Acidity Telugu lo home healthy tips gas trouble
Dear All, Acidity Telugu lo home healthy tips gas trouble.
అసిడిటీ – acidity telugu lo home healthy tips gas trouble • మంటలార్పండి!
గుండెల్లో ఎప్పుడూ ఓ కుంపటి రగులుతూ.. తరచూ మంటలు రేగుతుంటే ఏ మనిషికి మాత్రం సుఖం ఉంటుంది? జీవితం అనుక్షణం నరకంలా.. ఏమీ తోచని అయోమయంలా మారిపోతుంది. ఏం తినాలన్నా భయం. ఏం తాగాలన్నా బెరుకు. తిన్న దగ్గరి నుంచీ ఒకటే తేపులు.. గుండెల్లో మంట.. గొంతులోకి పుల్లగా కారం… ఛాతీ మొత్తం పట్టేసినట్టుంటుంది.. ఈ చెప్పుకోలేని బాధల చిట్టా చాలా పెద్దది!
మన సమాజంలో ఎంతోమంది ఎదుర్కొంటున్న సర్వసాధారణ సమస్య ఇది. ఇంకా చెప్పాలంటే మధుమేహం, హైబీపీ, గుండె జబ్బుల కంటే కూడా ఎక్కువగా విస్తరించిపోయిన అతిపెద్ద బాధ ఇది. ఒకప్పుడు దీనికి ఏవేవో చిట్కా వైద్యాలూ, యాంటాసిడ్ మాత్రలూ తప్పించి పెద్దగా పరిష్కారాలేం ఉండేవి కాదు. కానీ పీపీఐ రకం (ఒమెప్రజోల్ వంటివి) కొత్తతరం మందుల రాకతో ఈ పరిస్థితి సమూలంగా మారిపోయింది. అనాదిగా బాధిస్తున్న అసిడిటీని.. దాదాపు జయించేశామనే చెప్పే పరిస్థితి వచ్చింది.
అయితే ఇదేమీ శాశ్వత పరిష్కారం కాదు. ఈ మాత్రలు వేసుకుంటున్నంత కాలం బాధలుండవు.. కాబట్టి వాటిని దీర్ఘకాలం వాడుతూనే ఉండాలి. సురక్షితమే అయినా ఎక్కడన్నా ఒకరిద్దరికి వీటివల్ల దుష్ప్రభావాలూ తప్పటం లేదు. అందుకే వైద్యరంగం దీనికి సులభమైన పరిష్కారం కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
వీటిలో ‘ఆర్మ్స్‘ పేరుతో జపాన్ పరిశోధకులు ఆవిష్కరించిన తేలికపాటి ఎండోస్కోపీ చికిత్సా విధానంతో మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లోని ‘ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ’ ఈ చికిత్సా విధానాన్ని మన వరకూ తీసుకురావటం విశేషం. మందులతో అంతగా ప్రయోజనం లేని ఎంతోమందికి మేలు చేస్తుందని భావిస్తున్న ఈ విధానంపై ‘సుఖీభవ’ ప్రత్యేక కథనం ఇది!
Find everything you need.
Search Product, Service, Properties and items on a single site ShareMeBook.
‘అబ్బ, అసిడిటీ చంపేస్తోంది.. కొంచెం తినగానే కడుపుబ్బరం.. గుండెల్లో ఒకటే మంట.. పులి తేన్పులు..’ ఇలాంటి లక్షణాలతో నిత్యం వైద్యుల వద్దకు వచ్చే వారి సంఖ్యకు అంతులేదు.
ఈ బాధలు అన్నీఇన్నీ కావు. కొంచెం తినగానే కడుపు నిండిపోతుంది.. అక్కడ్నుంచి బాధలు మొదలవుతాయి. పడుకున్నా నిద్ర సరిగా పట్టదు.
కొన్నిసార్లు నొప్పి తీవ్రంగా ఉండి, ‘గుండెనొప్పి’లానూ అనిపిస్తుంటుంది. ఇంతలా వేధించే ఈ ‘అసిడిటీ’ బాధకు మూలం ఏమిటి?
Acidity Telugu lo home healthy tips gas trouble
Is White Fish Good For Your Health | iiQ8 Health and Yoga
Adhomukha Svanasana, How To do | అధోముఖ స్వనాసనం ఎలా చెయ్యాలి?
సులభంగా చెప్పాలంటే.. మనం నోటితో తీసుకున్న ఆహారం.. గొంతు దాటి.. అన్నవాహిక అనే పొడవాటి గొట్టం గుండా కిందికి ప్రయాణించి..కింద పెద్ద సంచీలా ఉండే జీర్ణాశయంలోకి చేరుతుంది. ఇలా ఆహారం కిందికి ప్రయాణించటమే గానీ.. కింది నుంచి మళ్లీ పైకి.. అంటే గొట్టంలోకి రాకుండా.. గొట్టం చివ్వర బలమైన కండర కవాటం ఉంటుంది. ఇది ఆహారాన్ని కిందికి పోనిస్తుంది..
కిందికి వెళ్లినది పైకి రాకుండా మళ్లీ గట్టిగా మూసేసుకుంటుంది. కింద జీర్ణాశయంలో తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేందుకు 1-1.5 లీటర్ల పరిమాణంలో రకరకాల జీర్ణరసాలు, ముఖ్యంగా గాఢమైన ఆమ్లం (ఆసిడ్) వంటివన్నీ ఉంటాయి. ఈ ఆమ్లం ఎంత గాఢమైనదైనా అది జీర్ణాశయంలో ఉన్నంత వరకూ మనకే బాధా ఉండదు. అయితే కొందరిలో- ఆ కండర కవాటం బలహీనపడి.. జీర్ణాశయం నుంచి ఈ ఆమ్లం పైకి..
అన్నవాహిక గొట్టంలోకి ఎగదన్నుకొస్తుంటుంది. దీంతో ఛాతీలో విపరీతమైన మంట. ఇదే అసిడిటీ సమస్యకు మూలం. జీర్ణాశయంలో ఉండాల్సిన ఆమ్లం పైకి.. అంటే అన్నవాహికలోకి ఎగదన్నుకురావటం వల్ల వచ్చే సమస్య కాబట్టి దీన్ని ‘గ్యాస్ట్రో ఈసోఫేగల్ రిఫ్లక్స్ డిసీజ్’ అని, తేలికగా ‘జీఈఆర్‌డీ-గర్డ్’ అంటారు. జీర్ణాశయం గోడలను ఈ ఆమ్లం ఏమీ చెయ్యదు, ఆ గోడల్లోని ఇందుకు తగ్గట్టుగా రక్షణ ఉంటుంది.
కానీ అన్నవాహికలో ఇలాంటి ఏర్పాట్లేమీ ఉండవు. కాబట్టి జీర్ణాశయంలో ఉండాల్సిన ఈ ఆమ్లం అన్నవాహికలోకి తన్నుకొచ్చినప్పుడు- మంటలాంటి బాధలే కాదు… ఆ లోపలి గోడలు దెబ్బతింటాయి. ఆమ్లం ప్రభావానికి అక్కడ పుండ్లు (అల్సర్లు) ఏర్పడతాయి. దీన్ని చాలాకాలంపాటు నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్లకూ దారితీసే ప్రమాదం ఉంటుంది. అందుకే అసిడిటీని తేలికగా తీసుకోవటానికి లేదు.
• లక్షణాలు
Tittibhasana Fire Fly pose, Ardha Chakrasana | తిట్టిభాసన (ఫైర్ ఫ్లై భంగిమ), అర్ధ చక్రాసనం
* ఛాతీలో మంట, నొప్పి: జీర్ణాశయంలో ఉండే ఆమ్లం చాలా గాఢంగా ఉంటుంది. ఇది అన్నవాహికలోకి ఎగదన్నుకొని వస్తే.. దాని ప్రభావానికి గుండెల్లో మంట, నొప్పి, చికాకు వంటివి మొదలవుతాయి. ఇది గుండె నొప్పిలానూ ఉండొచ్చు.
గుండెల్లో మొదలయ్యే నొప్పి గొంతు వరకూ కూడా వ్యాపించొచ్చు. అందుకే చాలామంది దీన్ని గుండె జబ్బుగా పొరబడి కార్డియాలజిస్టులనూ సంప్రదిస్తుంటారు. గుండెనొప్పితో ఆసుపత్రులకు వస్తున్నవారిలో 20% మంది అసిడిటీ బాధితులే కావటం గమనార్హం.
* కడుపు ఉబ్బరం
* పులి తేన్పులు
* గ్యాస్ బాధలు
* తిన్న ఆహారం గొంతులోకి వస్తుండటం
* గొంతులో మంట, గొంతు బొంగురు
* కొద్దిగా తినగానే పొట్ట నిండిపోవటం
* వీడకుండా వేధించే పొడి దగ్గు
– ఇలాంటి లక్షణాలను బట్టి అసిడిటీని (గర్డ్) ఎవరైనా తేలికగా గుర్తుపట్టొచ్చు.
అనాదిగా ఉన్నదే
అసిడిటీ సమస్య కొత్తగా వచ్చిందేం కాదు. అనాది కాలంలో కూడా ఉంది. ఆయుర్వేదంలోనూ, ప్రాచీన గ్రంథాల్లో కూడా దీనికి చాలా చికిత్సలను ప్రస్తావించారు.
క్రీ.పూ. 2,900 ఏళ్ల క్రితం నుంచీ ఇది మనుషులను వేధిస్తూనే ఉందని చెప్పేందుకు ఆధారాలున్నాయి. అయితే ఇటీవలి కాలంలో ఈ సమస్య బాగా విస్తరించిపోయింది. అభివృద్ధిచెందిన దేశాల్లో దాదాపు 40% మంది ఈ అసిడిటీతో బాధపడుతున్నారు. కొన్నేళ్లుగా ఇది మన దేశంలోనూ పెరిగిపోతోంది.
మన జనాభాలో అసిడిటీ, ఛాతీలో మంటతో నిత్యం బాధపడుతున్నవాళ్లు 4-7% ఉండగా.. నెలకోసారన్నా ఈ లక్షణాలతో సతమతమవుతున్నవాళ్లు 33-44% వరకూ ఉన్నారు.
పరీక్షలు చేస్తే వీరిలో 2% మందిలో అల్సర్లూ ఉంటున్నాయి. ఇలా మన దేశంలో 25 కోట్ల మంది అసిడిటీతో బాధపడుతున్నట్టు ‘ఇండియన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ’ అధ్యయనంలో తేలింది.
తెలంగాణలో 25%, ఆంధ్రప్రదేశ్‌లో 24% మంది అసిడిటీ బాధితులే. మధుమేహం, గుండెజబ్బుల కన్నా దీని బారినపడుతున్నవారే అధికం.
• తేలిగ్గా పోదు!
Vasisthasana, Ardha Chandrasana, Utkatasana (Chair Pose), Side-Bend Asana
చాలామంది ఏదో మందుల షాపు నుంచి నాలుగు ‘యాంటాసిడ్’ మాత్రలు తెచ్చుకుని వేసుకుంటే అదే తగ్గుతుందని భావిస్తూ సొంత వైద్యాలు చేసుకుంటుంటారు.
కానీ ఇదంత తేలికగా తగ్గదు, నిర్లక్ష్యం చేస్తే ఇతరత్రా సమస్యలకూ దారి తీస్తుంది. మాత్రలు వేసుకున్నప్పుడు బాధలు కొంత తగ్గినట్టే ఉండొచ్చుగానీ ఒకటిరెండు రోజుల్లోనే మళ్లీ మొదలవుతాయి. దీంతో మళ్లీ అవే మాత్రలు వేసుకుంటారు. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే- అన్నవాహిక జీర్ణాశయాల మధ్య ఉండే కండర కవాటం కుచించుకుపోతుంది (స్ట్రిక్చర్). దీంతో ముద్ద సరిగా కిందికి దిగదు.
కొన్నిసార్లు ఆ ప్రాంతంలో స్వల్పంగా రక్తస్రావం జరగొచ్చు. జీర్ణాశయంలో ఉండాల్సిన ఆమ్లం అన్నవాహికలోకి ఎగదన్నుకు రావటం వల్ల అన్నవాహికలో పుండ్లు పడొచ్చు.
ఆమ్లం మరీ ఎక్కువగా ఎగదన్నుకొస్తే- మనం పడుకున్నప్పుడు అది గాలిగొట్టంలోకీ వెళ్తుంది. దీంతో దగ్గు, ఉబ్బసం వంటి బాధలూ కనబడతాయి. ఈ సమస్య రాత్రిపూట ఎక్కువ. ఆస్థమా బాధితుల్లో అసిడిటీ మూలంగా దాని బారినపడేవారు 5% ఉంటున్నారని అంచనా.
అలాగే ఈ గర్డ్ సమస్య మూలంగా- నోటి దుర్వాసన, గొంతు నొప్పి, గొంతు బొంగురు, పొడి దగ్గు వంటివీ రావొచ్చు.
కొన్నిసార్లు వీటికి మూలం అసిడిటీ అని డాక్లర్లూ గుర్తుపట్టలేకపోవచ్చు. ఇది దీర్ఘకాలంలో కొన్నిసార్లు క్యాన్సర్‌కూ దారితియ్యచ్చు. కాబట్టి ఈ అసిడిటీని తేలిగ్గా కొట్టెయ్యటానికి లేదు.
• ఎందుకింత పెరుగుతోంది?
మన దేశంలో అసిడిటీ సమస్య ఇంతగా పెరిగిపోతుండటానికి మన జీవనశైలిలో వచ్చిన మార్పులనే ప్రధానంగా చెప్పుకోవాలి. మసాలాలు, మాంసాహారం ఎక్కువ అవుతున్నాయి. ఇవి అసిడిటీని పెంచుతాయి. వూబకాయం మరో కారణం. కార్లు, టీవీల సంఖ్య పెరుగుతున్నకొద్దీ వూబకాయుల సంఖ్యా పెరుగుతోంది. దీంతో అసిడిటీ సమస్యా ఎక్కువవుతోంది. వూబకాయం మూలంగా అన్నవాహిక-జీర్ణాశయం మధ్య ఉండే కవాటం పెద్దదవుతుంది. ఇదిలా బలహీనపడటంతో కింద ఉండే ఆమ్లం..
పైకి ఎదగన్నుకొచ్చేస్తోంది. ఇది అసిడిటీకి దారితీస్తుంది. మద్యం అలవాటు, వ్యాయామం లేకపోవటం, పొగ తాగటం, నొప్పుల మాత్రలు ఎక్కువగా వేసుకోవటం ఇతర కారణాలు. పొగ తాగటం వల్ల జీర్ణాశయంలో ఆమ్లం ఉత్పత్తి పెరుగుతుంది, కండరమూ బలహీనపడుతుంది.
గ్యాస్ ఉండే కూల్‌డ్రింకులు, చాకెట్లు, కాఫీ, టీలు ఎక్కువగా తాగటం, పుదీనా, మసాలాలు, బిర్యానీల్లాంటి మసాలాలు-నూనెలు ఎక్కువగా ఉండే పదార్ధాల వంటివన్నీ.. కండర కవాటాన్ని బలహీనపరిచి అసిడిటీని పెంచేవే. పాశ్చాత్య ఆహారపుటలవాట్లు పెరుగుతున్న కొద్దీ మనదేశంలో కూడా అసిడిటీ పెరుగుతోంది. ఒకప్పుడు గ్రామాల్లో తక్కువగా ఉండేది. ఇప్పుడు అక్కడా ఎక్కువగానే కనిపిస్తోంది.
• జీవనశైలి మార్చుకోవటం తొలి చికిత్స
అసిడిటీకీ- మన జీవనశైలికీ సంబంధం ఉంది కాబట్టి.. మందులు మొదలెట్టే ముందు మన జీవనశైలిని మార్చుకోవటం అవసరం. పొగ, మద్యం అలవాటుంటే మానెయ్యాలి. నూనె నెయ్యి వంటివి బాగా వేసి వండిన పదార్ధాలు, మసాలాలు బాగా తగ్గించెయ్యాలి. ముఖ్యంగా తినగానే పడుకోటం మానెయ్యాలి.
భోజనం చేశాక కనీసం 2 గంటల తర్వాతే పడుకోవాలి. పడుకున్నప్పుడు తల వైపు కాస్త ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. బిగుతు దుస్తులు వేసుకోవద్దు. నిత్యం వ్యాయామం చెయ్యాలి. చీటికీమాటికీ నొప్పులు తగ్గే మాత్రలు (ఎన్‌ఎస్‌ఏఐడీఎస్) వేసుకోవద్దు. ఇలా చిన్నచిన్న మార్పులు చేసుకుంటే సమస్య చాలావరకు తగ్గుతుంది. కానీ చాలామంది వీటిని పాటించరు. దీంతో అసిడిటీ పెరుగుతుంది. ఒక దశ దాటితే మందులు తీసుకోక తప్పదు. ఈ సమస్యకు ఇప్పుడు ఎంతోశక్తిమంతమైన మందులు అందుబాటులోకి వచ్చాయి. ఒమెప్రజోల్, ఎసమప్రజోల్, పాంటప్రజోల్, లాన్సప్రజోల్, రాబిప్రజోల్ వంటి ఔషధ నామాలతో దొరికే ఈ ‘ప్రోటాన్ పంప్ ఇన్‌హిబిటార్స్’ రకం మందులు అసిడిటీ సమస్యకు రామబాణాల్లాంటివి.
ఇవి ఆమ్లం ఉత్పత్తిని బాగా తగ్గిస్తాయి, దీంతో ఫలితాలు చాలా బాగుంటాయి. వీటిని 2-3 నెలలు వాడితే లక్షణాలు పూర్తిగా తగ్గుముఖం పడతాయి. అయితే వీటిని వేసుకోవటం ఆపేసిన కొన్ని రోజులకు సమస్య మళ్లీ మొదలవ్వచ్చు. మందు వేసుకున్నంత కాలమే పని చేస్తుండటం సమస్య. నిజానికి వీటిని వైద్యుల సిఫార్సు లేకుండా దీర్ఘకాలం వేసుకోకూడదు. ఎందుకంటే వీటిని ఏళ్ల తరబడి వాడితే కొన్ని అనర్థాలు తలెత్తుతున్నాయని పరిశోధనల్లో గుర్తించారు.
ముఖ్యంగా ఎముకల్లోని క్యాల్షియం తగ్గి, ఎముకలు గుల్లబారి త్వరగా విరిగే ప్రమాదం ఉంటోందని గుర్తించారు. అలాగే జీర్ణాశయంలో ఆమ్లాన్ని తగ్గించటం వల్ల కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని తేలింది. మొత్తానికి వీటిని కొన్ని నెలలు వేసుకోవటం, మానెయ్యటం, లక్షణాలు మొదలుకాగానేమళ్లీ వేసుకోవటం.. ఇలా చేయటం సమర్థనీయం కాదు. దీనివల్ల ఆమ్లం ఎగదన్నే సమస్య పూర్తిగా తగ్గకపోగా దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని వైద్యుల సిఫార్సు మేరకే వాడాలి.
• గుర్తించటమెలా?
అసిడిటీని గుర్తించటానికి చాలావరకూ రోగులు చెప్పే బాధలు, లక్షణాలే సరిపోతాయి. అవసరమైతే నోటి ద్వారా కిందికి కెమేరా గొట్టం (ఎండోస్కోపీ) పెట్టి చూస్తారు. జీర్ణాశయంలోంచి ఆమ్లం ఎలా పైకి తన్నుకొస్తోందో ఈ పరీక్షలో స్పష్టంగా కనబడుతుంది. దీని తీవ్రత కూడా తెలుస్తుంది.
ఇక కడుపులో ఆమ్ల స్వభావాన్ని తెలుసుకునేందుకు పీహెచ్ పరీక్షలు, కండర కవాటం- సమర్థంగా ఉందా? లేదా? బలహీనపడిందా? అన్నది తెలుసుకోవటానికి ‘మ్యానోమెట్రీ’ అనే పరీక్ష వంటివి కొంత ఉపయోగపడతాయి. ఇవేవీ అసిడిటీ(గర్డ్)ని కచ్చితంగా నిర్ధరించేవి కాకపోయినా.. సమస్య అదేనా? కాదా? అదే అయిత ఎంత తీవ్రంగా, ఏ గ్రేడులో ఉందన్నది పట్టుకోవటానికి బాగానే ఉపకరిస్తాయి.
• సర్జరీ ఉందిగానీ..
అసిడిటీ, ఆమ్లం ఎదగన్నే సమస్యకు ప్రస్తుతం ‘ఫండోప్లికేషన్’ అనే శస్త్రచికిత్స ఉంది. దీనిలో- జీర్ణాశయం పైభాగాన్నే పట్టుకుని, ఒక వరస అన్నవాహిక చుట్టూ తిప్పి కుడతారు.
దీంతో బయటి నుంచి కవాటం మీద ఒత్తిడి పెరిగి, అది బలంగా మూసుకుంటుంది. అయితే మిగతా ఆపరేషన్లకు మాదిరే దీంతోనూ ఇతరత్రా సమస్యలు, ముప్పులుంటాయి.
అందువల్ల దీనికి పెద్ద ఆపరేషన్‌తో పని లేకుండా.. తేలికగా నోటి నుంచి పంపే గొట్టంతోనే చికిత్స ఏదైనా చెయ్యొచ్చా? అని దాదాపుగా రెండు దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. అయితే అవన్నీ ఖరీదైనవి కావటం, ఫలితాలూ అంతంత మాత్రంగానే ఉండటంతో అవేవీ పెద్దగా విజయం సాధించలేదు.
తాజాగా జపాన్ పరిశోధకులు చేసిన ప్రయత్నం మాత్రం ఆశావహంగా ఉంది.
• అక్కరకొస్తున్న ‘ఆర్మ్స్’
జపాన్‌లోని టోక్యో విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ హారో ఇనోయీ ‘యాంటీ రిఫ్లక్స్ మ్యూకోసెక్టమీ- ఆర్మ్స్’ అనే సరికొత్త ప్రక్రియను ఆవిష్కరించారు. ఈ విధానంలో ఇప్పటి వరకూ జపాన్‌లో 40 మందికి ఈ చికిత్స చేశారు. దాదాపు అందరిలోనూ ఫలితాలు విజయవంతంగా ఉన్నాయి. మందులు, పెద్ద ఆపరేషన్ల అవసరం లేకుండా.. జీర్ణాశయంలోని ఆమ్లాన్ని తగ్గించకుండా.. కేవలం బలహీనపడిన, దెబ్బతిన్న కండర వలయాన్ని- బలపరచటం దీని ప్రత్యేకత.
• ఏం చేస్తారు?:
ఆర్మ్స్ పద్ధతిలో ఎండోస్కోపీ గొట్టంతో అన్న వాహిక చివరి వరకూ వెళ్లి.. సహజమైన, బలహీనపడిన కండర వలయం దగ్గర 2/3 వంతు పైచర్మాన్ని కత్తిరిస్తారు. ఇలా బయటపడిన కండరాలను క్లిప్ చేసి దృఢపరుస్తారు. క్రమేపీ ఆ పైపొర మానిపోతుంది.అప్పుడక్కడ బిగుతైన రింగులాంటి కృత్రిమ కవాటం ఏర్పడుతుంది.
అలాగే ఆ గాయం మానే క్రమంలో కొంత మందపాటి దృఢచర్మం కూడా (స్కార్) ఏర్పడుతుంది. దీంతో కవాటం మరింత దృఢపడి, అది సహజమైన కవాటంలానే పనిచేయటం ఆరంభిస్తుంది. ఈ చికిత్స అరగంటలోనే పూర్తవుతుంది. రోగి అదే రోజు లేదంటే మర్నాడు ఇంటికి వెళ్లిపోవచ్చు.
రెండో రోజు నుంచే అసిడిటీ లక్షణాలు తగ్గుముఖం పడుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అయితే దీన్ని అసిడిటీ బాధితులందరికీ చెయ్యటానికి లేదు. నెలల తరబడి మందులు వేసుకుంటున్నా లక్షణాలు తగ్గనివారికి, జీవితాంతం అసిడిటీ మందులు వేసుకుంటున్నవారికి, అలాగే అసిడిటీ-జీఈఆర్‌డీ సమస్య ముదిరి 3, 4 దశల్లో ఉన్నవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
ఈ చికిత్స చేశాక ఆహారం మామూలుగానే తీసుకోవచ్చు. అయితే నూనెలు, మసాల పదార్థాలు మితంగా తీసుకోవాలి. బరువు పెరగకుండా చూసుకోవాలి. జీవనశైలి మారితే అసిడిటీ తిరిగి వేధించొచ్చు. ఈ చికిత్స చేసిన తర్వాత 80% మందికి మందులు వేసుకోవాల్సిన అవసరముండదు. కొందరికి కుదురుకోవటానికి కొన్నాళ్లపాటు కొద్ది మోతాదుల్లో మందుల అవసరముండొచ్చు.
Acidity Telugu lo home healthy tips gas trouble