about amavasya అమావాస్యల గురించి తెలుసుకుందాం
చంద్రమానం ప్రకారం కృష్ణ పక్షము రోజులలో పదిహేనవ తిథి. అధి దేవత – చంద్రుడు . నెలకొక అమావాస్య చొప్పునాసంవత్సరానికి 12 అమావాస్ల్య్లుంటాయి .
కొన్ని అమావాస్యలు హిందువులకు పవిత్రమైనవి . అమావాస్య కాలమానంలో చీకటి రోజు … చంద్రుడుని చూడలేని రోజు . . . అయితే భూమండలం లో కొంతమందికే చీకటి , సగానికి చంద్రుడుకనిపిస్తాడు … ప్రతివానికి ఏదో ఒక రోజు అమావాస్య వస్తుంది … ఉంటుంది (చీకటి రోజు .. కష్టాలతో కూడుకున్న రోజు) .
అమావాస్య తిథి రోజున ఇంటి ముందు ముగ్గులు వేయకూడదని పండితులు అంటున్నారు. అమావాస్యకుముందురోజున పితృదేవతలు మన గృహానికి వస్తారని, ఆ సమయంలో పితృదేవతలకు-అర్ఘ్యమివ్వడంవంటి కార్యాలను చేయడం ద్వారా వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు.
అదేవిధంగా.. అమావాస్య రోజున ఇంటి ముందు చెత్తను శుభ్రం చేసి, నీటితో కల్లాపు చల్లడం వరకే చేయాలి. ఆ తర్వాతఇంటి ముందు ముగ్గులతో అలంకరిస్తే పితృదేవతలు వాకిలితోనే-ఆగిపోతారని పండితులు అంటున్నారు. అందుచేతఅమావాస్య నాడు ఇంటికొస్తారని విశ్వసించే పితృదేవతలను మనసారా ప్రార్థించి, దేవతామూర్తులకు ఇచ్చే నైవేద్యాలు, కర్పూర హారతులివ్వాలని పురోహితులు సూచిస్తున్నారు.
పితృదేవతలకు ప్రీతికరమైన రోజైన అమావాస్య నాడు — దేవతలు స్మరించినా ఫలితం ఉండదని పండితులుచెబుతున్నారు. ఆ రోజున దేవతలకు సమానంగా పితృదేవతలను కొలిచే వారికి సకల సంపదలు చేకూరుతాయనివిశ్వాసం.
స్థూలంగా చెప్పాలంటే, తిథులు అంటే చంద్రుడి కళలు (Phases). వీటిల్లో అమావాస్య, పౌర్ణమి అంటే అందరికీ తెలుస్తుంది. భూమినుంచి చూస్తే ఆకాశంలో చంద్రుడు, సూర్యుడు ఒకరికొకరు ఎదురెదురుగా (నూట ఎనభై డిగ్రీల దూరంలో) ఉంటే అది పూర్ణిమ. ఇద్దరూ కలిసి ఉంటే (ఒకే డిగ్రీలో ఉంటే) అది అమావాస్య…సేకరణ.
మనస్ఫూర్తిగా శివయ్యా అని పిలిస్తే ఆయన కరిగిపోవడానికీ … కదిలిరావడానికి ఎక్కువసేపు పట్టదు. పాపాల ఫలితాలు వెంటాడుతున్నప్పుడు … కష్టనష్టాలు సతమతం చేస్తున్నప్పుడు ఎవరికీ కూడా మనశ్శాంతి వుండదు. శారీరకంగా … మానసికంగా కూడా కుంగిపోవడం జరుగుతూ వుంటుంది. ఇలా సమస్యల వలయంలో చిక్కుకున్నప్పుడు వాటి బారినుంచి విముక్తిని కలిగించేదిగా శివనామస్మరణ కనిపిస్తుంది.
భక్తులకు ఆ దేవదేవుడు కల్పించిన మహదావకాశంగా ‘మాసశివరాత్రి‘ కనిపిస్తుంది. ఈ రోజున పరమశివుడిని భక్తిశ్రద్ధలతో పూజించడం వలన మాసమంతా ఆయనని సేవించిన ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. సదాశివుడికి ప్రదోష సమయం (సాయంకాలం) ప్రీతికరమైనదిగా చెప్పబడుతోంది. అందువలన ఈ రోజున ఆ సర్వేశ్వరుడికి సాయంకాల సమయంలో అభిషేకం జరిపి .. బిల్వదళాలతో అర్చించాలి.
పగటిపూట ఉపవాసం … రాత్రి జాగారం ఈ రోజు నియమంగా కనిపిస్తుంది. పూజామందిరంలో స్వామిని పూజించినా ఆలయం దర్శనం చేయడం కూడా మంచిది. ఈ రోజంతా సదాశివుడిని మనసులో నిలుపుకుని ఆయన నామాన్ని స్మరిస్తూ … ఆయన లీలావిశేషాలని కీర్తిస్తూ … భజనల ద్వారా ఆయనకి మరింతగా చేరువయ్యే ప్రయత్నం చేస్తూ జాగరణ పూర్తిచేయవలసి వుంటుంది. ఈ విధంగా చేయడం వలన సమస్త పాపాలు నశించడమే కాకుండా దోషాలు తొలగిపోతాయి. పుణ్యఫలాలు ప్రాప్తించడం వలన సకలశుభాలు చేకూరతాయి.