Be Careful with FAKE Website of TTD
The fake website was developed by the miscreants almost similar to TTD official website with negligible modifications.
The address of the Fake Website URL is tirupatibalaji-ap-gov.org
While the official website URL is tirupatibalaji.ap.gov.in
One more fake website has been identified by TTD IT wing and upon their complaint a case has been registered in Tirumala 1 Town Police Station. as FIR 19/2023 u/s 420,468,471 IPC.
One more fake website has been identified by TTD IT wing and upon their complaint a case has been registered in Tirumala 1 Town Police Station.
as FIR 19/2023 u/s 420,468,471 IPC. pic.twitter.com/Ff0vEdpqsE— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) April 23, 2023
Arunachalam Mahimalu – మహిమాన్విత చలం | అరుణాచల కొండ ప్రదక్షిణ ఫలితాలు | ఏ రోజు – ఏమి ఫలితం?
పత్రికా ప్రకటన తిరుమల, 23 ఏప్రిల్ 2023
మరో నకిలీ వెబ్సైట్ పై ఎఫ్ఐఆర్ నమోదు
– ఎపి ఫోరెన్సిక్ సైబర్ సెల్ విచారణ
– నకిలీ వెబ్సైట్లను నమ్మవద్దని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి
తిరుమల తిరుపతి దేవస్థానముల పేరుతో గల మరో నకిలీ వెబ్సైట్ ను టీటీడీ ఐటీ విభాగం గుర్తించి తిరుమల వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ 19/2023 యు/ఎస్ 420, 468, 471 ఐపిసి ప్రకారం పోలీసులు నమోదు చేసి ఎపి ఫోరెన్సిక్ సైబర్ సెల్ కు అప్పగించారు. ఈ మేరకు సైబర్ సెల్ అధికారులు నకిలీ వెబ్సైట్ పై విచారణ ప్రారంభించారు.
ఇదివరకే 40 నకిలీ వెబ్సైట్లపై కేసులు నమోదు కాగా, దీంతో కలిపి కేసుల సంఖ్య 41కి చేరింది.
అధికారిక వెబ్సైట్ https://tirupatibalaji.ap.gov.in/ ఇలా ఉండగా, చిన్న మార్పులతో కొందరు వ్యక్తులు రూపొందించిన https://tirupatibalaji-ap-gov.org/ వెబ్సైట్ ను టిటిడి గుర్తించింది. టీటీడీ అధికారిక వెబ్సైట్లోనే శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, గదులు బుక్ చేసుకోవాలని కోరడమైనది. దీంతో పాటు టీటీడీ అధికారిక మొబైల్ యాప్ ను TTDevasthanams కూడా వినియోగించవచ్చు