం లో బాత్ రూం కు వెళ్ళి రాకపొతే బాధ్యత మాది కాదు. మళ్ళీ మీకు కేటాయించబడిన సమయం వచ్చేదాకా వేచి చూసి అప్పుడు వెళ్ళాలి. అత్యవసర పరిస్థితిలో ఉద్యోగులు ఈ వేళలను వేరే ఉద్యొగి కి ఇవ్వబడిన వెళ తో మార్పు చేస్కొవచ్చును.అది కూడా మీ మేనజర్ పర్మిషన్ తో!
ఎవరయినా బాత్ రూం లో మూడు నిమిషాల కంతే ఎక్కువసేపు ఉంటే,ముందుగా అలారం మోగుతుంది.అది మోగాక 30 సెకన్లలో బయటికి రాకపొతే, బాత్ రూం లో, నీళ్ళు ఆగిపొతాయి.ఆ తర్వాతా 30 సెకన్లలో బయటికి రాకపోతే, ఆటొమాటిక్ గా బాత్ రూం తలుపు తెరుచుకుంటుంది.ఇదంతా సాఫ్ట్ వేర్ మరియు సెన్సార్లతో ప్రొగ్రామింగ్ చెయ్యిస్తున్నాము.
7) మీకు వచ్చే సాలరీ ని బట్టి, మీరు దుస్తులు ధరించండి.ఒకవేళ మీరు 2000 రూపాయల ధర కలిగిన బట్టలు వేస్కొని వస్తే, మీ దెగ్గర డబ్బులు బాగానే ఉన్నాయని మేము భావిస్తాము.జీతం పెంచమని మీరు అడగకూడదు.
మీ యొక్క సలహాలు, సూచనలు , అభిప్రాయాలు, అనుమానాలు, తిట్లు, ఆవేశాలు, ఆక్రొషాలు, సమస్యలు, ఇరిటేషన్లు దయచేసి మాకు పంపకండి. ఎందుకంటే మేము ఏ విధమయిన సహాయం చెయ్యలేము
– ఇట్లు-
కంపెనీ యాజమాన్యం
Software Telugu Cinema Titles, తెలుగు సినిమా టైటిల్స్